జేబులో బొమ్మ జేజేల బొమ్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాజు పేద (1954) సినిమా కోసం కొసరాజు రాఘవయ్య రచించిన లలితగీతం.


జేబులో బొమ్మ

జేజేల బొమ్మ ||| జేబులో బొమ్మ |||


మొక్కిన మొక్కులు చల్లంగుండి

ఎనక్కి తిరక్క గెలుస్తు వుంటే

భక్తి తోడ నీ విగ్రహానికి

బంగారు తుడుగే యించుదునమ్మా ||| జేబులో బొమ్మ |||


కనక తప్పెటలు గణగణ మ్రోయగ

శంఖ నాదములు శివమెత్తించగ

చేసిన తప్పులు చిత్తయిపోవగ

చేతులెత్తి ప్రార్థించెదనమ్మా ||| జేబులో బొమ్మ |||


మారాజులకు మనసులు మారి

మంత్రి పదవి నా తలపైకొస్తె

వేడుక దీరగ పూత కూర్పుతో

జోడు ప్రభల గట్టెంచెదనమ్మా ||| జేబులో బొమ్మ |||


మా యిలవేల్పుగ మహిమలు జూపి

మల్లికి నాకు మనసు గల్పితే

తకిట తకిణ తకథై అంటూ

చెక్కభజన చేయించెదనమ్మా || జేబులో బొమ్మ |||