Jump to content

చర్చ:అమ్మనుడి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

నమస్కారములు... మాన్యులు, మా ఆత్మీయ మిత్రులు శ్రీ Rajasekhar1961 వారు ఈ పుట గురించి చెప్పారు. చాలా సంతోషం కలిగింది. అసలు వాడుకరి:అమ్మనుడి మాట వింటేనే కడుపు నిండిపోతోంది. చాలా చాలా మంచి ప్రయత్నం మన తెవికేలో చేస్తున్నారు. సమాజ మూలాల్లోకి ప్రభావం వెళ్ళి తెలుగుభాష పునరుజ్జీవనం జరుగుతుందని ఆశగా ఉంది. ఇప్పటిదాకా లిప్యంతీకరణ/ ప్రచురణజేసిన పుటలు చూసాను.. చాలా ఉపయోగకరమైన, లక్ష్యస్పూర్తితో నడుస్తోంది. ఇటువంటి పత్రిక నడపడమే గొప్ప ఘనకార్యం. దానిని ఇలా తెవికేలో అందించే సహృదయం, బాధ్యతగా అనుకూలింప జేసే ప్రచురింప జేసే -నిష్ట, సహృదయాలు ఉన్న బాధ్యులు చేపట్టారు కనుక, ఇది xyz and beyond తరాలకు అందుతూ భాషాభివృద్ది చేయడంలో మరింత ఉన్నతస్థాయికి చేరుతుందని భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వీలయిన వారందరనూ పాల్గొనమని మద్దతిమ్మని కోరుతున్నాను. ఇంత చక్కటి కార్యక్రమానికి కారణభూతులైన శ్రీ Rajasekhar1961, శ్రీ వాడుకరి:అమ్మనుడి, మిగతా బాధ్యులు, సభ్యులు అందరకూ మంచి ఆయురారోగ్యాలు, అవసరమైన శక్తిసామర్థ్యాలు మా నల్లనయ్య అనుగ్రహించు గాక.

గణనాధ్యాయి 16:41, 31 డిసెంబరు 2021 (UTC)

అమ్మనుడి గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి