Jump to content

జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969

వికీసోర్స్ నుండి

భారత ప్రభుత్వము

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)



జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969

(1969 లోని 18 వ చట్టము)

[1 జూన్, 1991 న ఉన్నట్లుగా]


THE Registration of Births and Deaths Act, 1969

(Act 18 of 1969)

[As on 1st June, 1991]


భారత ప్రభుత్వము తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్రణాలయ కమీషనరుగారిచే ప్రభుత్వ కేంద్ర ముద్రణాలయము, హైదరాబాదునందు ముద్రించి ప్రచురింపబడినది.

1991

మూల్యము: రూ. 10-50

అవతారిక

ఈ ముద్రణలో 1 జూన్, 1991న ఉన్నట్లుగా ది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్, 1969 (1969 లో 18వ చట్టము) యొక్క ప్రాధికృత, తెలుగు పాఠము కలదు. ఈ పాఠమును 26 ఆగష్టు, 1991 తేదీగల భారత రాజపత్రము, అసాధారణ భాగము XVI అనుభాగము 1; సంఖ్య 6, సంపుటము 6లో 453 నుండి 462 వరకుగల పుటలలో ప్రచురించడమైనది.

ఈ తెలుగు పాఠమును, రాష్ట్రపతి ప్రాధికారము ననుసరించి ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద ప్రచురించడమైనది. అట్లు ప్రచురించినమీదట, ఈ అనువాదము ఆ చట్టమునకు ప్రాధికృత తెలుగు పాఠమైనది.

న్యూఢిల్లీ,

తేదీ: 31 ఆగష్టు, 1991.

వి. యస్. రమాదేవి,

కార్యదర్శి, భారత ప్రభుత్వము.

PREFACE

This edition of The Registration of Births and Deaths Act, 1969 (Act 18 of 1969) as on 1st June, 1991 contains the authoritative Text of that Act in Telugu which was published in the Gazette of India, Extraordinary Part XVI, Section 1, No. 6, Vol. 6, dated 26th August, 1991 on pages from 453 to 462,

This Telugu text was published under the authority of the President under clause (a) of Section 2 of the Authoritative Texts (Central Laws) Act, 1973, and on such publication it became the authoritative text of that Act in Telugu.

New Delhi,

Dated: 31st August, 1991.

V. S. RAMA DEVI,

Secretary to Govt. of India .

పరిచ్ఛేదక్రమము

పరిచ్ఛేదము

పుట

అధ్యాయము 1.

ప్రారంభిక.

1.
సంగ్రహనామము, విస్తరణ మరియు ప్రారంభము.
. .
1
2.
నిర్వచనములు మరియు అర్థాన్వయము.
. .
1

అధ్యాయము 2.

రిజిస్ట్రీకరణ-సిబ్బంది.

3.
భారత రిజిస్ట్రారు-జనరలు.
. .
2
4.
ముఖ్య రిజిస్ట్రారు.
. .
2
5.
రిజిస్ట్రీకరణ డివిజనులు.
. .
2
6.
జిల్లా రిజిస్ట్రారు.
. .
2
7.
రిజిస్ట్రారు.
. .
3


అధ్యాయము 3.

జనన మరణముల రిజిస్ట్రీకరణ.

8.
జనన మరణములను రిజిస్టరు చేయవలసిన వ్యక్తులు.
. .
3
9.
ప్లాంటేషనులోని జనన మరణముల గురించి ప్రత్యేక నిబంధన.
. .
4
10.
జనన మరణములను తెలియపరచుట మరియు మరణ కారణములను ధ్రువపరచుట కొందరు వ్యక్తుల కర్తవ్యమైయుండుట.
. .
5
11.
సమాచారము అందించు వ్యక్తి, రిజిస్టరులో సంతకము చేయవలసియుండుట.
. .
5
12.
రిజిస్టరు చేసిన నమోదుల ఉదాహృతులను సమాచారమందించు వ్యక్తికి ఈయవలసియుండుట.
. .
5
13.
జనన మరణములను ఆలస్యముగా రిజిస్టరు చేయుట.
. .
5
14.
శిశువు పేరు రిజిస్టరు చేయుట.
. .
6
15.
జనన మరణముల రిజిస్టరులోని నమోదును సరిచేయుట లేక రద్దుచేయుట.
. .
6

అధ్యాయము 4.

రికార్డుల మరియు గణాంకముల నిర్వహణ.

16.
రిజిస్ట్రార్లు రిజిస్టర్లను విహిత ప్రరూపములో ఉంచవలసియుండుట.
. .
6
17.
జనన మరణముల రిజిస్టరు సోదా చేయుట.
. .
6
18.
రిజిస్ట్రీకరణ కార్యాలయముల తనిఖీ.
. .
7
19.
రిజిస్ట్రార్లు నియతకాలిక వివరణులను సంకలనము కొరకు ముఖ్య రిజిస్ట్రారుకు పంపవలసియుండుట.
. .
7

అధ్యాయము 5.

వివిధ విషయములు.

20.
భారతదేశము వెలుపలనున్న పౌరుల జనన మరణముల రిజిస్ట్రీకరణను గూర్చి ప్రత్యేక నిబంధన.
. .
7
21.
జననము లేక మరణమును గురించిన సమాచారమును సేకరించుటకు రిజిస్ట్రారుకుగల అధికారము.
. .
8
22.
ఆదేశములిచ్చుటకు గల అధికారము.
. .
8
23.
శాస్తులు.
. .
8
24.
అపరాధములను రాజీచేయుటకు అధికారము.
. .
8
25.
అభియోగమునకు మంజూరి.
. .
9
26.
రిజిస్ట్రార్లు మరియు సబ్-రిజిస్ట్రార్లు పబ్లిక్ సేవకులుగా భావించబడుట.
. .
9
27.
అధికారముల ప్రత్యాయోజనము.
. .
9
28.
సద్భావపూర్వకముగ తీసికొనిన చర్యకు రక్షణ.
. .
9
29.
ఈ చట్టము, 1886 లోని 6వ చట్టమునకు భంగము కలిగించకుండుట.
. .
9
30.
నియమములు చేయుటకు అధికారము.
. .
9
31.
రద్దు మరియు వ్యావృత్తి.
. .
10
32.
చిక్కు తొలగించుటకు అధికారము.
. .
10

జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969.

(1969 లోని 18వ చట్టము)

(31 మే, 1969)

జనన మరణముల రిజిస్ట్రీకరణను క్రమబద్ధము చేయుటకు మరియు దానికి సంబంధించిన విషయములను గూర్చి నిబంధనలు చేయుటకైన చట్టము.

భారత గణరాజ్యము యొక్క ఇరువదవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయనైననది:—

అధ్యాయము 1.

ప్రారంభిక.

(1) ఈ చట్టమును జనన మరణముల రిజిస్ట్రీకరణ చట్టము, 1969 అని పేర్కొనవచ్చును.

(2) ఇది యావద్భారత దేశమునకు విస్తరించును.

(3) ఇది రాజపత్రములో అధిసూచన ద్వారా, కేంద్ర ప్రభుత్వము నియతము చేయునట్టి తేదీన ఏ రాజ్యములోనైనను అమలులోనికి వచ్చును.[1]

అయితే ఒక రాజ్యములోని వేరు వేరు భాగములకు వేరు వేరు తేదీలు నియతము చేయవచ్చును.

2. (1) ఈ చట్టములో సందర్భమునుబట్టి అర్థము వేరుగా ఉన్ననే తప్ప, -

(ఏ) "జననము" అనగా సజీవ జననము లేక నిర్జీవ జననము అని అర్థము;

(బీ) "మరణము" అనగా సజీవ జననము పిమ్మట ఏ సమయమునన్నెనను జీవ లక్షణములన్నియు శాశ్వతముగా కనిపించకుండ పోవుట అని అర్ధము;

(సీ) "భ్రూణ మరణము" అనగా, గర్భధారణ కాలావధి ఎంతయైనను , తల్లి నుండి పిండమును పూర్తిగా బయట పడగొట్టుటకు లేక బయటికి లాగివేయుటకు పూర్వమే జీవ లక్షణములేవియు దానిలో లేకుండుట అని అర్థము ; .

(డీ) "సజీవ జననము" అనగా, గర్భధారణ కాలావధి ఎంతయైనను , తల్లి నుండి బయటపడిన పిమ్మట లేక బయటికి లాగివేయబడిన పిమ్మట ఊపిరి పీల్చు లేక జీవము ఉన్నట్లు అన్య లక్షణములను కనపరచు పిండము తల్లినుండి బయటపడుట లేక తల్లినుండి లాగివేయబడుట అని అర్థము; మరియు అట్లు జన్మించిన ప్రతి ఉత్పత్తి, సజీవ జనితముగా భావించనగును;

(ఈ) "విహిత" అనగా ఈ చట్టము క్రింద చేసిన నియమముల ద్వారా విహితపరచిన అని అర్థము:

(ఎఫ్) సంఘ రాజ్యక్షేత్రమునకు సంబంధించి "రాజ్య ప్రభుత్వము" అనగా దాని పాలకుడు అని అర్ధము;

(జీ) "నిర్జీవ జననము" అనగా పిండమునకు కనీసము విహిత గర్భకాలావధి నిండినటువంటి భ్రూణ మరణము అని అర్థము. (2) ఏదేని ప్రాంతములో అమలులో లేని ఏదేని శాసనమును గూర్చి ఈ చట్టములోని నిర్దేశమేదైనను, ఆ ప్రాంతములో తత్సమానమైన శాసనము ఏదేని అమలునందున్నయెడల ఆ శాసనమును గూర్చిన నిర్వేశముగా అన్వయించబడవలెను.

అధ్యాయము 2.

రిజిస్ట్రీ కరణ-సిబ్బంది.

3. (1) కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా భారత రిజిస్ట్రారు-జనరలు అనబడు ఒక వ్యక్తిని నియమించవచ్చును.

(2) ఈ చట్టము కింద రిజిస్ట్రారు-జనరలు యొక్క కృత్యములలో, ఆయా సమయములలో నిర్వహించవలసినదిగా ఆయన ప్రాధికారమిచ్చునట్టి కృత్యములను ఆయన అధీక్షణాదేశముల క్రింద నిర్వహించు నిమిత్తము కేంద్ర ప్రభుత్వము తాను సబబని తలచు నట్టి పదా థిదానములతో ఇతర అధికారులను కూడ నియమించవచ్చును.

(3) రిజిస్ట్రారు-జనరలు ఈ చట్టము విస్తరించు నట్టి రాజ్యక్షేత్రములలో జనన మరణముల రిజిస్ట్రీకరణ గురించి సాధారణ ఆదేశములు జారీచేయవచ్చును. మరియు ముఖ్య రిజిస్ట్రార్‌ కార్యకలాపములను జనన మరణముల రిజిస్ట్రీకరణ విషయములో సమన్వయ పరచుటకును, ఏకీకరించుటకును చర్యలు తీసికొనవలెను. మరియు సదరు రాజ్యక్షేత్రములలో ఈ చట్టము అమలు అగు తీరును గురించి వార్షిక రిపోర్టును కేంద్ర ప్రభుత్వమునకు సమర్పించవలెను.

4. (1) రాజ్య ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా రాజ్యము కొరకు ఒక ముఖ్య రిజిస్ట్రారును నియమించవచ్చును.

(2) ముఖ్య రిజిస్ట్రారు కృత్యములలో ఆయన ఆయా సమయములలో నిర్వహించవలసినదిగా ప్రాధికారమిచ్చునట్టి కృత్యములను ఆయన అధీక్షణాదేశముల క్రింద నిర్వహించు నిమిత్తము రాజ్య ప్రభుత్వము తాను సబబని తలచు నట్టి పదాభి దానములతో ఇతర అధికారులను కూడ నియమించవచ్చును.

(3) రాజ్య ప్రభుత్వము ఏవైన ఆదేశములు ఇచ్చినయెడల వాటికి లోబడి, ఈ చట్టము యొక్క నిబంధనలను, వాటి క్రింద చేయబడిన నియమములను , ఉత్తరువులను అమలుపరచుటకు ముఖ్య రిజిస్ట్రారు రాజ్యములో ముఖ్య కార్యపాలక ప్రాధికారియై, యుండును.

(4) సమర్దమైన రిజిస్ట్రీ కరణ పద్దతిని సమకూర్చుటకుగాను యధోచిత అనుదేశములను జారీచేయుట ద్వారా కాని, అన్యధా కాని, 'రాజ్యములో రిజిస్ట్రీకరణ పనిని సమన్వయ పరచుటకును, ఏకీకరించుటకును మరియు పర్యవేక్షించుటకును ముఖ్య రిజిస్ట్రారు చర్యలు తీసుకొనవలెను మరియు 19వ పరిచ్ఛేదము యొక్క ఉప పరిచ్ఛేదము (2)లో నిర్దేశించిన గణాంక రిపోర్టుతొ పాటు రాజ్యములో ఈ చట్టము పనిచేయు తీరును గూర్చిన రిపోర్టును విహితపరచునట్టి రీతిగాను అట్టి అంతరావధులతోను రాజ్య ప్రభుత్వమునకు సమర్పించవలెను.

5. రాజ్య ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా, రాజ్యములోని రాజ్యక్షేత్రమును తాను సబబని తలచునట్టి రిజిస్ట్రీ కరణ డివిజనులుగా విభజించవచ్చును మరియు వేరు వేరు రిజిస్ట్రీ కరణ డివిజనులకు వేరు వేరు నియమములను విహితపరచ వచ్చును.

6. (1) రాజ్య ప్రభుత్వము , ఒక్కొక్క రెవెన్యూ జిల్లాకు ఒక జిల్లా రిజిస్ట్రారును మరియు తాను సబబని తలచునంత మంది అదనపు జిల్లా రిజిస్ట్రార్లనునియమించవచ్చును . జిల్లా రిజిస్ట్రారు యొక్క సాధారణ నియంత్రణాదేశములకు లోబడి, ________________

3 /6-455 జిల్లా, రిజిస్ట్రారు యొక్క కృత్యములలో ఆయన నిర్వహించవలసినదిగా ప్రాధికారమిచ్చు నట్టి కృత్యములను అదనపు జిల్లా రిజిస్ట్రార్లు నిర్వహించవలెను.

(2) ముఖ్య రిజిస్ట్రారు యొక్క ఆదేశములకు లోబడి జిల్లా రిజిస్ట్రారు, ఆ జిల్లాలో జనన మరణముల రిజిస్ట్రీకరణను అధీక్షించవలెను మరియు ఈ చట్టముయొక్క నిబంధనలను, ఈ చట్టము నిమిత్తము ఆయా సమయములలో ముఖ్య రిజిస్ట్రారు జారీచేయు ఉత్తరువులను, అమలుపరచుటకు ఉత్తరదాయి అగును.

7. (1) ఒక " పురపాలిక, పంచాయితీ, లేక ఇతర స్థానిక ప్రాధికార సంస్థ యొక్క అధికారితలోని ప్రాంతము లేక ఏదైన ఇతర ప్రాంతము, లేక అట్టి ఏవ్వెన రెండు లేదా అంతకెక్కువ ప్రాంతములు చేరియున్న ప్రతియొక స్థానిక ప్రాంతమునకు రాజ్యప్రభుత్వము ఒక రిజిస్ట్రారును నియమించవచ్చును:

అయితే, ఒక పురపాలిక, పంచాయితీ లేక ఇతర స్థానిక ప్రాధికార సంస్థ విషయములో దాని అధికారినెవరినై నను లేక ఇతర ఉద్యోగినెవరినైనను రాజ్య ప్రభుత్వము రిజిస్ట్రారుగా నియమించవచ్చును.

(2) ప్రతి రిజిస్ట్రారు, 8వ పరిచ్ఛేదము లేక 9వ పరిచ్ఛేదము క్రింద తనకు ఈయబడిన సకల 'సమాచారమును అందు నిమిత్తము నిర్వహించెడి రిజిస్టరులో, ఫీజుగాని, పారితోషికముగాని తీసుకొనకుండ, నమోదు చేయవలెను. మరియు తన అధికారితలో సంభవించునట్టి ప్రతి జననమును గూర్చియు ప్రతి మరణమును గూర్చియు జాగ్రత్తగా తెలిసికొనుటకును రిజిస్టరు చేయవలసిన వివరములను కనుగొని రిజిస్టరు చేయుటకును చర్యలు తీసికొనవలెను.

(3) ప్రతి రిజిస్ట్రారుకు, అతనిని నియమించిన స్థానిక ప్రాంతమునందు ఒక కార్యాలయము ఉండవలెను.

(4) ప్రతి రిజిస్ట్రారు, ముఖ్య రిజిస్ట్రారు ఆదేశించునట్టి దినములలోను ,అట్టి వేళలందును తన కార్యాలయములో జనన మరణములను రిజిస్టరు చేయు నిమిత్తము హాజరై యుండవలెను మరియు తాను ఏ స్థానిక ప్రాంతమునకు నియమితుడైనాడో ఆ స్థానిక ప్రాంతమునకు జనన మరణముల రిజిస్ట్రారు అను పదములు చేర్చి తన పేరు, తాను హాజరై యుండు దినములు మరియు వేళలు , స్థానిక భాషలో వ్రాయబడియుండు ఒక ఫలకమును తన కార్యాలయము యొక్క బాహ్య ద్వారముపై లేక దాని దగ్గరగా స్పష్టముగా కనుపించు ఒక స్థానము నందు పెట్టించ వలెను.

(5) రిజిస్ట్రారు , ముఖ్య రిజిస్ట్రారు యొక్క పూర్వామోదముతో, సబ్ రిజిస్ట్రార్లను నియమింపవచ్చును మరియు తన అధికారితలోని నిర్దిష్ట ప్రాంతములకు సంబంధించి తన అధికారములు మరియు కర్తవ్యములలో దేనినై ననుగాని అన్నింటిని గాని వారికి అప్పగించవచ్చును .

అధ్యాయము 3

జనన మరణముల రిజిస్ట్రీకరణ.

8. (1) 16వ పరిచ్ఛేదము యొక్క ఉపపరిచ్ఛేదము (1) క్రింద రాజ్య ప్రభుత్వము విహితపరచిన ప్రరూపములో నమోదు చేయవలసినట్టి అనేక వివరములను గూర్చి తమకు తెలిసినంతవరకు, తాను విశ్వసించుచున్నమేరకు సమాచారమును వాగ్రూపమునగాని వ్రాతమూలకమునగాని విహితపరచినట్టి కాలావధిలో రిజిస్ట్రారుకు అందజేయుట లేక అందజేయు నట్లు చూచుట ఈ క్రింద నిర్దిష్టపరచిన వ్యక్తుల కరవ్యమై, యుండును: ________________

4 /G--456 (ఏ) ఇందలి (బీ) నుండి (ఈ) వరకుగల ఖండములలో నిర్దేశించిన ఏదేని స్థలము కానట్టి గృహములోని జనన మరణముల విషయమున అది నివాస గృహమైనను, నివాసేతర గృహమైనను, ఆ గృహము యొక్క పెద్ద, లేక ఆ గృహములో ఒకటి కంటే ఎక్కువ కుటుంబములున్నయెడల ఆ కుటుంబ పెద్ద, అనగా ఆ గృహముచే లేక కుటుంబముచే పెద్దగా గుర్తింపుపొందిన వ్యక్తి, జననమును లేక మరణమును గూర్చి రిపోర్టు చేయవలసిన కాలావధిలోపల ఎప్పుడైనను అతడు గృహములో లేనియెడల, ఆ గృహములో నున్నట్టి ఆ పెద్ద యొక్క అత్యంత సన్నిహిత బంధువు, మరియు అట్టి ఏ వ్యక్తి యు లేనియెడల ఆ కాలావధిలో ఆ గృహములోనున్న అందరి కంటె వయసులో పెద్దవాడగు వయోజన పురుషుడు;

(బీ) ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రము, ప్రసూతి లేక నర్సింగుహోం లేక అటువంటి ఇతర సంస్థలోని జనన మరణముల విషయమున బాధ్యతగల అచటి వైద్యాధికారి లేక ఈ విషయమున అతనిచే ప్రాధికృతుడైన ఏ వ్యక్తి యైనను;

(సీ) జైలులోని జనన మరణముల విషయమున, ఆ జైలు బాధ్యతగల జైలరు;

(డీ) ఒక చౌట్రి, సత్రము , హాస్టలు , ధర్మశాల, భోజన గృహము, వసతి గృహము , పూటకూళ్ల యిల్లు, బారకాసు, కల్లు దుకాణము లేక సార్వజనిక సమాగమ స్థలములోని జనన మరణముల విషయమున, దాని బాధ్యతగల వ్యక్తి:

(ఈ) ఒక సార్వజనిక స్థలములో విడిచిపెట్టబడినట్లు కనుగొనబడిన అప్పుడే పుట్టిన శిశువు లేక ఏదేని శవము విషయమున గ్రామమై నచో, ఆ గ్రామము యుక్క గ్రామపెద్ద లేక ఇతర తత్సమానాధికారి, మరియు వేరొకచోట . అయినచో స్థానిక పోలీసు స్టేషను బాధ్యతగల అధికారి:

అయితే, అట్టి శిశువును లేక శవమును కనుగొనినట్టి లేక అట్టి శిశువు లేక శవము తన వశమునందు ఉంచబడినట్టి ఏ వ్యక్తి యైనను ఆ విషయమును గ్రామపెద్దకు లెక పైన చెప్పబడిన అధికారికి తెలియపరచవలెను.

(ఎఫ్) ఏదేని ఇతర స్థలములో, విహితపరచినట్టి వ్యక్తి

(2) ఉపపరిచ్ఛేదము (1)లో ఏమి ఉన్నప్పటికిని, ఒక రిజిస్ట్రీకరణ డివిజనులో ఉన్నట్టి పరిస్థితులను దృష్టియందుంచుకొని, రాజ్య ప్రభుత్వము ఉత్తరువు ద్వారా, ఉత్తరువులో నిర్దిష్ట పరచిన కాలావధి వరకు ఉపపరిచ్ఛేదము (1)యొక్క ఖండము (ఏ)లో నిర్వేశించిన గృహములోని జనన మరణములను గూర్చిన సమాచారమును ఆ ఖండములో నిర్దిష్ట పరచిన వ్యక్తులకు బదులు ఈ విషయమున పదాభిదానముతో రాజ్య ప్రభుత్వము నిర్దిషపరచినట్టి ఏ వ్యక్తి యైనను అందజేయ వలెనని లేక అందజేయునట్లు చేయవలెనని కోరవచ్చును.

9. ఒక ప్లాంటేషనులోని జనన మరణముల విషయములో, 8వ పరిచ్ఛేదములో నిర్దేశించిన సమాచారమును ఆ ప్లాంటేషను అధీక్షకుడు రిజిస్ట్రారుకు అందజేయవలెను లేక అందజేయునట్లు చేయవలెను: -

అయితే, 8వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1)లోని (ఏ) నుండి (ఎఫ్) వరకుగల ఖండములలో నిర్దేశించిన వ్యక్తులు, ఆవశ్యకమైన వివరములను ఆ ప్లాంటేషను అధీక్ష కునికి అందజేయవలెను.

విశదీకరణ: - ఈ పరిచ్ఛేదములో 'ప్లాంటేషను' అను. పదమునకు, తేయాకు, కాఫీ, మిరియాలు, రబ్బరు , ఏలకులు, సింకోనా లేక రాజ్య ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా నిర్దిష్ట పరచునట్టి ఇతర పదార్దములను పండించు టకు తయారు చేయబడుచున్నట్టి లేక వాస్తవముగా పండించబడు చున్నట్టి నాలుగు హెక్టార్లకు తక్కువకాని విస్తీర్ణముగల ఏదేని భూమి అని అర్ధము; మరియు ________________

5 /6-457 'ప్లాంటేషను అధీక్షకుడు' అను పదబంధమునకు, మేనేజరు అని పిలువబడినను, అధీక్ష కుడు అని పిలువబడినను లేక మరే ఇతర పేరుతో పిలువబడినను, ప్లాంటేషనులో శ్రామికులయొక్కయు పనియొక్కయు బాధ్యతను లేక పర్యవేక్షణను వహించుచున్న వ్యక్తి, అని అర్ధము

10.(1) తాము పరిచర్యచేసిన లేక ఉండియున్న లేక విహితపరచిన ప్రాంతము లలో సంభవించిన ప్రతియొక జననమును లేక మరణమును లేక రెండింటిని విహితపరచి నట్టి సమయములోను అట్టి రీతిగను తెలియపరచుట ఈ క్రింద తెలిపిన వ్యక్తులకర్తవ్యమే. యుండును.: -

(i) జనన సమయమునగాని మరణ సమయమునగాని పరిచర్యచేసిన,మంత్ర సాని లేక ఎవరేని యితర వైద్య పరివారకుడు లేక ఆరోగ్య పరిచారకుడు

(ii) శవముల సంస్కారమునకై ప్రత్యేకించిన స్థానము యొక్క పాలకుడు,లేక సొంతదారు లేక అట్టి స్థానమునందు హాజరులోనుండవలసినదని ఒక స్థానిక ప్రాధికార సంస్థ కోరినట్టి ఎవరేని వ్యక్తి లేక

(iii) రాజ్య ప్రభుత్వము ఈ విషయమున పదాభిదానముతో నిర్దిష్టపరచునట్టి ఎవరేని ఇతర వ్యక్తి,

(2) ఏ ప్రాంతములోనైనను , ఈ విషయమున అందు లభ్యమగు సౌకర్యము లను దృష్టియందుంచుకొని, మరణ కారణమును గూర్చి, విహితపరచినట్టి వ్యక్తి, నుండియు మరియు అట్టి ప్రరూపములోను రిజిస్ట్రారు. ఒక ధ్రువపత్రమును పొంద వలెనని, రాజ్య ప్రభుత్వము కోరవచ్చును .

(3) మరణ కారణమును గూర్చి ధువపత్రమును (సర్బిఫికేటు) పొందవలెనని రాజ్య ప్రభుత్వము ఉప పరిచ్ఛేదము (2) క్రింద కోరినయెడల ఎవరేని మరణించిన వ్యక్తి కడపటిసారి అస్వస్థుడైనప్పుడు వైద్యవృత్తి దారుచే పరిచర్య పొందియుండిన సందర్భములో ఆ వ్యక్తి మరణించిన పిమ్మట, ఆ వైద్యవృత్తిదారు, తనకు తెలిసినంత వరకు తాను విశ్వసించుచున్న మేరకు మరణ కారణమును తెలుపుచు విహిత ప్రరూపములో ఒక ధ్రువపత్రమును ఎట్టి ఫీజును వసూలు చేయకుండ ఆ మరణమునకు సంబంధించిన సమాచారమును అందజేయుటకు ఈ చట్టము క్రింద కోరబడిన వ్యక్తికి వెంటనే జారీచేయవలెను. మరియు అట్టి వ్యక్తి, ఆ ద్రువపత్రమును పొంది, ఈ చట్టము కోరిన ప్రకారము ఆ మరణమును గూర్చిన సమాచారమును అందజేయునప్పుడు రిజిస్ట్రారుకు ఆ ధ్రువపత్రమును ఈయవలెను.

11. ఈ చట్టము క్రింద కోరినట్టి ఏదేని సమాచారమును రిజిస్ట్రారుకు వాగ్రూపముగా ఇచ్చునట్టి. ప్రతియొక వ్యక్తి. ఈ విషయమున నిర్వహించెడి రిజిస్టరులొ తన పేరు, వివరణ, నివాస స్థలము వ్రాయవలెను. అతడు వ్రాయలేనివాడై నయెడల ఆ వివరములను రిజిస్ట్రారు నమోదు చేయవలెను. మరియు ఆ వ్యక్తి ఆ రిజిస్టరులొ నమోదు చేసిన తన పేరుకు, వివరణకు, నివాస స్థలమునకు ఎదురుగా తన బొటన వేలి ముద్ర వేయవలెను.

12. జననము లేక మరణమును రిజిస్టరు చేయుట పూర్తి అయిన వెంటనే అట్టి జననము లేక మరణమునకు సంబంధించిన రిజిస్టరు నుండి విహితపరచిన వివరముల ఉదాహృతులను రిజిస్ట్రారు తన చేవ్రాలుచేసి, 8వ పరిచ్ఛేదము లేక 9వ పరిచ్ఛేదము క్రింద సమాచారము అందజేసిన వ్యక్తికి ఉచితముగా ఈయవలెను.

13. జననము లేక మరణమును రిజిస్టరు చేయుటకు నిర్దిష్టపరచిన కాలావధి ముగిసిన పిమ్మటను, అది సంభవించిన ముప్పది దినముల లోపలను రిజిస్ట్రారుకు తెలియపరచినట్టి ఏదేని జననము లేక మరణమును, విహితపరచినట్టి ఆలస్యపు ఫీజు చెల్లించిన మీదట రిజిస్టరు చేయు ________________

6 /6-458 (2) అది సంభవించిన ముప్పది దినముల తరువాతను ఒక సంవత్సరము లోపలను రిజిస్ట్రారుకు తెలియపరచినట్టి, ఏదేని జననము లేక మరణమును, విహిత ప్రాధికారియొక్క వ్రాతమూలక అనుజ్ఞ తో మాత్రమే, మరియు విహిత ఫీజు చెల్లించి , ఒక నోటరీ పబ్లికు సమక్షమున లేక రాజ్య ప్రభుత్వముచే ఈ విషయమున ప్రాధికృతుడైన ఎవరేని ఇతర అధికారి సమక్షమున చేయబడిన అఫిడవిటు దాఖలు చేసిన మీదట మాత్రమే రిజిస్టరు చేయవలెను.

(3) అది సంభవించిన ఒక సంవత్సరము లోపల రిజిస్టరు చేయనట్టి ఏదేని జననము లేక మరణమును దాని యదార్దతను సరిచూచిన పిమ్మట , విహిత ఫీజు చెల్లించబడిన మీదట, మొదటి తరగతి మేజిస్ట్రేటుగాని, ప్రెసిడెన్సి మేజిస్ట్రేటు గాని చేసిన ఉత్తరువుపై మాత్రమే రిజిస్టరు చేయవలెను

(4) ఏ వ్యక్తి పైనైనను, అతడు ఏదేని జననము లేక మరణమును అందుకై నిర్దిష్టపరచిన సమయము లొపల రిజిస్టరు చేయకున్నందులకు తీసికొనదగు ఏదేని చర్యకు ఈ పరిచ్ఛేదము యొక్క నిబంధనలు భంగము కలిగించవు మరియు అట్టి ఏదేని చర్య జరుగుచుండగా అట్టి జననము లేక మరణమును రిజిస్టరు చేయవచ్చును.

14. ఎవరేని శిశువు యొక్క జననమును పేరు లేకుండ రిజిస్టరు చేసినచో, ఆ శిశువు యొక్క తల్లి లేక తండ్రి లేక సంరక్షకుడు, విహిత కాలావధి లోపల ఆ శిశువు పేరును వాగ్రూపమునగాని, వ్రాతమూలకమునగాని రిజిస్ట్రారుకు తెలియజేయవలెను, మరియు అటుపై, రిజిస్ట్రారు అట్టి పేరును రిజిస్టరులో నమోదుచేసి, పొడి సంతకము పెట్టి ఆ నమోదు తేదీ వేయవలెను.

15. ఈ చట్టము కింద రిజిస్ట్రారు ఉంచు ఏదేని రిజిస్టరులో జననమును లేక మరణమును గూర్చిన, ఏదైన నమోదు, ప్రరూపములోగాని, సారత: గాని, తప్పుగా ఉన్నదని లేక కపటపూర్వకముగా గాని అనుచితముగాగాని చేయబడినదని రిజిస్ట్రారుకు నమ్మకము కలుగునట్లు రుజువుపరచినయెడల, అతడు అట్టి నమోదులను ఏ షరతులపై మరియు ఏ పరిస్తితులలొ సరిచేయవచ్చునో లేక రద్దు చేయవచ్చునో అను దానిని గూర్చి రాజ్య ప్రభుత్వము చేయునట్టి నియమములకు లోబడి, మూల నమోదులో ఎట్టి మార్పు చేయకుండ మార్జినులొ యధోచిత నమోదు ద్వారా ఆ తప్పును సరిచేయ వచ్చును, లేక ఆ నమోదును రద్దుచేయవచ్చును. మరియు ఆ మార్జినులొని నమోదుప్రక్క సంతకము చేసి, సరిచేసిన లేక రద్దు చేసిన తేదీని ఆ సంతకమునకు చేర్చవలెను.

అధ్యాయము 4.

రికార్డుల మరియు గణాంకముల నిర్వహణ

16. (1) ప్రతి రిజిస్ట్రారు తాను అధికారితను వినియోగించుచున్నట్టి రిజిస్ట్రీకరణ ప్రాంతమునకు లేక అందలి ఏదేని భాగమునకు ఒక జనన మరణముల రిజిస్టరును విహిత ప్రరూపములో ఉంచవలెను.

(2) ఆయా సమయములందు విహితపరచినట్టి ప్రరూపములను, అనుదేశము లను అనుసరించి జనన మరణములను నమోదుచేయుట కొరకు చాలినన్ని రిజిస్టరు పుస్తకములను ముఖ్య రిజిస్ట్రారు ముద్రింపచేసి సరఫరా చేయించవలెను, మరియు స్తానిక భాషలో అట్టి ప్రరూపముల ప్రతి నొకదానిని ప్రతి రిజిస్ట్రారు కార్యాలయముయొక్క బాహ్య ద్వారముపై గాని దాని దగ్గరగా గాని బాగుగా కనపడు ఏదేని స్థలములొ ప్రదర్శించవలెను.

17. (1) ఫీజు మరియు తపాల చార్జీ చెల్లింపునకు సంబంధించిన నియమము లతో సహా రాజ్య ప్రభుత్వము ఈ విషయమున చేసిన ఏవేని నియమములకు లోబడి, ఏ వ్యక్తియై నను ________________

7 /6-459 (ఏ) జనన మరణముల రిజిస్టరులొని ఏదేని నమోదు కొరకు రిజిస్ట్రారుచే సోదా చేయించవచ్చును; మరియు

(బీ) అట్టి రిజిస్టరు నుండి ఏదేని జననము లేక మరణమునకు సంబంధించిన ఉదాహృతిని పొందవచ్చును.

అయితే, ఏదేని మరణమునకు సంబంధించి ఏ వ్యక్తి కైనను జారీచేసినట్టి ఏదేని ఉదాహృతిలో, ఆ రిజిస్టరులో నమోదు చేసిన, మరణ కారణమును గూర్చిన వివరములను వెల్లడించకూడదు.

(2) ఈ పరిచ్ఛేదము క్రింద ఇచ్చిన అన్ని ఉదాహృతులను రిజిస్ట్రారుగాని, భారత సాక్ష్య చట్టము, 1872 యొక్క 76వ పరిచ్ఛేదములోని నిబంధనల ప్రకారము ఉదాహృతులను ఇచ్చుటకు రాజ్య ప్రభుత్వముచే ప్రాధికృతుడై నట్టి ఎవరేని ఇతర అధికారిగాని, ధ్రువపరచవలెను మరియు వాటిని ఆ నమోదు దేనికి సంబంధించినదో, ఆ జననమును లేక మరణమును రుజువుపరచు నిమిత్తము సాక్ష్యముగా స్వీకారయోగ్య మ్మె నవగును.

18. జిల్లా రిజిస్ట్రారు నిర్దిష్టపరచునట్టి రీతిగా మరియు అట్టి ప్రాధికారి రిజిస్ట్రీకరణ కార్యాలయములను, తనిఖీ చేయవలెను మరియు అందు ఉంచిన రిజిస్టర్లను పరీక్షించవలెను .

19. (1) ప్రతి రిజిస్ట్రారు. తాను ఉంచిన రిజిస్టరులొని జనన మరణముల నమోదులను గురించిన వివరణి నొకదానిని, విహితపరచునట్టి అంతరావధులలోను, అట్టి ప్రరూపములలోను ముఖ్య రిజిస్ట్రారు కుగాని అతడు నిర్దిష్టపరచిన ఎవరేని అధికారికి గాని పంపవలెను.

(2) ముఖ్య రిజిస్ట్రారు, రిజిస్ట్రార్లు అందజేసిన వివరణులలోని సమాచారమును సంకలనము చేయించి, ఆ సంవత్సరములో రిజిస్టరయిన జనన మరణము లపై, ఒక గణాంక' రిపోర్టును ప్రజలందరి ఎరుకకొరకు, విహితము చేయునట్టి అంతరావధులలోను, ప్రరూపములలోను ప్రచురణ చేయవలెను.

అధ్యాయము 5.

వివిధ విషయములు

20. (1) ఈ విషయమున కేంద్ర ప్రభుత్వము చేయు నట్టి నియమములకు లోబడి, పౌరసత్వ చట్టము, 1955 కింద భారతదేశమునకు వెలుపల నున్న భారత పౌరుల జనన మరణములను భారతీయ కాన్సలేట్లలో రిజిస్టరు చేయుటకు సంబంధించి చేసిన నియమముల ననుసరించి అట్టి పౌరుల రిజిస్ట్రీకరణను గూర్చి తనకందిన, సమాచారమును రిజిస్ట్రారు-జనరలు రిజిస్టరు చేయించవలెను మరియు అట్టి ప్రతి రిజిస్ట్రీకరణను కూడ ఈ చట్టము క్రింద తగు రీతిగా చేసినట్లు భావించవలెను.

(2) భారతదేశమునకు వెలుపల జన్మించిన ఏ శిశువును గూర్చి ఉప పరిచ్ఛేదము (1)లోని నిబంధనానుసారముగా సమాచారము అందలేదో ఆ శిశువు యొక్క తల్లిదండ్రులు భారతదేశములో స్టిర నివాసమేర్పరచుకొను ఉద్దెశముతొ భారత దేశమునకు తిరిగి వచ్చినయెడల, వారు, ఆ శిశువు భారతదేశమునకు వచ్చిన తేదీ నుండి అరువది దినముల లోపల ఎప్పుడైనను, ఆ శిశువు భారతదేశమున జన్మించి యుండిన ఎట్లొ అట్లే అదే రీతిగా ఆ శిశువు యొక్క జననమును ఈ చట్టము క్రింద రిజిస్టరు చేయించవచ్చును, మరియు పైన చెప్పిన అరువది దినముల కాలావధి ముగిసిన పిమ్మట 13వ పరిచ్ఛేదపు నిబంధనలు, అట్టి శిశువు జననమునకు వర్తించును. 8 /G-460 ______________ 21. ఏ వ్యక్తినైనను, అతడు నివసించు వాడలో సంభవించిన ఏదేని జననమునకు లేక మరణమునకు సంబంధించి అతనికి తెలిసిన సమాచారమును అందజేయ వలసినదిగా వాగ్రూపమునగాని, వ్రాతమూలకమునగాని, రిజిస్ట్రారు కోరవచ్చును. అట్టి అభ్యర్దనను పాటించుట ఆ వ్యక్తి కి తప్పనిసరియై ఉండును.

22. ఈ చట్టము యొక్క లేక ఈ చట్టము క్రింద చేసిన ఏదేని నియమము లేక ఉత్తరువు యొక్క నిబంధనలలో వేటినైనను ఏదేని రాజ్యములో అమలు పరచుటకు ఆవశ్యకమని తోచునట్టి ఆదేశములను కేంద్ర ప్రభుత్వము ఆ రాజ్య ప్రభుత్వమునకు ఈయవచ్చును.

23 (1) ఈ క్రింది వ్యక్తి ఎవరైనను, అనగా-

(ఏ) 8వ మరియు 9వ పరిచ్ఛేదముల నిబంధనలలో దేని క్రిందనై నను ఏదైన సమాచారమును అందజేయుట తన కర్తవ్యమై యుండి యుక్తమైన కారణములు లేకుండ అందజేయకుండు వ్యక్తి లేక;

బీ) తెలుసుకొని రిజిస్టరు చేయించవలసిన వివరములలో అసత్యమై నదని తనకు తెలిసియున్నట్టి , లేక అసత్యమైనదని తాను విశ్వసించుచున్నట్టి ఏదేని సమాచారమును జనన, మరణముల రిజిస్టరులో చేర్చు నిమిత్తమై 'అందజేయు లేక అందజేయించు వ్యక్తి; లేక

(సీ) 11వ పరిచ్ఛేదము ద్వారా కోరినట్లు రిజిస్టరులొ తన పేరు, వివరణ , నివాస స్థలము వ్రాయుటకు లేక తన బొటన వేలిముద్ర వేయుటకు నిరాకరించు వ్యక్తి,

ఏబది రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగియుండును.

(2) తన అధికారితా క్షేత్రమందు సంభవించు ఏదేని జననమునుగాని, మరణమునుగాని యుక్తమైన కారణము లేకుండా రిజిస్టరు చేయుటను లేక 19వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1) ద్వారా కోరినట్టి ఏవేని వివరణులను సమర్పించుటను ఉపేక్షించు లేదా అట్లు రిజిస్టరు చేయుటకు లేక సమర్పించుటకు నిరాకరించు ఏ రిజిస్ట్రారైనను లేక సబ్-రిజిస్ట్రారైనను ఏబది రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగియుండును.

(3) 10వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (3) క్రింద ఒక ధ్రువపత్రమును జారీచేయుటను ఉపేక్షించు లేక జారీచేయుటకు నిరాకరించు ఏ వైద్యవృత్తిదారైనను మరియు అట్టి ధ్రువపత్రమును అందించుటను ఉపేక్షించు లేక అందించుటకు నిరాకరించు ఏ వ్యక్తియైనను ఏబది రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగి యుండును.

(4) ఈ చట్టములోని ఏదేని నిబంధన యొక్క ఉల్లంఘనకు ఈ పరిచ్ఛేదములో ఏ శాస్తియు లేనిచో, ఆ నిబంధనను యుక్తమ్మెన కారణము లేకుండ ఉల్లంఘించు ఏ వ్యక్తి యైనను పది రూపాయలదాక ఉండగల జుర్మానాతో శిక్షింపదగియుండును.

(5) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1898లో " ఏమియున్నప్పటికిని, ఈ పరిచ్ఛేదము క్రింది అపరాధమును మేజిస్ట్రేటు సంక్షిప్తముగా విచారణ జరుపవలెను.

24. (1) విహితపరచు నట్టి షరతులకు లోబడి, ముఖ్య రిజిస్ట్రారు, ఈ విషయమున ఒక సాధారణ లేక ప్రత్యేక ఉత్తరువు ద్వారా ప్రాధికారమొసగినట్టి ఏ అధికారియైనను , ఈ చట్టము క్రింద అపరాధము చేసిన లేక చేసినట్లు యుక్తముగా అనుమానించిన వ్యక్తి నుండి, అట్టి అపరాధమును రాజీచేయుచు ఏబది రూపాయలకు ________________

9 /6-461 మించని మొత్తము ఈ చట్టము కింద క్రిమినలు చర్యలు ప్రారంభించుటకు పూర్వముగాని తర్వాతగాని, స్వీకరించవచ్చును.

(2) అట్టి మొత్తమును చెల్లించిన మీదట , అట్టి వ్యక్తిని ఉన్మోచితుని చేయవలెను . మరియు అట్టి అపరాధమును గూర్చి అతనిపై మరే చర్యలను తీసుకొనరాదు.

25. ఈ చట్టము క్రింద శిక్షింపదగు అపరాధము విషయమున అభియోగ మేదియు, ముఖ్య రిజిస్ట్రారు, ఈ విషయమున సాధారణ లేక ప్రత్యేక ఉత్సరువు ద్వారా ప్రాధికారమొసగిన అధికారి తప్ప తేరాదు.

26. ఈ చట్టము యొక్క నిబంధనలననుసరించి లేక వాటి క్రింద చేసిన ఏదేని నియమము లేక ఉత్తరువుననుసరించి వ్యవహరించుచున్న లేక వ్యవహరించుచున్నట్లుతాత్పర్యమగునట్టి , అందరు రిజిస్ట్రార్లు మరియు సబ్-రిజిస్ట్రార్లు భారత శిక్షా స్మృతి 21వ పరిచ్ఛేదపు భావములో పబ్లికు సేవకులుగా భావించబడుదురు.

27. రాజ్య ప్రభుత్వము ఈ చట్టము క్రింద లేక దీని ననుసరించి చేసిన నియమముల క్రింద తాను వినియోగించదగు ఏ అధికారమున్నెనను (30వ పరిచ్ఛేదము క్రింద నియమములను చేయుటకుగల అధికారము తప్ప) రాజపత్రములో అధిసూచించిన ఆదేశము ద్వారా అందు నిర్దిషపరచు షరతు లేవేనియున్నయెడల, వాటికి లోబడి, ఆ ఆదేశములో నిర్దిస్టపరచునట్టి తన అధీనస్టు డైన ఏ అధికారియై నను లేక ఏ ప్రాధికారి యైనను కూడ వినియోగింపదగునని ఆదేశించవచ్చును.

28. (1) ఈ చట్టము ననుసరించి లేక ఈ చట్టము క్రింద చేసిన ఏదేని నియమము లేక ఉత్తరుపుననుసరించి సద్భావపూర్వకముగా చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన ఏ చర్యకైనను ప్రభుత్వముపై గాని రిజిస్ట్రారు-జనరలుపై గాని, ఏరిజిస్ట్రారు పై గాని, ఈ చట్టము క్రింద ఏదేని అధికారమును వినియోగించుచున్న లేక ఏదేని కరవ్యమును నిర్వరించుచున్న ఏ వ్యకి పై గాని ఎట్టి దావా, అభియోగము, లేక ఇతర శాసనబద్ద చర్యవుండదు.

(2) ఈ చట్టము ననుసరించి లేక ఈ చట్టము క్రింద చేసిన ఏదేని నియమము లేక ఉత్తరువుననుసరించి సద్భావపూర్వకముగా చేసిన లేక చేయుటకు ఉద్దెశించినట్టి దేనివలన గాని కలిగిన లేక కలుగగల ఏదేని నషటమునకై. ప్రభుత్వముపై ఎట్టి దావా లేక ఇతర శాసనబద్ద చర్య ఉండదు.

29. ఈ చట్టములోనున్నదేదియు, జనన మరణముల మరియు వివాహముల రిజిస్ట్రికరణ చట్టము, 1886 యొక్క నిబంధనలకు భంగము కలిగించునదిగా అన్వయించరాదు.

30. (1) ఈ చట్టపు ప్రయోజనములను నెరవేర్చుటకు రాజ్య ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము యొక్క ఆమోదముతో రాజపత్రములో అధిసూచన ద్వారా నియమము లను చేయవచ్చును.

(2) ప్రత్యేకించియు, పైన చెప్పిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము లేకుండను, అట్టి నియమములలో, ఈ క్రింది విషయములకై, నిబంధనలు చేయవచ్చును:-

(ఏ) ఈ చట్టము కింద ఉంచవలసిన జనన మరణముల రిజిస్టర్ల ప్రరూపములు;

(బీ) 8వ పరిచ్ఛేదము క్రింద రిజిస్ట్రారుకు సమాచారమును ఏ కాలావధి లోపల ఏ ప్రరూపములో మరియు ఏ రీతిగా అందజేయవలెను; (సీ) 10వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (1) క్రింద జనన మరణములను గురించి ఏ కాలావధిలోపల మరియు ఏ రీతిగా తెలియపరచవలెను;

(డీ) మరణ కారణమును గూర్చిన ధ్రువపత్రమును ఏ వ్యక్తి నుండి మరియు ఏ ప్రరూపములో పొందవలెను;

(ఈ) 12వ పరిచ్ఛేదము క్రింద ఈ యదగినట్టి, ఉదాహృతి వివరములు;

(ఎఫ్) జననమునుగాని మరణమునుగాని 13వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (2) క్రిoధ రిజిస్టరు చేయుటకు అనుజ్ఞను మంజూరుచేయు ప్రాధికారి;

(జీ) 13వ పరిచ్ఛేదము క్రిoద రిజిస్టరు చేయుటకొరకు చెల్లించదగు ఫీజు;

(హెచ్) ముఖ్య రిజిస్ట్రారుచే 4వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (4) క్రిoద రిపోర్టుల సమర్పణ:

(ఐ) జనన మరణముల రిజిస్టర్ల సోదా మరియు అట్టి సోదాకొరకును, రిజిస్టర్ల నుండి ఉదాహృతుల మంజూరీ కొరకును చెల్లించదగు ఫీజు;

(జే) 19వ పరిచ్ఛేదము క్రింద వివరణులు మరియు గణాంక రిపోర్టులను ఏ ప్రరూపములో మరియు ఏ అంతరావధులలో అందజేయవలెను మరియు ప్రచురించవలెను;

(కే) రిజిస్ట్రార్లు ఉంచిన రిజిస్టర్లయొక్కయు ఇతర రికార్డులయొక్కయు అభిరక్ష, దాఖలు మరియు అంతరణ;

(ఎల్) జనన మరణముల రిజిస్టరులో తప్పులను సరిచేయుట మరియు నమోదులను రద్దుచేయుట;

(యమ్) విహితపరచవలసిన లేక విహితపరచదగు ఏదేని ఇతర విషయము.

(3) ఈ చట్టము క్రింద చేసిన ప్రతి నియమమును దానిని చేసిన పిమ్మట వీలైనంత శీఘ్రముగా రాజ్యశాసనమండలి సమక్షమున ఉంచవలెను.

(1) ఈ చట్టము నందలి విషయములకు సంబంధించి, ఏదైన రాజ్యములో లేక రాజ్య భాగములో అమలులోనున్నట్టి ఏదేని శాసనము, అది అటు సంబంధించియున్న మేరకు, 29వ పరిచ్ఛేదపు నిబంధనలకులోబడి, అట్టి రాజ్యములో, లేక సందర్భానుసారముగా రాజ్య భాగములో ఈ చటము అమలులోనికి వచ్చినప్పటి నుండి రద్దు అగును.

(2) అట్లు రద్దు అయినప్పటికిని, అట్టి శాసనము కింద (జారీచేసిన ఏదేని అనుదేశము లేక ఆదేశము మరియు చేసిన ఏదేని వినియమము, నియమము లేక ఉత్తరువుతో సహా) చేసిన ఏదేని పని, లేక తీసికొనిన ఏదేని చర్య, ఈ చట్టపు నిబంధనలకు అసంగతముగా లేనంత వరకు, అట్టి పని చేసినపుడు లేక చర్య తీసికొనినప్పుడు పైన చెప్పిన నిబంధనలు అమలులో నుండి యుండిన ఎట్లో అట్లే, ఆ నిబంధనల క్రింద చేసినట్లు లేక తీసికొనినట్లు భావించవలెను మరియు ఈ చట్టము క్రింద చేసిన ఏదేని పని ద్వారా, లేక తీసికొనిన ఏదేని చర్య ద్వారా త్రోసిపుచ్చబడు వరకు, ఆ ప్రకారము అమలులో కొనసాగుచుండును.

32. ఒక రాజ్యమునందలి ఏదేని ప్రాంతమునకు ఈ చట్టపు నిబంధనలను వర్తింపచేయుటలో, వాటిని అమలు పరచుటయందు ఏదేని చిక్కు ఏర్పడినయెడల ఈ చటపు నిబంధనలకు అసంగతము కాకుండను, కేంద్ర ప్రభుత్వము యొక్క ఆమోదము తోను ఉత్పరువు ద్వారా, రాజ్య ప్రభుత్వము ఆ చిక్కును తొలగించుటకు ఆవశ్యకమని లేక ఉపయు కృమని తనకు తోచు నటి నిబంధనలను చేయవచ్చును లేక అట్బి ఉత్తరువు లను ఈయవచ్చును

అయితే, ఒక రాజ్యములో ఏదేని ప్రాంతమునకు సంబంధించి ఈ పరిచ్ఛేదము క్రింద ఉత్తరువేదియు, ఆ ప్రాంతములో ఈ చట్టము అమలులోనికి వచ్చినట్టి తేదీ నుండి రెండు సంవత్సరములు గడచిన పిమ్మట చేయబడరాదు.

  1. ఈ చట్టము, ఆంధ్రప్రదేశ్ రాజ్యములో 1-4-1970 తేదీ నుండి అమలులోనికి వచ్చింది. భారత రాజపత్రము II వ భాగము పరిచ్ఛేదము 3 ( 1 ) పేజీ 966లో ప్రచురితమైన 7-3-1970 తేదీగల అధిసూచన నెం - జి - ఎస్. ఆర్. 461 ను చూడండి.