జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం పాట

వికీసోర్స్ నుండి

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రం తిన్న గుగ్గెళ్ళు జీర్ణం
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం
అబ్బాయి(అమ్మాయి) తాగిన ఉగ్గుపాలు జీర్ణం
నందిలాగ కూర్చొని తాబేలులాగా పాకి
లేడిలాగా లేచి కుందేలులా బాబు(పాప) పరిగెత్తాలి