చక్కని జాణ ఇన్నిట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పల్లవి
చక్కని జాణ ఇన్నిట జవరాలు
చెక్కెర బొమ్మవంటిది జవరాలు
చరణం1
కన్నులతప్పకచూచి కప్పురాన నిన్ను వేసి
సన్నసేసినదివొ జవరాలు వెన్నెల నవ్వులు నవ్వి వేడుక నీకు పుట్టించి
చన్నులనొరసి నిన్ను జవరాలు
చరణం2
తెరమరుగుననుడి తెనగారమాటలాడి
సరివెనగినీతొ జవరాలు
విరులు నీపై చల్లి వింతసేతలెల్లా చెసి
సరసములు నెరపి నీ జవరాలు
చరణం3
తమకము నీకు రేచి దయపుట్ట సెవ సెసి
సముకానాకొసరి నీ జవరాలు
అమర శ్రీవెంకటేశ అన్నిటా నీవు గూడగా
జమనిరతుల చొక్కి జవరాలు