చిరస్మరణీయులు, మొదటి భాగం/సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వి

వికీసోర్స్ నుండి

29

6. సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వి

(1786-1831)

భారత స్వాతంత్య్రసంగ్రామంలో భాగంగా అర్థ శతాబ్దిపాటు బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించి స్వాతంత్య్ర సమర యోధులకు ప్రేరణగా నిలచిన వహాబీ ఉద్యమ నిర్మాత సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వీ.

16వ శతాబ్దంలో అరేబియా తత్త్వవేత్త అబ్దుల్‌ వహాబ్‌ ప్రారంభించిన శుద్ధ ఇస్లాం ధార్మిక సంప్రదాయ ఉద్యమం వహాబీ ఉద్యమం గా ఖ్యాతి చెందింది. ఆ ఉద్యమాన్ని ఇండియాకు పరిచయం చేసిన సయ్యద్‌ అహమ్మద్‌ 1766లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయబరేలి జిల్లా బరేలి గ్రామంలో జన్మించారు. 1803లో విద్యాభ్యాసం పూర్తి చేసి, టోంక్‌ (Tonk) నవాబు అమీర్‌ ఖాన్‌ సైన్యంలో చేరారు. అమీర్‌ ఖాన్‌ పక్షాన పలు పోరాటాలలో, యుద్ధాలలో పాల్గొని రణరంగ ఎత్తుగడలలో మంచి ప్రావీణ్యం సంపాదించి సాహసోపేత యుద్ధ వీరుడిగా ఖ్యాతి గడించారు.

ఆనాడు సాగుతున్న్ ఇస్లామిక్‌ పునరుద్దరణ ఉద్యమాలకు మారదర్శ కత్వం వహిసున్న ప్రముఖ ఇస్లామిక్‌ తత్వవేత్తలు షా వలీయుల్లా (1703-62), అయన కుమారుడు అబ్దుల్‌ అజీజ్‌ (1746-1823)ల ధార్మిక సిద్ధాంతాల పట్ల అహమ్మద్‌ ఆకర్షితు లయ్యారు. ఆ సిద్థాంతాల సారాన్ని ప్రజలకు వివరిస్తూ మీర్‌, ముజఫర్‌నగర్‌, షహరాన్‌పూర్‌

చిరస్మ రణయులు 30

జిల్లాలలో, ఆ తరువాత అలహాబాద్‌, బెనారస్‌, కాన్పూరు, లక్నో, రోహిల్‌ఖండ్‌లలో పర్యటించారు. ఈ ధార్మిక ప్రచార పర్య టనల సందర్బంగా అన్నివర్గాల సామాన్య ప్రజలు ఎదాుర్కొంటున్న ధార్మిక-లౌకిక సమస్యలను గమనించారు.

ఆ తరువాత మక్కా వెళ్ళి 1824 ఏప్రిల్‌లో స్వదేశం తిరిగి వచ్చాక, స్థానికంగా నెలకొనియున్నరాజకీయ, సాంఫిుక, ధార్మిక పరిస్థితుల నేపధ్యంలో వహాబీల ధార్మిక మార్గం ప్రకారం శుద్ద ఇస్లాంనూ, ప్రవక్త మార్గాన్నీముస్లింలు తు.చ. తప్పకుండా అనుసరించేలా చూడలంటే, అది ఇస్లామిక్‌ రాజ్యంలో మాత్రమే సాధ్యమని, అందువల్ల ఇండియాలో పాలన సాగిస్తున్న ఆంగ్లేయులను తరిమి వేయాలని నిర్ణయించారు. అ లక్ష్యసాధన కోసం బలగాల సమీకరణకు దేశమంతా పలు పర్యటనలు చేశారు. ఈ పర్యటనలలో ప్రజలకు తన తాత్విక, ఆర్థ్దిక, రాజకీయ సిద్థాంతాలు, విధానాలను వివరించారు. ఆయనకు భారీ అనుచరవర్గం ఏర్పడింది. ఈ పర్యటనల సందర్భంగా పలుచోట్ల వహాబీ కేద్రాలను ఏర్పాటుచేశారు. ఆ కేద్రాలకు సమర్దులైన నిర్వాహకులను నియమించి, వహాబీ తత్వ ప్రచారం చేయాల్సిందిగా, బ్రిటిషర్ల మీద ధర్మపోరాటం సాగించాల్సిందిగా ఉద్బోధించారు.

ఆ తరువాత మతపరమైన, రాజకీయ విధానాలను అమలు పర్చేందుకు సరైన స్థావరం కోసం అంవేషణ సాగించారు. ఆ అంవేషణ పర్యవసానంగా వాయవ్య సరిహద్దు ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. 1826 జనవరి 17న బ్రిటిషర్ల మీద, ఆ శక్తులకు తొత్తులుగా మారిన స్వదేశీ శిక్కు పాలకుల మీద అంతిమ పోరు సాగించేందుకు రాయ్‌బరేలి నుండి నిర్దేశించుకున్న స్థావరానికి సయ్యద్ అహమ్మద్‌ బరేల్వీ బయలుదేరారు. ఆయన ఆదేశాల మేరకు ప్రాణాలను తృణప్రాయంగా భావించి త్యాగం చేయగల భారీ శిష్యగణం బరేల్వీ వెంట కదిలింది. పది మాసాలపాటు మూడు వేల మెళ్ళ మేరకు సాగిన 'లాంగ్ మార్చ్‌' తరు వాత 1826 నవంబరు 20న పెషావర్‌ చేరు కుని అక్కడ దానిని ప్రధాన స్థావరం చేరుకున్నారు. ఈ మేరకు గమ్యస్థ్దానం చేరుకోగానే సయ్యద్‌ అహమ్మద్‌ స్వతంత్య్ర రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టి ఆంగ్లేయులకు వత్తాసు పలుకుతున్న పంజాబ్‌ అధినేతల మీద యుద్ధాన్ని ప్రకటించారు. అప్పటి నుండి పలు పోరాటాలు సాగినా 1831లో బాల్‌కోట్ వద్ద మహారాజా రంజిత్‌ సింగ్ తో నిర్ణయాత్మక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తన అనుచరులతో కలసి శతృవుతో వీరోచితంగా పోరాడుతూ 1831 మే 6న సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వీ 'షహీద్‌' అయ్యారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌