Jump to content

చిరస్మరణీయులు, మొదటి భాగం/మౌల్వీ అలీ ముసలియార్‌

వికీసోర్స్ నుండి

95

39. మౌల్వీ అలీ ముసలియార్‌

(1853- 1922)

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 120 సంవత్సరాలు పోరుబాటన సాగి, 1922 ప్రాంతంలో ఖిలాఫత్- సహాయనిరాకరణ ఉద్యమంలో విలీనమైపోయిన మలబారు మోప్లా యోధుల వారసులు మౌల్వీ అలీ ముస్సలియార్‌.

కేరళ రాష్ట్రం మలబారు ప్రాంతంలోని తూర్పు మంజేరిలో గల పండిక్కడ్‌ సమీప గ్రామం నెల్లిక్కుట్టులో 1853లో అలీ జన్మించారు. ప్రాధమిక విద్య తరువాత, ధార్మిక విద్యకోసం మక్కా వెళ్ళిన ఆయన ఏడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి లక్షదీవులలోని కనారట్టి ద్వీపంలోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేప్టారు.

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మలబార్‌ మోప్లాలు సాగిస్తున్న పోరాటాలలో భాగంగా 1894, 1897లో జరిగిన తిరుగుబాట్లల్లో మౌల్వీ కుటుంబ సబ్యులంతా బ్రిటిష్‌సైనికుల ఊచకోతకు గురయ్యారు. గ్రామాలలో ఒకవైపు న భూస్వాములు, మరోవైపు పాలకవర్గాల వలన మలబారు పేద రైతాంగం ఎదుర్కొంటున్న ఇక్కట్లను గమనించిన ఆయన కరడు గట్టిన బ్రిటిష్‌ వ్యతిరేకవాది గాను, జాతీయభావాలను నరనరాన నింపుకున్నపోరాట యోధుని గాను రూపుదాల్చి 1921-1922 మధ్యలో జాతీయోద్యమంలో భాగంగా మలబారులో సాగిన ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు కేంద్రమయ్యారు.

చిరస్మరణీయులు 96

1916 ప్రాంతంలో మలబార్‌ ప్రాంతానికి జాతీయోద్యమ పవనాలు ప్రబలంగా తాకాయి. ఆ ప్రబావంతో మౌల్వీ ముస్సలియార్‌ ఖిలాఫత-సహాయ నిరాకరణ ఉద్యమాలకు నాయకుడయ్యారు. ఆయన శిష్యులు, అనుచరులు మహాత్ముని మార్గంలో ఉద్యమించారు. మౌల్వీ ప్రత్యేక శిక్షణలో ఖిలాఫత్‌ కార్యకర్తలు సుశిక్షుతులుగా తయారయ్యారు.

ఖిలాఫత్‌- సహాయనిరాకరణ ఉద్యమం మలబార్‌ ప్రాంతంలో పటిష్టపడి, గ్రామ గ్రామాలకు చేరడంతో పాలకవర్గాలు కలవరపడసాగాయి. ఖిలాఫత్‌ ఉద్యమం శీఘ్ర గతితో గ్రామాలకు వ్యాపించడాన్ని ప్రబుత్వం సహించలకపోయింది. ప్రశాంతంగా ఉద్యమిస్తున్న కార్యకర్తలు, నేతలను రెచ్చగొట్టి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేట్టు చేసి మౌల్వీని, ఆయన సహచరులను నిర్భంధించాలని ప్రణాళిక రూపొందించింది. ఖిలాఫత్‌ కమిటీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించి, వారు ఆయుధాలు దాచిపెట్టారంటూ అరెస్టులను, నిర్బంధాన్ని సాగించింది. మౌల్వీని అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. ఆ విషయం తెలుసుకున్న ప్రజలు మౌల్వీ అరెస్టును ప్రతిఘంచారు. ఆంగ్లేయాధికారుల ఆజ్ఞల మేరకు పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. ప్రజలు సాయుధంగా తిరగబడగా పోలీసులు, సైనికులు పరారయ్యారు. ప్రభుత్వాధికారులు, బలగాలు పారిపోవడంతో మౌల్వీ ముస్సలియార్‌ నేతృత్వంలో స్వతంత్ర పాలన ఆరంభమయ్యింది.

ఆ పరిస్థితులతో మండిపడ్డ పోలీసులు, సైన్యం మౌల్వీని అరెస్టు చేయడానికి తిరిగి వచ్చి మౌల్వీ ఉన్న మసీదు మీద కాల్పులు జరిపాయి. మౌల్వీ అనుచరులు సాయుధంగా ప్రతిఘటించారు. ఈ పోరాటంలో మొత్తం మీద 22 మంది మరణించారు. చివరకు మౌల్వీని సైనిక బలగాలు అరెస్టు చేశాయి. ఆ తరువాత విచారణ తంతు జరిపి మౌల్వీతో ముస్సలియార్‌తో పాటుగా 12 మందికి ఉరిశిక్షలు విధించి, ముగ్గురిని అండమాన్‌ దీవులకు పంపారు. మరో 33 మందికి జీవిత ఖైదును ఖాయం చేశారు.

మౌల్వీ ముస్సలియార్‌కు మరణ శిక్ష విధించినప్పటికీ, మౌల్వీఆయన అనుచరులు ఆయుధాలు చేపట్టడానికి, మోప్లాల రైతాంగ సమస్యలు, ఆంగ్లేయాధికారుల ఆహంకార పూరిత చర్యలు, ఖిలాఫత్‌ నేతలలో పెల్లుబికిన జాతీయ భావాలు, ఖిలాఫత్‌ సహాయ నిరాకరణ ఉద్యామాలే ప్రధానంగా కారణమని న్యాయస్థానం తీర్పులో వెల్లడించక తప్పలేదు . చివరకు ఉరిశిక్ష విధించేందుకు మౌల్వీని కోయంబత్తూరు జైలుకు తరలించగా ఆంగ్ల న్యాయస్థానం విధించిన శిక్షకు చిక్కకుండా 1922 ఫిబ్రవరి 17న కొయంబత్తూరు జైలులో మౌల్వీ అలీ ముస్సలియార్‌ కన్నుమూశారు. ◆

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌