చింతయేహం జానకీకాంతం సంతతం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


రాగం: మాయామాళవగౌళ తాళం: మిశ్ర ఝంపె

చింతయేహం జానకీకాంతం సంతతం చింతితార్థ దాయక-
మనిల సుతనుతం కాంతి విజిత దినపతిం దయాన్వితం||

దంతి సంతోషం శ్రితానంత బృందార్చితం శాంత చిత్తం ముఖ విజిత కాంతి నిశాకాంతం||

పంకజాక్షం రఘువరం మోదకరం కంకణాది భూషణధరం
లంకేశ మదహరం పంకజోద్భవాద్యమర సంకట వినాశకరం
సంకర్షణం శ్రీకరం శంఖ చక్రధరం వాసుదేవం హరిం||