చిరస్మరణీయులు, మొదటి భాగం/నవాబ్‌ సయ్యద్‌ ముహమ్మద్‌

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

85

చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf

34. నవాబ్‌ సయ్యద్‌ ముహమ్మద్‌

(1867- 1919)

బ్రిటిష్‌ వ్యతిరేక పోరాట వీరుల జాబితాలో ప్రముఖ స్థానం ఆక్రమించిన మైసూరు పులి టిపూ సుల్తాన్‌ వారసత్వాన్నికొనసాగిస్తూ ఆయన ఆశయాలను అనుగుణంగా వ్యవహరించిన జాతీయ ఉద్యమకారులలో నవాబ్‌ సయ్యద్‌ ముహమ్మద్‌ ఎన్నదగినవారు.

1867లో జన్మించిన సయ్యద్‌ ముహమ్మద్‌,టిపూ సుల్తాన్‌ నాల్గవ కుమారుడైన సుల్తాన్‌ యాసిన్‌ కుమారై రుఖ్‌ బేగంకు తల్లి పక్షాన మనుమడు. 1867లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం మద్రాసు నగరంలో జరిగింది. ఆ తరువాత తండ్రి మీర్‌ హుమాయున్‌ మార్గదర్శకత్వంలో వాణిజ్యరంగ ప్రవేశం చేసి అత్యధికంగా గడించారు.

ఒకవైపు వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూనే రాజకీయ -ప్రజాసేవా రంగాల వైపు సయ్యద్‌ ముహమ్మద్‌ దృష్టి సారించారు. 1894లో మద్రాసులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలో సభ్యత్వం స్వీకరించిన ఆయన 1896 సంవత్సరంలో మద్రాసు నగరానికి తొలి ముస్లిం షరీఫ్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారు.1897లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనను నవాబు బిరుదుతో సత్కరించింది. 1900 సంవత్సరంలో ఆయన మద్రాస్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఎంపికయ్యారు. 1901లో భారత జాతీయ కాంగ్రెస్‌ కమిటీసభ్యులయ్యారు.

ప్రజల ఆర్థిక-రాజకీయ- సాంఫిుక చైతన్యం కోసం కృషి ఆరంభించిన ఆయన

చిరస్మరణీయులు 86

మద్రాసు మహజన సభ అధ్యక్షునిగా బాధ్యతలను నిర్వహించి ప్రజల మన్నన పొందారు. ఆనాటి సంపన్న కుటుంబీకుల అతి విలాసవంతమై న జీవితాలకు భిన్నంగా, పేదముస్లింల స్దితిగతులను మెరుగుపర్చడానికి ఆయన పలు నూతన సంస్ధలను స్థాపించి ప్రజలతో కలిసి పనిచేశారు. ప్రజల ఆర్థికాభివృద్ధికి సాంకేతిక విద్యకు, పారిశ్రామిక అభివృదికి ప్రభుత్వం తోడ్పడాలని, రైతాంగ మీద పన్నుల భారం అధికంగా ఉందని, అందువల్ల పన్నుల భారాన్నిగణనీయంగా తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

1903 మద్రాస్‌ లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు ఆహ్వాన సంఘ అధ్యక్షునిగా సమర్థవంతంగా సమావేశాలను నిర్వహించి నేతల ప్రశంసలందుకున్నారు. ఈ సందర్బంగా మ్లాడుతూ, జాతీయ కాంగ్రెస్‌లో ముస్లింలు బహుళ సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రజల ఉమ్మడి రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను విస్మరించి అంతా కలసి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు.1905లో ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఏ పదవిలో ఉన్నాప్రజల సంక్షెమమే ప్రదానంగా వ్యవహరించారు. మతాతీత రాజకీయ భావాలు కలిగిన సయ్యద్‌ ముహమ్మద్‌ 1906లో లార్డ్‌ మింటోను కలసి ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలు కావాలని కోరడానికి వెళ్ళిన ముస్లింల ప్రతినిధి బృందంలో చేరడానికి ఇష్టపడలేదు.

జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు తనదైన రీతిలో ఆర్థిక-హర్థిక సహాయ సహకారాలు అందించిన ఆయన 1913లో కరాచిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాల నిర్వహణ కోసం భూరి విరాళం ఇవ్వడమే కాకుండా తన సంపదను ఎంతో వ్యయం చేశారు. ఆనాడు పలువురు ముస్లిం ప్రముఖులు జాతీయ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేస్తున్నప్రచారాలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు . ఈ సందర్బంగా హిందూ -ముస్లింలు సోదరుల్లా మెలగాలని, మతాలు వేరైనప్పిటికి తమపుట్టి పెరిగిన గడ్డ ఒక్కటే కనుక మత విభేదాలు వద్దన్నారు. ఐక్యత మాత్రమే ఉమ్మడి లక్ష్యాలను సాధించగలదని స్పష్టంచేశారు. ఉమ్మడి ప్రయోజనాల సాధనకు తోడ్పడిన ప్రజలకు మాత్రమే ఆ ప్రయోజనాలలో వాటా కోరగల హక్కు ఉంటుందని సయ్యద్‌ ముహమ్మద్‌ ప్రకటించారు.

ఈ విధంగా అన్ని రంగాలలో సమర్ధవంతంగా కార్యకలాపాలను నిర్వహించి, జాతీయోద్యమంలో ప్రముఖ పాత్రను పోషించి వదాన్యులుగా ఖ్యాతిగాంచిన నవాబ్‌ సయ్యద్‌ మహమ్ముద్‌ 1919 ఫిబ్రవరి 12న మద్రాసులో చివరిశ్వాస విడిచారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌