జానపద గేయాలు/ఓ చిన్ని ముద్దుబాలా
కోలాటం పాట
ఓ చిన్ని ముద్దుబాలా
1)
ఓ చిన్ని ము ద్దు బాలా నా మరదల
నీ చెంగు విడువ జాలా నీకు
పోచీల గుళ్లపేరు దాచీ ఉంచితిని -
పొందు - గోరితి చాలా
2)
పిడకల గంపతోడా ఓ పిల్లా
పెండెంవోరి దిబ్బకాడా - నీ
నడకహొయలు జాడ నాకళ్ళతోజూడ
పడకా జెయ్యక వీడా
3)
ఆదెన్న అరుగుమీదా - ఆనాడు
సోదంత చెపితిగాదా - ఆ
మాదిగి యెంకడికి నాకూ వచ్చిన తంట
మరిచిపోతె మాసిపోదా
4)
కన్నూ బొమ్మలతీరూ - ఆనడుమూ
సన్నాన నూగాడూ - నిను
కన్నాది యెవతో కాకినాడజనమూ
కళ్ళుకుట్టి పోయినారే ||
5)
ఉంగరాల కురులరాశి - ఓభామా నీ
బొంగరాల చరులకేసి - నాకు
గంగిర్లు ఎత్తంగ చూచి చూడనట్లు
గాయుందు లేల దాచి ||
6)
వాటామైన చోటనే - మనకూ
మాటాలు కలియగానే - ఆ
కోటిపల్లి తీర్థము ఏటికాడ నీయెంట
కుక్కలాగ తిరుగుతానే ||
7)
తుమ్మచెట్టు పూతజూసి - ఓ భామా
తుమ్మెదలు రెండులేచె
కమ్మవిల్తుని యొక్కుమ్మడి శరముల
కాగియుంటి నినుబాసి ||
- వల్లూరి జగన్నాధరావుగారితో
గ్రామఫోను రికార్డు ఇచ్చినపాట
1932