చిరస్మరణీయులు, మొదటి భాగం/పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌

వికీసోర్స్ నుండి

59

21. పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌

(1831- 1861)

ప్రపంచ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా భాసించిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అద్వితీయమైన సాహసాలతో ఆత్మార్పణకు కూడా వెనుదీయని వీర సైనికులలో పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ ఒకరు.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ జిల్లా సంభాల్‌ లోని సామాన్య కుటుంబంలో పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ 1831లో జన్మించారు. ఆయన తండ్రి పఠాన్‌ అబ్దుల్లా ఖాన్‌. చిన్ననాటి నుండే ధైర్యసాహాసాలను ప్రదర్శిస్తూ గ్రామస్తులను ఆకట్టుకున్న సలాబత్‌ సైనికుడిగా ఖోటా రాజ్యంలో ఉద్యోగం చేబట్టారు. ఆయన ఖోటా సైన్యంలోని గోవర్థన్‌ నాయకత్వంలోని పటాలంలో సభ్యులయ్యారు.

1857 మే మాసంలో భారతదేశం అంతా ఎగిసిపడిన తిరుగుబాటు జ్వాలల ప్రభావం ఉత్తరప్రదేశ్‌ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. ఆ సమయంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాజకీయ ప్రతినిధి మేజర్‌ బుర్టన్‌ (MAJOR BURTON) నివాస గృహం మీద కోట రాజ్యంలోని స్వదేశీ సైనికుల దళం దాడి చేయటం ద్వారా 1857 అక్టోబరు 15న తిరుగుబాటు బావుటాను ఎగురవేసింది. తిరుగుబాటు యోధుల ధాటికి తట్టుకోలేక మేజర్‌ బుర్డన్‌ బ్రతుకు జీవుడా అంటూ ఆయుధాలు, అనుచరు లతో బంగ్లాలో దాక్కున్నాడు.

చిరస్మ రణీయులు 60

అతడ్ని బంగ్లా నుండి బయటకు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నించి, చివరకు ఆ బంగ్లాను స్వదేశీ బలగాలు చుట్టుముట్టి తగులబెట్టినా ఆంగ్లేయుడు మాత్రం బయటకు రాలేదు. బంగ్లాలోకి ప్రవశించి ఆ ఆంగేయుడ్ని, అతడి అనుచరుల్ని ఎదాుర్కొని, బంధించి బయటకు తీసుకురావటం చాలా ప్రమాదాకరం కావడంతో స్వదేశీ సైనికుల దళ నేతలు ఏంచేయాలన్న మీమాంసలో పడ్డారు.

ఆ సమయంలో ప్రమాదకరమైన ఆ సాహస కార్యాన్నినిర్వహించేందుకు పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ ముందుకు వచ్చారు. ఒక నిచ్చెన ద్వారా తిన్నగా ఆంగ్లేయుడు ఆయుధాలతో దాక్కొని ఉన్న బంగ్లా కప్పు మీదకు చేరుకుని, అతని అనుచరుల కంటబడకుండా అకస్మాత్తుగా బుర్టన్‌ ఎదుట ఆయన నిలిచారు. ఆ అనూహ్య సంఘటన నుండి తేరుకొని ఖాన్‌ పై బుర్దన్‌ దాడి చేయగా లాఘవంగా తప్పంచుకున్న సలాబత్‌ ఆ ఆంగ్లేయాధికారిని లొంగదీసుకున్నారు. ఈ సందర్బంగా సలాబత్‌ ఖాన్‌ చూపిన తెగువ, సాహసానికి ఎంతో సంతసంచి, సలాబత్‌ శౌర్యప్రతాపాలకు గౌరవ చిహ్నంగా, తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నలాలా జై దాయాల్‌ భట్నాగర్‌ ప్రత్యేక జ్ఞాపికను బహు˙కరించారు.

1858 మార్చిలో మేజర్‌ జనరల్‌ రాబర్ట్స్ నాయకత్వంలోని సైనిక దాళాలు కోట సంస్థానాన్ని స్వదేశీ దళాల నుండి స్వాధీనం చేసు కున్నాయి. ఆ సమయంలో తిరుగుబాటు దాళాలతోపాటుగా సలాబత్‌ ఖాన్‌ గ్వాలియర్‌ వెళ్ళారు. ఆ తిరుగుబాటు దళాలు బ్రిటిష్‌ దళాలతో ఝుబియాపట్టాన్‌ (JHABIA PATTAN) అను చోట జరిపిన పోరాటంలో సలాబత్‌ ఖాన్‌ పాల్గొన్నారు. ఆ పోరాటం తరువాత ఆయన ఆంగ్లేయుల నిఘా నుండి తప్పించుకుని, లక్నో గుండా నేపాల్‌ పర్వతత ప్రాంతాలలోకి వెళ్ళిపోయారు.

ఆ అడవుల్లో తిరుగుబాటు యోధులతో కలసి రెండు సంవత్సరాలు గడిపారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల తొత్తులైన జంగ్ బహుదాూర్‌ లాంటి పాలకుల వలన ప్రతికూల పరిస్థితులు ఎదురుకావటంతో ప్రవాసం నుండి బయటపడి తిరిగి కోటా రాజ్యంలో ప్రవేశిస్తుండగా శతృ సైనికుల కంటబడ్డారు. కంపెనీ సేనలు అయనను చుట్టుముట్టిఅరెస్టు చేశాయి. ఆయన మీద రాజద్రోహం నేరారోపణ చేసి,ి చిత్రహంసలకు గురిచేశాక, విచారణ నడిపి 1861 ఆగస్టు 10న ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులు ఆయనకు మరణదండన ప్రకటించారు. ఆ శిక్ష ప్రకారం 1861 అక్టోబరు 23న కోటా లోని బ్రిటిష్‌ అధికార ప్రతినిధి నివాసం ఎదుట ఇతర తిరుగుబాటు యోధులతోపాటుగా పఠాన్‌ సలాబత్‌ ఖాన్‌ను బహిరంగంగా ఉరితీశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌