Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/చముళ్లమూడి

వికీసోర్స్ నుండి

86

చముళ్లమూడి

కైఫియ్యతు మౌజె చముళ్లమూడి, సంతు, గుంట్టూరు

సర్కారు మృతు౯జాంన్నగరు, తాలుకె సత్తెనపల్లి

యీలాకె రాజా మానూరి వెంక్కట రమణయ్యారావుగారు

యీ గ్రామాన్కు పూర్వంనుంచ్చింన్ని చవుళ్లమూడి అనే పేరు వుంన్నది. గజపతివారు రెడ్లు ప్రభుత్వములు జర్గిన తర్వాతను తిర్గి గజపతివారు ప్రభుత్వాన్కు వచ్చి లాంగూల గజపతిగారు మొదలుకొని ప్రతాపరుద్ర గజపతి పర్యంత్తరం ప్రభుత్వంచేశ్నె మీదట యీ గజపతిగారి కుమారుడయ్ని వీరభద్ర గజపతిగారు ప్రభుత్వంచేస్తూవుండ్డగా ఆనెగొంద్ది నరపతి శింహ్వసనస్తుడయ్ని కృష్ణదేవరాయలు యీతూపు౯ దేశముల్కు విచ్చేశి గిరిదుగ౯ స్తలదుగ౯ మలు అంన్ని సాధించ్ని శాలివాహనం ౧౪౭౦ (1515 A. D) అగునేటి యవసంవ్వత్సర మంద్దునను కొండవీటి దుగ్గ౯ంపుచ్చుకొని గజపత్ని పట్టుకుని అభయదానంచేశి విడిచ్నివారై యీదేశములు ఆక్రమించ్చుకుని ప్రభుత్వంచేస్తూ యీకొండ్డవీటిశీమలో బ్రాంహ్మణుల్కు ఆగ్రహరములు మొదలయ్ని ఖండ్రికలు ధారాగ్రహితంచేశ్ని వారైనారు గన్కు యీచముళ్ల మూడి అగ్రహరం చేశ్నివయ్నిం.

రాచకొండసూరుదీక్షితులుగారు బృంహ విద్వాంసులుంన్ను తపః సంపన్నులుంన్ను అయివుం ద్దురుగన్కు రాయులవారు వీర్ని చాలాసన్మానించి వీర్కి పుత్రపౌత్ర పారంపర్యా శాశ్వతంగా జీవనం జరుగగలందుల్కు అష్టభోగ సహితంగా ఆగ్రహరంచేశి చముళ్ళమూడి స్వస్తిశ్రీ శాలివాహన శకవష౯౦బ్బులు ౧౪౪౧ (1519 A.D) ప్రమాధి సంవ్వత్సరమంద్దు ధారాగ్రహితం చేసినారు గన్కు సూరుదీక్షితులుగారు కుటుంబ్బ యుక్తముగా అగ్నిహోత్రములతోటి చముళ్ళ మూడి ప్రవేశించ్చి గృహనిర్మాణములుచేసుకొని అగ్రహరం బస్తీచేశి నిరాతాంన్నదాన పరులై యాగాద్యనుషాది సత్కిృయలు జరుపుకొంట్టూ పయ్నివాన్ని శకం మొదలుకొని కృష్ణరాయలు అచ్యుతరాయలు, సదాశివరాయలు, రామరాయలు, శ్రీరంగరాయలుగారి ప్రభుత్వం శాలివాహనం ౧౫౦౦ శకం (1578 A.D) వర్కు అనుభవించ్చినారు——

తదనంత్తరం దేశంమ్లేచ్చక్రాంతమయ్ని తర్వాతను పాదుశాహిలు సర్కారు సముతు బంద్దీలు మొదలయి ఖాయిదాలు యేప౯రిచే యడల యీ గ్రామం గుంట్టూరు సమతులో దాఖలుచేస్నివారై పయ్ని వాన్ని సూరి దీక్షితులుగారి మనుమలయ్ని తిరుమలదీక్షితులుగార్కి యీచముళ్లమూడి అగ్రహారమువాసి యిచ్చిరిగన్కు యీసూరు దీక్షితులుగారు అనుభవించ్ని తర్వాతను వారి కొమారులయ్ని రామసోమయాజులుగారు అగ్రహారం అనుభవిస్తూ గ్రామాన్కు. వుత్తరం యీశాన్యభాగమంద్దు శివాలయం కట్టించ్చి ఆయనలోవయ్నిం కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొనివచ్చి వుంన్నారుగన్కు ఆలింగమూత్తి౯ని ప్రతిష్ఠ చేశి చంద్రశేఖర స్వామి వారనేనామం యేప౯రచి నిత్యనైవేద్యదీపారాధనల్కు జరుగగలంద్గుకు కుచ్చల భూమి మాన్యం యిప్పించినారు స్న ౧౨౨౨ ఫసలీ (1812 A. D)లో కొండ్డవీటి శీమ మూడువంట్లుచేశి జమీదాల౯కు పంచ్చి పెట్టే యెడల యీ గ్రామం సర్కారు మఙ్ముదారులయ్ని మానూరీ వెంక్కంన్న పంత్తులుగారి వంట్టులోచేరి చిల్కలూరిపాడు తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంక్కంన్న పంత్తులుగారు పయిని వాన్ని సూరుసోమయాజులు గారికి సాలు ౧ కి హు ౧౨ం వరహాల చొప్పున శ్రోత్రియం యేప౯రచి వెంక్కంన్న పంత్తులు అప్పాజీ పంత్తులు వెంకట్రాయునింగ్గారు వెంక్కట కృష్ణునింగ్గారు యిచ్చిరి గన్కు సదరహి సూరుసోమయాజులు వీరిపుత్రులై న తిరుమల సోమయాజులుంగారు అనుభవించ్చినారు ——

తదనంతరం తిరుమల సోమయాజులుంగారి పుత్రులైన చంద్రశేఖర సోమయాజులు సూర్యనారాయణ సోమయాజులు సూరిసోమయాజులు కృష్ణ సోమయాజులుగారు వీరికి వెంక్కట కృష్ణునింగారు మామూలు ప్రకారం జరిగించ్చిరి. తదనంత్తరం వీరి కుమారులయ్ని నర్సంన్న గారు ప్రభుత్వంచేస్తూ వుంటే పయ్ని వాన్ని ఆప్పాజీ పంతులుగారి కొమారులయ్ని వెంక్కటేశంగారు తాలూకా సఖంపంచ్చుకున్నారు గన్కు యీ గ్రామం వేంక్కటేశం రావుగారి వంత్తు వచ్చిన సత్తెనపల్లి తాలుకాలో దాఖలు ఆయినది గన్కు వేంక్కటేశంగారి ప్రభుత్వంలోను జరిగించ్చినవారైనారు గన్కు తదనంత్తరం వీరి కొమారులయ్ని వెంక్కటరమణయ్యగారు ప్రభుత్వాన్కు వచ్చి యీ అగ్రహారాన్కి సాలు ౧కి హో300 వరహల చొప్పున శ్రొత్రియం వుంచ్చి కొంన్ని సంవత్సరములు జరిగించ్చి తదనంత్తరం అగ్రహరీకులయ్ని కృష్ణసోమయాజులుగారికి పూర్వంనుంచ్చి జరుగుతూవుండే యీనాం కు ౮ కుచ్చళ్లు పొలముంన్నూ తతిమ్మా భటవృత్తి౯ మాన్యములు జారీగావుంచ్చి గ్రామం ఆగ్రహారీకుల పరంచేశిరి. స్న ౧౨౨౨ ఫసలీ (1812 A.D) వర్కు ప్రభుత్వం చేస్తూవుంన్నారు గన్కు కృష్ణసోమయాజులు సదరహి యినాము అనుభవిస్తూ గ్రామం మణాయింపు చేసుకొంట్టూవుంన్నారు.

రిమాకు౯ గ్రామగుడికట్టు కుచ్చళ్లు-౫౦౹౦ కిమ్నీ హాలు

౯ గ్రామకంఠం
౬౺౦ గ్రామాన్కి తూర్పున అగ్రహరీకులు వేయించ్చిన వనంత్తట చింత్తది -
౪౺౦ మరింన్ని గ్రామాన్కు దక్షిణం వేయించ్ని తోపు-
౨౦౦ గ్రామాన్కు తూపు౯ భాగం అగ్రహరీకులు తవ్వించిన చెర్వు ౧ కి
౦౻౦ కుంటలు ౩౪
౦౺౦ లక్ష్మీమానూరి సోమయాజులుగారికుంట్ట
౦౦ఽ చేబ్రోలు నారాయణకుంట ౧ కి
౦౺ఽ మింగాలు కుంట
౦౻౦ బుల్ల వాగులు
౧౹ డొంక్కలు ౪ కి
————————
౨౨౻౬
౭౬౬ యినాములు
౧ శ్రీస్వామి వారికి
౮ అగ్రహరీకుల యినాములు
౧ నోరి వెంకటేశ్వర సోమయాజులగారి యినాం
౧౻ఽ మంగ్లపాటి చంద్రశేఖరుడు
౦౺౦ కప్పగంతు రామయ్య
౦౻ఽ దెంద్దుకూరి పురుషోత్తముడు
౧౺౦ మల్లాది సోమయాజులుగారికి
౦౻౦ అంబ్బటిపూడి చంద్రశేఖరుడు
౦౺౦ కరనాల వెంకయ్యకు
౦౹౦ భూదెల్ల రామంన్న
౦౪ఽ భాగవతుల శివయ్యగారికి
౧ గ్రామచర్వు...... ....లకు
—————
౧౭౹ఽ
——————
౭౻ఽ ఇవిగాక తతిమ్మావి ౨ఽ౹--

ఆన ౧౮౧౨ (1812 A. D) సంవత్సర నవంబ్బరు ది ...తేదీ అంగీరస నామ సంవ్వత్సర కాతీ౯క శు ౧౧ ఆదివారము

మల్లయ్య.