Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/నారాకోడూరు

వికీసోర్స్ నుండి

98

నారాకోడూరు

కయిఫియ్యతు మౌజే నారాకోడూరు సంతు చేబ్రోలు, సర్కారు

మృతు౯ జాంన్నగరు, తాలూకే చింత్తపల్లి, రాజావాశిరెడ్డి వెంక్క

టాద్రి నాయుడు బహద్దరు మంన్నెసుల్తాను.

యీ గ్రామాన్కు పూర్వం నుంచి నారాకోడూరు అనే పేరు వుంన్నది. గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజు రాజ్యం చేశేటప్పుడు వీరి ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు సమస్తమయ్ని బ్రాంహ్మణులకు గ్రామకరణీకపు మిరాశీలు నిన౯యించ్చే యడల యీ నారాకోడూరుకు కోడూరువారనే ఆరువేల నియ్యోగులకు యేకభోగంగా మిరాశిస్నదు వాయించి యిప్పించ్చినారు గన్కు అప్పట్లోవారు మిరాశీ అనుభవిస్తూ వుండి యీగ్రామంలో గ్రామాన్కు పశ్చిమం శివస్తలం కట్టించి శ్రీ గణవిశ్వరస్వామి వారనే లింగమూత్తి౯ని ప్రతిష్ఠ చేసి మరింన్ని యీ గ్రామ మధ్యమంద్దు విష్ణు స్తలం కట్టించ్చి శ్రీ వేంక్కటేశ్వరస్వామివారిని ప్రతిష్టచేశి యీస్వామివారికి నిత్యనైవేద్య దీపారాధనులకు జరగగలంద్లుకు యిచ్చిన యినాములు వగయిరా.

కు ౧ ౹ ౦ శ్రీస్వామివాల౯కు యినాము
౦ ౺ ౦ గణపేశ్వరస్వామివారికి
౦ ౻ ౦ శ్రీవెంకటేశ్వరస్వామివారికి

వో ౬ నగర ... దీపావళి వుత్సవములకు మొదలయ్ని సంవత్సరోత్సవములకు సంవత్సరం ౧ కి

3 శ్రీ గణపేశ్వరస్వామివారికి
౩ శ్రీవెంకటేశ్వరస్వామివారికి

యీప్రకారం ప్రభువులమూలంగా వసతులు చేయించ్చినారు. వడ్డెరెడ్డి కనా౯టక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జరిగిన తరువాతను మొగలాయీ ప్రభుత్వం వచ్చెగన్కు బారాముత సద్దీ హోదాలు నిన౯యించి సర్కారు సంతు బంద్దీలు చేశేటప్పుడు యీగ్రామం చేబ్రోలు సముతులో దాఖలు చేశీ సంతు అమీలు చౌదరు దేశపాండ్యాల పరంగా బహుదినములు అమాని మామలియ్యతు జరిగించినారు. స్న ౧౧౧౨ ఫసలీ (1702 AD)లో కొండవీటి శీమ మూడు వంట్లుచేసి జమీదాల౯ కు పంచ్చిపెట్టే యడల యీగ్రామం వాశిరెడ్డి పద్మనాభునింగారి వంత్తువచ్చి చింత్తపల్లి తాలూకాలో దాఖలు అయినది గన్కు పద్మనాభునిగారు, చంద్రమౌళిగారు అధికారం చెశ్ని తర్వాతను పెదరామ లింగంన్న గారు ప్రభుత్వం చేశ్ని దినములలో మజ్కూరి కరణమయిన కొడూరి నరసరాజు పయిని వాశ్ని గణపేశ్వరస్వామివారి ఆలయంజీన౯ మయివుంటే పునహ కట్టించి ప్రతిష్టచేసినారు గన్కు పూర్వప్రకారంగా వసతి జరిగించ్చి పెదరామలింగంన్నగారు, జంగయ్యగారు రామంన్నగారు ప్రభుత్వం చేశ్నితర్వాతను రాజా వెంక్క టాద్రినాయుడు బహదురు మన్నె సుల్తానుగారు ప్రభుత్వానకువచ్చి అధికారంచేస్తూ పయినివాశ్ని స్వామివాల౯కు పూర్వమంద్దు నిన౯యించబడ్డ కు ౧౹౦ యినాము.

సంవత్సరోత్సవములకు జరిగించె పంస్నులు కు ౬ జరిగిస్తూ వుంన్నారు.

రిమాకు౯: గ్రామం గుడికట్టు కుచ్చళ్లు ౫౨ కి మ్నిహాలు

౧ ౹ ౦ గ్రామకంఠం
౦ 6 ౦ కోడూరివారిపాలెం
౦ 6 ౦ గోవిందువారిపాలెం
౦ 6 ఽ గొల్ల పాలెం
౦ ౻ ౦ వనం త్తొటలు ౨ కి
౦౹ ౦ వంక్క కాండయతావు
౦ ౺ ౦ వుప్పల పాపంన్నతావు
౧ డొంక్కలు ౪ కి
యీనాములు
౧ ౹ ౦ శ్రీ స్వామివాల్ల౯కు
౦ ౹ ఽ గ్రామ మతుకి (?)
౦ 6 ఽ వండ్ల వానికి (?)
౦ ౹ ౦ చరువు యినాము
౦ ౺ ౦ పర్వతాలు రామ ...
౦ ౹ ౦ చేబ్రోలు నాగేశ్వర ... యినాము
——————
౭ ౻ ఽ
గ్కా తతిమ్మా – ౪ ౪ ౻ ఽ
శెరి ౩ ౪ ౻ ఽ సావరము ౬
కయిఫియ్యతు మొతు౯జాకు

అంగీరసనామ సంవ్వత్సర మాగ౯శిర శుద్ధ 3 ఆదివారం స్న ౧౨౨౨ ఫసలీ (1812 A. D.) ది ౬ డిశంబ్బరు. ఆన. ౧౮౧౨ సంవత్సరం.