చెలియతో పూబంతు లాడెనే

వికీసోర్స్ నుండి


పల్లవి:
చెలియతో పూబంతు లాడెనే మనసీతతో పూబంతు లాడెనే
అలికులవేణి యహల్యశాపము బాపి
నట్టి శ్రీరాములు అతివేడ్కతో నేడు

చరణము(లు):
దొంతి అజాండమ బంతిగజేసి తా
వింతగనాడు శ్రీవిభుడు నేడిట మన

వేడుకతోడ నీరేడు జగమ్ములు
గూడ బంతిగ బట్టి యాడు నేర్పరి నేడు

దనుజుల బట్టి శోధనజేసి పువ్వులు
దునిమినగతి గోటదునిమి యాడెడు ప్రౌఢ

అంగనయై రిపుల బంధించి సురలకొసంగి
అమృతపు కలశ మంది యాడెడుజాణ

ధరణిని నరసింహదాసుని దొరయైన
ధరణిజాధిపుడు భద్రాద్రిరాఘవ విభుడు