Jump to content

చాలులే నిదరపో జాబిలి కూన

వికీసోర్స్ నుండి

పల్లవి:

చాలులే నిదరపో జాబిలి కూనా

ఆ దొంగకలవ రేకుల్లో తుమ్మెదలాడేనా

ఆ సోగకనుల రెప్పల్లో తూనీగలాడేనా ||చాలులే||

తుమ్మెదలాడేనా తూనీగలాడేనా (2)


చరణం:

అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా

ఓసి! వేలెడేసి లేవు బోసి నవ్వులదానా || అంత ||

మూసేనీ కనుల ఎటుల పూసేనే నిదర అదర జాబిలి కూనా! | ఆ దొంగ |

తుమ్మెదలాడేనా తూనీగలాడేనా (2)


చరణం:

అమ్మను బులిపించి నీ అయ్యను మరిపించావే

కాని చిట్టి తమ్ముడొకడు నీ తొట్టి లోకి రానీ | అమ్మను |

ఔరా కోరికలు, కలలు తీరా నిజమైతే, ఐతే జాబిలి కూనా! | ఆ దొంగ |

తుమ్మెదలాడేనా తూనీగలాడేనా (2)