చలన చిత్ర చట్టము, 1952

వికీసోర్స్ నుండి

భారత ప్రభుత్వము

శాసన మరియు న్యాయపాలన మంత్రిత్వ శాఖ

(శాసన నిర్మాణ విభాగము)



చలన చిత్ర చట్టము, 1952

(1952 లోని 37 వ చట్టము)

[1 జూన్, 1991 న ఉన్నట్లుగా]


The Cinematograph Act, 1952

(Act 37 of 1952)

[As on 1st June, 1991]


భారత ప్రభుత్వము తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్రణాలయ కమీషనరుగారిచే ప్రభుత్వ కేంద్ర ముద్రణాలయము, హైదరాబాదునందు ముద్రించి ప్రచురింపబడినది.

1991

మూల్యము: రూ. 13-00

అవతారిక

ఈ ముద్రణలో 1 జూన్, 1991న ఉన్నట్లుగా ది సినిమాటోగ్రాఫ్ యాక్ట్, 1952 (1952 లో 37వ చట్టము) యొక్క ప్రాధికృత తెలుగు పాఠము కలదు. ఈ పాఠమును 26 ఆగష్టు, 1991 తేదీగల భారత రాజపత్రము, అసాధారణ భాగము XVI అనుభాగము 1; సంఖ్య 6, సంపుటము 6లో 795 నుండి 807 వరకుగల పుటలలో ప్రచురించడమైనది.

ఈ తెలుగు పాఠమును, రాష్ట్రపతి ప్రాధికారము ననుసరించి ప్రాధికృత పాఠముల (కేంద్ర శాసనముల) చట్టము, 1973 యొక్క 2వ పరిచ్ఛేదములోని ఖండము (ఏ) క్రింద ప్రచురించడమైనది. అట్లు ప్రచురించినమీదట, ఈ అనువాదము ఆ చట్టమునకు ప్రాధికృత తెలుగు పాఠమైనది.

న్యూఢిల్లీ,

తేదీ: 31 ఆగష్టు, 1991.

వి. యస్. రమాదేవి,

కార్యదర్శి, భారత ప్రభుత్వము.

PREFACE

This edition of The Cinematograph Act, 1952 (Act 37 of 1952) as on 1st June, 1991 contains the authoritative Text of that Act in Telugu which was published in the Gazette of India, Extraordinary Part XVI, Section 1, No. 6, Vol. 6, dated 26th August, 1991 on pages from 795 to 807.

This Telugu text was published under the authority of the President under clause (a) of Section 2 of the Authoritative Texts (Central Laws) Act, 1973, and on such publication it became the authoritative text of that Act in Telugu.

New Delhi,

Dated: 31st August, 1991.

V. S. RAMA DEVI,

Secretary to Govt. of India .

________________

చలనచిత్ర చట్టము , 1952 -

పరిచ్ఛేదక మము

పరిచ్ఛేదము

భాగము 1-

ప్రారంభిక - I -
1. సంగ్రహనామము , విస్తరణ మరియు ప్రారంభము .
2. నిర్వచనములు
2ఎ జమ్మూ-కాశ్మీరు రాజ్యములో అమలు నందులేని ఏదేని శాసనమును గూర్చిన, లేక అస్తిత్వమునందు లేని ఎవరేని కృత్యకారిని గూర్చిన ననిర్ధేశముల అన్వయము - -2

భాగము 2. ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్ధము ద్రువీకరించుట .

3. ఫిల్ము సెన్సారు బోరు .
4. ఫిల్ములను పరీక్షించుట .
5. సలహా ప్యానళ్ళు
5ఏ. ఫిల్ములను ధ్రువీకరించుట .
5బీ . ఫిల్ములను ధృవీకరించుటకు పాటించవలసిన మార్పదర్శక సూతములు -
5సీ. అపీళ్ళు
5డీ. అపీలు ట్రిబ్యునలు ఏర్పాటు •
52 • పువపత్రమును నిలుపుదల చేయుట మరియు దానిని ప్రతిసంహరించుట .
5ఎఫ్. - కేంద్ర ప్రభుత్వము ఉత్తరువులను పునర్విలోకనము చేయుట - 6. కేంద్ర ప్రభుత్వ పునరీక్షణాధికారములు - 6ఏ. ధ్రువీకరించిన ఫిల్ములకు సంబంధించి పంపిణీదారులకు , ప్రదర్శకులకు సమాచారమును మరియు దస్తావేజుటలను ఇచ్చుట . ఈ భాగమును ఉల్లంఘించినందులకు శాస్త్రులు • ఏ. అభిగ్రహణచేయు అధికారము - - 7. బోరు తమ అధికారములను ప్రత్యా యోజనము చేయుట - 7. పరీకారము ఫిల్ములను ప్రదర్శించవలసినదిగా ఆదేశించు అధికారము - డీ. ఖాళీలు మొదల్కెన వాటివలన చర్యలు శాసనమాన్యత లేనివి కాకుండుట , ఈ · బోర్డు సభ్యులు మరియు సలహా ప్యానళ్ల సభ్యులు పట్టికు సేవకుల్నే యుండుట . 7ఎఫ్. శాసనబద చర్యలకు అడ్కంకి - - 8 నియమములు చేయు అధికారము . 9. మినహాయించుటకు అధికారము • 7.

to

10 భాగము 3. చలనచిత్రముల ప్రదర్శనలను క్రమబదము చేయుట • 10. చలనచిత్ర ప్రదర్శనల కొరకు లెసెన్సు ఈయవలసియుండుట . .|| - లెసెన్సు ఇచ్చు ప్రాధికారి . . 12. లైసెన్సు ఇచ్చు ప్రాధికారి అధికారములపై నిర్భంధనలు • 13. కొన్ని సందర్భములలో ఫిల్ముల ప్రదర్శనను నిలిపి వేయుటకు కేంద ప్రభుత్వమునకు లేక స్థానిక ప్రాధికారికి అధికారము , ..

12 పుట:చలన చిత్ర చట్టము, 1952.pdf/4

చలనచిత్ర చట్టము, 1952.

(1952 లోని 37వ చట్టము)

(21 మార్చి, 1952)

చలనచిత్ర ఫిల్ములను ప్రదర్శనార్ధము ధ్రువీకరించుట కొరకును చలనచిత్రముల ప్రదర్శనలను క్రమబద్దము చేయుటకొరకును అయిన చట్టము.

పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయనైనది:–

భాగము 1.

ప్రారంభిక.

1. (1) ఈ చట్టమును చలనచిత్ర చట్టము, 1952 అని పేర్కొనవచ్చును.

(2) భాగములు 1.2 మరియు 4 యావద్భారతదేశమునకు విస్తరించును; భాగము 3 సంఘ రాజ్యక్షేత్రములకు మాత్రమే విస్తరించును.

(3) ఈ చట్టము, కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన అమలులోనికి వచ్చును:

అయితే, భాగములు 1 మరియు 2, జమ్ము-కాశ్మీరు రాజ్యములో చలనచిత్ర (సవరణ) చట్టము, 1973 ప్రారంభమైన తరువాత, కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయునట్టి తేదీన మాత్రమే అమలులోనికి వచ్చును.

2. ఈ చట్టములో సందర్భమును బట్టి అర్దము వేరుగా ఉన్ననే తప్ప.–

(ఏ) "వయోజనుడు" అనగా పదునెనిమిది సంవత్సరముల వయస్సు పూర్తి, అయిన వ్యక్తి అని అర్దము;

(బీ) "బోర్దు " అనగా 3వ పరిచ్ఛేదము క్రింద కేంద్ర, ప్రభుత్వము ఏర్పాటు చేసిన [1]ఫిల్ము సర్టిఫికేషను బోర్దు అని అర్దము;

(బిబీ) "ధ్రువపత్రము" అనగా పరిచ్ఛేదము 5ఏ క్రింద జోర్దు ఇచ్చిన ధ్రువపత్రము అని అర్ధము;

(సీ) "చలనచిత్రము" అను పదపరిధిలో చలనచిత్రములనుగాని చిత్రముల పరంపరనుగాని ప్రదర్శించు ఏదేని పరికరము చేరియుండును;

(డీ) ఒక ప్రెసిడేన్సీ పట్టణమునకు సంబంధించి "జిల్లా మేజిస్ట్రేటు" అనగా పోలీసు కమీషనరు అని అర్దము;

(డీడీ) "ఫిల్ము" అనగా చలనచిత్ర ఫిల్ము అని అర్ధము;

(ఈ) "స్థలము" అను పదపరిధిలో ఇల్లు, భవనము, డేరా మరియు సముద్ర; భూ లేక వాయు మార్గమున పయనించు ఏదేని రకపు వాహనము చేరి యుండును;

(ఎఫ్) "విహిత" అనగా ఈ చట్టము క్రింద చేసిన నియమముల ద్వారా విహిత పరచిన అని అర్దము;

(జీ) "ప్రాంతీయ అధికారి" అనగా 5వ పరిచ్ఛేదము క్రింద కేంద్ర ప్రభుత్వము నియమించిన ప్రాంతీయ అధికారి అని అర్దము; ఈ పదపరిధిలో అదనపు ప్రాంతీయ అధికారి, సహాయక ప్రాంతీయ అధికారి చేరియుందురు;

(హెచ్) "టిబ్యునలు" అనగా పరిచ్ఛేదము 5డీ కింద ఏర్పాటు చేసిన అపీలు టిబ్యునలు అని అర్ధము;

2ఏ. జమ్మూ-కాశ్మీరు రాజ్యములో అమలునందులేని ఏదేని శాసనమును గూర్చి లేక అస్తిత్వమునందులేని ఎవరేని [2]కృత్యకారిని గూర్చి, ఈ చట్టములో గల ఏదేని నిర్దేశమును ఆ రాజ్యము విషయములో, ఆ రాజ్యములో అమలునందున్న తత్సమానమైన, శాసనమును గూర్చి లేక అస్తిత్వమునందున్న తత్సమాన కృత్యకారిని గూర్చి చేసిన నిర్దేశమైనట్లు అన్వయించవలెను.

భాగము 2.

ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్దము ద్రువీకరించుట.

3. (1) ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరుచేయు నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా, ఫిల్ము సర్టిఫికేషను బోర్దు అనబడు ఒక బోర్దును ఏర్పాటు చేయవచ్చును; ఆ బోర్దులో కేంద్ర ప్రభుత్వము నియమించినట్టి ఒక అధ్యక్షుడును, పన్నెండు మందికి తక్కువ కాకుండ, ఇరవై ఐదు మందికి మించని ఇతర సభ్యులును ఉండవలెను.

(2) బోర్దు అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వము నిర్ధారణచేయునట్టి జీతమును మరియు బత్తెములను పొందవలెను; ఇతర సభ్యులు బోర్దు సమావేశములకు హాజరగుటకు విహితపరచినట్టి బత్తెములనుగాని ఫీజును గాని పొందవలెను.

(3) బోర్దు సభ్యుల ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు విహిత పరచునట్టివై ఉండును.

4. (1) ఏదేని ఫిల్మును ప్రదర్శింపగోరు ఎవరేని వ్యక్తి, దాని విషయమున ధ్రువపత్రమును పొందుటకై బోర్దుకు విహితరీతిగా దరఖాస్తు పెట్బుకొనవలెను; బోర్దు ఆ ఫిల్మును విహితరీతిగా పరీక్షించిన పిమ్మటగాని పరీక్షింపజేసిన పిమ్మటగాని–

(i) ఆ ఫిల్మును నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరు చేయవచ్చును;

అయితే ఆ ఫిల్ములోగల ఏదేని విషయము దృష్ట్యా, అట్టి ఫిల్మును చూచుటకు పన్నెండు సంవత్సరములలోపు వయస్సుగల ఎవరేని బిడ్డను అనుమతించ వచ్చునా అను ప్రశ్నను అట్టి బిడ్డ తల్లిదండ్రులుగాని సంరక్షకుడుగాని పర్యాలోచించవలెనని హెచ్చరించుట ఆవశ్యకమని బోర్దు అభిప్రాయపడినచో, బోర్దు అట్లని పీటీవ్రాసి ఆ ఫిల్మును నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయవచ్చును; లేక

(ii) వయోజనులకు మాత్రమే పరిమితముచేయుచు ఆ ఫిల్మును సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయవచ్చును; లేక

(ii ఏ) ఆ ఫిల్ము స్వభావమును, అందలి విషయవస్తువును మరియు మూల స్వభావమును దృష్టియందుంచుకొని, ఆ ఫిల్మును ఏదేని వృత్తికి చెందిన వారికిగాని వ్యక్తుల వర్గమునకుగాని పరిమితముచేయుచు సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయవచ్చును; లేక

(iii) పై ఖండములలో దేని క్రిందన్నెనను ఆ ఫిల్మును సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరు చేయుటకు పూర్వము ఆ ఫిల్ములో తాము ఆవశ్యకమని తలచునట్టి కత్తిరింపులనుగాని మార్పులను గాని చేయవలసినదిగా, దరఖాస్తుదారును ఆదేశించవచ్చును; లేక

(iv) ఆ ఫిల్మును సార్వజనిక ప్రదర్శనార్థము మంజూరు చేయకుండ నిరాకరించవచ్చును.

(2) ఈ విషయములో తన అభిప్రాయములను విన్నవించుకొనుటకు దరఖాస్తుదారుకు అవకాశమునిచ్చిన పిమ్మటనే తప్ప బోర్దు ఉపపరిచ్ఛేదములోని ఖండము (i)కి గల వినాయింపు, ఖండము (ii), ఖండము (ii ఏ), ఖండము (iii) లేక ఖండము (iv) క్రింద ఎట్టి చర్యను తీసికొనరాదు.

5. (1) ఈ చట్టము క్రింద బోర్డు తన కృత్యములను సమర్శవంతముగా నిర్వహించుటకు దానికి వీలు కలిగించుటకుగాను, కేంద్ర ప్రభుత్వము తాము సబబని తలచునట్టి ప్రాంతీయ కేంద్రములలో సలహా ప్యానళ్లను ఏర్పాటు చేయవచ్చును; అట్టి ప్రతి ప్యానలులో కేంద్ర ప్రభుత్వము నియమించుట సబబని తలచునంతమంది వ్యక్తులు ఉండవలెను. వారు ఫిల్ముల వలన ప్రజలపై పడగల ప్రభావమును నిర్ణయించుటకు అర్హతగలవారని కేంద్ర ప్రభుత్వము అభిప్రాయపడునట్టి వారై యుండవలెను.

(2) ప్రతియొక ప్రాంతీయ కేంద్రములో కేంద్ర ప్రభుత్వము నియమించుట సబబని తలచునంతమంది ప్రాంతీయ అధికారులు ఉండవలెను. మరియు ఈ విషయమున చేయు నియమములలో, ఫిల్ములను పరీక్షించుటలో ప్రాంతీయ అధికారులు పాల్గొనుట కొరకై నిబంధనలను చేయవచ్చును.

(3) ధ్రువపత్రము కొరకై దరఖాస్తు చేసిన ఏదేని ఫిల్ము విషయములో బోర్డు, ఏదేని సలహా ప్యానలును, విహితపరచినట్టి రీతిగా సంప్రదించవచ్చును.

(4) అట్టి ప్రతియొక సలహా ప్యానలు–ఈ విషయమున చేసిన నియమములలో నిబంధించినట్లు ఒక నికాయముగా వ్యవహరించుచున్నను కమిటీలుగా వ్యవహరించుచున్నను-ఫిల్మును పరీక్షించి బోర్డుకు, తాము సబబని తలచునట్టి సిఫారసులను చేయుట ఆ ప్యానలు కర్తవ్యమై యుండును.

(5) సలహా ప్యానలు సభ్యులకు ఎట్టి జీతమును పొందు హక్కు ఉండదు; కాని విహితపరచినట్టి ఫీజునుగాని, బత్తెములనుగాని వారు పొందవలెను.

5ఏ. (1) ఏదేని ఫిల్మును విహిత రీతిగా పరిశీలించిన పిమ్మటగాని లేక పరీక్షింపజేసిన పిమ్మటగాని బోర్డు–

(ఏ) ఆ ఫిల్ము, నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్థము తగినదని లేక సందర్భానుసారముగ, 4వ పరిచ్ఛేదపు, ఉపపరిచ్ఛేదము (1) లోని ఖండము (1)కి గల వినాయింపులో పేర్కొనినటు వంటి పీటీవ్రాతతో నిర్బంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని తలంచినచో, ఆ ఫిల్ము విషయములో ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తికి ఒక [3]"నిలే" 'ద్రువపత్రమును' లేక సందర్భానుసారముగ, ఒక [4]"నిలేవ" ధ్రువపత్రమును ఈయవలెను; లేక

(బీ) ఆ ఫిల్ము, నిర్భంధనలేవియు లేకుండ, సార్వజనిక ప్రదర్శనార్దము తగినది కాదని, అయితే వయోజనులకు మాత్రమే పరిమితముచేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని లేక సందర్భానుసారముగ ఏదేని వృత్తికి చెందిన వారికి లేక ________________

4 /-798 వ్యక్తుల వర్గమునకు మాత్రమే పరిమితముచేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని తలచినచో, ఆ ఫిల్ము విషయములో ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తికి, 'వ' ధ్రువపత్రమును లేక సందర్భానుసారముగ *[5]"ప్ర" ధ్రువపత్రమును ఈయవలెను మరియు ఆ ఫిల్ముకు విహితరీతిగా అట్లు గుర్తు వేయించవలెను:

అయితే, ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తి గాని, ఎవరేని పంపిణీదారుగాని, ప్రదర్శకుడుగాని లేక ఆ ఫిల్ములో హక్కులు సంక్రమించిన మరెవరేని వ్యక్తి గాని, ఖండము (ఏ) లేక ఖండము (బీ) కింద ధ్రువపత్రము పొందిన ఫిల్ము లోని ఏదేని విషయమును గురించిన అశ్లీలతకు సంబంధించిన ఏ శాసనము క్రింద న్నెనను శిక్షకు పాత్రుడు కాడు .

(2) ఏదేని ఫిల్ము విషయములో ఇచ్చిన ధ్రువపత్రమును లేక ధ్రువపత్రము నిచ్చుటకు నిరాకరించుచు చేసిన ఉత్తరువును, భారత రాజపత్రములో ప్రచురించవలెను.

(3) 'ఈ చట్టములోని ఇతర నిబంధనలకు లోబడి, ఈ పరిచ్ఛేదము క్రింద బోర్దు. ఇచ్చిన ధృవపత్రము, పది సంవత్సరముల కాలావదిపాటు భారత దేశమంతటను శాసనమాన్యత కలిగియుండును.

5బీ... (1) ఏదేని ఫిల్ముకు ధ్రువపత్రము నిచ్చుటకు సమర్దతగల ప్రాధికారి అభిప్రాయములో, ఆ ఫిల్ముగాని అందలి ఏదేని భాగముగాని, భారతదేశము యొక్క సార్వభౌమత మరియు - అఖండత , రాజ్య భద్రత, విదేశీ రాజ్యములతో స్నేహ సంబంధములు, మారదర్శక ప్రజాశాంతి, సభ్యత లేక నైతికత-వీటికి సంబంధించిన హితములకు భంగకరమైన , ద్నెనచో, లేక పరువు నష్టము లేక న్యాయస్థాన ధిక్కారము ఇమిడియున్నద్నెనచో, లేక ఏదేని అపరాధము చేయుటను ప్రేరేపించగలదైనచొ, దానిని సార్వజనిక ప్రదర్శనార్దము ధ్రువీకరించరాదు.

(2) ఉపపరిచ్ఛేదము (1)లోని నిబంధనలకు లోబడి, ఫిల్ములను సార్వజనిక ప్రదర్శనార్దము మంజూరు చేయుటలో ఈ చట్టము క్రింద ధ్రువపత్రములనిచ్చుటకు సమర్ద తగల ప్రాధికారి పాటించవలసిన సూత్రములను పొందుపరచుచు కేంద్ర ప్రభుత్వము తాము సబబని తలచునట్టి ఆదేశములను జారీచేయవచ్చును .


5సీ. (1) ఏదేని ఫిల్ము విషయములో ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టు కొనియుండి, బోర్దు -

(ఏ) ధ్రువపతము నిచ్చుటకు నిరాకరించుచు; లేక

('బీ) వ' ధ్రువపతమును మాత్రమే ఇచ్చుచు; లేక

(సీ) ప్ర ద్రువపతమును మాత్రమే ఇచ్చుచు , లేక

(డీ) నిలేవ' ధ్రువపతమును మాత్రమే ఇచ్చుచు; లేక

(ఈ) ఏవేని కత్తిరింపులను లేక మార్పులను చేయవలసినదిగా దరఖాస్తు దారును ఆదేశించుచు చేసిన ఉత్తరువు వలన వ్యధితుడెన ఏ వ్యక్తి యైనను అట్టి ఉత్తరువు తేదీ నుండి ముప్పది దినముల లోపల ట్రిబ్యునలుకు అపీలు చేసుకొనవచ్చును:

అయితే, అపీలుదారు, పర్యాప్తమైన కారణమును బట్టి, పైన తెలిపిన ముప్పది దినముల గడువులోపల అపీలు దాఖలు చేయలేకపోయినాడని టిబ్యునలు తృప్తి, చెందినచో ఆ అపీలును మరో ముప్పది దినముల గడువులోపల స్వీకరించుటకు ఆ టిబ్యునలు అనుమతింపవచ్చును. ________________

5/G-799 (2) ఈ పరిచ్ఛేదము క్రింద ప్రతియొక అపీలును వ్రాతమూలకమైన అర్జి ద్వారా చేయవలెను; ఏ ఉత్తరువుపై అపీలు చేయన్నెనదో ఆ ఉత్తరువుకుగల కారణముల సంగ్రహ వివరణను అపీలు దారుకు అందజేసియున్నయెడల అట్టి వివరణ ప్రతిని మరియు ఒక వేయి రూపాయలకు మించకుండ విహితపరచినట్టి ఫీజును అపీలుతో దాఖలు చేయవలెను .

5డీ. (1) పరిచ్ఛేదము 5సీ క్రింద బోర్డు చేసిన ఏదేని ఉత్తరువుపై అపీళ్ళను ఆకర్షించు నిమిత్తము, కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా ఒక అపీలు టిబ్యునలును ఏర్పాటు చేయవలెను.

(2) టిబ్యునలు - ప్రధాన కార్యాలయము న్యూ ఢిల్లీ లోగాని కేంద్ర ప్రభుత్వము రాజపత్రములో అధిసూచన ద్వారా నిర్దిష్టపరచు నట్టి ఇతర స్టలములొ గాని ఉండవలెను .

(3) అట్టి టిబ్యునలులో కేంద్ర ప్రభుత్వము నియమించినట్టి ఒక ఛైర్మను" మరియు నలుగురికి మించని ఇతర సభ్యులును ఉండవలెను .

(4) ఉన్నత న్యాయస్టానపు న్యాయాధీశుడుగా పదవీ విరమణ చేసిన వ్యక్తి అయి యుండిననే తప్ప లేక ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశుడుగా ఉండుటకు అర్హత కలిగియున్న వ్యక్తి అయిననే తప్ప ఏ వ్యక్తి యు , టిబ్యునలు చెర్మనుగా నియామకమునకు అర్హుడు కాడు.

(5) ఫిల్మువలన ప్రజలపై, పడగల ప్రభావమును నిర్ణయించుటకు అర్హతగల వారని తాము అభిప్రాయపడు నట్టి వ్యక్తులను కేంద్ర ప్రభుత్వము టిబ్యునలు సభ్యులుగా నియమించవచ్చును .

(6) టిబ్యునలు. చైర్మను, కేంద్ర ప్రభుత్వము నిర్దారణ చేయునట్టి జీతము లను, మరియు - బత్తెములను పొందవలెను. మరియు సభ్యులు, విహితపరచబడునట్టి బత్తెమునుగాని ఫీజునుగాని పొందవలెను

(7) ఈ విషయమున చేయు నియమములకు లోబడి, కేంద్ర ప్రభుత్వము ఒక కార్యదర్శిని మరియు ఈ చట్టము క్రింద టిబ్యునలు కర్తవ్యములను సమర్ద వంతముగా నిర్వర్తించుటకొరకు ఆవశ్యకమని తాము తలంచునట్టి ఇతర ఉద్యోగులను నియమించవచ్చును .

(8) టిబ్యునలు కార్యదర్శి మరియు ఇతర ఉద్యోగులు, టిబ్యునలు ఛైర్మనుతో సంప్రదించిన పిమ్మట, విహితపరచినట్టి అధికారములను వినియోగించవలెను మరియు అట్టి కర్తవ్యములను నిర్వర్తించవలెను . (9) టిబ్యునలు ఛైర్మను మరియు సభ్యులయొక్కయు, కార్యదర్శి మరియు ఇతర ఉద్వోగులయొక్కయు సేవను గూర్చిన ఇతర నిబంధనలు మరియు షరతులు, విహితపరచునట్టి వైయుండును.

(10) ఈ చట్టపు నిబంధనలకు లోబడి, టిబ్యునలు తన ప్రక్రియను తానే క్రమబద్దము చేసుకొనవచ్చును .

(11) టిబ్యునలు ఏదేని ఫిల్ముకు సంబంధించి, ఆ విషయములో తాము ఆవశ్యకమని తలచు నట్టి: పరిశీలన జరిపిన పిమ్మటను, ఆ విషయములో ఆకర్షించబడు' టకు అపీలు దారుకు మరియు బోర్డు కు ఒక అవకాశమునిచ్చిన పిమ్మటను తాము సబబని తలచునట్టి ఉత్తరువును చేయవచ్చును; బోర్డు అట్టి ఉత్తరువుననుసరించి ఆ విషయమును పరిష్కరించవలెను; . ________________

6 /6-800 5 - - (1) 6వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (2) లో ఏమియున్నప్పటికిని, కేంద్ర ప్రభుత్వము, ఈ భాగము క్రింద ఇచ్చిన ధ్రువపత్రమును రాజపత్రములో అధిసూచన ద్వారా , తాము సబబని తలచు నట్టి కాలావధిపాటు నిలుపుదల చేయవచ్చును లేక

(i) ఏ ఫిల్ము విషయములో ఆ ధ్రువపత్రము ఇచ్చినారో ఆ ఫిల్మును ధ్రువీకరించిన రూపములో కాకుండ ఇతర రూపములో ప్రదర్శించుచున్నారని, లేక

(ii) ఆ ఫిల్మును లేక. అందలి ఏదేని భాగమును ఈ భాగపు నిబంధనలను గాని ఈ భాగము క్రింద చేసిన - నియమములనుగాని ఉల్లంఘించి, ప్రదర్శించుచున్నారని అభిప్రాయపడినచో, అట్టి ధ్రువపత్రమును ప్రతిసంహరించవచ్చును.

(2) ఉపపరిచ్ఛేదము (1) క్రింద అధిసూచనను ప్రచురించినయెడల, కేంద్ర ప్రభుత్వము , ఆ ధ్రువపత్రమును లేక ఆ ఫిల్ము విషయములో డూప్లి కేటు ద్రువ పత్రములను ఇచ్చినచో వాటన్నిటిని బొర్దుకు లేక సదరు అధిసూచనలో నిర్దిష్టపరచిన ఎవరేని వ్యక్తికి లేక ప్రాధికారికి ఇచ్చివేయవలసినదిగా ధ్రువపత్రమునక్కె దరఖాస్తు, పెట్టుకొనిన వ్యక్తినిగాని, ఆ ఫిల్ములో హక్కులు సంక్రమించినట్టి ఎవరేని ఇతర వ్యక్తిని గాని, ఉభయులనుగాని కోరవచ్చును .

(3) ఈ విషయములో తన అభిప్రాయములను తెలుపుకొనుటకు సంబంధించిన వ్యక్తికి అవకాశమునిచ్చిన పిమ్మటనే తప్ప ఈ పరిచ్ఛేదము క్రింద ఎట్టి చర్య తీసుకొనరాదు.

(4) ఈ పరిచ్ఛేదము క్రింద ధృవపత్రమును నిలుపుదల చేసిన కాలావధిలో ఆ ఫిల్మును ధ్రువీకరించని ఫిల్ముగా భావించవలెను.

5ఎఫ్. (1) ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తి గాని, ఫిల్ములో హక్కులు సంక్రమించినట్టి ఎవరేని ఇతర వ్యక్తి గాని, పరిచ్ఛేదము 5 క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ఏదేని ఉత్తరువువలన వ్యధితుడైనయెడల , రాజపత్రములో అధిసూచనను ప్రచురించిన అరవై దినముల లోపల అతడు ఆ ఉత్తరువును పునర్విలోకనము చేయుట కొరకై ఏ ఆధారములపై అట్టి పునర్విలోకనము చేయువలయునని తాను తలంచుచున్నాడో ఆ ఆధారములను ఉగ్గడించుచు కేంద్ర ప్రభుత్వమునకు ఒక దరఖాస్తు పెటుకొనవచ్చును:

అయితే, ధ్రువపత్రము కొరకు దరఖాస్తు పెట్టుకొనిన వ్యక్తి లేక ఆ ఇతర వ్యక్తి, పునర్విలోకనము కొరకు దరఖాస్తును *[6]పర్యాప్తమ్నెన కారణమును బట్టి సదరు అరవై దినముల కాలావధిలోపల పెట్టుకొనలేక పోయినాడని కేంద్ర ప్రభుత్వము తృప్తి చెందినచో అది అట్టి దరఖాస్తును మరో అరవై దినముల కాలావధిలోపల దాఖలు చేయుటకు అనుమతించవచ్చును

(2) ఉపపరిచ్ఛేదము (1) క్రింద దరఖాస్తు అందిన మీదట, కేంద్ర ప్రభుత్వము , ఆకర్షింపబడుటకు వ్యధితుడైన వ్యక్తికి యుక్తమైన అవకాశము నిచ్చియు తాము ఆవశ్యకమని తలంచునట్టి తదుపరి పరిశీలన జరిపిన పిమ్మటను తమ నిర్ణయమును ఖాయపరచుచు, మార్పుచేయుచు లేక విపర్యస్తముచేయుచు తాము సబబని తలచు నట్టి ఉత్తరువును చేయవచ్చును; బోర్డు అట్టి ఉత్తరువుననుసరించి ఆ విషయమును పరిష్కరించవలెను.

6. (1) ఈ భాగములో ఏమియున్నప్పటికినీ, ఏదేని ఫిల్ముకు సంబంధించి ప్రభుత్వ బోర్డు. సమక్షమున నడుచుచున్నట్టి లేక బోర్డు గాని సందర్భానుసారముగ ట్రిబ్యునలు గాని నిర్నయము ఒసగినట్టి ఏదేని చర్య (అయితే టిబ్యునలు సమక్షమున ఏదేని విషయమునకు సంబంధించి నడుచుచున్న ఏ చర్యయు ఇందు చేరియుండదు) యొక్క ________________

7 /6-801 రికార్దును ఏ దశయందై నను తమంతతాము తెప్పించి, ఆ విషయమున తాము ఆవశ్యకమని తలచు నట్టి పరిశీలన జరిపిన పిమ్మట దాని విషయములో తాము సబబని తలచు నట్టి ఉత్తరువు చేయవచ్చును; బోర్దు అట్టి ఉత్తరువుననుసరించి ఆ విషయమును పరిష్కరించవలెను:

అయితే, ధ్రువపత్రముకొరకు దరఖాస్తు పెట్టుకొనిన లేక సందర్భాను సౌరముగ ధ్రువపత్రము పొందిన ఎవరేని వ్యక్తికి ప్రతికూలమగునట్టి ఉత్తరువును దేనినీ ఆ విషయములో తన అభిప్రాయములను తెలియజేసుకొనుటకు అతనికి ఒక అవకాశము నిచ్చిన పిమ్మటనే తప్ప, చేయరాదు:

అంతేకాక ఈ ఉపపరిచ్ఛేదములో నున్నదేదియు, ప్రజాహితమునకు భంగకర మగునని తాము తలంచు నట్టి ఏదేని సంగతిని వెల్లడిచేయవలెనని కేంద్ర ప్రభుత్వమును కోరదు.

(2) ఉప-పరిచ్ఛేదము (1) క్రింద తమకు ఒసగిన అధికారములకు భంగము లేకుండ కేంద్ర ప్రభుత్వము , రాజపత్రములో అధిసూచన ద్వారా, -

(ఏ) ధ్రువపత్రమును పొందిన ఏదేని ఫిల్మును, యావద్భారత దేశములో గాని అందలి ఏదేని భాగములోగాని ధృవపత్రము పొందని ఫిల్ముగా భావించవలెనని, లేక

(బీ) "నిలే" ధ్రువపత్రము లేక "నిలేవ" ధ్రువపత్రము లేక "ఏ" ధ్రువ పత్రము పొందిన ఏదేని ఫిల్మును , 'వ' ధ్రువపత్రము పొందిన ఫిల్ముగా భావించవలెనని; లేక

(సీ) ఏదేని ఫిల్మును ప్రదర్శించుటను ఆదేశములో నిర్దిష్టపరచినట్టి కాలావధి పాటు నిలుపుదల చేయవలెనని,

ఆదేశించవచ్చును:

అయితే, ఖండము (సీ) క్రింద జారీచేసిన ఆదేశమేదియు, అధిసూచన తేదీ నుండి రెండు మాసములకు మించి అమలులో ఉండరాదు.

(3) ఉపపరిచ్ఛేదము (2) లోని ఖండము (ఏ) లేక ఖండము (బీ) క్రింద ఎట్టి చర్యనుగాని ఈ విషయములో తన అభిప్రాయములను తెలియజేసికొనుటకు సంబం ధించిన వ్యక్తి కి ఒక అవకాశము ఇచ్చిన పిమ్మటనే, తప్ప తీసుకొనరాదు.

(4) ఉపపరిచ్ఛేదము (2)లోని ఖండము (సీ) క్రింద ఏదేని . ఫిల్మును నిలుపుదల చేసిన 'కాలావధిలో ఆ ఫిల్మును ధ్రువపత్రము పొందని ఫిల్ముగా భావించవలెను.

6ఏ. ధ్రువీకరించిన ఏదేని ఫిల్మును ఎవరేని పంపిణీదారుకుగాని ప్రదర్శకునకు గాని ఇచ్చు ఎవరేని వ్యక్తి, ఆ ఫిల్ము పేరును, నిడివిని, దాని విషయములో ఇచ్చిన ధ్రువపత్రపు స్వభావమును, సంఖ్యను, అది అట్లు ఏ షరతులకు లోబరిచి ఈయడమ్నెనదో ఆ షరతులను, మరియు ఆ ఫిల్ముకు సంబంధించి విహితపరచదగు ఏవేని " ఇతర వివరములను పంపిణీదారుకు లేక సందర్భానుసారముగ ' ప్రదర్శకునకు విహితపరచదగిన రీతిగా తెలియజేయవలెను.

7. (1) ఎవరేని వ్యక్తి,

(ఏ) ఏదేని స్ఠలములొ

(i) నిర్భంధనలేవియు లేకుండ సార్వజనిక ప్రదర్శనార్దము లేక వయోజను లకు లేక ఏదేని వృత్తికి చెందినవారికి లేక వ్యక్తుల వర్గమునకు మాత్రమే పరిమితము చేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని బోర్దు ధ్రువీకరించిన ఫిల్ము అయియుండి దానిని ప్రదర్శించినపుడు బోర్దు విపాతపరచిన గుర్తును చూపునదియు దానికి అట్టి గుర్తు పెట్టినప్పటి నుండి ఏ విధముగను మార్చబడనిదియు లేక అక్రమముగా దిద్దబడ నిదియు కానట్టి ఏదేని ఫిల్మును, 8"/G-802}} ________________

(ii) వయోజనులకు మాత్రమే పరిమితముచేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని బోర్దు ధ్రువీకరించిన ఏదేని ఫిల్మును ఎవరేని వయోజనుడు కాని వ్యక్తికి,

(iiఏ) ఏదేని వృత్తికి లేక వ్యక్తుల వర్గమునకు మాత్రమే పరిమితము చేసి సార్వజనిక ప్రదర్శనార్దము తగినదని బోర్దు ధ్రువీకరించిన ఏదేని ఫిల్మును అట్టి వ్రుత్తికి చెందని లేక అట్టి వర్గమునకు చెందని వ్యక్తికి

ప్రదర్శించు లేక ప్రదర్శించుటకు అనుమతినిచ్చుచో, లేక

(బీ) ఏదేవి ఫిల్మును ధ్రువీకరించిన పిమ్మట శాసనసమ్మతమైన ప్రాధికారము (దానిని రుజువుచేయు భారము అతనిపై ఉండును) లేకుండ దానిని ఏ విధముగాన్నైనను మార్చుచో లేక అక్రమముగా దిద్దు చో, లేక

(సీ) పరిచ్ఛేదము 6ఏ లోని నిబంధనలను లేక కేంద్ర ప్రభుత్వముగాని బోర్దుగాని ఈ చట్టము ద్వారా లేక ఈ చట్టము క్రింద చేసిన నియమముల ద్వారా తనకు ఒసగిన అధికారములలో లేక కృత్యములలో వేటిన్నెనను వినియోగించుచు చేసిన ఏదేని ఉత్తరువును పాటించనిచో

అతడు మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కారావాసముతోను లేక ఒక లక్ష రూపాయల దాక ఉండగల జుర్మానాతోను లేక ఈ రెండింటితోను మరియు అపరాధము కొనసాగుచున్న సందర్భములో అట్టి అపరాధము కొనసాగుచున్న కాలములో ప్రతి దినమునకు ఇరవై వేల రూపాయల దాక ఉండగల అదనపు జుర్మానాతోను శిక్షింప దగియుండును:

అయితే, ఖండము (ఏ)లోని ఉప-ఖండము (1) యొక్క నిబంధనలను ఉల్లంఘించుచు ఒక వీడియో ఫిల్మును ఏదేని స్థలములో ప్రదర్శించు లేక ప్రదర్శించు టకు అనుమతినిచ్చు వ్యక్తి, మూడు మాసములకు తక్కువ కాకుండద అయితే మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి కారావాసముతోను మరియు ఇరవైవేల రూపాయలకు తక్కువ కాకుండ అయితే లక్ష రూపాయల దాక ఉండగల జుర్మానాతోను మరియు అపరాధము కొనసాగుచున్న సందర్భములో అట్టి అపరాధము కొనసాగుచున్న కాలములో ప్రతి దినమునకు ఇరవైవేల రూపాయల దాక ఉండగల అదనపు జుర్మానా తోను శిక్షింపదగియుండును:

అంతేకాక, న్యాయస్ట్రానము , తీర్పులో పేర్కొనవలసిన *[7]పర్యాప్తమైన మరియు ప్రత్యేక కారణమును బట్టి మూడు మాసముల కంటే తక్కువ కాలావధికి కారావాస శిక్షను లేక ఇరవై వేల రూపాయల కంటే తక్కువ జుర్మానాను విధించవచ్చును:

అంతేకాక, క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 యొక్క 29వ పరిచ్ఛేద ములో ఏమియున్నప్పటికినీ, ఈ విషయమున రాజ్యప్రభుత్వముచే ప్రత్యేకముగా అధికారము పొందిన ఎవరేని మహానగర మేజిస్ట్రేటు లేక ఎవరేని మొదటి తరగతి న్యాయిక మేజిస్ట్రేటు , ఈ భాగము క్రింద శిక్షింపదగు ఏదేని అపరాధమునకై దోష స్థాపితుదైన ఎవరేని వ్యక్తి పై ఐదువేల రూపాయలకు మించిన జుర్మానా దండనోత్తరువు చేయుట శాసనసమ్మతమ్మె యుండును:

అంతేకాక ఇంకను ఈ భాగము క్రింద "నిలేవ"గా ధ్రువీకరించిన ఫిల్ముపై, హెచ్చరికగల పీటీవ్రాతలోని ఏదేని షరతును ఉల్లంఘించినందులకు , పంపిణీదారుగాని ప్రదర్శకుడుగాని ఏదేని సినిమా హౌజ్ సొంతదారుగాని లేక ఉద్యోగిగాని శిక్షకు పాత్రుడు కాడు . ________________

09 /6-803 (2) ఎవరేని వ్యక్తి ఏదేని ఫిల్ము విషయములో ఈ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగిన ఏదేని అపరాధమునకై, దోష స్థాపితుడైనచో, దోషస్థాపనచేయు న్యాయ స్థానము ఆ ఫిల్మును ప్రభుత్వము సమపహరణము చేయవలెనని ఆదేశించవచ్చును .

(3) ఒక "వ" ధ్రువపత్రము లేక "ప్ర" ద్రువపత్రము లేక "నిలేవ " ధ్రువ పత్రము పొందిన ఫిల్మును తల్లి దండ్రు లతోగాని సంరక్షకులతోగాని వచ్చు. మూడు సంవత్సరములలోపు వయస్సుగల పిల్లలకు ప్రదర్శించుటను ఈ పరిచ్ఛేదపు భావపరిధిలో అపరాధముగా భావించరాదు

7ఏ(1) ఈ చట్టము క్రింద ఎట్టి ధువపత్రమును పొందని ఫిల్మును "ప్రదర్శించినయెడల లేక వయోజనులకు మాత్రమే పరిమితము చేసి సార్వజనిక ప్రదర్శన నార్దము తగినదని ధ్రువీకరించిన ఫిల్మును వయోజనుడు. కాని ఎవరేని వ్యక్తికి ప్రదర్శించినయెడల , లేక ఏదేని ఫిల్మును ఈ చట్టములొని ఏదేని ఇతర నిబంధనను లేక తనకు ఒసగిన అధికారములలో దేనిన్నె నను వినియోగించి కేంద్ర ప్రభుత్వము , టిబ్యునలు లేక బోర్దు చేసిన ఏదేని ఉత్వరువును ఉల్లంఘించి ప్రదర్శించినయెడల, ఏ పోలీసు అధికారియైనను , ఏ స్థలములో ఆ ఫిల్మును ప్రదర్శించినారని, ప్రదర్శించు చున్నారని లేక ప్రదర్శించగలరని విశ్వసించుటకు తనకు కారణము కలదో అట్టి ఏదేని స్థలములో ప్రవేశించి దానిని సోదా చేయవచ్చును. మరియు ఆ ఫిల్మును అభిగ్రహించ వచ్చును

(2) ఈ చట్టము క్రింద సోదాలన్నింటిని క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 - ఆ లోని సోదాలకు సంబందించిన నిబంధనల ప్రకారము జరుపవలెను .

7.బీ (1) కేంద్ర ప్రభుత్వము సాధారణ లేక ప్రత్యేక ఉత్తరువు ద్వారాను, ఈ చట్టము క్రింద బోర్దు వినియోగించదగు ఏదేని అధికారమునుగాని, ప్రాధికారమును గాని అధికారితను గాని ఈ భాగము క్రింద ఫిల్ముల ధ్రువీకరణ విషయములోను ఆ ఉత్తరువులో నిర్విష్టపరచిన షరతులు ఏవేనిఉన్నచో వాటికి లోబరచియు బోర్డు చైర్మను లేక దాని ఎవరేని ఇతర సభ్యుడు కూడ వినియోగించవచ్చునని ఆదేశించవచ్చును; ఆ ఉత్తరువులో నిర్దిష్టపరచిన ఛైర్మను లేక ఇతర సభ్యుడు చేసినది ఏదియై నను లేక తీసికొనిన ఏ చర్యయ్నె నను బోర్దు చేసినదిగా లేక తీసికొనిన చర్యగా భావించవలెను .

(2) కేంద్ర ప్రభుత్వము ఉత్తరువు ద్వారాను విహితపరచు నట్టి షరతులకును ఆ నిర్బంధనలకును లోబడియు తాత్కాలిక ధ్రువపత్రమును జారీచేయుటకు ప్రాంతీయ అధికారులకు ప్రాధికారము నొసగవచ్చును.

7సీ. ఈ చట్టము ద్వారా తనకు ఒసగిన అధికారములలో దేనిన్నెనను వినియోగించుట కొరకు కేంద్ర ప్రభుత్వము , ట్రిబ్యునలు నుగాని, బోర్దునుగాని ఏదేని ఫిల్మును తమ సమక్షమున లేక ఈ విషయమున తాము , నిర్దిష్టపరచిన ఎవరేని వ్యక్తి లేక ప్రాధికారి సమక్షమున ప్రదర్శించవలెనని కోరవచ్చును .

7డీ- ట్రిబ్యునలు, బోర్దు లేక ఏదేని సలహా ప్యానలు యొక్క ఏ కార్యమును గాని, చర్యనుగాని సందర్భానుసారముగ ఆ ట్రిబ్యునలు, బోర్దు లేక ప్యానలులో ఏదేని ఖాళీ ఉన్నదను లేక దాని ఏర్పాటులో ఏదేని లోపము. ఉన్నదను కారణ మాత్రముననే శాసనమాన్యత లేనిదిగా భావించరాదు.

7ఈ ట్రిబ్యునలు, బోర్దు మరియు ఏదేని సలహా ప్యానలు సభ్యులందరిని ఈ చట్టమునందలి ఏవేని నిబంధనలననుసరించి వ్యవహరించునపుడు లేక వ్యవహరించుటకు చున్నట్లు తాత్సర్యమగునపుడు భారత శిక్షాస్మృతియొక్క 21వ పరిచ్ఛేదపు భావపరిధిలోని పబ్లికు సేవకులై నట్లు భావించవలెను. 7ఎఫ్. ఈ చట్టము క్రింద సద్భావముతో చేసిన లేక చేయుటకు ఉద్దేశించిన దేనికైనను సంబంధించి సందర్భానుసారముగ, కేంద్ర ప్రభుత్వము, ట్రిబ్యునలు, బోర్దు లేక సలహా ప్యానలుపై గాని కేంద్ర ప్రభుత్వము, ట్రిబ్యునలు, బోర్దు లేక సలహా ప్యానలుయొక్క ఎవరేని అధికారిపై, లేక సభ్యునిపైగాని ఎట్టి దావా లేక శాసనబద్ద చర్య ఉండదు.

8. (1) కేంద్ర ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా ఈ భాగము నందలి నిబంధనలను అమలుపరచుటకు నియమములు చేయవచ్చును.

(2) ప్రత్యేకించియు, పైన తెల్పిన అధికారము యొక్క వ్యాపకతకు భంగము లేకుండను ఈ పరిచ్ఛేదము క్రింద చేయబడిన నియమములలో ఈ క్రింది వాటి కొరకు నియమములు చేయవచ్చును:–

(ఏ) బోర్డు సభ్యులకు చెల్లించదగు బత్తెములు మరియు ఫీజు;

(బీ) బోర్డు సభ్యుల సేవా నిబంధనలు, మరియు షరతులు;

(సీ) ధ్రువపత్రము కొరకు బోర్దుకు దరఖాస్తు చేసుకొను రీతి; బోర్దు ఫిల్మును పరీక్షించు రీతి; అందుకు విధించదగు ఫీజు;

(డీ) ఫిల్ములను పరీక్షించుటలో ప్రాంతీయ అధికారులు పాల్గొనుట; ఏ నిర్బంధనలకు లోబడి తాత్కాలిక ధ్రువపత్రములను జారీచేయుటకు పరిచ్ఛేదము 7బీ క్రింద ప్రాంతీయ అధికారులకు ప్రాధికారమొసగవచ్చునో ఆ నిర్భంధనలు, ఆ షరతులు; మరియు అట్టి ధ్రువపత్రములు శాసనమాన్యత కలిగియుండు కాలావధి;

(ఈ) బోర్దు ఏ ఫిల్ము విషయములోనైనను ఏదేని సలహా ప్యానలును సంప్రదించవలసిన రీతి;

(ఎఫ్) సలహా ప్యానలు సభ్యులకు చెల్లించదగు బత్తెములు లేక ఫీజు;

(జీ) ఫిల్ములకు గుర్తు వేయుట;

(హెచ్) ట్రిబ్యునరలు సభ్యులకు చెల్లించదగు బత్తెములు లేక ఫీజు;

(ఐ) ట్రిబ్యునలు కార్యదర్శి మరియు ఇతర సభ్యుల యొక్క అధికారములు కర్తవ్యములు;

(జే) ట్రిబ్యునలు ఛైర్మను మరియు సభ్యుల యొక్కయు కార్యదర్శి మరియు ఇతర ఉద్యోగుల యొక్కయు ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు;

(కే) అపీలుదారు, అపీలుకు సంబంధించి ట్రిబ్యునలుకు చెల్లించదగు ఫీజు;

(ఎల్) (సాధారణముగా ఫిల్ముల నిడివికి లేక ప్రత్యేకముగా ఏదేని కోవకు చెందిన ఫిల్ముల నిడివికి సంబంధించిన పరతులతో సహా) ఏ షరతులకులోబరచి ఏదేని ధ్రువపత్రము ఈయవచ్చునో ఆ షరతులు, లేక ఏ పరిస్థితులలొ ఏదేని ధ్రువపత్రము ఈయవచ్చునో ఆ పరిస్థితులు;

(ఎమ్) విహితపరచవలసిన లేక విహితపరచదగు ఏదేని ఇతర విషయము;

(3) ఈ భాగము క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రతినియమమును, దానిని చేసిన పిమ్మట వీలయినంత శీఘ్రముగ, పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున, మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతియొక సదనము సమక్షమున ఉంచవలెను. ఆ ముప్పది దినములు ఒకే అధివేశనములోగాని, ________________

| IG-805 రెండు లేక అంతకు మించి వరుసగావచ్చు అధివేశనములలోగాని చేరియుండవచ్చును; పైన చెప్పిన అధివేశనమునకు లేక వరుసగా వచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనము ముగియుటకు పూర్వమే ఆ నియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు , అంగీకరించినచో లేక ఆ నియమమును చేయరాదని ఉభయ సదనములు అంగీకరించినచో అటు పిమ్మట, ఆ నియమము అట్లు మార్పు చేసిన రూపములో మాత్రమే ప్రభావము కలిగియుండును లేక సందర్భానుసారముగ ప్రభావ రహితమై యుండును , అయినప్పటికినీ, ఏదేని అట్టి మార్పుగాని, రద్దుగాని అంతకు పూర్వము ఆ నియమము క్రింద చేసిన దేని శాసనమాన్యతక్కెనను భంగము కలిగించదు .

9. కేంద్ర ప్రభుత్వము వ్రాతమూలకమైన ఉత్తరువు ద్వారా, ఏదేని ఫిల్ము లేక ఏదేని కోవకు చెందిన ఫిల్ముల ప్రదర్శనను తాము విధించునట్టి షరతులు, మరియు నిర్బంధనలు ఏవేని ఉన్నచో వాటికి లోబరచి, ఈ భాగమునందలి ఏవేని నిబంధనల నుండి గాని ఈ భాగము క్రింద చేసిన ఏవేని నియమముల నుండిగాని మినహాయించవచ్చును .

భాగము 3.

చలనచిత్రముల ప్రదర్శనలను క్రమబద్దము చేయుట.

10. ఈ భాగములోని నిబంధనలు వేరు విధముగా ఉన్ననే తప్ప, ఏ వ్యక్తి యు చలనచిత్రములను ఈ భాగము క్రింద లైసెన్సు ఈయబడిన స్థలములొకాక మరెచ్చటను లేక అట్టి లెసెన్సు ద్వారా విధించిన ఏవేని షరతులను, నిర్భంధనలను పాటించకుండ ఇతర విధముగా, ప్రదర్శించరాదు.

11. జిల్లా మేజిస్ట్రేటు ఈ భాగము క్రింద లైసెన్సులనిచ్చుటకు అధికారము గలిగియున్న ప్రాధికారి (ఇందు ఇటు పిమ్మట లైసెన్సు ఇచ్చు ప్రాధికారి అని పేర్కొన బడిన) అయి ఉండును \:

అయితే, రాజ్యప్రభుత్వము , రాజపత్రములో అధిసూచన ద్వారా సంఘ రాజ్య క్షత్రమంతటికి గాని దానిలో ఏదేని భాగమునకుగాని తాము అధిసూచనలో నిర్దిష్టపరచు నట్టి ఇతర ప్రాధికారిని, ఈ భాగము నిమిత్తము లైసెన్సు ఇచ్చు ప్రాధికారిగా ఏర్పాటు చేయవచ్చును.

12. (1) లైసెన్సు ఇచ్చు ప్రాధికారి , -

(ఏ) ఈ భాగము క్రింద చేసిన నియమములను చాలవరకు పాటించినారనియు,

(బీ) ఏ స్థలమునకు సంబంధించి లైసెన్సు ఈయవలసియున్నదో ఆ స్థలములో జరుగు ప్రదర్శనలకు హాజరగు వ్యక్తుల భద్రతకొరకు *[8]పర్యాప్తమైన ముందు జాగ్రత్తలు తీసుకొనినారని,

తాను అభిప్రాయపడిననే తప్ప, ఈ భాగము క్రింద లైసెన్సు ఈ యరాదు.

(2) ఈ పరిచ్ఛేదములోని పై నిబంధనలకును రాజ్యప్రభుత్వ నియంత్రణకును లోబడి , లైసెన్సు ఇచ్చు ప్రాధికారి ఈ భాగము కింద లెసెన్సులను తాను సబబని తలచునట్టి వ్యక్తులకు , మరియు తాను నిర్దారణచేయు నట్టి నిబంధనలు , మరియు షరతులప్పెనను , అట్టి నిర్భంధనలకు లోబరచియు ఈయవచ్చును. ________________

208- 0 2 /6-806 (3) ఈ భాగము క్రింద ఏదేని లైసెన్సును నిరాకరించుచు లైసెన్సు ఇచ్చు ప్రాధికారి చేసిన నిర్నయము వలన వ్యధితుడైన ఏ వ్యక్తి యైనను , విహితపరచినట్టి కాలావధిలోపల రాజ్య ప్రభుత్వమునకుగాని, ఈ విషయమున రాజ్యప్రభుత్వము నిర్దిష్ట పరచునట్టి అధికారికిగాని అపీలు చేసుకొనవచ్చును . మరియు సందర్భానుసారముగా రాజ్యప్రభుత్వము లేక అధికారి ఆ కేసులో తాను సబబని తలచు నట్టి ఉత్తరువు చేయవచ్చును.

(4) కేంద్ర ప్రభుత్వము, వైజ్నానిక ఫిల్ములను, విద్యావిషయక ప్రయోజనములకై ఉద్దేశించిన ఫిల్ములను, వార్తలకు, వర్తమాన సంఘటనలకు సంబంధించిన ఫిల్ములను , డాక్యుమెంటరీ ఫిల్ములను లేక దేశీయ ఫిల్ములను ప్రదర్శించుటకు *[9]పర్యాప్తమైన అవకాశము ఉండునట్లు ఏదేని ఫిల్ము యొక్క లేక ఏదేని కోవకు చెందిన ఫిల్ముల యొక్క ప్రదర్శనను క్రమబద్దము చేయుటక్కె ఆయా సమయములందు , సాధారణముగా లైసెన్సుదార్లకుగాని ప్రత్యేకముగా ఎవరేని లైసెన్సుదారుకుగాని ఆదేశములను జారీచేయవచ్చును . ఏవేని అట్టి ఆదేశములను జారీచేసినయెడల, ఆ ఆదేశములను లైసెన్సు ఇచ్చుటకు లోబరచిన అదనపు షరతులుగను మరియు నిర్భంధ నలుగను భావించవలెను.

13. (1) సంఘ రాజ్యక్షేత్రమంతటికి లేక అందలి ఏదేని భాగమునకు సంబంధించి లెఫ్ట్ నెంట్- గవర్నరు. లేక సందర్భానుసారముగ చీఫ్ కమీషనరు , మరియు జిల్లా మేజిస్ట్రేటు అధికారితా పరిధిలోని జిల్లాకు సంబంధించి ఆ జిల్లా మేజిస్ట్రేటు, సార్వ జనికముగా ప్రదర్శింపబడుచున్న ఏదేని ఫిల్ము బహుశ: శాంతిభంగము కలిగించగలదని తాను అభిప్రాయపడినచో, ఉత్తరువు ద్వారా, ఆ ఫిల్ము ప్రదర్శనను నిలిపివేయవచ్చును; అట్టి నిలుపుదల కాలములో ఆ ఫిల్మును, సందర్భానుసారముగ ఆ రాజ్యము, భాగము లేక జిల్లా యందు ధ్రువీకరించని ఫిల్ముగా భావించవలెను.

(2) ఉపపరిచ్ఛేదము (1) క్రింద ఉత్తరువును సందర్భానుసారముగ చీఫ్ కమీషనరు లేక ఒక జిల్లా మేజిస్ట్రేటు జారీచేసినయెడల, దానికి గల కారణముల వివరణతో సహా ఆ ఉత్తరువు నకలును, ఆ ఉత్తరువుచేసిన వ్యక్తి, తక్షణమే కేంద్ర ప్రభుత్వమునకు పంపవలెను; కేంద్ర ప్రభుత్వము ఆ ఉత్తరువును ఖాయపరచవచ్చును లేదా రద్దు చేయవచ్చును .

(3) ఈ పరిచ్చేదము క్రింద చేసిన ఉత్తరువు, దాని తేదీ నుండి రెండు మాసముల కాలావధి వరకు అమలులో నుండును, కాని కేంద్ర ప్రభుత్వము, ఆ ఉత్తరువు అమలులోనుండుట కొనసాగవలెనని అభిప్రాయపడినచో, ఆ నిలుపుదల కాలావధిని తాము సబబని తలచు నట్టి అదనపు కాలావధి వరకు పొడిగించవలెనని ఆదేశించ వచ్చును.

14. ఏదేని చలనచిత్రపు సొంతదారుగాని, దాని బాధ్యతగల వ్యక్తి గాని దానిని, ఈ భాగము యొక్క లేక ఈ భాగము క్రింద చేసిన నియమముల యొక్క నిబంధనలను , లేక ఈ భాగము క్రింద ఏదేని లైసెన్సు ఏ షరతులకు మరియు నిబంధనలకు లోబరచి ఈ యబడినదో ఆ షరతులను, నిర్భంధనలను ఉల్లంఘించి ఉపయోగించుచో, లేక అట్లు ఉపయోగించనిచ్చుచో లేక ఏదేని స్థలము సొంతదారుగాని ఆక్రమణదారుగాని ఆ స్థలమును సదరు నిబంధనలను, షరతులను, నిర్భంధనలను ఉల్లంఘించి ఉపయోగించుటకు అనుమతించుచో అతడు వేయి రూపాయల దాక ఉండగల జుర్మానా తోను, మరియు ' కొనసాగుచుండు అపరాధమెన సందర్భములో, ఆ అపరాధము కొనసాగుచున్న కాలములో ప్రతి దినమునకు వంద రూపాయల దాక ఉండగల అదనపు జుర్మానాతోను శిక్షింపదగియుండును . ________________

13 /6-800 15. లైసెన్సు కలిగియున్న వ్యక్తి 7వ పరిచ్ఛేదము క్రిందగాని 14వ పరిచ్ఛేదము క్రిందగాని అపరాధమునకు దోషస్టాపితుడైనయెడల, లైసెన్సు ఇచ్చు ప్రాధికారి ఆ లైసెన్సును ప్రతి సంహరించవచ్చును .

16. (1) కేంద్ర, ప్రభుత్వము, రాజపత్రములో అధిసూచన ద్వారా-

(ఏ) ఈ భాగము క్రింద లెసెన్సును ఏ నిబంధనలకు, షరతులకు మరియు నిర్భంధనలకు. లోబరచి ఈయవచ్చునో అవి ఏవేని ఉన్నచో వాటిని విహితపరచుచు;

(బీ) ప్రజా భద్రత కొరకై చలనచిత్ర ప్రదర్శనలను క్రమబద్దము చేయుట కొరకు నిబంధనచేయుచు,

(సీ) 12వ పరిచ్ఛేదపు ఉపపరిచ్ఛేదము (3) క్రింద అపీలు ఎంత కాలము లోపల మరియు ఏ షరతులకు లోబడి చేయవచ్చునో విహితపరచుచు,

నియమములను చేయవచ్చును.

(2) ఈ భాగము క్రింద కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రతి నియమమును దానిని చేసిన పిమ్మట వీలయినంత శీఘ్రముగా, పార్లమెంటు అధివేశనములోనున్న సమయమున, మొత్తము ముప్పది దినముల కాలావధిపాటు దాని ప్రతియొక సదనము సమక్షమున ఉంచవలెను.. ఆ ముప్పది దినములు, ఒకే అధివేశనములోగాని, రెండు లేక అంతకు మించి వరుసగా వచ్చు అధివేశనములలోగాని చేరియుండవచ్చును . మరియు పైన చెప్పిన అధివేశనమునకు లేక వరుసగావచ్చు అధివేశనములకు వెనువెంటనే వచ్చు అధివేశనము ముగియుటకు పూర్వమే ఆ నియమములో ఏదేని మార్పు చేయుటకు ఉభయ సదనములు అంగీకరించినచో లేక ఆ నియమమును చేయరాదని ఉభయ సదనములు అంగీకరించినచో, అటు పిమ్మట ఆ నియమము అటు మార్పు చేసిన రూపములో మాత్రమే ప్రభావము కలిగియుండును, లేక సందర్భానుసారముగ, ప్రభావ రహితమై యుండును. అయినప్పటికిని, ఏదేని అట్టి మార్పు గాని, రద్దు గాని, అంతకు పూర్వము ఆ నియమము కింద చేసియుండిన దేని శాసనమాన్యతక్కె నను భంగము కలిగించదు.

17. కేంద్ర ప్రభుత్వము, వ్రాతమూలకమ్నెన ఉత్తరువు ద్వారా, ఏదేని చలన చిత్రము యొక్క ప్రదర్శనను లేక ఏదేని కోవకు చెందిన చలనచిత్రముల ప్రదర్శనలను తాము విధించు నట్టి షరతులకును నిర్బంధనలకును లోబరచి ఈ భాగమునందలి ఏవేని నిబంధనల నుండి గాని ఈ భాగము కింద చేసిన ఏవేని నియమముల నుండి గాని మినహాయించవచ్చును.

భాగము

రద్దు

18. సినిమాటో గ్రాఫు చట్టము, 1918 ఇందుమూలముగా రద్దు చేయన్నెనది:

అయితే భాగము 'ఏ' మరియు భాగము 'బీ రాజ్యముల విషయములో, సదరు చట్టము చలనచిత్ర ఫిల్ములను ప్రదర్శనార్దము మంజూరు చేయుటకు సంబం ధించియున్నంతమేరకు మాత్రమే ఈ రద్దు ప్రభావము కలిగియుండును .

  1. *ఫిల్ము ధ్రువీకరణ మండలి.
  2. ఫంక్షనరీ.
  3. "నిర్భంధనలేని".
  4. నిర్భంధనలేని వయోజన.
  5. *ప్రత్యేకం
  6. *చాలినంత
  7. *చాలినన్ని
  8. *చాలినన్ని
  9. *చాలినంత.