Jump to content

చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/కాంచనగంగ

వికీసోర్స్ నుండి

ఒకరోజు గాలివాన తీవ్రంగా ఉన్నది. సుందోప సుందులు బయటికి వెళ్ళారు. నందుడు వంటింటో అన్నలకోసరం రొట్టెలు చేస్తున్నాడు. ఇంతలో బయటి తలుపుమీద పెద్ద చప్పుడైంది. తన అన్నలు కూడా తలుపు అంత గట్టిగా తట్టరు.

నందుడు భయపడుతూ వెళ్లి తలుపు తియ్యకుండానే, "ఎవరు?" అని అడిగాడు. 'తలుపుతియ్యి !" అని పెద్ద బొంగురు గొంతు మేఘంలాగా గర్జించింది.

నందుడు తలుపుతీశాడు. ఒక్కసారిగా ఇంటోకి తుపాను ప్రవేశించిన ట్టయింది. ఒక లావుపాటి పెద్ద మనిషి లోపలికి వచ్చాడు. ఆయన వొంటిమీద గుడ్డ ಬುಲ್ಲಿ లాగా ఇంటికప్పఎత్తు లేచింది. మనిషి నల్లగా మేఘం మాదిరిగా వున్నాడు. 'మంచివాసన కొడుతున్నదే ! రొట్టెలు కాలుస్తున్నావా? ఏదీ నాకొకటి పెట్టూ !" అంటూ ఆ పెద్దమనిషి లోపలికి వచ్చాడు. ఆయన అడుగుపెట్టిన చోటసల్లా నీళ్ళు మడుగులు కడుతున్నాయి. "అయ్యా, మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని లోపలికి రానిచ్చినందుకు నన్ను " మా అన్నలు చంపేస్తారు. వాళ్లు వచ్చేవే అయింది. మీరు దయచేసి వెళ్లిపాండి,” అని బతిపూలాడు నందుడు. ఆయన బిగ్గిరిగా నవ్వి, 'నేనురాకుండా మీ ఆన్నలకెట్గా జరుగుతుందీ" ఏదీ, ఒక రొట్టె తినిపోతాను,' అన్నాడు పెద్దమనిషి. "స్వామీ నేను మీకు రొట్టె పెడితే ఆది నేనే తిన్నానని మా అన్నలు నన్ను చంపేస్తారు. సరిగా ముగ్గురికీ మూడు రొట్టెలే చేస్తున్నాను,” అన్నాడు నందుడు. 'నేను మీకు ఎంత ఉపకారం చేస్తున్నాను? నాకు ఒక్క రొట్టె పెడితే అరిగి పోతారా? ఆకలయి వచ్చినవాణ్ణి వెళ్ల గొట్టటం ధర్మమా?' అన్నాడా పెద్దమనిషి.

ఆయన చెప్పినమాట అబద్ధంకాదు. ఎందుచేతనంటే ఆయన పరుణదేవుడు. ఆయన వర్షించబట్టే ఆ లోయలో పంటలు సమృద్ధిగా ఉన్నాయి. ఆయన దయవల్లనే అస్నదమ్ములంత భాగ్యవంతు లయినారు. అయితే ఈ సంగతి నందుడికి తెలియదు. వాడికా పెద్దమనిషిని చూస్తే జాలి వేసింది. వానకు తడిసి ఆకలిగొని ఉన్నవాడికి ఒక్క రొట్టె ఇస్తే ఇంతలో తరిగేదేమిటనుకున్నాడు. 'అయ్యా, నావం తు రొట్టె తిసుకోండి,’ అన్నాడు సందుడు. “మరి నీకో?’ అన్నాడు పరుణ దేవుడు. 'నాకు లేకపోతే పర్పాలేదులెండి. పస్తు పడుకోవటం నాకు ఆలవాటే !' నందుడు. పరుణదేవుడు సందు డిచ్చిన రొట్టె తింటూ, "చాలా బాగుంది ! వరుణయ్య వచ్చి రొట్టె తినిపోయినాడని మీ ఆన్నలతో చెప్పు. వారు నిన్నేమీ అసరులే,' - అని వచ్చినదారేపట్టి వెళ్లిపోయాడు.

తరువాత కొ ద్ది సే ప టి కి సుందోప సుందులు తిరిగివచ్చారు. భోజనం పెట్ట మని అడిగారు. పళ్ళెంలో రెండే రొట్టెలు కనిపించాయి. మూడోది ఏదని అడిగారు. "ఎవరో వరుణఎయ్యట వచ్చి తినిపోయినాడు. ఆమాట మీతో చెప్పమన్నాడు,” అన్నాడు నందుడు భయపడుతూ.

ఈ ఇంట్లో ఆడుగుపెట్టటానికి వరుణయ్యకేమధికారం ఉంది? అసలి లోయలో కాలు పెట్టటానికి ఈ బిచ్చగాళ్లకే పుట:Chandamama 1948 01.pdf/59

' వేడిగావుంది, నన్ను బయటవెయ్యి' అన్నదా ముఖం మళ్లీ నందుణ్ణి చూసి, నందుడు ముందూ వెనకా ఆలోచించ కుండా ఆ బొచ్చె పైకితీసి దానిలో ద్రావ కాన్ని కిందికి పంచేశాడు. బంగారానికి బదులు ఒక మరుగుజ్జు ముసలాడు బయటికి వచ్చి సందుడి మోకాలు ఎత్తుస నిలబడ్డాడు. ఆ ముసలాడిజుట్టూ, వొళ్ళూ, చొక్కా కూడా బంగారు రంగు లో నే వున్నాయి. "అయ్య బాబోయ్!' అన్నాడు నందుడు. “నన్నెరుగుదువా, నందుడూ ? నేనే కాంచనగంగకు రా జ ను,' అన్నాడు మరుగుజ్జు.

నందుడు తెల్లబోయి చూడసాగాడు.

“నీసంగతి అంతా చూస్తూనే వున్నాను. నుపుచాలా బుద్ధిమంతుడివి. అందుకని నీకోరహస్యం చెబుతావిను. ఆ కాంచన గంగమీదుగావున్న శిఖరం చూశావా! దాని మీదికి యొక్కి ఆ నదిలో ఎవరైతే మూడు బొట్లు పవిత్ర తీర్థం వేస్తారో వాడికి ఆనది బంగారం అవుతుంది. ఇతరులకది నీరు గానే వుంటుంది. మరోసంగతి - యొపడైనా ఆ నదిలో అ పవిత్ర మై న నీరు పోశాడా, వాడు కాస్తా నల్లరాయి యిపోతాడు. తెలి సిందా? జ్ఞాపకంపంచుకో!" అంటూ ఆ మరగుజ్జు, సందుడు జవాబుచెప్పేలోపుగా మంటల్లోకి దూకి మాయమైనాడు.