గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/చవడవరం
89
చవడవరం
కైఫియ్యతు మౌజే చవడవరం సంతు గుంట్టూరు సర్కారు
మృతు౯జాంన్నగరు తాలూకా చిల్క లూరుపాడు రాజా
మానూరి వెంక్కట కృష్ణారావు.
యీ గ్రామాన్కు పూర్వం నుంచ్చింన్ని చవడవరం అనే పేరు వుంన్నది. గజపతి శిహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు ప్రభుత్వం చేశేటప్పుడు వీరిదగ్గర మహా ప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహనం ౧౦౬౭ శక (1145 A.D.) మంద్దు బ్రాంహ్మణులకు గ్రామ మిరాశీలు వాయించి యిచ్చే యడల యీ గ్రామాన్కు వెలనాడు కాశ్యప గోత్రలయ్ని పిల్లలమర్రి వారికి యేకభోగంగ్గా గ్రామ కరిణీకపు మిరాశీ నిన౯యించ్చినారు గన్కు తదారఖ్యా యీవరకు అనుభవిస్తూ వుంన్నారు.
వడ్డె రెడ్డి కనా౯టక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 A.D.) వర్కు జరిగిన తర్వాతను మొగలాయీ ప్రభుత్వము పచ్చి కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేశేటప్పుడు యీగ్రామం గుంట్టూరు సముతులో దాఖలు అయింది. జమిందాలు౯ కొండ్డవీటి శీమ మూడు వంట్లు చేశి పంచ్చుకొనే యడల యీగ్రామం సర్కారు మజుంద్దారులయ్ని మానూరి వెంక్కన్న పంత్తులు గారి వంట్టులో వచ్చి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలు అయ్నిది గ——న్కు వెంక్కన్న పంత్తులుగారు, అప్పాజీ పంత్తులుగారు, వెంక్కటాయునిం గారు, వెంక్కట కృష్ణునింగారు నరసంన్న గారు ప్రభుత్వములు చేశ్ని తర్వాతను, నరసంన్నగారి తంమ్ములు గారి కొమారులయ్ని వెంక్కట కృష్ణునింగారు స్న ౧౨౨౨ ఫసలీ (1812 A.D.) వరకు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.
రిమాకు౯ గ్రామం గుడికట్టు కుచ్చళ్లు ౪౦౻౦కి మ్నిహాలు.
- ౦ ౹ ౦ గ్రామ కంఠం.
- ౦ ౺ ఽ దాశరిపాలెం.
- ౦ ౹ ఽ మాలపల్లె, మాదిగపల్లె.
- ౦ ౺ ౦ డొంక్కలు ౨కి
- ౦ ౺ ౦ కొండవాగులు ౨కి
- ౪ పనికిరాని పారడ పొలం
- ౩ చెర్వులు ౨కి
- ౦ ౺ ౦ కొన్ని కాపాటి చవుడవరాన్కి ఆనవాటు పొలం
- ౦ ౺ ౦ వనం తోట వ౧ కి.
- —————
- ౬యినాములు,
- ౧ ౺ ౦ దెంద్దుకూరి శింగంన్న గార్కి
- ౨ నాళ్ల చెర్వు అప్పయ్య గార్కి
- ౧ చేదాల కోనప్ప గార్కి
- ౦ ౺ ౦ దెంద్దుకూరి సదాశివశాస్తుల౯ గార్కి
- ౦ ౺ ౦ గుండు సూర్యనారాయణ శాస్తుల౯ గార్కి
- ౦ ౺ ౦ గ్రామ కరణాల్కు.
- ——————
- ౧ ౫ ౻ ౦ గ్కా తతింమ్మా ౨౫
కయిఫియ్యతు మొత౯జా
ది౬డిశంబరు, అన ౧౮౧౨ సంవ్వత్సరం ఆంగ్లిరసనామ సంవత్సర మాగ౯శిర శుద్ధ 3 ఆదివారం.