చెప్పులు కుడుతూ కుడుతూ/తెగ నాయకుని ఆచారాలు
2. తెగ నాయకుని ఆచారాలు
ఆదిజాంబవుడిని తమ మూలపురుషునిగా మాదిగలు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన 'మాదిగల పితామహుడు' ప్రపంచం ఆరంభానికి ఆరునెలల ముందే వెలసినవాడు. ఆర్యుల దండయాత్రలతో భారతదేశంలో 'ప్రపంచం మొదలయింది. అప్పుడున్న ఆదివాసులలో ఈ మానవుడు 'అది మాదిగ' ఒకరు. అప్పటికి ఆది జాంబవుడు చాలా గొప్పవాడు. ఏది ఏమైనప్పటికీ యుద్ధం చేయాలనుకున్నప్పుడు శ్రీరాముడు మొట్టమొదటిసారి అతని దగ్గరికి వెళ్ళి పెద్దవానిగా సలహా అడిగి ఆతర్వాత అతను చెప్పింది చేశాడు. ఆర్యులు మొట్టమొదటిసారి ఈ భూమి పుత్రులతో సంబంధం పెట్టుకున్నారు. ఆనాటికి ఆయన ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, ఆదిజాంబవుడికి ఆతర్వాత అవమానాల దశ ఆరంభమైంది. ఆయన ఉన్నత స్థానం నుండి పడిపోయాడు.
ఆ రోజులలో కామధేనువు అనే సమస్త సంపదలు యిచ్చే ఆవు ఉండేది. వెల్లమను అనే బాలుడు ఈ గోవును మేపుతుండేవాడు. ఆవు పాలు యిచ్చేది. ఈ నేలమీద ఆదివాసీలు పూజించే శక్తిస్వరూపమైన ఆదిశక్తి స్వయంగా దేవతలకి కామధేనువు పాలు తాగటానికి అనుమతించింది. వెల్లమనుకి ఆ పాలని రుచిచూడాలని కోరిక పుట్టింది. కాని దేవుళ్ళు " ఏ విధంగానూ నువ్వు అందులో వాటా అడగటానికి వీల్లేదు” అన్నారు. అతనికి కోరిక తగ్గలేదు. ఒక రోజు జబ్బు చేసినట్టుగా పడుకున్నాడు. దేవతలు పాలు తాగి వదలిన పాత్రను దొంగతనంగా తీసుకుని అందులో నీళ్ళు పోసి దాన్ని తాగాడు. 'పాలే ఇంత రుచిగా ఉంటే మాంసం యింకెంత రుచిగా ఉంటుందో” అనుకున్నాడు. కామధేనువుకి అతని చెడ్డ ఆలోచనలు తెలిసిపోయాయి. తన మాంసం తినాలన్న ఆలోచన ఎవరికైనా కలిగేసరికే కామధేనువు తన శక్తులన్నీ కోల్పోయి మరణించింది.
దేవుళ్ళు జరిగిందంతా విన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి కామధేనువు చనిపోవటం చూశారు. వాళ్ళు ఆదిజాంబవుడి దగ్గరకు వెళ్ళారు. "నువ్వు మనందరిలోనూ గొప్పవాడివి. కనక నువ్వు దీన్ని నాలుగు భాగాలు చెయ్యాలి అన్నారు. ఆయన ఆ విధంగా చేశాడు. తనకొక భాగం ఉంచుకుని బ్రహ్మ, విష్ణువు, శివుడికి తలో భాగం యిచ్చాడు. వాళ్ళు తమ భాగాలు తీసుకుని వెళ్ళిపోయారు.
ఇంతలో వాళ్ళు తిరిగి వచ్చి “మాకు ఆవు తిరిగి కావాలి అన్నారు. వాళ్ళు మూడు భాగాలు తెచ్చి, ఆది జాంబవుడి భాగాన్ని అడిగారు. ఈలోగా ఆ బాలుడు, వెల్లమను, ఒక ముక్కను తీసి ఉడకబెడుతున్నాడు. అది కుండలో ఉడుకుతుండగా, ఆ మాంసంలోని ఒక చిన్న ముక్క పైకి లేచి నిప్పులో పడింది. అతను దాన్ని ఎత్తి, ఊదుతూండగా అతని నోటి తడి మాంసానికి తగిలింది. దాన్ని తిరిగి కుండలో వేశాడు. ఆదిజాంబవుడు తన భాగాన్ని తీసుకుని తతిమా మూడు భాగాలలో కలిపి ఒక కొత్త ఆవును సృష్టించటం మొదలుపెట్టాడు. కాని పాపం! ఉడికి, ఊదబడిన ముక్కను దాని స్థానంలో పెట్టలేకపోయాడు. కామధేనువు అంతకు పూర్వంలా లేదు. దాని మెడ దగ్గర అంతకు ముందున్న మాంసం పోవడంతో చర్మం వేళ్ళాడుతోంది. అన్ని విధాల అది తగ్గిపోయింది. ఎంతో గొప్పగా రెండు తలలతో ఉండే కామధేనువు ఈనాటి ఆవు పరిమాణానికి దిగజారిపోయింది.
' ఆదిజాంబవుడు తన ఉన్నత స్థానం నుంచి కిందకి వచ్చి మన కింద ఉండాలి' అన్నారు దేవుళ్ళు. ఆ విధంగా అతని అవమాన దశ ఆరంభమైంది. తనకోసం ఆదిజాంబవుడు ఒక బావిని తవ్వుకుంటే వెల్లమాను మరొబావిని తవ్వుకొన్నాడు. వారమధ్య కులభేదం పుట్టింది. మాదిగల పితామహుని గాథ అది. అయితే ఎవరి ప్రమేయం వల్ల ఇంత తీవ్రమైన మార్పు వచ్చిందో ఆ బాలుడు వెల్లమను ఎవరు? అస్పృశ్యులలో వల్లువలు అనే పూజారి కులం ఉంది. బ్రాహ్మణ ఋషులకు మాత్రమే తెలిసిన పూజా శాస్త్రాలను పోలిన విద్యను ఈనాటికీ వారు ఎంతో శ్రద్ధగా రక్షించుకున్నారు. సంస్కృతశాస్త్రాల చిహ్నాలు అందులో కనబడుతుంటాయి. ఆదివాసీ తెగలతో ఆర్యులు స్నేహపూర్వకంగా ఉండి వారి ఆశ్రమాలలో విద్యాభోదన చేస్తున్న రోజులకు అవి తార్కాణాలు. కుల భావాలు విభేధాలు ఏర్పడుతున్నప్పుడు కొత్త పాతల మధ్య 'వల్లువలు' ఒక గొలుసులా ఉండి ఉంటారు.
ఆ బాలుడు వెల్లమాను దేవుళ్ళకి పాలు సమర్పించాలి. దేవుళ్ళను అభిమానించి, ఆ పాలు తాగేందుకు ఆదిశక్తి అనుమతించింది. అంటే ఆర్యులు ఆదివాసులు భావన స్వంతం చేసుకొని, వారి ఆచారవ్యవహారాలలో కలిపేసుకొనిపోతున్నప్పుడు ఆ అనుమతి లభించింది. కాని ఆ బాలుడు వెల్లమాను దేవుళ్ళ పానీయంలో వాటా తీసుకోవటంతోటే అయోగ్యుడు అయిపోయాడు. మాంసం మీద కోరిక అతని మనసులో నిండిపోయింది. ఇది ఆర్యులకీ, ద్రవిడులకీ మధ్య ఉన్న తీవ్రమైన వివాదం. ఎందుకంటే ద్రావిడులు మాంసం తింటారు. అది వారి మధ్య తొలి స్నేహ సంబంధాలను అల్లకల్లోలం చేసింది. ఈ మార్పుకి కారణం సామాజికంగా వారి మధ్య పొసగకపోవటం.
ఆది జాంబవుడి గుర్తులకోసం అనేక గ్రంధాలను వెదికాను. నాకు అనేకం లభించాయి. పురాణ కాలం నుంచి ఆయన వారసులు మన రోజుల వరకూ ఆయన్ను తీసుకువచ్చారు. కర్ణాటకకు చెందిన మాదిగలలో 'జంబు” అనే పూజారి జాతి ఉంది. వారికి లౌకికులతో వివాహసంబంధాలు లేవు. అందరూ ఇచ్చిన దానిమీదనే ఆధారవడి జీవిస్తారు. వారనత్వంగా వచ్చే పూజారిత్వంతో పెద్ద పూజారి తరచుగా పల్లెలు తిరుగుతాడు. తన అనుయాయూలకు బోధలు చేన్తుంటాడు. తెగ పెద్ద కాలక్రమంగా పూజారి పెద్ద అయాడని గ్రహించటం కష్టంకాదు. తెగ చెల్లాచెదురవుతూండగా దూరప్రాంతాలకు వలస పోయినవారి మీద పూజారుల వారసత్వం పట్టు కోల్పోయింది. జనాభా లెక్కలలో మాదిగల ఉపకులాలుగా చెప్పబడే జాంబవులు, జాంబవంతులు ఆది జాంబవుడికి దగ్గరి వారసులయుంటారు.
“మాదిగల పితామహుడు” రామునికి యుద్ద విషయాలలో గౌరవనీయుడైన నలహాదారుడని పురాణగాథ చెపుతుంది. గొప్ప నంన్కృతిక ఇతిహనవ్లైన రామాయణాన్ని ఆది జాంబవుడి చివ్నోలకోనం తిరగేశాను. కవి ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుని గురించి చెపుతాడు. బహుశా ఆయన ఆదిమాదిగ అయిన ఆదిజాంబవుడయుండాలి. కవిత్వపు ముసుగులో ఇతర వీరులతో సమానం చేయటానికి జాంబవంతుడు గౌరవప్రదంగా చెప్పబడ్డాడు. అతని భావాలు సుదీర్ధంగా వివరించబడ్డాయి.
రామునికి యుద్ధంలో సహాయపడిన వీరులను చెప్పుటపుడు రామాయణ కవి వారిని దృశ్యమానం చేసేందుకు వారి రాజ చిహ్నాలతో వారిని నంభోదించాడు. వానరులు, ఎలుగుబంట్లుగా చెవృబడినవారు బవాశా ఆ జంతువులను మూజించి ఉండేవారయుండాలి. ద్రవిడ రాజవంశాలకు వారి ధ్వజాలుగా జంతువులు ఉండటం వల్ల చేరులకు ఏనుగులు, పల్లవులకు పులులు, జాంబవంతుని తెగకు ఎలుగుబంటి ధ్వజం కావడం వల్ల చేరులకు ఏనుగులు, పల్లవులకు పులులు, జాంబవంతుని తెగకు ఎలుగుబంటి ధ్వజం కావటం వల్ల కవి ఆ విధంగా వారిని సంభోదించి ఉండవచ్చు. దండకారణ్యం బుందేల్‌ఖండ్‌కి దక్షిణంగా కృష్ణానది వరకూ విస్తరించి ఉండవచ్చు. ఈ రోజున మాదిగలు చెల్లాచెదరుగా వ్యాపించి ఉన్న ప్రాంతంలోనే ఆనాడు రాముడి సైన్యం పోగయింది.
రామాయణం కథా నాయకుడు రాముడు ఓథ్‌కి చెందిన రాజకుమారుడు. ఆయన్ని వనవాసానికి పంపాక, తన సారధిని నగర నరిహద్దులలో వదిలేశాక దండకారణ్యంలో ప్రవేశించాడు. రాముని మీద భక్తిశ్రద్ధలు గల భార్య సీత, ఆర్య స్త్రీలలో అందగత్తె ఆయనని అనునరించింది. బర్త వీద అనురాగంతో అరణ్యవానంలోని కష్టాలను భరించింది. ఈనాటి నిలోనును ఆనాడు పాలించే రాక్షసుల ప్రభువు రావణుడు వచ్చి ఆమెను తీనుకుపోయాడు. రాముడు పత్నీ వియోగంతో కృంగిపోయి ఆ ప్రాంతంలోని బలవ్లైన తెగల నాయకులని కలిని నీతని రక్షించటంలో నవోయం కోరాడు. వానరుల పెద్ద అయిని సుగ్రీవుడు అందరిలోకి శక్తిమంతుడైన మిత్రుడు. కాని, ఇతరులు కూడా ఉన్నారు. వారిలో ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు నుప్రసిద్భడు.
నీత రక్షణకోనం అందరితోనూ కూడిన గొవ్స సైన్యం బయలుదేరింది. వారు దక్షిణం వైపు సాగి సముద్రాన్ని చేరుకుని ఆగిపోయారు. రాముని మనోహరమైన భార్య సీతను రావణుడు చెరపట్టి ఉంచిన లంక అవతలి ఒడ్డున ఉంది. సముద్రం ఒడ్డున బలవంతులైన వానరులు నిలబడి ఈ అగాధాన్ని దాటాలని (గ్రహించారు. వాళ్ళు కలవరపడ్డారు “వానర వీరులారా! మీమీ శక్తులను ప్రదర్శించండి. లంఖింంచండి!”” అంటూ మవో సేనారీపతి నంగ్రీవుడు అజ్ఞాపించాడు. అనేకమంది గట్టిగా చెప్పారు. కాని ఎవరూ ఆ ఘనకార్యాన్ని చేయటానికి ముందుకు రాలేదు.
చివరకు జాంబవంతుడు అన్నాడు “ ఒకప్పుడు నాకు లంఘించే శక్తి గొప్పగా ఉండేది. నేను వృద్దుడినయిపోయాను. నా శక్తులు ఉడిగిపోయాయి. నేనిప్పుడు లంఫించలేను.” మవాోజ్ఞాని అయిన జాంబవంతుడు అన్నాడు. “కాని సేనాధిపతి ఆజ్ఞావించినవుడు ఆయన గౌరవాన్ని కాపాడటం సేవకుల విధి.” జాంబవంతుని సలహా ఫలించింది. చిట్టచివరికి వానర డ్రేవ్చుడైన హనుమంతుడు అతని ధైర్యమూ ప్రతిష్టా గుర్తుచేయగా సముద్రాన్ని లంఘించటానికి సిద్సమయాడు.
బలవంతుడైన రావణుని భవనం నుంచి ఎంతో శక్తియుక్తులతో పరాక్రమంతో నీత రక్షించబడింది. రాక్షన వీరులతో బాటు రావణుడు నేలకొరిగాడు.
మాదిగలకు నంబంధించిన ఇతర గాథలన్నింటిలోనూ అవమానాలు, అణచివేతలూ ఉంటాయి. “ఎలుగుబంట్ల నాయకుడు జాంబవంతుడు” ఆది జాంబవంతుడితో సహా ఉన్నత స్థానంలోనే ఉంటారు. వారిని ఎవరూ తక్కువ చేయరు. వారి ఆదిమకీర్తిలో వారికి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుంది. వారి వారసులు మాత్రం పూర్తిగా వెలివేయబడ్డారు!