చెన్నబసవరగడ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చెన్నబసవరగడ

(శ్రీపాల్కురికి సోమనాధ మహాకవి కృతము)

కం. శ్రీ మంతన బసవగురు
      శ్రీ మంతన నాంపొగళ్వె జంగమలింగ
      శ్రీ మంతన సుజ్ఞాన
      శ్రీ మంతన [1]మహితభక్తి యింబసవేశా!
         (ఉత్సవ రగడ) = తురగవల్గనరగడ.
శ్రీ బసవ వృషభకుమార వరకుమార..............చెన్నబసవ
శ్రీ బసవ చిదనల హతరమా కుమార................ײ
బసవ గురువచోవ్య పగత వృజనపంక................ײ
బసవ పురభిదపగత త్రిపుర కలంక..................ײ
బసవ పశుపవిదళిత పశుపాశ వరణ..................ײ
బసవ మలహరక్ష పిత మల ప్రసరణ.................ײ
బసవ భానునిర్గళిత భవాంధకార.....................ײ
బసవ వీరభద్ర వీరభద్రసార........................ײ
బసవ గురువరాధరీకృతాధి శిష్య.....................ײ
బసవ భావజనిత లింగసుకలి శిష్య...................ײ
బసవ విషయజప్రసాద [2]సౌఖ్యలోల...................ײ
బసవ పాదజనిత వినుత భక్తిశీల.....................ײ
బసవ పారిషద గనైక పధవిహార.....................ײ
బసవ రుద్రగణ నిజాపరావతార.....................ײ
బసవ మాంత్రికోపలబ్ధ రాజమంత్ర.....................ײ
బసవ తాంత్రికోపడేశ వీరతంత్ర.....................ײ
బసవ పద సరోజపూజ నార్హహస్త.....................ײ
బసవ పద సరోజనత సమాజ[3]శస్త.....................ײ

బసవ పదకమల పరాగ పటలతిలక..............చెన్నబసవ
బసు పద కమలనుతి ప్రహర్ష పులక.....................ײ
బసవ పద నఖాంశుకౌముదీచకోర.....................ײ
బసవ పాదనఖర ముకుర సుఖశరీర.....................ײ
బసవ పదరవింద గత మరందసిక్త.....................ײ
బసవ పదరవింద కాంత కాంతియుక్త.....................ײ
బసవ పాద తళమరాళ [4]జాలకల్ప.....................ײ
బసన సద్గుణ స్మరణ చణావికల్ప.....................ײ
బసవ పాదకమల విమల సదనవాస.....................ײ
బసవ పాదభక్తి వాసనా విలాస.....................ײ
బసవ పదవిశేష భక్తి వేషభూష.....................ײ
బసన పాదభక్తి పల్లవిత మనీష.....................ײ
బసవ పాద ఘననినాద వనమయూర.....................ײ
బసవ పాద కంజ పంజరోరుకీర.....................ײ
బసవ గీత జాత నీత [5]సారగర్భ.....................ײ
బసవ పారిజాత పోత కలితగర్భ.....................ײ
బనవ కల్ప మహిజ మూలికాదిసిద్ధ.....................ײ
బసవ కల్ప వల్లరీ వితాన బద్ధ.....................ײ
బసవ కల్ప భూరుహోరు చారుశాఖ.....................ײ
బసవ దివిజ భూజవర శిఖామయూఖ.....................ײ
బసవ కల్ప కుజనవాంకు[6]రానుకూల.....................ײ
బసవ కల్పవృక్ష పల్లవాంశు జాల.....................ײ
బసవ గురు మరుత్తరు ప్రచుర శలాటు.....................ײ
బసవ గురు మరుత్తరు ప్రసూనవలయ.....................ײ

బసవ కల్పపాద పల విపులసార..............చెన్నబసవ
బసవ కామధుక్పయః ప్రవాహపూర.....................ײ
బసవ ధుగ్యరస్త వాలవాల.....................ײ
బసవ కామ థుఙ్ముఖారవింద గంధ.....................ײ
బసవ కామ ధుగ్ప్రపుష్కలానుబంధ.....................ײ
బసవ సత్కృపాపయః పయోధిఫేన.....................ײ
బసవ ఘన ఘృణావియన్నదీవిలీన.....................ײ
బసన రస రసాయనైకపాత్ర భూత.....................ײ
బసవ నిధినిధానలబ్ధ భాగ్యజాత.....................ײ
బసవ శాతకుంభకుధర కోటిరోచి.....................ײ
బసవరోహణాచల ద్యుమణి మరీచి.....................ײ
బసవ రజత శైల సార్వభౌమ భూమ.....................ײ
బసవ హిమవదచల భూమి కాభిరామ.....................ײ
బసవ కులనగాగ్ర [7]కనక కలశధామ.....................ײ
బసవ దిగిభ దివ్యనిటల తటలలామ.....................ײ
జసవ బప్రధావవర్ణ బహుళశోభి.....................ײ
బసవ సద్వితీయవర్ణ సహజతేజ.....................ײ
బసవ సతృతీయవర్ణ ముఖ్యసౌఖ్య.....................ײ
బసవ తదసమాక్షర స్ఫురస్మనస్క.....................ײ
బసవ తదసమాక్షరాంకల సదురస్క.....................ײ
బసవ తద సమాక్షరోప మానగాన.....................ײ
బసవ తద సమాక్షరామృత రసపాన.....................ײ
బసవ తరసమాక్ష రమణిగణకరండ.....................ײ

బసన తద సమాక్ష రనిచితాబ్జ జాండ..............చెన్నబసవ
బసవ వర్ణలిఖత పుస్తకైక రసన.....................ײ
బసవ వర్ణ వస్తు పీఠికాంగ వసన.....................ײ
బసవ వర్ణ కర్ణ పూర్ణ కుండలాంక.....................ײ
బసన వర్ణ నూత్నరత్న [8]శోభితాంగ.....................ײ
బసవ లింగసేవనార్చ నావిధేయ.....................ײ
బసవ జంగమాంఘ్రి పూజనానపాయ.....................ײ
బసవ సద్గురుప్రసాద భరితపాత్ర.....................ײ
బసవ నిజగుణ ప్రసాద కర్ణసూత్ర.....................ײ
బసవ తదుభయ ప్రసాదఘ్రాణవిషయ.....................ײ
బసవ సుప్రసాద రస విషయరసజ్ఞ.....................ײ
బసవ సుప్రసాద సంస్కరణ మనోజ్ఞ.....................ײ
బసవ సుప్రసాద విషయ సర్వసంగ.....................ײ
బసవ సుప్రసాద [9]లసదపాంగసంగ.....................ײ
బసవ పాద కంకణాంకితోత్తమాంగ.....................ײ
బసవ మజ్జనోదకస్నపిత తదంగ.....................ײ
బసవ ప్రసాద లీలపూర్ణకుంభ.....................ײ
బసవ సర్వవిఘస సౌఖ్యవిషయకుంభ.....................ײ
బసవ గురుదదీయు గురుతరాధ్వపధిక.....................ײ
బసవలింగ భక్తలింగ సుగుణకధక.....................ײ
బసవ సశివపాదభక్త పాదభక్త.....................ײ
బసవ సత్యశరణయుక్తపదనియుక్త.....................ײ
బసవ కేవల ప్రజాద సుప్రసాద.....................ײ
బనవ నిజశివైక్య వ్రత శివైక్యమోద.....................ײ

బసవ నృత్త బసవచిత్త బసవదత్త..............చెన్నబసవ
బసవ సూక్త బసవశక్త బసవయుక్త.....................ײ
బసవ నిరత బసవ చరిత బసవభరిత.....................ײ
బసవ కామ్య బసవగమ్య బసవసౌమ్య.....................ײ
బసవ సోము బసవసీమ బసవనేమ.....................ײ
బసవ పుత్ర బసవసూత బసవగాత్ర.....................ײ
బసవ పుత్ర నిమ్మపుత్ర నానలయ్య.....................ײ
బసవ గోత్ర నిమ్మగోత్ర నానలయ్య.....................ײ
బసవ భృత్య నిమ్మభృత్య నానలయ్య.....................ײ
బసవ భక్తి నిమ్మభక్త నానలయ్య.....................ײ
బసవ శిష్య నిమ్మశిష్య నానలయ్య.....................ײ
బసవ భావ నామభావ కావుదెన్న.....................ײ
బసవ సేవ నప్రభావ కావుదెన్న.....................ײ
బసవ లక్షణైకరక్ష రక్షిసెన్న.....................ײ
బసవ రక్షతా సమాక్ష రక్షిసెన్న.....................ײ
బసవ లోల తరసులీల పాలిసెన్న.....................ײ
బసవ మేళ నాతిశీల పాలిసెన్న.....................ײ
బసవ చిత్సముద్ర ఉద్ధరి సువుదెన్న.....................ײ
బసవ సత్ప్రబుధ్ధి ఉద్ధరి సువుదెన్న.....................ײ
బసవ కరణ నిహితకరణ కరుణిసెన్న.....................ײ
బసవ కరణ దేహవరణ కరుణిసెన్న.....................ײ
బసవ చరణ నిమ్మచరణ శరణ రెనగె.....................ײ
బసవ చరణ నిమ్మచరణ హరణ రెనగె.....................ײ
బసవ మూర్తి చెన్నబసవ లసితకీర్తి.....................ײ
బసవ సూను చెన్నబసవ పాశలూన.....................ײ

బసవ సిద్ధ చెన్నబసవ బసవశుద్ధ..............చెన్నబసవ
బసవ పురుష చెన్నబసవ బసవపరుష.....................ײ
బసవ రూప చెన్నబసవ బసవజాప.....................ײ
బసవ గోప చెన్నబసవ భక్తిదీప.........................ײ
బసవ గణ్య చెన్నబసవ బహుళపుణ్య.....................ײ
బసవ శరణు చెన్నబసవ నిమ్మశరణు.....................ײ
బసవ రిశద శరణు చెన్నబసవ శరణు.....................ײ
కం. చెన్నబసవణ బల్లల
    బణ్ణిసలా బసవ మహిమెయం బల్లనవం
    చెన్నబసవణ భక్తియ
    నిన్నొబ్బిరి.....బసవేశా!
కం. ..........చెన్నబసవ
    స్తుతి మహోత్సాహ జగళెయం పఠసిదొడం
    స్తుతిసిదొడికేళి దొడమభి
    మత లిసువడు చెన్నబసవం బసవం!

చెన్నబసవేశ్వరుఁడు వీరశైవమతోద్ధారకుఁడును బసవేశ్వరుని మేనల్లుడు చెన్నబసవేశ్వరుఁడు కుమారస్వామి యవతారమని వీరశైవుల విశ్వాసము. సోమనాధుని లఘుకృతులలోని ఈచెన్నబసవరగడ యాతని శిష్యుడైన పిడపర్తి సోమనాధకవి పద్యములు బసవపురాణావతారికయందలి పద్యములలో నుదాహృతములయిన వానిలోఁ జేరియుండలేదు. ఇదియు సోమనాధవిరచితమే యనుటకు సందియము లేదు.

నామిత్రులు మహబూబునగరోన్నత పాఠశాలా పండితులు నగు శ్రీహస్నబాదా నాగలింగ శివయోగిగారి తాళపత్రగ్రంథ సం చయము నుండి సేకరించి దీనినిందు బ్రకటించుచున్నాను. ఇది మూడేసి మాత్రలుగల 8 గణములతో మొత్త మిరువదినాల్గుమాత్రలు గలిగి కన్నడమందలి యుత్సవరగడకు, తెలుగునందలి తురగవల్గనరగడ లక్షణమునకు సరిపోవుచున్నది. అర్థము సంగతముగను సులభముగను ద్యోతకము కాని కొలఁది తావులలో నేను కొన్ని సవరణలు చేసి యసలు ప్రతియందలి వానిమూలపాఠములను బుటలయడుగునఁ జూపితిని.

బండారు తమ్మయ్య,
పరిషదధ్యక్షుఁడు.

  1. నాసమ
  2. విషయ
  3. హస్త
  4. కూళ
  5. జపన
  6. రయతుకాల
  7. కలన
  8. చోడికాంక
  9. లసదు