చిరస్మరణీయులు, మొదటి భాగం/బేగం అజీజున్
43
13. బేగం అజీజున్
(1832-1858)
స్వప్రయోజనాలను ఆశించకుండా మాతృభూమి మీదగల ప్రేమాభిమానాలతో మాత్రమే తమ ధాన, మాన, ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆంగ్లేయ సైన్యాలతో పోరాడుతూ అమరత్వం పొందిన సామాన్యులలో అసామాన్యురాలుగా ఖ్యాతిగాంచిన యోషురాలు బేగం అజీజున్.
1832లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బితూర్‌లో జన్మించిన అజీజున్ తండ్రి హసీన్ ఖాన్, తల్లి హమీదా బాను. అజీజున్ మంచి రూపసి. ప్రసద్ధనర్తకి ఉమ్రావ్‌జాన్ బృందంలో చేరి నాట్యంలో మంచి అభినివేశాన్ని సాధించిన ఆమెకు స్వజనం మీద పెత్తనం సాగిసున్న ఆంగ్లేయులంటే పరమ ద్వేషం. బ్రిటిష్ సైన్యంలో సుబేదారుగా పనిచేస్తున్న షంషుద్దీన్ పరాయి ప్రభుల కొలువు నుండి తొలిగి కాన్పూరు పాలకుడు నానా సాహెబ్ పక్షంలో చేరేంత వరకు ఆయన స్నేహాన్ని అంగీకరించని దేశభక్తి ఆమెది.
మహాయోధుడు నానా సాహెబ్ పీష్వా అంటే అజీజున్‌కు భక్తి, గౌరవం. స్వదేశీ సంస్థానాలను అక్రమంగా ఆక్రమించుకుంటున్న ఆంగ్ల పాలకులంటే అసహ్యం. ఆ అసహ్యత నుండి పరదేశీయులు సాగిస్తున్న అధర్మాన్ని, అన్యాయాన్ని ఎదుర్కోవాలన్న ప్రగాఢవాంఛ ఆమెలో అంకురించింది. ఆ కోర్కె మరింతగా బలపడి 1857 జూన్ 7న
చిరస్మ రణయులు 44
కాన్పూరులో తిరుగుబాటు ఆరంభం కావటంతో కార్యరూపం ధరించింది. ఆమె ఒక్క క్షణం కూడా అలశ్యం చేయ్యకుండా అతి విలాసవంతమైన జీవితాన్నివదిలి, సన్నిహితుడు షంషుద్దీన్‌తో కలసి నానా సాహెబ్ పక్షాన ఆంగ్లేయుల మీదపోరుకు సిద్ధమయ్యారు.
ఆత్మీయ మిత్రుడు షంషుద్దీన్ సహకారంతో ఆయుధాలను ఉపయోగించటం, గుర్రపు స్వారి చేయడం అజీజున్ నేర్చుకున్నారు. ఆమె పూర్తిగా సైనిక దుస్తులు ధరించి సంచరిస్తూ మాతృదేశ భక్తిభావాలు గల యువతులను సమీకరించి, ప్రత్యేక మహిళా సైనిక దళం ఏర్పాటుచేసి తుపాకి పేల్చటం, కత్తి తిప్పటం, గుర్రపుస్వారీ చేయటంలో ప్రత్యేక శిక్షణ కల్పించారు. ఆమె తన బలగంతో కాన్పూరు నగరంలోని ప్రతి ఇల్లూ తిరుగుతూ యువకుల్లో రోషాగ్నిని ప్రజ్వరిల్లచేస్తూ, యుద్ధభయంతో సైన్యంలో చేర నిరాకరించిన వారి చేతులకు స్వయంగా గాజులు తొడిగి, వారిని సైన్యంలో చేరేలా ప్రేరణ కలిగించి నానా సాహెబ్ బలగాలను పెంచారు. ఆ క్రమంలో పోరాట యోధులకు ఆహారం, ఆయుధాలను, బట్టలు సమకూర్చి పెట్టటం, సైనికుల మధ్యన సమాచారం అందజేసే సంధానకర్తల్లా వ్యవహరించటం, శత్రుసైనికుల కదలికల మీద నిఘా ఉంచి వారి గమనాగమనాన్నితిరుగుబాటు నేతలకు చేరవేయడం, ఆంగ్లేయులతో సాగుతున్న పోరాటంలో గాయపడిన వీరసైనికుల చికిత్సకు సంబంధించిన కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించేందుకు యువతీ-యువకులతో ప్రత్యేక దళాలను ఏర్పాటుచేసి నానా సాహెబ్‌కు ఎనలేని సహాకారం అందించారు.
ఆంగ్ల సైనికులతో సాగిన పలు పోరాలలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. ఈ మేరకు రణరంగంలో శత్రువు పరిమార్చుతూ తీవ్రంగా గాయపడి పట్టుబడినా కూడా ఏమాత్రం అధర్య పడకుండా ఆంగ్ల సెన్యాధికారితో 'బ్రిటిష్ పాలన అంతం చూడలన్నది
తన లలక్ష్యం' అని ప్రకటించడంతో ఖంగుతిన్న ఆంగ్ల సైన్యాధికారి General Havelock
ఆమెను కాల్చివేయాల్సిందిగా ఆదేశాలిచ్చాడు.
ఆ ఆదేశాలను విన్న అజీజున్ చిరునవ్వుచిందిస్తూ ఆంగ్ల సైనికుల తుపాకులకు ఎదురొడ్డి నిల్చున్నారు. ఆమెకేసి గురి పెట్టబడ్డ తుపాకులు ఒక్కసారిగా గర్జించటంతో ఆమె ఉచ్చ్వాస-నిశ్వాసలు అనంతవాయువులలో కలసిపోయాయి. ఆ చివరి క్షణంలో కూడాపరాయి పాలకుల మీద పోరాటం సాగించిన అజీజున్ తన నేత మీద గౌరవాన్ని వ్యక్తంచేస్తూ 'నానా సాహెబ్ జిందాబాద్' అని చేసిన సింహనాదం ఆంగ్లేయ సైనికులను మాత్రమే కాకుండా సైన్యాధికారులను కూడా భయకంపితులను చేసింది.
సయ్యద్ నశీర్ అహమ్మద్