Jump to content

జయహే కృష్ణావతారా

వికీసోర్స్ నుండి

శ్రీకృష్ణావతారం (1967) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన లలితగీతం.


జయహే కృష్ణావతారా, జయహే కృష్ణావతారా

నంద యశోదా పుణ్యావతారా, జయహే కృష్ణావతారా

పాపులనణచి సాధుల బ్రోవగ వ్రేపల్లె వెలసిన గోపకిశోరా ||| జయహే |||


ఎన్నో జన్మల పున్నెము పండీ

నిన్ను కంటిరా చిన్నారితండ్రీ ||| ఎన్నో |||

కన్నతల్లిని, కడుపెరుగదు

నా చన్నుకుడువ కనుమూసెదురారా

చన్నుకుడువ కనుమూసెదురారా


విషపూతన ప్రాణాపహారీ ||| విషపూతన |||

శకటాసుర సంహారీ శౌరీ ||| శకటాసుర |||


కాపురమ్ము సేయలేమమ్మా

వ్రేపల్లెలోన కాపురమ్ము సేయలేమమ్మా

ఓ యశోదా ఈ పాపమెందు చూడలేదమ్మా

పాలు వెన్న మనగనీడు, పడుచునొంటిగ చనగనీడు

కలిమి ఉంటే కట్టి కుడుతురు, కన్న సుతునిటు విడుతురా

కాపురమ్ము సేయలేమమ్మా

జయహే కృష్ణావతారా, నందకుమారా నవనీతచోరా ||| జయహే |||


కాళింగ మడుగున కాళీయు పడగల

కాలూని ధిమిధిమి నాట్యము చేసి

సర్పాధీశుని దర్పములణచిన ||| సర్పాధీశుని |||

తాండవ నాట్యవినోదా

జయహే కృష్ణావతారా... కాళియమణిగణ రంజిత చరణ ||| జయహే |||


తనువులపై అభిమానము వీడినగాని

తరుణులాల ననుజేర తరముగాదులే

సిగ్గువదలి ఇరుచేతులు జోడించండి ||| సిగ్గువదలి |||

చెల్లింతును మనసుదీర మీ కోరికలు

జయహే కృష్ణావతారా గోపకుమారీ వస్త్రాపహారా ||| జయహే |||


బాలుడితడనీశైలం చాలబరువని ||| బాలుడితడనీ |||

మీ భయము వదలుకొండి, నా అండను చేరగరండి

మీకేలల్లాడదు నమ్మండి ||| భయము |||

గోవర్ధన గిరిధారీ... సురనాయక గర్వాపహారీ ||| జయహే |||