పెదచెరువు గట్టునా
భేరి వాగింది,
పెళ్లివారొచ్చారు
పెదవీధిలోకి!
పసుపు కుంకాలన్ని
పెళ్లాలబట్టి,
రండి పేరంటాళ్లు
రండెదురు కుందాం!
పానకపు కావిళ్లు
బుజాన్ని పెట్టి,
రావయ్య బ్రాహ్మడా,
రావయ్య త్వరగ!
పెళ్లమ్మ మా యింట్లొ!
పెళ్లి మాయింట్లొ!
పేరైన సీతమ్మ
పెళ్లి మాయింట్లొ!
పెళ్లిపెళ్లనగానె పెరిగెబుగ్గల్లు!
పెళ్లైన మర్నాడు తీసెబుగ్గల్లు!
సంపాదన
వింజమూరి వెంకటరత్నమ్మ
|
1
ఒకటి ఒకటి రెండు
అవ్వ బోడి గుండు
దూది నిమ్మ పండు
గాజు గోలి గుండు
ఒకటి ఒకటి రెండు.
2
రెండు రెండు నాల్గు
పంతులమ్మ నీల్గు
బిచ్చగాని మూల్గు
తేనె వంటి తెల్గు
రెండు రెండు నాల్గు.
3
మూడు మూడు ఆరు
కంది పప్పు చారు
పేరు లేని ఊరు
అత్త గారి పోరు
మూడు మూడు ఆరు.
|