Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/గుండ్డవరం

వికీసోర్స్ నుండి

73

గుండ్డవరం

కైఫియ్యతు గుండ్డవరం తాలూకే రాచూరు, యిలాకే మల

రాజు వెంకట గుండ్డారావు స్న ౧౨౨౭ ఫసలీ (1817 AD)

మజ్కూరి అగ్రహరీకులు వాయించినది.

పూర్వం నుంచ్చి యీ గ్రామానికి గుండ్డవరం అనే వాడిక వున్నది. నా మోహన శకం ౧౪౪౨ (1520 A. D.) అగునేటి విక్రమ సంవత్సర కాత్తీ= క శుద్ధ పుణ్యదివసమంద్దు తుంగభద్రానదీ తీర మంద్దున శ్రీ విరూపాక్ష స్వామి వారి సంన్నిధానమంద్దు ఆప స్తంభ సూత్రులున్ను, యజ్క్షశ్శాఖాధ్యాయనులుంన్నూ కౌండిన్యసగోత్రులుంను యజనాది షట్కమ౯ నిరతులైన వెంక్కటేశ్వరావధానుల గారికి శ్రీ మద్రాజాధిరాజ రాజ పరమేశ్వర శ్రీ వీర ప్రతాప కృష్ణ దేవమహారాయులుంగ్గారు కొండ్డవీటి రాజ్యములో గొడవతీ౯ గండ్డవరం యీ రెండ్డు గ్రామాదులు అష్ఠభోగ సహితంగ్గా దానధారపూర్వకముగా ఆగ్రహారములుగా యేవ ౯రచి తామశాసనములు లిఖింప్పచేశి ధారాగ్రహితముగా యిచ్చినారు గన్కు వేంకటేశ్వరావధానులు విజయనగరానుంచి వచ్చి కుటుంబ్బ యుక్తముగా ఆగ్ని హోత్రముతో గూడ గొడవత్తి౯ గుండ్డవరం అగ్రహారంలో ప్రవేశించ్చి యాగానుష్ఠాన సత్య్రియలు జర్పుకొంటూ నిరతాన్న దానపరులై సదరహి శకం లగాయతీ శాలివాహన ౧౫౦౦ శకం (1578 AD) వరకు కృష్ణరాయలు, అచ్యుతరాయలు, సదాశివరాయులు, రామరాయులు, శ్రీ రంగ్గరాయులు, వారి ప్రభుత్వము వరకు అనుభవించి నారు. తదనంత్తరం దేశం మ్లేచ్చా క్రాంత మాయగనుక పయిన వాశ్ని వెంక్కటేశ్వర అవధానుల కొమారుడయన అన్నప్ప అవధానులు ఆయనకోమారుడు వెంక్కటనారాయణ యీయన కొమారుడు వుపేంద్రుడు, వెంక్కటనారాయణ వీరుల పాదుషహా అయ్ని మల్కీ విభురాంసుల్తాను అబ్దుల్లాతానీషా ఆలంగ్గీరు మొదలైనవారు శాసన పత్రికలు విమశి౯౦చ్చి అవిచ్చిత జర్గించ్చినారు. సదరహి మొగలాయి ఆరంభములో యీ గ్రామాదులు రెండ్డుంనూ గుంట్టూరి సముతులో దాఖలు చేశినారు.

స్న ౧౧౨౨ ఫసలీ లో కొండ్డవీటి శీమ మూడు వంట్లుచేశి జమీందాల౯కు పంచ్చి పెట్టేయడల యీ గ్రామాదులు రేపల్లె తాలూకాలో దాఖలు ఆయి రమణయ్యా మాణిక్యా రాయునింగ్గారి వంతు వచ్చినది గన్కు రమణయ్యా మాణిక్యారాయినింగ్గారు ప్రభుత్వం చేస్తూ పయ్ని వాన్ని అగ్రహారీకులయిన క్రిష్టమ్మ పాపంభట్టు యీ అగ్రహారాలకు సాలు ౧ కి అయిదు వరహాలు శ్రొత్రియం చొప్పున నిన ౯యించినారు గన్కు రమణయ్యగారు, మల్లన్నగారు, శీతన్నగారు, గోపంన్నగారు, సదరహీ ఫసలీలగాయతు స్న ౧౨౧౬ ఫసలీ (1806 AD) వరకు అగ్రహారాలు జరిగించినారు. తదనంతరం పయ్ని వాన్ని శీతన్నగారి కొమారుడైన జంగ్లంన్నగారు ప్రభుత్వానకు వచ్చిరి గన్కు వారి దివాను అయ్ని కోటంరాజు వెంక్కన్న పంత్తులు అగ్రహారీకుల మీద గిట్టమి చాత అగ్రహారములు నడుపకుండ్డా చేశినారు గనుక సదరహీ అగ్రహారీకులు కరిణిక యాజమాన్యత్వంలో వుంట్టూ వుండ్డిరి సదరహి ఫసలీ లగాయతు స్న ౧౧౮౨ ఫసలీ (1772 AD) పర్కు జంగ్గంన్నగారు ప్రభుత్వం చేస్తూ వుండ్డగా యితని తంమ్ముడైన తిరుపతి రాయణింగారు కల్తపడి తాలూకా చరిసఖం పంచుకునే యడల గండ్డవరం అగ్రహారం రాచూరి తాలూకాలో దాఖలు అయి తిరుపతి రాయుణింగారి వంత్తుకు వచ్చినది. గొడవర్రు మాత్రం రేపల్లె తాలూకా క్రింద జంగ్గన్నా రాయుణింగారు ప్రభుత్వం చెశ్ని మీదట యీయన కొమారుడయ్ని భావన్నా మాణిక్యరాయినింగారు ప్రభుత్వానకు వచ్చి సదరహి గ్రామంలో ప్రభవ సంవ్వత్సరమంద్దు ఆలయం కట్టించి మల్లేశ్వరుడనే లింగమూత్తి౯ని ప్రతిష్ఠ చేశి చేబ్రోలు యోగానందం అనే పూజార్ని అచ౯కత్వానికి నిన్న౯యించ్చి యీద్ధేమునికి నిత్యనైవేద్యదీపారాధనలు జర్గుగలందులకు కుచ్చల పొలం యినాం యిప్పించినారు గనుక జర్గుతూ వున్నది. కాళయుక్తి నామసంవత్సరములో మజ్కూరికాపు అయ్ని మంకెన కొండ్డప్ప అనే అతను గ్రామమధ్యమంద్దు విష్ణు స్థలం కట్టించి శ్రీ వేణుగోపాలస్వామి వార్ని ప్రతిష చేసి పుసులూరి శేషయ్య అనే విఖనసుణ్ని అవ౯కత్వానకు నిన౯యించ్చి యీద్దేమునికి నిత్య నైవేద్య దీపారాధనలకు కుంచల పొలం యినాం యిచ్చినారు. తిరుపతి రాయినింగ్గారి ప్రభుత్వం వచ్చిన మీదట సదరహీ నిన౯య ప్రకారం దేవబ్రాహ్మణ వృత్తులు జరిగిస్తూ వచ్చినారు తదనంతరం యీయన కొమారుడయ్ని అప్పారాయనింగారు శీతంన్నారావు వీరు స్న ౧౨౦౮ ఫసలీ (1798 AD) వర్కు ప్రభుత్వం చేశి సంత్తతి లేకపోయినంద్ను స్న ౧౨౧౧ ఫసలీ (1801 AD) లో యీ రాచూరి తాలూకా హాసరేబిల్ కుంఫిణీవారు యాలం వేయించివారు గన్కు రాజా మల్రాజు వెంక్కట గుండ్డారాయుణింగారు కొనుక్కొని సదరహీ ఫసలీ లగాయతు స్న ౧౨౨౮ ఫసలీ (1818 AD) వరుకు ప్రభుత్వం చేస్తూ వుంన్నారు.