జానకీ రమణ కళ్యాణ సజ్జన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


   కాపి రాగం    త్రిపుట తాళం

ప: జానకి రమణ కళ్యాణ సజ్జన

నిపుణ కళ్యాణ సజ్జన నిపుణ || జానకి ||


చ 1: ఓనమాలు రాయగానే నీ నామమే తోచు

నీ నామమే తోచు శ్రీరామా || జానకి ||


చ 2: ఎందు జూచిన నీదు అందమే గానవచ్చు

అందమె గానవచ్చు శ్రీరామా || జానకి ||


చ 3: ముద్దు మోమును చూచి మునులెల్ల మోహించిరి

మునులెల్ల మోహించిరీ శ్రీరామా || జానకి ||


చ 4: దుష్టులు నినుజూడ దృష్టి తాకును ఏమో

దృష్టి తాకును ఏమో శ్రీరామా || జానకి ||


చ 5: ఎన్ని జన్మలెత్తిన నిన్నే భజింప నీవె

నిన్నే భజింప నీవే శ్రీరామా || జానకి ||


చ 6: ముక్తి నే నొల్ల నీదు భక్తి మాత్రము చాలు

భక్తిమాత్రము చాలు శ్రీరామా || జానకి ||


చ 7: రాతి నాతిగజేసె నీ తిరువడిగళె కాదా

నీ తిరువడిగళె కాదా శ్రీరామా || జానకి ||


చ 8: నారదాది మునులు పరమపద మందిరిగద

పరమపద మందిరిగా శ్రీరామా || జానకి ||

చ 9: సత్య స్వరూపముగ ప్రత్యక్షమై నావు

ప్రత్యక్షమై నావు శ్రీరామా || జానకి ||


చ 10: భద్రాచల నివాస పాలిత రామదాస

పాలిత రామదాస శ్రీరామా || జానకి ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.