Jump to content

జ్యోతిష్య శాస్త్రము/జ్యోతిష్యము మనుషులకేనా? జంతువులకు కూడ వర్తిస్తుందా?

వికీసోర్స్ నుండి

4. జ్యోతిష్యము మనుషులకేనా? జంతువులకు కూడ వర్తిస్తుందా?

జరుగబోవు కాలములో జీవులకు సంభవించు కష్టసుఖములను ముందే తెల్పునది జ్యోతిష్యము. జీవులు భౌతిక శరీరముతో ఉన్నపుడుగానీ, సూక్ష్మశరీరముతో ఉన్నపుడుగానీ అనుభవించు కర్మను ముందే తెల్పునది జ్యోతిష్యము. జీవులు స్త్రీశరీరముతోనున్నపుడుగానీ, పురుషశరీరముతో నున్నపుడుగానీ అనుభవించు వాటిని గురించి సూచనగా ముందే తెల్పునది జ్యోతిష్యము. అలాగే జీవులు మానవ ఆకారములోనున్నపుడుగానీ, జంతువు ఆకారములో ఉన్నపుడుగానీ, అనుభవించు పాపపుణ్య మిశ్రమ ఫలితములను తెల్పునది జ్యోతిష్యము. అంతేకాక జీవులు అండజ, పిండజ, ఉద్భిజ రూపములో ఎక్కడ జన్మించినా, జన్మించినది మొదలు మరణించువరకు జరుగు కాలములో, కష్టసుఖ రూపముతో అనుభవించు పాపపుణ్యములను పసికట్టి, ముందే చెప్పునది జ్యోతిష్యము. అందువలన జ్యోతిష్యము సర్వజీవరాశులకు వర్తించునని చెప్పవచ్చును.