జయజయ శ్రీరామా రఘువరా
స్వరూపం
జయసింహ (1955) సినిమా కోసం సముద్రాల రామానుజాచార్య రచించిన లలితగీతం.
జయజయ శ్రీరామా
రఘువరా శుఖకర శ్రీరామా
త్రిభువన జన నయనాభిరామా ||| జయజయ శ్రీరామా |||
తారకనామా దశరథ రామా
దనుజవిరామా పట్టాభిరామా ||| జయజయ శ్రీరామా |||
రామా రఘుకుల జలనిధి సోమా
భూమి సుధా ధామా
కామిత దాయతే కరుణాదామా
కోమల నీల సరోజశ్యామా ||| జయజయ శ్రీరామా |||