Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/గుంటూరు

వికీసోర్స్ నుండి

17

గుంటూరు

శ్రీ రామ

శు భ మ స్తు

ఆవిష్నుమ స్తు_శ్రీశారదాంబా నీవేకలవు దైవనిర్నయం

జంబ్బూద్వీప విస్తారము

పెదనాగదేవ భట్టు వాశిన ప్రకారము

యీజంబ్బూ వృక్షం మేరువుకు దక్షిణ దిగ్భాగమందున సుదశ౯నమంద్దునను ౨౫౦౦ యోజనంబ్బుల వున్నతంగలదు. దాని పండ్లు భూమిమీదను పడి రాలి సారయు శలయేరులు మేరువుకు వుత్తర దిగ్భాగం తిరిగివచ్చును. ఆనీరుపారునంత్త పర్యంత్తం కనకమయి వుండ్డును. యీవృక్షం వేనబరగినది జంబ్బూద్వీపం. యీజంబ్బూ ద్వీపము నవఖండ్డాలు, యీనవఖండ్డాల భూమధ్య ఆమేరువు పారుతు ౧౬౦౦ యోజనాలులోతు యీ మేరువుకు నాలుగు బాదులు బాదు౧కి ౧౬౦౦ వేలయేశి యోజనాలు యీమేరువును చుట్టు సముద్రం ఆంటివున్నది. యెన్మిది పర్వతాలు యివిగాకను అనేకములయ్ని పర్వతాలు వున్నవి. యీపర్వతాలలోను గాచు చుట్టూ లవణ సముద్రము యాకారం బండ్డికంమ్మివలె వుంన్నది. యీమేరువుకు పర్వతాలు వుత్తర దిగ్భాగమంద్దున ప్రథమ పర్వతం హేమకూటం తూర్పు పశ్చిమాలు అంట్టి వుంన్నది. నిడివి యోజనాలు ౮౦౬౦౦ మేరువు హేమకూటం సంద్దు ౮౦౬౫ యోజనాలు యీ హేమకూటానికి వుత్తరదిగ్భాగాన శ్వేత పర్వతము సముద్రాలు తూర్పు పశ్చిమాలు అంట్టి వున్నది. వీధి ౭౦౧౫౦ యోజనాలు. యీ శ్వేతపర్వతాలకు పుత్తర దిగ్భాగానను శృంగ్గపత పర్వతాలు సముద్రాలు అంటివుంన్నవి. నిడుపు ౬౪౩౦౦ యోజనాలు యీశృంగ్గపర్వతం వృత్తసముద్రం సంద్దు ౮౦౭౫ యోజనాలు సంధు. యీమేరువు దక్షిణ దిగ్భాగన ముందు ప్రధమ నీటి పర్వతం యీపర్వతానకు——— దక్షిణ దిగ్భాగానను శ్వేత పర్వతము యీపర్వతానకు ధక్షిణ దిగ్భాగానను హిమవత్పర్వతం యీపర్వతాలు మూడు సముద్రం అంటి వుండ్డును. మేరువు ఉత్తర దిగ్భాగానను పర్వతాలు వలెనె వెడల్పు నిడుపులు హిమవంతం శేతువు సందు రేఖలు సందులు నిడిపులు సమము యెక్కువ తక్కువలు లేవు. యీమేరువుకు పశ్చిమ దిగ్భాగమందునను మూల్యవంతం పూర్వ దిగ్భాగమునను గంధమాధన పర్వతాలు అందు వుండ్డే యిరుసులవలెను హేమకూట నీలపర్వతాలు అంట్టి వున్నవి. ౩౨౧౫౦ యోజనముల నిడుపులు వీటి తూర్పు పశ్చిమ సముద్రంబుల సందులు౮౦౭౫ యోజనాలు వెడల్పుయివె నవఖండాలు, యీఖండాల పేర్లు వుత్తర సముద్రం శృంగవంతం సందు బైరావృతవర్షం అందురు. మేరువు తూర్పుధక్షిణాల పశ్చమలు నాలుగు దిక్కులు పారు యిలావృతవర్షం అందురు. గంధమాధనం తూర్పు సముద్రం సందు భద్రాశ్వకవర్షం అందురు. మేరువు దక్షిణ దిగ్భాగం నీలపర్వతం నిషిత పర్వతం సందు రమణారమాణాకవర్షం అందురు. యీనిషిధ హేమవంతం సంద్దు పారు కింపురుష సర్పం హిమవంత హేతువు సంద్ధు వర్షం ఆంద్దురు. యిది నవఖండాలు యీభరతఖండమందు వుంన్న పుణ్యనదులు గంగ్గయు, తుంగభద్రయు, వేత్రావతియు, కష్ణావేణియు, బీమనీధియు, మలినాపహారియు, శారావతియు, చంద్రోభాగయు, చెంన్నయు, యమునయు, దమనయు, రేవయు, కావేరియు, గోదావరియు, నర్మదయు, బాహుదయు, గండకియు, సరయు, ప్రసూతయు, సరస్వతియు, శతద్రుతియు, వితన్తయు, విపాశయు, తామ్రపర్ణియు, నేకామరయు, మొదలుగా గల పుణ్యనదులు అనేకంబులు గలవు కుల పర్వతంబ్బులు యేడు గలవు. వాటినామములు మలయ పర్వతం, శక్తివంతం వింధ్యపర్వతం, పూరియాత్ర పర్వతం, మహేంద్ర పర్వతం, మహేంద్ర పర్వతం, సిహ్వగిరి పర్వతం, ఇవియేడు సప్తకుల పర్వతములు పర్వత్తం మరియు అనేక పర్వత్తంబ్బులు గలవు. యీ భరత ఖండమందునను భట్టుద్ని దేశంబులు గలవు. వాటినామాంక్కతంబులు పాంచ్చాలి, బబ్బర, మత్య, మగధ, మంగళ, కుళింగ, కుకుమ, కొంక్కణ, త్రికర్త, సాముద్ర, సాల్వ, సూరసేన, సుధేష్ణ, సుంహ్వక, కురూకూరుశ, గౌళ, కౌసల, యవన, సుగంధర, పాండ్రు, శింధు, భేళి, పుళింద్ర, పుండ్రక, పాంఢ్య, ఆభుర, సౌవిద, సౌరాష్ట్ర, మహరాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రౌవిశ, దశార్ణవ, కర్ణాట, అంగ, వంగ, మరాట, పరాట, వాట, భోట బ్రాంప్టోహిక బమాధాన, కిరాత, కేకయ, ఆశ్మంతక, గాంధారా, కాంభోజ, కేరళ, కాశ్మీర, భార్జిర, కుంతల, అవంతి, యివి చప్పంన్న దేశంబులు గలవు. యీజంబూ ద్వీపం ఆరుగురు చక్రవర్తులు. పదహారుగురు రాజులు యేలిరి. యీజంబూద్వీపమకంటేను రెట్టియై వకటి కూకటి ధనధాన్య సంపదలు గలిగి వుండును. సప్తద్వీపంబులు లవణా ఇక్షు సురాసర్పిద ధీక్షిర శుద్ధోదకంబులనెడి సప్త సముద్రంబులు, ద్వీపాలు జంబూద్వీప, ప్లక్షద్వీప, శాల్మలద్వీప, కుశద్వీప, కుశల ద్వీప, క్రౌంచద్వీప, శాఖద్వీప, పుష్కరద్వీపంబులు పయిన ఆరు ద్వీపాలు రెట్టియై ఒక టొక్కటిక్కంటె సస్యసంపదలు కలిగి వుండును. యీజంబూ ద్వీపముకు చుట్టు వలయంబందివలె వుండును. యీరీతిన భూనిన౯యం జంబ్బూ ద్వీపంబు మహమ్మేరుపు భూమధ్యమందున కేతుమాలతషణా నిడుపు ౧౬౧౫౦ యోజనంబుల వెడల్పు ౩౨౧౫౦ యోజనంబులు శ్వేతువు... శృంగవరం శ్వేత పర్వతం-హేమకూటం నిషిద పర్వతం హిమవంతం భద్రాశ్వక వర్షం; నిడుపు ౧౬౫యోజనంబులు వెడల్పు ౩౨౧౫౦ యోజనంబు లున్ను యిలావృతవర్షం నిడుపు ౩౨౩౦౦ వెడల్పు ౩౨౧౫౦ మేరువు హేమ ౧౬౦౦ జయన నాగ భొట్టువాశ్ని శీమామూలదండ కవిలె ప్రకారం కలియుగప్రవేశం ప్రభవ సంవత్సర చైత్ర శు ౧ నాడు ౧౩ ఘడియలు మీదటను యీభూమి యేలికెరాజులు దర్శప్రతి పాలనంయేలినరాజులు ముక్కంటి గనకను పరీక్షిత్తు మహారాజు ౬౦ జనమేజనయుడు ౫౦ శంఖశతానీకులు ౧౦ వీరుపాండు సంతితి నూరు సంవ్వత్సరంబులు యేలిరి. అటుతర్వాతను అంబరీష మహారాజు ౨౫౦ సంవత్సరములు యేలెను. భల్లాణరాజు ౧౮౪ శూద్రక మహారాజు ౧౮౨ విష్ణువర్ధనుడు ౧౮౩ చంద్రగు ప్తవ హారాజు ౧౮౧ తెనుగు గిజ్జడు ౧౦౦ యుధిష్ఠిర శకవత్సరంబులు ౧౮౧౮౦ సంవ్వత్సరములు నడిచినవి. అటుతర్వాతను విక్రమార్క శక వర్షంబులు ౨౦౦౦ ఆటుతర్వాతను శాలివాహన శకవర్షంబులు అయిన యీ శాలివాహనుడు పంచ్చమీ శాబ్దంబులు యేలెను. ౨౫ భోజరాజు ౧౦౮ అగునేటి వెన్క - వగిధనవర్మ అబ్జంబులు ౧౨౫ కోటి కేతు మహారాజు ౧౨౦ నీలకంఠమహారాజు ౧౩౦ భోజరాజు ౧౨౦ యవన భోజుడు ప్రతాపరుద్రుడు యీ ముక్కంటి నుంచి ధర్మపరిపాలను లేవాయెను. యుగ ధర్మం సడలెను. యిటుతర్వాతను ద్వాదశాబ్దంబులు క్షామం తగిలెను. యిటుతర్వాతను జనపతి విశ్వంభరుడు ద్వాదశవత్సరంబులు ప్రతిపాలన చేశి యేలెను.

పాండురాజు పరలోకగతుడయ్యే వర్కు ధర్మరాజుకు అయిన సంవత్సరంబులు ౧౭ అటుతర్వాతను శతశృంగపర్వతాననుంచి హస్తినాపురం వచ్చి కృపాచార్యులు, శిక్ష విద్యలు నాలుగు సంవత్సరంబులు (౪) అటుతర్వాతను కుంభసంభవుని దగ్గిర ధనుర్విద్యలు అయిదు సంవత్సరంబులు (౫) ఆటుతర్వాతను ధృతరాష్ట్రుని దగ్గిరను, యువరాజ్యంచేశి పదమూడు సంవత్సరంబులు వుండెను. అటుతర్వాతను కారణావతారంబున వకసంవత్సరం లక్కగృహం యంద్దు వుండెను. అటుతర్వాతను అయిదుసంవత్సరంబులు విప్రవేషానను యేకచక్రపురంబున వుండెను. అటుతర్వాతను వివాహంఅయి ద్రుపదరాజు యింటను వకసంవత్సరం వుండెను. ఆటుతర్వాతను తిరిగి అస్తినాపురంబున అయిదు సంవత్సరంబులు యువరాజ్యం చేశెను. అటు తర్వాతను యింద్రప్రస్థపురంబున యిరువై నాలుగు సంవత్సరములు తండ్రి భాగం రాజ్యంచేశి రాజసూయ యాగంచేశెను. అటుతర్వాతను వక సంవత్సరమునకు జూదంవాడెను. అటుతర్వాతను పంన్నెండు సంవత్సరములు ద్వయితమందు వుండెను. వనవాసము అటుతర్వాతను వక సంవత్సరం విరాటరాజు యింటను కంక్కుభట్టు నామం చాతను అజ్ఞాతవాసం చేతను వుండెను. ఆటుతర్వాతను ఖరనామసంవత్సర కార్తీకమాసమున కృష్ణ పక్షమున అమావాస్యను భారతయుద్ధం ఆయెను. భీష్ముడు పదిదినములు ద్రోణుడు ఆరుదినములు కర్ణుడు రెండు దినముల్కు శల్యుడు దుర్యోధనాధులు వకపగలు రాత్రి యుద్ధంచేశి మడిశి తదనంతరమందునను ౩౫ ముఫై అయిదు సంవత్సరములు యేకరాజ్యాభిషిక్తుడై రాజ్యంబు చేసెను. యితడు జననమయి ౧౨౫ యేండ్లు బ్రతికి ప్రభవ సంవత్సర చైత్ర శు ౧ నాడు ౧౩ ఘడియలమీదను పుణ్యం పాపలు పాపం మూడుపాళ్లు అయి కలియుగం నాలుగు లక్షలుంన్నూ ముప్పయి రెండ్డువేల యేండ్లున్నూ నడువవలెను గనుకను కలియుగ ప్రవేశం ఆయను అని పరిక్షిత్తును పట్టంగట్టి రాజ్యాభిషిక్తుంన్ని చేశి కృపాచార్యులను ప్రధానత్వం వుంచి యీధర్మరాజు స్వరాగమునుకై తంమ్ములు నలుగురు ద్రౌపదీ సమేతుండైత......అటుతర్వాతను పరీక్షిత్తు ౯౦ సంవత్సరములు కలి పురుషుంణ్ని కొట్టి ద్వాపరధర్మం నడిపి శృంగ్గి శాపంచేతను తక్షక దంష్ట్రమయి (Folio 4B) పరలోకగతుండాయెను. అటుతర్వాతను యీపరీక్షిత్తుకుమారుడు జనమేజయుడు 30 సంవ్వత్సరంబ్బులు చేశి ధర్మపాలనచేశి సర్పయాగం చ్చేశి పరలోకగతుడాయెను. యీ జనమేజయుని కుమాండ్లు శంఖ్క శతానీకులు అనేటివారు పదిసంవత్సరంబ్బులు యేలి ధర్మ ప్రతిపాలనలుచేశి పరలోకగతులయిరి. యీనలుగురు కలిగొట్టివేశి ద్వాపరధర్మం నడిపించ్చిరి. ౧౦౦ నూరు సంవత్సరంబ్బులు పాండుసం త్తతి నడిపించిరి. యిటు యిపుతల ధర్మప్రతిహలనం నడిపించ్చిరి ————దీర్ఘాయువులయి యేలిన రాజులు అంబ్బరీష మహారాజులు ౨౫౦ సంవత్సరంబ్బులు యేలెను. అటుతర్వాతను భల్లాణ మహారాజు ౧౮౪ సంవ్వత్సరములు యేలెను. ఆటుతర్వాతను శూద్రకమహారాజు ౧౮౨ సంవ్వత్సరంబులు యేలెను. అటుతర్వాతను విష్ణువద౯నుడు ౧౮౩ సంవత్సరంబులు యేలెను. అటుతర్వాతను చంద్రగుప్తమహారాజు ౧౮౧ సంవ్వత్సరంబులు యేలెను. తెనుగుబిజ్ఞడు ౧౦౦ నూరు సంవ్వత్సరంములు యేలెను. వీరు పద్దుకు ౧౧౮౦ సంవత్సరంబులు యుధిష్ఠిరశకవర్షంబులు నడిచెను. ద్వాపరమందును 3౫ సంవత్సరంబులు నడిచెను. యీ రెండ్డు యుగములను యుధిష్ఠిర శకవర్షంబులు ౧౨౧౫ నడిచెను. అటుతర్వాతను యుధిష్ఠిరశకవర్షంబ్బులు విక్రమార్కుడు పుట్టినాడు.—— య్యకను విక్రమార్క శకవర్షంబులు నడిపించుకొనెను. ౨౦౦౦ సంవ్వత్సరములు నడిచెను. యీవరుకు విక్రమార్క యుధిష్ఠిర శక వర్షాలు ౩౧౮౦ నడిచెను. యిటు తర్వాతను శాలివాహనుడు పుట్టి విక్రమార్కుంణ్ని గొట్టివేశి శాలివాహన శకవర్షంబ్బులు నడిపించ్చుకొని పంచవింశతివర్షంబ్బులు యేలి పరలోకగతుడాయెను. యీశాలివాహనశక పరుషంబ్బులు ధర్మప్రతిపాలనచేశి చినుకుతులా మెత్తగాను యింద్రకీలాద్రి కనకవర్షం కురిపించెను. అది మాధవవర్మ నిక్షేప ఆయెను. అటుతర్వాత కొట్టకేతు మహారాజు ౧౨౦ సంవత్సరంబ్బులు అటుతర్వాతను నీలకంఠమహారాజు ౧౩౦ సంవత్సరంబులు అటుతర్వాతను భోజమహారాజు ౧౨౪ సంవత్సరంబ్బులు అటుతర్వాతను యవనభోజుడు ౧౨౦ సంవ్వత్సరంబ్బులు యీ ఆరుగురు రాజులు ౭౨౭ సంవ్వత్సరంబులు ధర్మం నడిచి ఆటుతర్వాత ముక్కంటి అంద్దుదురు. యితనిని ఓరుగంటి ప్రతాప రుద్రుడందురు. యీముక్కంటి ౮౮ సంవ్వత్సరంబులు యేలెను. జయన సంహ్వారంబు చేశాను. దనకును ధర్మ పరిపాలనలు తప్పెను. కలిమి యిచ్చెను. అల్ప ఆయువులు వేదశాస్త్రాలు పాటించక నుండెను....(మును)లు శపించ్చిరి గన్కను వాక్యందులు తప్పెను. కలహించెను. అశ్వపతి, గజపతి, నరపతి రాజులు ముగ్గురురాజులు వేయివేలు సంవత్సరంబులు యేలగలవారలు. స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవర్షంబ్బులు ౮౩౬ అగు నేటి దుంద్దుతి సంవ్వత్సర మంద్దు యీ ప్రతాపరుద్రుడు పరరాజుచేతను పట్టుబడును. కలియుగ సంవ్వత్సరంబ్బులు నాలుగువేల పదహారు ముక్కంటి యేలి పొయ్యేవర్కు శాలివాహనశక వర్షంబ్బులు ౮౪౦ (9.8 AD) గ్కా చాకి ౧౬౦౮ అగు నేటి క్షయవరుకు ౯౯౭ కి యీవెన్కును యేలిన రాజులు రాజులేని రాష్ట్రం ౧౨ సంవ్వత్సరంబులున్ను ద్వాదశవర్ష క్షామము వెన్కు అశ్వపతులు గజపతులు నరపతులు యేలుబడి మధ్యదేశం తూర్పు గజపతిరాజ్యాలు ౧౮ దక్షిణ పశ్చిమ పుత్తరరాజ్యాలు నరపతులు ౧౮ అశ్వపతులు వుత్తర రాజ్యాలు ౧౮ కూడా రాజ్యాలు ౫౬ కిమధ్యదేశం ౩౯౯కి గజపతి వారు వీరిని మిర్యాలవారు అంద్దురు. వీరుంవుండే రాజులు జగదేవు జగపతి ౪౦ నారాయణ దేవు ౩౦ విశ్వంభరదేపు ౧౨ యితని కొమారుడు గణపతిదేవు ౫౮ యితని యేలుబడిని నియ్యోగులకు మిరాశీలు యిచ్చిరి. వీండ్లవారు అనుము కొండ్డ నుంచ్చి వచ్చిరి. పంట రెడ్లు వీరిని దొంతావారు అంద్దురు. యీగణపతివారి దేశం ఆక్రమించ్చిరి. యీదొంతా అల్లిరెడ్డి కుమారుడు పోలయ్య వేమన్న ౩౨ యిద్దరు. అంన్నవేమంన్న ౩౦ అంన్నవేమంన్న ౧౨ గొమరగిరి రెడ్డి ౧౪ కోమటి వేమంన్న గృహరాజు మేడ గట్టి౦చ్చి ౧౮ రాజు వేమన ౪—— యీరాజు వేమన్న పురిటిపంన్ను పోయిలపంన్ను శిశాలపంన్నులు కల్పించ్చి దుర్మార్గనడతలు నడచినంద్ను పొడచి చంపిరి. యితనిచావుతో నూరు సంవత్సరములు యేలిరి. యితనితో ఆర్గురు యేలిరి కుదురు నష్టించ్చెను. యిటుతర్వాత కృష్ణదేవరాయలు యేలుచూవుండ్డి రెడ్లు వారు గజపతివారి దేశం ఆక్రమించ్చి యేలిన దేశాలు తాను ఆక్రమించ్చి కనా౯టకం కిందకల్పుకొని కొండ్డవీడు కొండ్డపల్లెలు సాధించియేలెను. తిర్గి గజపతివారు మచిద గజపతి అని అతడు తిర్గి ఆక్రమించ్చి ౫౨ సంవ్వత్సరాలు యేలుచూ వుండగాను యీకృష్ణదేవరాయలుగారి గృహనామం సంపుటవారు అంద్దురు. శుంగొలవారు అందురు. యితడు దళంచేస్కుని కొండ్డవీడు కొండపల్లిలు సాధించ్చి గజపతివారి దేశం కొల్లబుచ్చి గజపతివారి మీదనూ ముట్టడి వేశినంత్తలో గజపతితన కూతురిని తమబిరుదులను యిచ్చిరి గన్కును శింహ్వాద్రి పొట్లూరి దగ్గరను శిలాస్తంభాలు నిల్ని గజపతి బిడ్డ పెండ్లాడి తులాభారంత్తూగి శీమలు కర్ణాటకం కింద్దకల్పి వినికొండ్డ బెల్లంకొండ్డలు పరగణాలుచేశి కొండ్డవీడు హవేలీ ౬ం౦ గ్రామదులు వుంచ్చి ౫౮ సంవ్వత్సరాలు యేలిచనెను.

ఆటుతర్వాతను రామదేవరాయలు ౧౫ సంవత్సరములు యేలెను. అల్లుడు రామరాజు ౧౨ సంవత్సరాలు లాంగ్గూలగజపతి ౩౮ సంవ్వత్సరములు నరశింగ్గరాయలుని జటామారి మాగరాజు ౩౫ సదాశివరాయలు ౪౦ అటుతర్వాతను అశ్వపతులు యేలిరి.

ఆదిని మీజా౯ ౪ం సులతాను ౪౮ బాట్లమల్కా ౫ ముక్కంట్టి ముల్కా౪౦ విభురాం ౪౫ ఖుతుపుశా ౫౮ సులతానబ్దుల్లా ౫౫ తానేశా ౧౨ సంవత్సరములు వీరు యీ రాజ్యములు యేలినారు. భావనగరం యీరాజ్యాలు యేలెను. అపురంగ్గు యేలెను. యేడు సంవత్సరాలు విజాపురి సాధించ్చి అల్లియేడుఖాను యాడాది గోలకొండ్డ సాధించ్చి తానీశాను పట్టుకపొయెను. రాయలవారికి గజపతివారికి దశపరం లేదాయను. రాజ్యాలు అవురంగ్గువారికే భవు పన్ను పాచావు అనిరి. యీవెన్కరాజులను దస్తరం శిద్దంన్న అక్కంన్న మాదంన్నగారి మేనల్లుడు వ్రాయించ్చిన ప్రకారము-పూర్వవృత్తాంతము.

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబ్బులు ౧౨౫౦ (1328 AD) అగునేటి నలనామసంవ్వత్సరముకు జయిన నాగదేవభట్టువాశ్ని దండ్డకవిలె ప్రకారము-యీ ప్రకారం రుద్రుడు యేలుబడి వృత్తాంత్తము యీ పతాపరుద్రుడు త్రినేత్రుడు గన్కు ముక్కంట్టి అనిరి. రుద్రహంశ గన్కును కనుప్రతాపరుద్రుడనినారు గనుకను ప్రతాపరు-డనిరి. యీప్రతాప రుద్రుడు ధరణికోట బెట్టించి యీధరణికోట కాడ కాపురంవుండ్డి యీ కొండ్డవీటి శీమలు ౧౪ యీకొండ్డవీటి కింద్దను చెల్లెశీమలు అద్దంకిశీమ గ్రామాలు ౫౫ అమ్మునమోలు ౫౫ కంద్దుకూరు శీమగ్రామాలు ౬౫ నెల్లూరు శీమ గ్రామాదులు ౫ం వుదయగిరిశీమ ౮౦ చుండ్డిశీమ ౪౪ పొదిలె శీమ ౬౬ కూరెడ్లశీమ కొటిశీమ ౬౦ దూపాటిశీమ 3౬ం నాగాజు౯నకొండ్డ శీమ ౧౫౦కి మాచెల౯సంత్తు ౬ళ క్కారెంపూడి సంత్తు ౧౪ గురజాలసంత్తు ౧౬ తమ్మురుగోగెళ్ల శీమ ౪౪ పూర్వవృత్తాం త్తం.

స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబ్బులు (1328 AD) అగునేటి నలనామ సంవ్వత్సరానకు జయిన నాగదేవభట్టు వాశిన దండ్డకవిలె ప్రకారం కలియుగ ప్రమాణములు ౪౩౨౦౦౦ ప్రతాపరుద్రుడు యేలే వరకు యీభూమి యేలినరాజులు ఆది పరీక్షిత్తు షష్టి వర్షంబులు యేలెను. అటువెన్కను జనమేజయుడు త్రిదశాబ్దంలు యేలెను. ఆవెన్క శంఖశతా నీకులు దశవర్షంబులు యేలిరి. ఆవెన్క భల్లాణరాజు నూటయెను బదినాలుగు సంవ్వత్సరాలు యేలెను. ఆవెన్కను శూద్రక మహారాజు నూటయెనుబది రెండ్డు సంవ్వత్సరంబ్బులు యేలెను.

అటువెన్కును విష్ణు వధ౯నుండు యేలెను. నూటయెను బదిమూడు సంవ్వత్సరంబ్బులు-ఆటు వెన్కును చంద్రగుప్త మహారాజు సూటఅరువై యెనిమిది వర్షంబులు యేలెను. అటువెన్కు ను విక్రమార్కుండును రెండు వేల యెండ్లు యేలెను. అటువెన్క శాలివాహనుండు పంచ వింశతి వర్షంబ్బులు యేలెను. అటువెన్కును భోజరాజు నూటయెనిమిది సంవ్వత్సరంబులు యేలెను. అటువెన్కును మాధవవర్మ నూటయిరువది యేను సంవ్వత్సరంబ్బులు యేలి చినుకు తమెత్తు కనక వర్షం కురియించ్చెను. బెజవాడకు అటువెన్క కోటకేతమహారాజు నూటయిరువై వర్షంబులు యేలెను. అటువెనుకను నీలకంఠమహారాజు నూటముప్పై ఆయనంబ్బులు యేలెను.

22

గ్రామ కైఫియత్తులు

అటువెన్కను చోళమహారాజు నూటయిరువై నాలుగు సంవ్వత్సరంబ్బులు యేలెను. ఆటువెన్కను యవనభోజుండు నూటయిరువై సంవత్సరంబ్బులు యేలెను. యీప్రతాపరుద్రుడు యెనభై యెనిమిది యేండ్లు యేలెను. యీప్రతాపరుద్రుడు కలియుగం ౩౬౦౦ సంవ్వత్సరంబులు యేలెను. మీదట దుంద్దుభినామ సంవ్వత్సరమందునను పట్టుబడెను. పరరాజు చాతను యీ ప్రతాపరుద్రుడి యేలుబడి వృత్తాంతము. యీప్రతాపరుద్రుడు త్రినేత్రుడుగన్కు ముక్కంట్టి అనిరి. రుద్రాంశముగన్కు ప్రతాపరుద్రుడు అని నామముగనుక ప్రతాపరుద్రుడనిరి. మూడు కన్నులు గన్కును ముక్కంట్టి అనిరి. యీప్రతాపరుద్రుడు ధరణికోట బెట్టించి యీధరణికోట లోను కాపురం వుండ్డి యీనాటి కొండ్డవీటి శీమలు ౧౪ యీ కొండ్డవీటి శీమకింద్ద చెల్లెశీమలు అద్దంకిశీమ గ్రామాదులు ౫౫ అంమ్మనమోలు ౫౫ కంద్దుకూరు శీమ ౬౫ నెల్లూరు శీమ ౧౫౦ వుదయగిరిశీమ ౮ం భుండ్డిశీమ ౪౪ పొదిలెశీమ ౬౬ మారెడ్లశీమ ౫౮ కోటశీమ ౬ం దూపాటిశీమ ౩౬౦ నాగాజు౯నకొండ శీమపు గ్రామాదులు ౧౫౦ కి మోచల౯ అరువయి నాలుగు క్కారెంపూడి ౧౫ గురజాల ౧౬ దముడుగోడు ౧౨ త్తంగ్గెడ ౪౪ యీ అయిదున్ను నాగాజు౯ని కొండశీమ వలినాడు అందురు. వినుకొండ్డ శీమ ౨౨౫ బెల్లంకొండ్డశీమ ౧౦౦ కొండవీటిహవేలీ ౫౮౦ యీపద్నాలుగు సంతులు యిప్రతాపరుద్రుడు యేలెను అన్నిన్ని ధరణికోట బైట నుంచ్చి కాపురం వుండ్డి యేలెను. అటుతరువాతను వోరుగల్లు దుర్గం కట్టించ్చి ఓరుగంటిలో నువుండి తదనంత్తరమందునను పాలకురికి సోమనారాధ్యులు వోరుగంట్టికి ప్రతాప దశ౯నానకు వచ్చె గన్కును ఆసోమనారాధ్యులమహత్తు చూడవలెనని గవిని దగ్గిరను దశ౯నానకు రాకుండ్డా నిల్కడ చేయించ్చె గన్కును ఆసోమనారాధ్యులు అక్కడ తనయందు శివస్వరూపం - వుండచూపె గన్కును ఆ ప్రతాపరుద్రుడు తానేవచ్చి ఆసోమనారాధ్యుల యందు శివస్వరూపంచూచి అపరాధ క్షమ చెయ్యమని వేడి సోమనారాధ్యులను గురుస్తానం చేసుకొనెను. యీప్రతాపరుద్రుడు రుద్ర సంఖ్యగ్రహాలకు అగ్రహారాలు యిచ్చెను.

శ్లొ॥ దదౌధరణి కోటాఖ్యం బ్రహ్మ ప్రీత్యావురం ముడా |
చంద్రాద౯మకుట ప్రీత్యాచంద్ర వోలిపురంద్దదౌ౹౹ -
కేశవర్షణ బుధ్యా వైదదావెక్షు పురంధువి ॥
సోమనారాధ్య గురవే పిడపర్తిపురం దదౌ ౹
యేవంప్రతాపరుద్రాభ్యోకృతవా౯ రుద్ర సంఖ్యయా ౹
ఆదౌ ప్రతాపరుద్రాఖ్య భూపాలో ధర్మపూర్వకం ౹
సప్తర్షిం సంఖ్యయా గ్రామా౯ దదౌసప్తద్విమన్మనాం ॥

యివి పదకొండ్డు గ్రామాలు ప్రతాపరుద్రుడు యిచ్చిన అగ్రహరం. యివి ముక్కంటి దత్తూరు అందురు. ధరణికోట అమరేశ్వరున్కి బ్రంహ్మస్థానంగాను యిచ్చెనూ శివస్థానంగాను చందవోలు లింగోద్భవునకు యిచ్చెను. విష్ణుస్థానంగా పెదచెరుకూరు త్రివిక్రమస్వామి వార్కి యిచ్చెను. గురుస్థానంగ్గాను పాలకురికి సోమనారాధ్యులకు పెదపర్రు యిచ్చెనూ. యీసోమనారాధ్యులు సోమేశ్వర నామాంక్కితంగ్గా లింగ్గాంని చేయించ్చి ప్రతిష్ట చేశి సోమేశ్వరునికి పిండ్తు పిట్టుచేశి నైవేద్యంగ్గాను కట్టడి చేశి పిట్టు సోమేశ్వరుడని నామాంక్కితంచేశి సోమనారాధ్యులు పెదపర్రు సోమేశ్వరున్కి యిచ్చి దేవాలయం కట్టించెను. ససర్షి సంఖ్యగాను యిచ్చిన గ్రామాదులు. విశ్వామిత్రస్థానంగ్గాను కార్యాలయిచ్చెను. భరద్వాజస్థానంగ్గాను సొలస యిచ్చెను. గౌతమస్థానంగాను గుంట్టూరు యిచ్చెను. కశ్యపులస్థానంగ్గాను వంగ్గిపురం యిచ్చెను. జమదగ్ని స్థానంగ్గాను యినగల్లు యిచ్చెను. ఆత్రయస్థానంగాను కారంచేడు యిచ్చెను. వశిష్ట స్థానంగ్గాను వుప్పుటూరు యిచ్చెను. యివి సప్తర్షి సంఖ్యా గ్రామాలు యిచ్చెను. యీపద కొండ్డు గ్రామాదులు ముక్కంట్టి దత్తి అంద్దురు. (fol. 7). యీప్రతాపరుద్రుని యేలుబడిలో వుంన్న గ్రామాదులు:-...యీప్రతాపరుద్రుడు ధరణికోట పెట్టించ్చి ధరణికోటందున్ను కాపురం వుండి యేలుబడిని నియ్యోగుపాగాలు సంపాద్యంచేసి యీయన సంత్తతు కాశికిపోయి గంగ్గలో కుంకులిడి విశ్వేశ్వరుని స్తుతియించి రాజ్యభారాన్ని... శానికి కళతప్పకుండ్డాను వచ్చి శింహ్వాసనా శీనుడై యుండ్డును. యీయ్న ధర్మపత్ని అయ్ని అంబ్బికాదేవంమ్మ ఆమెకు యెదురు లేకుండ్డాను యీయ్న కాశికిపొయ్యెటివాడు వకనాడు నిద్ర మేల్కొని అంబికాదేవమ్మ చూచి యటుపోయి నాడిని విచారించ్చి కనవలెననికాచి కనలేక పోయిన యవలుగాని యీజాడ చెప్పలేరు అని విచారించ్చి యీజయినుల ముంద్దరనడిచే వృత్తాంత్తం అనాగతం చెప్పేటివారు గన్కును అంబికా దేవంమ్మకు చెప్పిరి. అంబికాదేవంమ్మ యీజయినులమీదను చాలా పక్షంగా వుంద్దుగన్కు యీజయినులను పిలిపించ్చి అడిగె గన్కు యీజయినులు విచారించి యీముక్కంట్టి పోయించ్చికూడా అంబ్బికా దేవమ్మకు చెప్పిరి. అంబ్బికాదేవంమ్మ యీప్రతాపరుద్రుడు పోయ్యా గనుపెట్టి తానువచ్చెను అని చాలా బల్వుచేసెను గన్కును అంబ్బికా దేవంమ్మనుబెట్ట బట్టుకుని యోగవాగాలతోనుబోయినంత స్నానంచేసినంతలో అంబ్బికాదేవమ్మ రజస్వల ఆయ గన్కును యీప్రతాపరుద్రుడు చాలా చింతన చేశి యీ అంబికాదేవంమ్మను విడిచిపోరాదు పోక పోతేను రాజ్యం విరొధంఅని ఆకాశీఖట్టులోను వుండ్డే బ్రాహ్మణులు గంఘ్ఘకు స్నానానకు వచ్చి వుండ్డిరి. అప్పుడు వారు వినయంగ్గాను తాను వచ్చిపోయి మర్మము చెప్పేగన్కును ఆకాశీ బ్రాంహ్మణులు విచారించ్చి రజస్వల అయిన స్త్రీ తోకూడాను యోగవాగాలు యోగాలు నడచిన అని విచారించి ఆకాలానకు బ్రాంహ్మణులకు వేదశాస్త్రాలు ఆడినట్టువస్తూ వుండ్డేగన్కును వారుయీరాజుకు వలాడు కంన్నులు వున్నవి. యితడు సాక్షాత్కారమయిన రుద్రహాంశ యితనికి మనం యీదినం యోగవాగాలు నడుపుదాము. వేదశాస్త్రాలు, మనకు యీకలియుగకాలంలోను ఆడినట్టువస్తూ వుంన్నవి అని విచారించ్చి ముందరవచ్చే హెష్యం యెరుక తగిలియుండ్డి ఆబ్రాంహ్మణులు ప్రతాపరుద్రుని తోను ముంద్దర నాలుగు యేండ్లకు మాదేశాన్కు అవాంతరాలురానుంన్నవి. అకాలమంద్దునను మేము మీశీమకువశ్తేను మాకు అంన్నవస్త్రాలు నడిపింతునని యీగంగ్గా గభ౯ మంద్దునను స్నానంచేశి నీవుమాకు ధారాపూర్వకంగ్గాను మీకునడిపిస్తున్నాను అని అంటేను యీదినం మీకు యోగవాగాలు మింమ్మున యిద్దరిని యింట్టికి చేర్చి అట్టినడిపిస్తూ వుంన్నాము అని యింతనుంచ్చి యీ యోగవాగాలు పలిగొనవు అనిరిగన్కును ప్రతాపరుద్రుడుకు ఆమాటకు వప్పెగన్కును వారిదంప్పతులు యిద్దరిని గంగ్గలో స్నానం చేయించి యీప్రతాపరుద్రుని తాము అంన్నమాట గంగ్గలోను ధారపోయించుకుని అప్పుడు తాముస్నానంచ్చేశి ఆశీర్వచనంచేశి మేముసత్యంగాను వేదంచ్చదివితి మాయనా యీ వేద వచనాలు నిశ్చయమయినట్టు ఆయనోమేము సత్యవాదుల మైతిమయనా యీరాజుపత్నిని యీయోగవాగాలు నడిపించ్చుగాకను అని ఆశీర్వచనంచేశి అంబ్బికాదేవంమ్మను తనపతిని ముట్టుకోవచ్చె అట్టుగాను చేశి యీదినమె కాటియిసుక యీ యోగవాగాలు మీకు పనిగొని వుంట వనిరి గన్కు పత్నీసమేతంగ్గాను యీముక్కంట్టి యోగవాగాలు నడిపించ్చుగాకను, వారు ధరణికోట ప్రవేశించ్చి యప్పంట్టివలెనే వుండ్డిరి. యోగవాగాలు అంత్తట్టినుంచ్చి పనిగొన వాయెను. యోగవాగాలు పనిగొనకపోయినండ్డున యీప్రతాపరుద్రుడు చింతించ్చి త్తనమర్మం యవ్వరూ యెరుగనిదయి అంబ్బికాదేవికి యేలాగున యెరుకపడేనో జయనులే చెప్పి వుండ్డేరు. అని మనస్సంద్దు నమతగిలి అంబ్బికాదేవి జయినుల మీదపక్షం అని విచారించ్చి అంబ్బికా దేవితోను మనము జయినులేఅని దొడ్డబ్రాంహ్మణులు అనుకుంద్దురు. యీబ్రాంహ్మణులకన్నా కాశిబ్రాహ్మణులు యంత్తదొడ్డవారలు వీరు ఆశీర్వచనంచ్చేశి యోగవాగాలు నడిపించ్చిరి. యికను మీకు యీ యోగవాగాలు పనిగొనవు అనిరి. అలాగుననే పనిగొనవాయెను. యీబ్రా హ్మణులే దొడ్డవారు. యీబ్రాంహ్మణుల నాటివారలుకారు జయినులు అని యెరుగను అంబ్బికాదేవంమ్మ జయినులే దొడ్డవారలు సత్యవాదులు యెన్నో అనాగత హేష్యసంగతులు చెప్పేటివారలు అని ప్రతిమాటలు యిచ్చె గస్కును యీ ప్రతాపరుద్రుడు జయినుల దొడ్డతనము యీ బ్రాహ్మణుల దొడ్డతనము దిట్టపరచవలెను అని కోపోద్దీపితుండై వరుకు యెవరికీ లేకుండా వక క్రూర సర్పాంన్ని తెప్పించి ఒక మంద్షసములో వుంచి తాను కొల్వుతీర్చి ఆమంద్దసం సభామధ్యమందున వుంచ్చి జయినులను బ్రాహ్మణులను వుభయత్రల వారిని పిలిపించి మీరు యీవుభయత్రులలోకి యవ్వరు దొడ్డవారలు మీతారతమ్యములు విచారించ వలసినది. యీమందసములో వుంన్న 'వస్తువ యదార్ధముగా యవ్వరు చెప్పితేవారు దొడ్డ బ్రాంహ్మణులు, చెప్పలేనివారిని కులక్షయం చేయిస్తూ వుంన్నాము అని ప్రతాపరుద్రుడు పంతబడిచేశె గనుక జయినులు అడిగినప్పుడే యీమందసములో యేవస్తువులేదు క్రూరసర్పం వున్నదని చెప్పిరి గనుకను ముక్కంటి యేమీ అనక వూరికె వుండేను. ఈ బ్రాంహ్మణులు మేము రేపుచెప్పేము అనిరి వుభయత్రలు వారివారి గృహాలకు పోయి యీబ్రాంహ్మణులు విచారించి జయినులుచేశ్ని గ్రంధాలు వారిమాటలు యదార్ధం వీరు చెప్పినమాటలు మనము చెప్పలేము. రాజు యవ్వరు చెప్పలేకపోతే వారిగ్రంధాలు అంన్ని దగ్ధం చేయిస్తుంన్నాను, వారిని భూమిన లేకుండాను, క్షయంచేయిస్తూవుంన్నాను అని పంతం పలికెను. జయినులు యీమందసమందు సర్పం వుంన్నదనిచెప్పిరి. యీజయినులు మాటయదార్ధం చెప్పేటివారు. జయినులు చెప్పినమాటమనము చెప్పరాదు మనమాటే గెల్పించుకొని యీజయినులను గ్రంధాలు అంన్నీ అగ్ని దగ్ధం చేయించి జయిన సంహ్రరమే చేయించవలెనని కృత్యము విచా రించి యీబ్రాంహ్మణులు మంత్రజ్ఞుంణ్ని మాట్లాడి వాడికి అంన్నవస్త్రాలు నడపించే అట్టుగాను కట్టడచేశిరి వాడు వచ్చి కొరందొరు ఆశీర్వచనంచేశి యీమందసములో ముత్యాల భత్రం ఉన్నది అని మీరు మంత్రాక్షింతలు వెయ్యండి మీసందడి నేను అక్షింతలు మంత్రించి ఓక ముత్యాల భత్రం వుండచేశి మిమ్మును గెల్పిస్తున్నాము అని అనెగనుక వాణ్ని బ్రాంహ్మణులు తమ వేషం ధరియించి వానికి యజ్ఞోపవేతం చేసి బ్రాహ్మణులు వాణ్ణిత్తమలో కల్చుకొని వచ్చి ఆశీర్వచనంచేశి కూర్చుంనంత్తలోను జయినులువచ్చిరి. వుభయత్రల వారిని యీమందసములో వుంన్నవస్తువు చెప్పమనిరి గనుకను జయినులు నిన్ననే మేము సర్పం వుంన్నదని చెప్పిన్నాము అనిరి. యీబ్రాహ్మణులంతా ఆశ్వీరచనంచదివి యీమందసములోను ముత్యాలభత్రం వున్నదని మంత్రాక్షతలు వేశిరి. ఆమంత్య్రజ్ఞుడు తన విద్వాంసత్వాన ముత్యాల భత్రం చేసెను. బ్మాంహ్మణులను గెలిపించెను. గనుక రాజు నేను సర్పాన్ని అందులో వుంస్తే జయినులు అయితే సర్పమే వున్నది అనిచెప్పిరి. యీబ్రాహ్మణులు ఆశీర్వచనం చదివి ముత్యాల భత్రం వున్నదంటే ముత్యాలభత్రం వుండెను. వీరు యెంతదొడ్డ బ్రాంహ్మణులు అని రాజు మెచ్చెను. జయినులు యదార్ధం పలికినారు గనుక వారినేమనకరాజు వూరక వుండెను. బ్రాహ్మణులు చేశిన కృత్మిమోపాయము జయినులకు తేటపడేను యీబాహ్మణులు, జయినులను అబద్దీకులను జేశిరి. జయినులు యదార్ధం చెప్పిరి. అందరూరకవుండి విమర్శించక పోయినందున బ్రాహ్మణులు జయినులు చేశినగ్రంధాలను అన్నిటినీ అగ్నిహాత్రంలో దగ్ధం చేశెనూ. రాజు చూస్తూవుండెను. ప్రతిపాలన చాయడాయను గనుకను జయినులు తాముచేశ్ని గ్రంధాలు యీ బ్రాంహ్మణులు దగ్ధంచేయగాను యీప్రతాపరుద్రుడు ప్రతిపాలన శాయడాయను గ్రంధాలు మనం చూడగా దగ్ధంచేశిరి. మనము హీనులమయి వుండవలశినది. రాజు కులక్షయం చేయిస్తూ వున్నాము అంన్నాడు. రేపు ఆయినా యీబ్రాహ్మణులు రాజుతోనూ చెప్పి మనము సఖలంచేయించే వారు. యీబ్రాంహ్మణులు కృతిృమం చేస్తే రాజు ప్రతిపాలన లేదాయెను. మనము హీనులమై వుండలేము. మనము శరీరాలు చాలింతాము అని విచారించి జయినులు బ్రాహ్మణులను మీరు చదివే మాత్రమేకానీ వేదశాస్త్రాలు మీయందు నిపుణతలేకపోగాక మేము కాపురాలు చేసిన పాళ్ల మీదను యెవరూ కాపురాలుజేసినా జేయలేకపోగాక మంమ్ము యీకృత్యము విచారించిన వారిలోను కల్పన మంత్రబన్నని సంతతి యీ మంత్రాలు అభ్యశించినవాండ్లు భిక్షకులు అవుదురు గాక యీరాజు బహుజనపోషకుడు యీబ్రాంహ్మణులు చేశ్ని కృతిృమం ప్రతిపాలన శేయక పోయినందున యిధరణికోట స్థలం విడుచుగాక, పరరాజులకు పట్టుబడుగాక, మాకులంవారు మంమ్ముని కలశిరాక ప్రాణభీతిని పోయినారు, హీనులై పోదురుగాక అని శేపించి బ్రాంహ్మణులను మాగ్రంధాలను దగ్ధం చేస్తిరి. మీకు ముందురను మాగ్రంధాలు లేకపోను, ఆదర్వులేదు. యీగ్రంధం ప్రయోజనాలకు యిది అమరం వుంచుకోమని చాతులక్షగ్రంధం అమరు యిచ్చి జయినులు అందరు విషాంన్నభుక్తులై తర్లిరి. యీజయినులు మన్నుదిబ్బలుపోశి ఆదిబ్బలమీదను గృహాలుకట్టి కాపురాలు చేశేటివారు. వారు కాపురాలు చేశేటి గ్రామమధ్యమందునను సూర్యనారాయణ అనే దేవుండు గ్రామానకు పశ్చిమభాగమందున జట్లంమ్మా అనేశక్తి గ్రామానకు పూర్వభాగమందునను దేశమ్మ అనే శక్తియీ-దేవుళ్లను కొల్చేది. యీపాళ్లమీదను కాపురాలు. చేశేవారికి జయంలేదు రాజు ప్రతీపానలులేవు. యీప్రతాపరుద్రులు దనుకారాజులు, ధర్మప్రతిపాలనులు చేశి యేలినారు గనుకను ఆయువులు మిక్కిలి ఆయురాజ్యధర్మం ప్రతి పాలన చేసినారు. యీ ప్రతాపరుద్రుడి యేలుబడినుంచి ధర్మప్రతిపాలనలు సిద్ధించెను యీచొప్పన జయినుల ఫలం యొక్క వుండవలెనని వాసినారు. ప్రతాపరుద్రుడు కాశిలోను బ్రాహ్మణులకు ధారావంత్తం బ్రాహ్మణులకు యిచ్చుట యీజనంఖిలమయిన వెనుకను ధరణికోటలోను వుండగాను యీబ్రాంహ్మణులు అంనట్టి మరి నాలుగు యేండ్లకు కాశీరాజ్యంకు అవాంత్తరం వచ్చి క్షామం తగిలెగనుకను రాజ్యం విడిచి బ్రాంహ్మలు ముక్కంట్టియేలే రాజ్యానకు పోతేను ఆనాడు వచ్చిన కుంగంగలోను అన్నమాట నడిపించిరి అని ఆరాజ్యం బ్రాంహ్మణులు వచ్చి ఆతుకూరిలోను దిగిరి గనుకను కృష్ణానది నిండా సంపూర్ణవుదకముతోవుండి, వుండేగనుక ను ధరణికోటకు దాటను అలవిగాదాయను ముక్కంటికి చెప్పినారు. దాటించ్చేవారు లేకుండిరి యీబ్రాహ్మంణులను విచారించి ఆరాజ్యం విడిచి యింతతడవు వచ్చి అన్నంలేకను యిక్కడ మృతిజేందేటి కంటెను కృష్ణానదిలోను స్త్రీ బాలులతోను చొత్తాము మనకు పాపాలు పరిహారం పతితపోవని అని తెంపుచేశి కృష్ణానదిలోకి ఆరువేల కుటుంబాలు వారు జొచ్చిరి. తక్కినవారు ప్రాణభీతిని రాలేక వుండిరి గనుకను యీకృష్ణానదియంత చిన్నవారలకు వోరివారికి మోకాటీలోతునను దారియిచ్చె గనుకను దాటివచ్చి యీప్రతాపరుద్రుని దర్శనం చేశిరి. గనుక వారికి దయచేశ యీకొండవీటికిందను చెల్లేశీమలు౧౪కిను లోను వారికి వుపాధిచేశాను, వారు నిల్చిరి.యీకొండవీడు, వినుకొండ, బెల్లంకొండలు ఆనాడు వెలనాడు అందురు. గనుకను యీశీమనున్నవారికి వెలనాటివారు అనిరి. ఆరువేలయిండ్లవారు గనుకను ఆరువేలవారు అనిరి. నాడు అనంగ్గాను భూమి గనుక వెలనాడు అనిరి. పలెనాడు, పాకనాడు, ములినాడు, కాసరినాడు, వేగినాడు. వెలగలనాడు. వెసిరవాయి. యివిశీమల పేర్లు. నంవంద్ద వూరిపేరు. యీశీమనుంచి వచ్చినవారు వారివారి నెలవునను యేశీమనుంచి వచ్చినవారు ఆసీమవారితో బాంధవ్యాలు చేస్తూవచ్చిరి గనుకను ఆశీమల పేర్లు పిల్చినారు గనుకను ఆశీమల పేర్లను నామాంకితాలు అయినవి. గ్రామంవక్కటే గనుకను నంద్దవరీకులు అనిరి. నడువడ్లు యెక్కువ తక్కువ మాత్రమే కానీ బ్రాహ్మణ్యం అంతా వక్క విధంగాని రెండు విధాల లేవు. యీప్రతాపరుద్రుడు యెనభై యెనిమిది సంవత్సరములు యేలెను. కలి సంవ్వత్సరంబులు ౩౬౦౦ యేండ్లమీదటను దుందుభి సంవత్సరమందునను పట్టుబడెను. యీప్రతాపరుద్రుడు చనినపింమ్మటను ద్వాదశ వర్షక్షామం ఆయను. రాజ్యప్రతిపాలనలు లేకపోయను. ప్రజలు కొందరు దేశాంత్తరులు అయినారు. (యెరుక ఉండవలెనని వ్రాసినాను. యిది యీప్రతాపరుద్రుడి యేలుబడి).

గజపతివారి యేలుబడి వృత్తాంతము:-

వీరి యింటిపేరు మిరియాలవారు అందురు. వడ్డెరాజులు యీగజపతి నామాంకితము .విశ్వంభరుడు ప్రజలుడయి ద్వాదశ వర్షంబులు యేలెను. ప్రజల్కు పాలనంచేశెను. గనుక దేశం సుభిక్షం ఆయను. యీవిశ్వంభరుని కుమార్లు గణపతిదేవు, నరపతిదేవు, విశ్వంభరదేవు, బాలభాస్కర దేవు, వీరు నలుగురు కుమారులు. గజపత్యాశ్వయులు. వీరేపరాక్రమములు. అఖిలదిర్భితకీర్తి విశాలురు జగనల్పు గుండ్లగుండ్ల బిరుదులున్నూ, యీగజపత్యాన్వయులున్నూ శ్రీ మహామండలేశ్వరులయి యేలేశ్వరం పడమటికిహద్దుగాను యేలుచుండి యీ కొండవీటిశీమ మూలు౧౮శీమలు యీగజపతివారు యేలుచూ వుండి యీకొండవీటి శీమలోను బ్రాంహ్మణులకు వృత్తిక్షేత్ర అగ్రహారాలు యిచ్చిన్ని.

శ్లొ౹౹ గణపత్యాంన్వయా భూపో గుణపత్వపనీశ్వర :
బ్రాంహ్మణీభ్యశ్చ తుశ్చాత్మ్వా వింశజ్ఞానపదాందదౌ
శ్రీమాంశాకాబ్దే రసబాణ ఖేందో: సంఖ్యాప్నవృత్యా ద్విజపుంగవేభ్యః ౹
గ్రామందదౌ శ్రీగణపత్యభిఖ్యా వ్యక్తిప్రయుక్తా౯ గణపత్యధీశః ౹౹

శ్రీస్వస్తి శ్రీమత్త్రిభువన చక్రవర్తి శ్రీ మద్రాజాధిరాజదేవత జయరాజ్య సంవత్సరంబులు ౧౦౫౬ అగునేటి ప్రమాదీచనాను సంవత్సర మందునను వృత్తి క్షేత్రాలు గ్రామాదులు యిచ్చెను. శ్రీగ్రామాదులు శ్రీతెనాలి ౧ , చివ్వలూరు ౧ , కొల్లిపర ౧, మున్నంగి ౧ వెల్లటూరు ౧, అంతుమూడి ౧, వోలేరు ౧, అనంత్తవరం ౧, నల్లూరు, కామరాజుగడ్డ ౧, అంగలకుదురు ౧, మాంచాళ ౧, నందంపల్లి , పెదచరకూరు ౧, ధరణికోట ౧, చరుకు పల్లి ౧, తొప్పెలపూడి ౧, దావులూరు ౧, దోనేపూడి ౧,పెదకాకాణి ౧, పాలడుగు ౧, తూర్పు రుద్రవరం ౧, (యిక్కడ మాతృకభిన్నం,) నంద్ది వెలుగు ౧, కఠేవరం ౧, యీమని ౧ యీమని పాలంలోను యీగణపతిదేవు తమ్ముడు బాలభాస్కర దేవు ఖండు వీలు౧౫౦పోకౌల్కు లూరి పొలంలోను యీమని చింతలపూడి కొల్కలూరు కూడలి నుంచి యీమన్కి పడమర, కొల్కలూరికి తూర్పు యీశాన్యపు మూలకుని కుంట హద్దునుంచి దుగ్గిరాలపూడికి దక్షిణభాగం కొల్కలూరికి వుత్తరభాగం తుంగభద్ర, పడమర గోలాలమెట్టను, కొల్కలూరు, యీమని, పెనుమూరు కూడలికునికుంట, హద్దు కొల్కలూరి పోయి వుత్తరభాగం. ఖండవీలు ౧౦ ఖండ్ర వాటిలోనుకల్పి ఖండ్డవీలు ౧౬ం చేశిదుగ్గిరాల పూడి కొల్కలూర్కి పొలిమేర హద్దులు చేశినారు. వృత్తిక్షేత్రాలు ఖండ్రవాటు యిచ్చెను. చినకూరపాటి పొలంలోను ఖండ్రవీలు ౨౪౦ పొలిమేర హద్దులు బట్టి బ్రాంహ్మణులకు వృత్తిక్షేత్రాలు ఖండ్రివాలు గ్రామాదులు రెండు బాలభాస్కరదేవు యిచ్చెను. శ్లోకాలు.

యీమని పొలంలో పాలెందుగ్గిరాలపూడి ఖండ్రి వాలు

శ్లోకాలు: శ్రీమత్మకాబ్దేరసబాణఖేందుః సంఖ్యాప్రవృత్తే ద్విజపుంగవేభ్యః
చందాత్మజం శ్రీమతుదుగ్గిరేవాపుండి ధరోపరధోరి పరాగతాభ్యాం ౹
భతృతేృవంశాశ్నవ పూర్ణచంద్రా సభాల మార్తాండ మహితవేశాయత్కల్పయ
గ్రామమదంధరిత్రీం మదేత్రమాచంద్రదివే శతారాం ౹౹

శేషః ౹ త్తక్షర పద్మనాభకుశికానం తాబ్దికర్కొకటః ౹
వామక్యాది మహాపద్యనాగరి చదరం పండాత్మజానం దన్నభీమం
పాండువభీమ విక్రమనిభం శ్రీఖండవాటేశ్వరం క్రూరారాతి మెషెంద్రవజ్రత్తు
చితందక్షంతు భూపోత్తమం॥

స్వస్తిశ్రీ దంత్రి భువన చక్రవర్తి శ్రీమద్రాజరాజదేవర విజయరాజ్య సంవత్సరంబులు శా॥ ౧౦౫౬ (1134 A. D.) ఆగు నేటి ప్రమాదీచనామ సంవత్సరమందునను యీ బాలభాస్కరదేవు యీమనిపొలంలో ఖండ్రపాటి దుగ్గిరాలపూడి అలాయిదా గ్రామం చేశి పొలిమేర హద్దులు చేశి పంన్నెండు గోత్రాలవారికి వృత్తులు ౧౨ ఖండ్రవాటి గ్రామం యిచ్చెను. యీమన్కి పడమర దుగ్గిరేలకు తూర్పుపొలిమేరకు బాలభాస్కరదేవు కర వేయించినాడు. యీమని ౩౬౦ వృత్తులు గణపతిదేవు బ్రాంహ్మణులకు యిచ్చెను.

అర్కసంఖ్యార్క గోత్రాణాం,
విస్త్రాణాంచ మహాత్మనాం,
షష్టిత్రిదశ సంఖ్యా కామర్వీంగణపతిర్దదౌ,
శ్రీమా౯ శాకాబ్దే రసబాణఖెందు సంఖ్యాప్రవృత్తే ద్విజపుంగవేభ్యః ౹
గ్రామా౯దదౌ శ్రీగణపత్యభిక్యావృత్తి ప్రయుక్తా౯ గణపత్యధీశః ౹

పతిదేవు యిచ్చిన వృతిక్షేత్ర గ్రామాదులు ౪౨ ఖండ్రవాటేలు ౨ న్నూ చినకూరపాటి పొలం ముత్యాలకి ఖండృవాటు చేశెను. యీ బాలభాస్కర దేవు యీ కూరపాటి ఖండ్రవీలు ౩౬ం కి ఖండృవీలు ౨౪౦.

శ్రీదశబాణాdra భూసంఖ్యే ప్రవృత్తే
శకవత్సరే ప్రమోది సంఖ్య వర్షేతు
గణపత్యా న్వయాద్భవః ౹

అర్కసంఖ్యాక గోత్రాణం విస్త్రాణాచ మహాత్మనాం,
అంబరం గతికంర్ణించ ఖండ్డవి గణపతిర్దదౌ,
బాలభాస్కరదేవే శహస్వశౌక పుస్యచ నభరచ
గుణాక్షానిఖండ్డ వినాంధ్వీభాగగా౯ వియోజ్యకృత్యాముత్పాలనాంన్మాతి
తృండ్రపాటి కాందదౌద్వాదశో గోత్రేభ్య విఖ్యేప్రే ధర్మచింత్తయా ॥

యీ చినకూరపాటి ఖండవీలు 3౬ం యీపొలంలో పాలెంఖండవీలు ౨౪ం పంన్నెండు గోత్రాలు బ్రాహ్మణులకు వృత్తిక్షేత్రాలు యిచ్చి యీ కూరపాటి ఖండవీలు ౧౨౦ వుంచి పొలిమేరలకు హద్దులు పెట్టించెను. అలాయిదా గ్రామం ఆయను ముప్పాలపూడి నామం ఆయను. యీ కూరపాటి పొలంలో ఖండ్రపాటి ముప్పాలపూడి యీమని పొలంలో ఖండ్రివాటు దుగ్గిరేలపూడి యీఖండ్రవాటలు రెండున్ను బాలభాస్కరదేవు యిచ్చెను. పాలడుగు ౧ విశ్వంబరుడు యిచ్చెను. (మాతృకభిన్నము.) శ్రీ శ్రీ గోపరాజు రామంన్న యిచ్చిన గణిక స్థావరాలు. యీ గణపతిదేవు యేలుబడిని యాజ్ఞమల్కి గోపరాజు రామంన్న అని ప్రధాని గణక స్థావరంబులు యిచ్చెను.

శ్రీశ్లోకాలు౹౹ గోత్రాశాస్త్రాబ్ర శీతాంశు సంఖ్యాబ్దే శాలివాహనే ౹
గ్రామస్థావర వృత్తిశ్చాకృతివా౯ గణికాగ్రణీః ॥
శ్రీమాంగణపతిర్చూపో గజపత్యన్వా యోద్భవః ॥
ఆస్తిభూమండలేతస్థ్యా బహుళశృంత్రి మంత్రిణః ౹
తేషాం శ్రేష్ఠతమోమాత్యః యాజ్ఞవమ్యోత్త మోద్విజః
గోపరాజాంన్వయోత్ఫంన్నో రామాభ్యోగణకాగ్రణీః
రక్తాక్ష్యబ్దెమాశి భాద్రపద బహుళ పక్షే
వర శ్రేర్క గ్రహంగే పుంణ్యకాలోంగారకవా సరే౹
గణకానాం హితార్ధయ సధ్యసః స్థాపనాయాచతిష్ట త:
శ్చశిమాన్మా౯ండయావత్తా వతువృద్ధియేతన
రాజాజాగ్ర హిందాపాం కృష్ణవేణీ తదేతదా |
గ్రామ స్థావరహృత్తేనాం సాక్షిణస్సర్వదేవతాః ॥

స్వస్తిశ్రీమత్రిభువనచక్ర వర్తి శ్రీమద్రాజరాజ విజయరాజ్య సంవత్సరంబులు శ్రాహి ౧౦౬౭ ఆగు నేటి రక్తాక్షినామ సంవత్సర భాధ్రపద బహుళ ౩౦ అంగారకవారంబున సూర్యో పరాగపుణ్యకాలమందునను గణపతిదేవుచాతను ధారాదత్తముబట్టి కరిణిక స్థావరంబులు యిగోపరాజురామంన్న నియోగ్యులకు గ్రామాదులు యిచ్చెను. యీ రామంన్న యిచ్చేవర్కు కరణీకం వ్రాశేవారు అర్వలు యీ కొండవీటి హవేలీ గ్రామాదులకు రామన్న యిచ్చే వర్కు కుచ్చళ్ల పే కత్తులు అందురు. కత్తి అనంగాను నాలుగు బారలకడను ౬౪౦౦ కుంటలు అయితే కత్తి అందురు. ౩౨౦౦ కుంటలు అయితే అరకత్తి అందురు. నాలుగు బారల ఘడకు ౪౦౦ కుంటలు ఆయితేను కొందరు పూర్వరాజుల యేలుబడిని ౧౬ మర్తువు అందురు. గజపతి యేలుబడిని ౧౬ ఘడను నూరు కుంటలు ఆయిన కుచ్చళ్లు యెనభై కుంటలది కుచ్చల. యీ కుచ్చళ్ల పేరు ఖండవీలు అనిరి. ఖండవీలు అనంగాను ఆరకుచ్చల పేరు. ఖండవీలు రెండు అయితేను నూరు కుంటలకు సౌంజ్ఞ ఖండవీలు, అయితే యెనభయి కుంటల కుచ్చల అసౌజ్ఞ అందురు. పిచ్చపాటిని అందురు, ఖండలికి కుంటలు ౫ం యాభయి ఖండలికి కుంటలు ౪ం చేశి ఖండల కుచ్చలు ౮౦ కుంటలు, మారం కుంటల కుచ్చలకు ౫ం. యీచొప్పున ఖండవీలు రెండు అయితేను యీ కొచ్చెళ్ళలకు యక్కవపాటిన్ని తక్కువపాటిన్ని అందురు. యీ రెడ్లవారి యేలుబడిని తూంప్ప కుచ్చెళ్ళు అనిరి. యీ కుచ్చెళ్ళకు కుచ్చెలకు రెండు తూంపలున్నర అయితేను కుచ్చల అనిరి. యీ వెనుకను కృష్ణదేవరాయలు యేలుబడిని తూంపులు అని అందురు. నాలుగు బారల ఘడను నూరు కుంటలు అయితేను బిగువు అందురు. యివి ఖండవీలు అనంగ్గాను కుచ్చళ్ళ సంజ్ఞ ఖండ్రవాటు అనంగ్గాను ఖ ౧ అనుట ఖండ్డెమనంగ్గాను బేతెడు అనుట ఖండించు మనంగ్గాను తెగగొట్టమనుట యివి పూర్వపు మాటలు. యీ రామన్న కొండవీటి కిందను చెల్లెశీములు ౧౪ కి దేశం పెత్తనం యిచ్చిన మిరాశీలు నియ్యోగులకు అద్దంకిన, అమ్మనబోలు శీమలు ౨ కిజుమలా సంప్రతులు నాలుగింటికి సంప్రతులు వెలనాడు వేగినాడు సంప్రతులు నీలంరాజు వారనేటివార్కి సంప్రతి ౧ పొలంరాజువారు అనేటి వారికి సంప్రతి ౧ రామరాజువారు అనేటివారికి సంప్రతి ౧ అద్దంకివారు అని గ్రామనామం సంప్రతి ౧ యీ నాలుగు సంప్రతులు అద్దంకి అమ్మనబోలుకు జమలాగా యిచ్చెను. కందుకూరి శీమకు కరణకంమ్మలు సంప్రతులు ౨ కి అక్కిరాజువారు అనేటివార్కి సంప్రతి ౧ మంత్తరాజువారు అనేటివారికి సంప్రతి ౧ కందుకూరి శీమకు యీ రెండు సంప్రతులు యిచ్చెను. నెల్లూరి శీమకు సంప్రతులు 3 కి కరకంమ్మలు సంప్రతులు ౨ కి, అక్కంరాజువారి సంప్రతి ౧ ముత్తరాజు వారి సంప్రతి ౧ తెలుగాణ్యుల శ్రీవత్సగోత్రులయ్ని, ఆదిరాజువారు అనేటివార్కి సంప్రతి ౧ యీ నెల్లూరికి యీమూడు సంప్రతులు యిచ్చెను. ఉదయగిరి చుండి శీమలకు యీ రెంటికి సంప్రతులు ౨ కి కరణకమ్మల సంప్రతులు ౨ కి అక్కిరాజువారి సంప్రతి ౧ ముత్తరాజు వారి సంప్రతి ౧ రెండు శీమలు వీరికి యిచ్చెను. పొదిలెశీమకు వెలనాటి సంప్రతి ౧ కి పొలంరాజువారు అందురు వీరికి యిచ్చెను. మారెళ్ళశీమకు వెలనాడు సంప్రతులు ౨కి దూళిపాళ వారికి సంప్రతులు బచ్చలివారు అనేటివారికి సంప్రతి ౧ యీ శీమలకు రెండు సంప్రతులు యిచ్చెను. కోటసీనుకు వెలనాడు సంప్రతులు ౨ కి తురిమెళ్ల వారు అనేటివారికి సంప్రతి కాశిరాజు ఆనేటివారికి సంప్రతి ణ యీ సీనుకు రెండు సంప్రీతులు యిచ్చెను. దూపాటిశీమకు వెలనాడు సంప్రతులు ౨ కుంబాలవారు అనేటివార్కి సంప్రతి వీరు కరణ కంమ్ములు అన్నంరాజు వారు అనేటివార్కి సంప్రతి ౧ యీ రెండు సంప్రతులు యిచ్చెను. నాగార్జునికొండ శీమకు ౫ కి సంప్రతులు ౪ కి మాచర్ల సంతు సంప్రతులు ౨ కి వెలనాడు సంప్రతి ౧ కి వీరిని కందకూరివారందరు ప్రథములు. సూరపరాజు అనేటివార్కి సంప్రతి ౧ యీ సంతుకు రెండు సంప్రతులు యిచ్చెను. కారెంపూడిసంతుకు ములుగోటి సంతు యీ రెండు సంతులకు సంప్రతి ౧ యీ కందుకూరివారికి యిచ్చెను. గురిజాల సంతుకు వెలనాడు సంప్రతి ౧ దుగ్గరాజు అనేటివారికి యిచ్చెను. తంగ్గేడు సంత్తు వెలనాటి సంప్రతి ౧ వీరికి తుమ్మలచర్వు వారందురు హరితస గోత్రులు వీరికి యిచ్చెను. ఈ సంతులు ౫ం న్నూ నాగార్జునకొండ శీమ అందురు. యీ సంప్రతులు నాలుగు యిచ్చెనూ. బెల్లంకొండసీమకు సంప్రతులు 3 కి ప్రథములు బెహరావారు అనేటివారు సంప్రతి ౧ కి కరణి కంమ్మలు గ్రామనామం సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ శ్రీ గోపరాజువా వారు అనేటి వారికి యిచ్చెను. యీ బలకొండ

శీమకు యివి మూడు సంప్రతులు యిచ్చెను. వినుకొండశీమకు సంప్రతులు నంద్దవంశీకులు సంప్రతులు ౨ కి గుంత్తుపల్లి వారు ఆనేటివారికి సంప్రతి ౧ రాయనివారు ఆనేటివారికి సంప్రతి ౧ యీ వినుకొండశీమ సంప్రతులు యిచ్చెను. కొండవీడు హవేలీ శీమకు తెలగాంణ్యులు సంప్రతివారు అనేటివార్కి ఒక సంప్రతి వకటి యిచ్చెను. యీశీమలు ౧౪ కి శీమలు పెత్తనపు మిరాశీ సంప్రతులు వీరికి యిచ్చెను. హవేలీ గ్రామాదులకు యిచ్చిన సంప్రతులు కొండ్డవీటి సంప్రతులు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు వీరిని కొండపాటు అందురు. ప్రథములు సంప్రతి ౧ కౌండిన్యస గోత్రులు వీరిని పట్టస్వామివారు అనిరి. కొండలు గాకను ఖండవీలు ౪౦౦ యాంబలూరు వెలనాడు సంప్రతులు ౨ కి గౌతమగోత్రుల సంప్రతి ౧ వీరికి గ్రామనామము కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ వీరిని దాంత్తివారు అందురు. ఖండవీలు ౨౦౦ రేపూడ వెలనాడు సంప్రతి ౧ వీరిని చిల్కావారు అందురు. ఖండవీలు ౬౦ దక్షిణ తాళ్లూరు వెలనాడు అందురు. సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని చిల్కూవారు అందురు. ఖండవీలు ౩౮౦ ఫిరంగ్గిపురం యోనాడు సంప్రతి హరితస గోత్రులు వీరిని బల్కావారు అందురు. ఖండవీలు ౮౦ చినతక్కెళ్ల పాడు వెలనాడు సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని చిల్కావారు అందురు. ఖండవీలు ౬ం పెదతక్కిళ్లపాడు వెలనాడు సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని చిల్కావారు అందురు. ఖండవీలు 300 చేముళ్ల కంటి వెలనాడు సంప్రతి ౧ కౌశికగోత్రులు వీరినిగ్రామనామం ఖండవీలు ౧౨౦ పడమటి జంపని ప్రథములు సంప్రతి భారద్వాజగోత్రులు వీరిని గోవాడవారు అందురు. ఖండవీలు ౪ం వేగమూడి ౧ వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రులు వీరిని యాబలూరి వారందురు. ఖండవీలు ౨౪ డొంకిపర్రు సంప్రతులు ౨ కి గౌతమగోత్రుల సంప్రతి ౧ వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ గోరిజవారిని పొత్తూరి వారందరు. ఖండవీలు ౧౨౦ సదరు మూడు సంప్రతులు ౪ కి తెలగాంణ్యులు కౌండిన్య గోత్రులు వీరిని పూరేవారందురు. కొప్పర్రు వెలనాడు గౌతమగోత్రుల సంప్రతి ౧ వీరికి గ్రామనామము ఖండవీలు ౧౫౦ సంప్రతి ౧ ప్రథములు సంప్రతి భారద్వాజ గోత్రులు వీరికి -గ్రామనామము నుదురుపాటి వార్భోల ప్రథముల - సరిప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦౦ అందురు. నందవరీకుల సంప్రతులు ౨ కి కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని తంగేళ్లవారందురు. జంగాలపుల్వ వెలనాడు కౌశికగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ కౌండిన్యస గోత్రుల సంప్రతి... వీరిని కోటపల్లె వారందుకు. ఖండవీలు ౪౦౦ తూమాడు తెలగాణ్యులు భారద్వాజగోత్రుల సంప్రతి ౧ వీరిని పువ్వాడవారందురు. ఖండవీలు ౧౫౦ గొరిజపాటి సంప్రతి భారద్వాజగోత్రులు వీరిని గుండ్లవారందురు. ఖండవీలు ౩౮౦ చిరుమామిళ్ల వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గోపరాజువారందురు. ఖండవీలు ౧౫౦ వంకాయలపాడు వెలనాడు సంప్రతి ౧ కౌశికగోత్రులు వీరికి గ్రామము ఖండవీలు ౨౦౦ సొలుసగణికెపూడి ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ కి ఖండవీలు ౪౦ సొలస సంప్రతులు ౪ కి వెలనాడు సంప్రతులు ౨కి గౌతమగోత్ర సంప్రతి కౌశిక గోత్రుల సంప్రతి ౧ చినకూరపాడు పాకనాడు శాడిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బల్లి కుదురనవారు అందురు. ఖండవీలు ౧౨౦ ప్రథముల సంప్రతులు ౨ కి కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦౦ ముప్పాల తెలగాంణ్యుల కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని సంపుటంవారు అందుకు. ఖండవీలు నక్కలగుడిపాడు ప్రధములు భారద్వాజగోత్రులు సంప్రతి ఖండవీలు ౨౪౦ నక్కలగుడిపాడు ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం గోళ్ల పాడు తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ గోళ్ల పాడు తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని మాగంటి వారందురు. ఖండవీలు ౮౦ పడమటి పెంచికలపూడి ప్రథములు భారద్వాజగోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ ముల్కలూరు తెలగాంణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీర్ని పువ్వాడ వారు అందురు. ఖండవీలు ౧౨౦ గుండాల వెలనాడు గౌతమ గోత్రులు సంప్రతి ౧ కి ఖండవీలు ౪ం పడమటి చేతపూడి పాంకనాడు శాండిల్య గోత్రులు సంప్రతి ౧ కి వీరిని బల్లికుదురువారు ఆందురు. ఖండవీలు ౭౦ మునగపాడు ప్రథములు ఆత్రేయగోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ నారాయణాపురం హింకనాతం శాండిల్య గోత్రులు సంప్రతి ౧ కి వీరిని బలికుదురు వారందుకు. ఖండవీలు ౧౪౦ పడమటి కనుపర్రు మోవాడు సంప్రతులు ౨ కి కౌడిన్యస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౩౮౦ రెంగులగడ్డ సంప్రతులు ౪ తెలగాణ్యులు కౌండిన్యస గోత్రులు వీరిని వూరివారు అందురు. కాకుమాను కేసరివాయువులు సంప్రతి వీర్కి గ్రామనామ పరాశర గోత్రులు ఖండవీలు ౪౦౦ ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి వీరిని నుదురుపాటి వారందురు. తూర్పు గరికిపాడు ప్రసరవాయుల సంప్రతి ౧ పరాశరగోత్రుల ఖండవీలు ౧౬౦ నందవరీకుల సంప్రతులు ౨ కి కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని మోపల్లి వారు అందుకు. ఖండవీలు ౨౪ం అడుసుపల్లి మెపాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు ఖండవీలు ౧౨౦ కొంమ్మూరు తెలగాణ్యుల సంప్రతులు ౨ కి లోహిత గోత్రుల సంప్రతి ౧ వీరిని గంగరావు వుప్పుటూరు ప్రథములు సంప్రతులు ౨ కి బెండపూడి వారు ఆనేటివారికి సంప్రతివారు అందురు. శ్రీవత్స గోత్రుల సంప్రతి వీరిని బాగ్రరాజు వారు అందురు. ఖండవీలు ౬౦ మాశీరాజు వారు అనేటివార్కి సంప్రతి ౧ ఖండవీలు బాలపాటి నుపాడు ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ కి ఖండవీలు ౪౦ భిన్నం ...సాయింఖాన గోత్రులు ఖండవీలు ౩౦౦ దక్షిణ దండమూడి నందవరీకులు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ మైదువాలు సంప్రతులు ౨ కి ప్రథములు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వెలనాడు గౌతమ గోత్రులు సంప్రతి ఖండవీలు ౧౨౦ పసుమర్రు వెలనాడు హరితసగోత్రుల సంప్రతి వీరిని భట్రాజువారందురు. ఖండవీలు దక్షిణ వేలూరు సంప్రతులు ౪ కి ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వెలనాడు కౌండిన్యస గోత్రులు సంప్రతి ౦ వీరిని పొత్తురివారు అందురు. వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని నణ్యంవారు అందురు. ఖండవీలు ౩౦౦ యడ్ల పాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పాలపర్రు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ వంగీపురం సంప్రతులు ౨ కి తెలగాణ్యులు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ వీరిని సందెపూడి వారందురు. ప్రథములు కౌడిన్య గోత్రులు సంప్రతి ౧ వీరికి ఖండవీలు ౬౦౦ సందెపూడి నందవరీకులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం దక్షిణ వుప్పలపాడు వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ ప్రత్తిపాడు సంప్రతులు ౨ కి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని యేకావారు అందురు. కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని తొలక కుచ్చువారు అందురు. ఖండనీలు ౮౦౦ అంన్నపర్రు వెలనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రుల ఖండవీలు ... (మాతృక భిన్నమయినది) ౧ పుసులూరు సంప్రతులు 3 కి ప్రథములు సంప్రతులు ౨కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ వీరిని చంన్నాప్రగడవారు అందురు. ఖండవీలు ౧౬౦ దక్షిణ వరగాని ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬ం కొమిరెపూడి పాకనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని శివదేవుని వారందురు. ఖండవీలు ౨౦౦ యలవర్రు గుంట ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ దక్షిణ గాల ౯ పాడు ప్రథములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని నేతివారందురు. ఖండవీలు ౧౮ం మాదల వెలనాడు భారద్వాజ గొత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౮ం పల్లె దేవరపాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬ కేసానుపల్లె యెనుమూలమంద వెలనాడు భారద్వాజ గోత్రులు ౧ సంప్రతి ౬౦ ఖండవీలు వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతులు ౨ ఖండవీలు ౮౦ పడమటి బొల్లవరం ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు పడమటి రుద్రావరం వెలనాడు భరద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ తొండశి వెలనీడు సంప్రతి భారద్వాజ గోత్రులు ఖండవీలు ౧౮ం కొండవీటిశీమ మూలు పడమట జొన్నలగడ్డవెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు పోతవరం వెలనాడు హరితస గోత్రులు సంప్రతి౧ ఖండవీలు ౪౦ యిర్లపాడు పాడు వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు దక్షిణ కోడూరు వెలనాడు హరితస గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు కంటిపూడి పాకనాడు శాండిల్య గోత్రులు సంప్రతి ౧ వీరిని బల్లికుదురువారు అందురు. ఖండవీలు ౮౦ ఆముదాలపల్లె వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౪ం నందిగామం పాకనాడు చికిత్స గోతృలు వీరిని కొణిదెండాక వారు అందురు. ఖండవీలు ౧౬ం చిలుకూరి పాకపాడు చికితస గోత్రులు సంప్రతి వీరిని కొణిదెండాక వారందురు. ఖండవీలు ౪౦ విప్పర్ల వెలనాటి కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం చిరువరు పాంకనాడు చికితస గోత్రులు సంప్రతి ౧ వీరిని కొణిదెండాకవారు అందురు. ఖండవీలు ౧౦౦ వుండవెల్లి ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు సత్తెనపల్లి వెలనాడు సంప్రతులు వెంన్నాదీవి ప్రధములు సంప్రతి వీరిని పచ్చుసవారందురు. ఖండవీలు ౨౦౦ రెంటపాళ్ల తెలగాణ్యులు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ వీరిని రాచపురివారందురు. ఖండవీలు ౪ం కి వెప్పటల్ వెలనాడు కౌశిక గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬ం అబ్బూరు సంప్రతులు ౨ కి పాంకనాడు సంప్రతి శ్రీవత్స గోత్రులు వీరిని శివదేవుని వారందురు ౨౪౦ కరణం కమ్మల సంప్రతి ౧ వీరిని అక్కిరాజు వారు అందురు పెదపణిదెరు సంప్రతులు 3 కి వెలనాడు సంప్రతులు ౨ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని యిద్దనపూడి వారందురు. కాశ్యప గోత్రులు రెండు సంప్రతి ౧ వీరిని ఘతుకుపల్లి వారందురు ప్రధములు సంప్రతి ౧ కాశ్యపగోత్రులే వీరిని కేతన వారందురు ఖండవీలు ౩౮౦ దక్షిణం గోగులపాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం వుంన్న తెలగాంణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు పడమట మజ్జిపూడి తెలఘాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ తూర్పుతోట ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ కొర్నిపాడు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ యామర్రు ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౮ం కోపెల్ల ప్రధవాలు భారద్వాజ గోతులు, సంప్రతి ౧ ఖండవీలు ౬O జాలాది సంప్రతులు 3 కి తెలగాణ్యులు కౌండిన్యసగోత్రులు సంప్రతి ౧ వీరిని సంపటంవారు అందురు. కాశ్యపగోత్రులు వెలనాడు సంప్రతి ౧... వీరిని పుంణ్యమూర్తివారు అందురు తెలగాణ్యులు మూడో సంప్రతి కౌండిన్య గోత్రులు వీరిని గుఱ్ఱంవారు అందురు. ఖండవీలు ౧౨౦ పాతులూరు సంప్రతులు కి ౨ పాకనాడు శీవత్సగోత్రుల సంప్రతి ౧ వీరిని శివదేవువారు అందురు. వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని పాతులూరివారు అందురు. ఖండవీలు ౧౨౦ త్రిపుర సుందరపురం ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం జంగ్గాలపురం సంప్రతులు ౪ కి వెలనాడు సంప్రతి ౧ కాశ్యప గోత్రులు వీరిని నణ్నెంవారు అందురు. తెలగాంణ్యులు కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ వీరిని సంపుటంవారు అందురు కౌడిన్యసగోత్రులు రెండు సంప్రతిం వీరిని గుర్రంవారు అందురు. కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లిపొరువారు అందురు. ఖండవీలు ౧౬౦ చందవరం తెలగాణ్యులు కౌండిన్యు గోత్రుల సంప్రతి ౧ వీరిని సంపటంవారు అందురు. ఖండవీలు ౧౦౦ దక్షిణ పొణుకుమాడు తెలగాణ్యులు కౌండిన్య గోతుల సుప్రతి వీరిని సంపుటంవారు అందురు. ఖండవీలు ౧౮౦ వెలగపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పడమటి గొగుపాడు తెలగాణ్యులు కౌశిక గోత్రులు సంప్రతి ౧ వీరిని రాచపూడి వారందురు ఖండవీలు ౪౮ పీసపాడు వెలనాడు మౌద్గల్య గోత్రుల సంప్రతి ౧ ఖుడవీలు ౮౦ గుడూరు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పడమటి శిరిపురం వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬ం శానంపూడి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని సంపుటం వారు అందురు. ఖ౧౬౦ గర్నెపూడి ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం గుడిపూడి పాకనాడు సంప్రతులు ౨కీ గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని తన్నెపల్లి వారందురు. శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బల్లికుదురు వారందురు ఖండవీలు ౩౦౦పాలడును సంతులు ౨కి వెలనాడు గౌతమస గోత్రులు సంప్రతి౧ఖండవీలు ౪౦౦ చినమంకెన ప్రధములు సంప్రతి ౧ కాశ్యప గోత్రులు వీరిని కేతనవారు అందురు. ఖండవీలు౪ంపడ్మటి చింతలపూడి ప్రధములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ వీరిని కేతనవారు అందురు. ఖండవీలు౬౦యన్మదల సంప్రతులు నాల్గింటికి వెలనాడు కాశ్యప గోత్రులు వీరిని పచ్చి మిరియాలవారందురు. వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి౧వీరిని సంక్కా వారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని లక్క రాజువారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి౧ వీరిని గొల్లపూడివారు అందురు. ఖండవీలు ౮౦౦ వెంక్కటాపురం త్రిపురాపురాలు.౨కి ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి౧వీరిని గణప రాజువారు అందురు. వెంకటాపురం ఖండవీలు౬౦వీరు రెండు గ్రామాదులు అర్వలు జానంచుండూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ఖండవీలు౮౦ కొండిపాడు ప్రధములు శీవత్స గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౩౦ గారపాడు ప్రధములు శ్రీవత్స గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౩౪ సంతరావూరు సంప్రతులు 3 కి అర్వల సంప్రతి ౧ వెలనాడు సంప్రతులు ౨ కి కౌండీన్యగోతుల సంప్రతి అచ్యుతన్నవారు అందురు భారద్వాజ గోత్రుల సంప్రతి వీరిని గాలివారుఅందురు. ఖండవీలు పెదమంకెన ప్రధములు సంప్రతి కాశ్యప గోత్రులు వీరిని కేతనవారు అందురు. ఖండవీలు౮౦పాందురు సంప్రతులు ౨కి వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి౧వీరిని జలగదరికివారు అందురు. అరవల సంప్రతి౧కి ఖండ వీలు౪౦౦దక్షిణ కనుపర్రు వేలనాడు గౌతమ గోతమ గోత్రులవారు సంప్రతి౧ వీరిని కొడవలివారు అందురు. ఖండవీలు ౪౦౦ ఏనుగువారు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతికి౧వీరినే వెలగపూడివారందురు. ఖండవీలు ౨౦౦దక్షిణ ఆనంత్తవరం వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ వీరిని వెల్కపూడివారు అందురు. ఖండవీలు ౧౫౦దక్షిణం వెలగపూడివారు భారద్వాజస గోత్రుల సంప్రతి౧ఖండవీలు౮౦ మట్టి కుంబ ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ఖండవీలు౬ం మోటుపల్లి తెలగాణ్యులు భారద్వాజ గోత్రులు సంప్రతి౧ వీరిని బంద్దేవారు అందురు. ఖండవీలు ౮౦నాయిపల్లిలో సంప్రతి౧ఖండవీలు౬౪ పెదగంజాం వెలనాడు భారద్వాజస గోత్రుల సంప్రతి౧ఖండ వీలు౬ం పెరేచెర్ల పెసరవాయులు మౌద్గల్య గోత్రులు సంప్రతి౧ఖండవీలు౧౬౦యర్రవరం పెసర వాయులు మౌద్గల్య గోత్రుల సంప్రతి౧ఖండ వీలు౭ం పెదపల్కలూరు సంప్రతులు౨కి వెలనాడు... ధంవారు పాలపర్తివారికి మూడు సంప్రతులు యిచ్చిరి. కాడూ—— రామన్న యిచ్చిన మిరాశి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి౧వీరికి మండుగులోను సంప్రతి యిప్పించ్చిరి. ఈకోడూరు భారద్వాజ గోత్రులు మాధవపెద్దివారు అనేటివారికి ఏకభోగం యిచ్చిరి. పెనుపులి రామన్న ఇచ్చిన మిరాశి వెలనాడు గౌతమ గోత్రులు వీరిని యెల్యంపూడి వారందురు. వీరికి కొల్కలూరితోను సంప్రతి యిప్పించి యీపెనుపులివారి సంప్రతి గలవారికి యిచ్చిరి. జన్న సానివారికి ౧ ఆకెళ్ళ వారు అనేటి వారికి జనమంచివారు అనే వారికి యిచ్చిరి. సంప్రతులు3కి పెనుగుదురుపాడు. —— యిచ్చిన మిరాశి ప్రధములు కౌండిన్య గోత్రులు వీరికి సంప్రతి చుండూరీలోను యిప్పించి పెనుగుదురుపాడు రెండు—— వారికి యిచ్చిరి. హరితస గోత్రులయిన నాదేండ్లవారు అనేటి వారికి అగుమంచివారు అనేటివారికి యిచ్చిరి. శ్రీవెలనాటివారికి ౩౬ వేగినాటివారికి 3 ద్రావిళ్ళకు ౫ ఈ గ్రామాదులు ౪౪ రెడ్లు ఆకరణంగాను అగ్రహారాలు యిచ్చిరి. కోమటివేమన్న గృహరాజమేడ కట్టించినాడు. కనకతోరణం కట్టించెను. ఈయన కమామిసునను శ్రీనాథుడు కవీశ్వరుడు సొలస పొలంలో పాలెము యీదోంతిఅల్లా రెడ్డి - వేమాంబ అని కుమార్తె అయిలమ్మ అందురు. ఈ అయిలమ్మ సంక్రాంతి పండుగవస్తేను తనకు ......పండగ ఖర్చు కావలెనని అల్లారెడ్డిని అడిగె గనుకను మనుమరాలికి ఖర్చు యినాంగాను ఆరెండు పాలెములు పొలిమేర గోడలు పెట్టించే గనుకను ఆయిలమ్మవేట అయిలమ్మ——అనిరి. సంక్రాంతి పండుగకు యిచ్చెను గనుక సంక్రాంతిపాళెం అని నామము ఆయెను. అలాయిదా గ్రామాదులు ఆయెను. ఈ రెడ్లవారు కొండవీడు మీద దుర్గం కట్టించిరి కాపు అంశం ౬౦౦౦ బ్రాహ్మలు ౨౦౦ రెండు కొమ్మలు అయితేను కొత్తడంకొత్తడానికి వక ...కిందను కాపు 200 చొప్పున...కాపు౧౨౦౦౦. పులిచెర్ల కొనేటి అయ్యబురుజు ౧ ఆళ్ళవాబురుజు బ్రహ్మ దేవర గుండమల్ల గండమ్మ బురుజు... స్నబురుజు పోతరాజు బురుజు౧... రాజుబురుజు.. తిప్పనిబురుజు... తిరుపతి అనే బురుజు౧ మిర్వా...ఝుట్టిబురుజు౧ చుక్కలకొండ౧ నెమళ్ళకొండ ౧ పాముల కుర్వ౧ ఎడుకొండలు౧ గంజి కాలువ౧ సబ్జా...పడమటి పెదగుని౧ తూర్పున కట్టెలనది౧. ఈ చెప్పున బురుజులకు పేర్లు. ఈ బురుజులకు కొత్తడాలు కాళేనాయకులు... మెహతాదుల పేర్లు ఉదయరావు పాజనరావు గణపతిపరావు మరిన్ని... కటినేండు సూరపనేడు యెలనేడు. ౩౦౦ వెలమ నాయకులు బలిజనాయకులు వినోదరావు, పరిపాపతిరావు, భూపతిరావు, ముండల నేడు సోమరౌతుజక్కా నాయకుడు, అంకానాయకుడు, పంద్రంగిరామానాయకుడు, తులువా వెంకటాదిరామానాయకుడు, సూరానాయకుడు, శ్రీగిరి నాయకుడు, బిసాబత్తుడు, యిక్కుర్తి తిమ్మానాయకుడు.. . కొండానాయకుడు బీరంరంగారావు, అంజేటి యర్రానాయకుడు, ముత్యాల నాయకుడు, మంగపోతు వీరు బలిజనాయకులు...నాయకుడు హసనునాయకుడు, అబ్జలు...నాయడు, అల్లినాయకుడు, రాజానాయకుడు, కరీంనాయకుడు, దావలచినాయకుడు, వీరు తారకనాయకులు. ఈ నాయకులు తయినాతులువున్న.....౧౨౦౦౦ యిచొప్పున దుర్గంకాపు వినికొండ, బిలంకొండ. నాగార్జునకొండ దుర్గాలు ఈచొప్పునగా... కాడై గజపతి...లకు అలవిగాకను ఉండేరెడ్డి కర్ణాటకులను వేరుపడి... కొండవీటి సీమలు ౧౪కి దుర్గాలు గురమ్మ వారికి దేవతా... వేదినిక్షేపంశ్రీనాధుడు కవీశ్వరుడు వారికీర్తి ప్రఖ్యాతి... నానాదేశాలయందు విన...ఆయెను. . .కృష్ణ దేవరాయలకు... శ్రీనాధుని కవనం రెడ్లవారు కవీశ్వరుడని... వినికిడి ఆయెగను శ్రీనాధుణ్ణి చూడవలెనని పిలుపించే గనుక శ్రీనాధుడు విజయనగరంపోయి రాయల సన్ని ధానమందునను నిలిచినంతలోను శ్రీనాధుడు... లేదు గనుకను నదియేవూరని అడిగె గనుకను శ్రీనాధుడు రాయల దేవునితో ఇచ్చిన పద్యం ॥

సీస పద్యం ॥ పరరాజు పరదుర్గ పరవైభవ ప్రజలకొసకొని విడనాడు
కొండవీడు పరిపంధి రాజస్య బలము
బంధించు। గురుతైన వురుద్రాడు భటుల విక్రమ
కళాసాహసం బొనరించు కుటివారునకు జోడు
ముగురు రాజులకును మోహంబు బుట్టించు కొమర
మించిన యట్టి కొండవీడు భటుల మత్తేభ
సామంత పరివీరభటన నెకహటి ప్రకట గంధ
శిందురార్భట మోహనాశ్రీల దనరు కూర్మినమరావతికి జోడు కొండవీడు౹౹

ఖండవీలు ౧౨౦ దక్షిణ అనంతవరం వెలనాడు భారద్వాజ గోత్రం సంప్రతి౧ వీరిని మొక్కపాటివారు అందురు. ఖండవీలు ౧౫౦ దక్షిణ వెలగపూడి వెలనాడు భారధ్వాజస గోత్రులు సంప్రతి ౧ఖండవీలు ౮ం మట్టికుంట ప్రధములు భారద్వాజస గోతుల సంప్రతి౧ వీరిని మిద్దెవారందురు. ఖండవీలు ౮౦ నాయిపల్లి అరవకుల సంప్రతి ౧ ఖండవీలు పెద్ద గంజాం వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు మేడివెర్ల... సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ యర్రవరం కొసరునాయలు మౌద్గల్యగోత్రుల సంప్రతి ౧ ఖండ వీలు ౧౦ పెదపల్కలూరు సంప్రతులు ౨ కి వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౩౦౦ చిన పల్కలూరు ప్రథములు సంప్రతి ౧ కౌండిన్యస గోత్రులు వీరిని పట్టస్వామి వారందురు. ఖండవీలు ౪౦ మల్లవరం వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ గోపీనాథపురం వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ఖండవీలు ౪ం చినపణిదేరం సంప్రతులు ౨ కి వెలనాడు భారద్వాజగోత్రులు సంప్రతి ౧ ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరు పట్టస్వామివారందురు. ఖండవీలు ౬ం విస్తల ప్రథములు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు ౬౦ వెలపర్తి పాడు వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ఖండవీలు ౪౦ దక్షిణ పొట్టపాడు వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ మేడుకొండూరు వెలనాడు సంప్రతులు 3 కి పరాశర గోత్రులు సంప్రతి ౧ వీరిని అక్కిరాజువారు అందురు. శౌనక గోత్రులు సంప్రతి ౧ వీరిని భట్టిప్రోలు వారందురు. ఖండవీలు ౫౦౦ సరిపూడి వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని భట్టిప్రోలు వారందురు. ఖండవీలు ౫౦ కొర్రపాడు సంత్తులు ౨ కి పాకనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు వీరిని శివదేవుని వారందురు. ప్రథములు సంప్రతి కాశ్యప గోత్రులు ఖండవీలు ౩౮౦ వీరిని కేతన వారందురు. ఉత్తరగంగవరం నందవరీకులు సంప్రతి ౧ గౌతమ గోత్రుల ఖండవీలు ౪ం పెదకూరపాడు సంప్రతులు కి కౌండిన్య గోత్రుల సంప్రతి గౌతమగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦౦ దక్షిణ గంగవరం నందవరీకులు గౌతమ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం పోడపాడు నందవరీకుల సంప్రతి ౧ శౌనక గోత్రులు వీరిని నూతక్కి వారందురు. ఖండవీలు ౬౦ వుత్తరలింగంగుంట ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ ఉత్తర బేతపూడి ప్రధముల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల ఖండవీలు ౧౦౦ అయ్నివోలు ప్రథముల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ కురుగల్లు ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని కేసనపల్లి వారు అందురు. ఖండవీలు కాలూరు వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౨౪ బట్లూరు ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని కొండవారు అందురు. ఖండవీలు ౨౦ లగడపాడు ప్రథములు. కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని కేతనవారు అందురు. ఖండవీలు ౮౦ గారపాడు ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ సంన్నెకండ్లపాడు ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ ములుకుట్ల ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ యినుమనగుండ్ల ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖ డవీలు ౫౦ బాలెమర్రు వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖడవీలు ౬౦ పొందుగుల వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ కస్తుల వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ ఉత్తర జంపల్లి ప్రథములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ ఉత్తరకోపల్లె ప్రథములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం ఉత్తర పొట్టపాడు ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ బియ్యవరం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు వూంటుకూరు నందవరీకులు కాశ్యప గోతులు సంప్రతి ౧ ఖండవీలు ౧౮౦ గోనుగుంట్ల ప్రథములు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ గజరాకేలూరు నంద వరీకులు కౌశికగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౫ం గ్రంధెశిరి నందవరీకులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ ఆంబ్బటిపూడి నందవరీకులు భారద్వాజ 'గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కొండకూడూరువారు వెలనాడు సంప్రతి ౧ గౌతమగోత్రులు వీర్ని పిల్ల లమర్రివారు అందురు. ఖండవీలు ౮౦ చవ౯వరం వెలనాడు సంప్రతి ౧ కోకంటి గుండ్ల నందవరీకుల సంప్రతి౧ (మాతృభిన్నము) వెరిటపాడు ప్రథముల సంప్రతి ౧ శిద్దాపురం ప్రథముల సంప్రతి ౧ అనంతవరం ప్రథములు సంప్రతి ౧ అనంతవరం ప్రథముల సంప్రతి ౧ చినపాడు నందవరీకులు సంప్రతి ౧ పెదపాడు ప్రథముల సంప్రతి ౧ నల్ల పాడు ప్రథముల సంప్రతి ౧ తిమ్మాపురం ప్రథముల సంప్రతి ౧ పుత్తర రుద్రవరం నందవరీకుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు వోరువకల్లు వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి వీరిని యద్ధనపూడివారు అందురు. (మాతృభిన్నం) మునుగోడు సంప్రతులు ౨ కి పరాశర గోత్రులను తుర్కావారందురు. కాశ్యపగోత్రులను యద్దనపూడి వారందురు. ఖండవీలు .

౩౦౦ బలుసుమూడు తెలగాణ్యులు సంప్రతులు ౨ కి పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని బందెవారు అందురు. ఖండవీలు ౪౦౦ ఆత్తలూరి వెలనాడు సంప్రతులు ౨ కి గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని ధూళిమెట్టవారందురు. ఖండవీలు ౬౦౦ దిగుడు వెలనాడు సంప్రతులు ౨ కి కౌశిక గోత్రుల సంప్రతి కటికూరి వారందరు. గౌతమ గోత్రుల సంప్రతి వీరిని ధూళిమెట్టవారు అందురు. ఖండవీలు ౪౪౦౦ మల్లాది వెలనాడు సంప్రతులు ౨ కి కౌశిక గోత్రులు కటకూరివారందురు. సంప్రతి౧ధూళిమెట్లవారి సంప్రతి ఖండవీలు ౧౨౦ తమ్మవరం వెలనాడు సంప్రతులు ౨కి ధూళిమెట్టవారున్ను గౌతమగోత్రీకులై కటకూరి వారున్ను ఖండవీలు ౪ం కాశిపాడు ప్రధములు సంప్రతి౧భారద్వాజ గోత్రులు వీరిని రాజనాలవారు అందురు ఖండవీలు ౧౬ం పడమట మంగళగిరి ప్రధములు సంప్రతి కౌండిన్య గోత్రులు ఖండవీలు ౪ం దేచవరం కరణకంమ్ములు సంప్రతి జమదగ్ని గోత్రులు ఖండవీలు౪౦పుత్తర వొణుకుమాడు కరణకంమ్ములు జమదగ్ని గోత్రులు సంప్రతి ౧ ఖండ వీలు ౨౪ రామాపురం ప్రధములు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు వీరిని జలదంకివారు ఆందురు. ఖండవీలు ౬ం పడమటి గోరంట్ల నందవరీకులు సంప్రతులున౨కి శ్రీవత్స గోత్రులు సంప్రతి౧కౌండిన్య గోత్రుల సంపత్రి ౧ (మాతృభిన్నం) పడమట గర్కిపాడు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి౧ తాంళ్లూరు వెలనాడు సంప్రతులు ౨కి పాకనాడు శ్రీ వత్సగోత్రుల సంప్రతి౧వీరిని శివదేవునివారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి౧రావెల తెలగాణ్యులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ యెతడక వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు వీరిని హొరకవివారు అందుకు. ఖ ౧౦౦ పోంన్నకల్లు వెలనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు నిడుముక్కల వెలనాడు కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ పెయ్యల మెట్ట వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦కోనూరి నందవరీకులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వారిని నేపాళునివారు అందురు. ఖండవీలు పామర్రు తెలగాణ్యులు కంణ్యసగోత్రులు సంప్రతి ౧ వీరిని యీశ్వరాయనివారందురు. చల్లగిరి తెలగాణ్యులు కణ్వస గోత్రుల సంప్రతి ౧ వీరిని యీశ్వరాయనివారందురు. - తాడువాయి తెలగాణ్యులు కంణ్వస గోత్రులు సంప్రతి ౧ వీరిని యీశ్వరాయనివారు అందురు గింజుపల్లి తెలగాణ్యులు ఖంణ్వస గోత్రుల సంప్రతి వీరిని యీశ్వరాయవారు అందురు వీరినేనాగనాథునివారు అందురు. జటపల్లెవెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పాటిబండ్లవారు అందురు. మాడిపాడు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పాటిబండ్లవారు అందురు. వుత్తర చింతపల్లి తెలగాణ్యులు కణ్వస గోత్రుల సంప్రతి ౧ వీరిని యీశ్వరాయవారు అందురు కుంటమద్ది వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పాటిబండ్ల వారందురు. పాములపాడు వెలనాడు (మాతృభిన్నం) వుత్తర వెల్కపూడి వెలనాడు, పెదమద్దూరు వెలనాడు, భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ బంద్ధం రావూరు సంప్రతి ౧ ప్రథములు రావిపూడి సంప్రతులు ౨కి ఆత్రేయ గోత్రు సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని మాదిరాజువారందుకు. మందడం సంప్రతులు ౨ కి (మాతృభిన్నం) వుండవెల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కి తోడేపల్లి వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ పోతూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని విఠలారాజువారందురు. సుబ్బనపల్లి సంప్రతులు ౨కి వెలనాడు కణ్వస గోత్రుల సంప్రతి ౧ ప్రధములు సంప్రతి ౧ తూములూరు తెలగాణ్యులు వాధూల గోత్రులు వీరికి కస్తూరి వారందురు. ఖండవీలు ౪ం వుప్పుమాగులూరు వెలనాడు సంప్రతి ౧(మాతృ భిన్నం) తాడికొండ వెలనాడు సంప్రతి ౧ శాండల్య గోత్రుల వీరిని దొంతరాజువారు అందురు. ఖండవీలు ౫౦౦ ముక్కాయలు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦౦ పాటి బండ్ల వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౫౨ం నేలపాడు వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౧౫౦ నెక్కట్ల వెలనాడు సంప్రతి ఖండవీలు ౮౦ వుత్తరపరిమ వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ అంతవరం ప్రథముల సంప్రతి ౧ ఖండవీలు ౬ం నీరుకొండ ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ కర్లపూడి వెలనాడు సంప్రతి భారద్వాజ గోత్రులు వీరిని మాంచ్చాలవారందురు. నిడుమర్రు వెలనాడు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౨౦ వెనిగుండ్ల ప్రథములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪ం బండారుపల్లె ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని గోవాడవారు అందురు. తూర్పు గరికెపాడు ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని గోవాడవారు అందురు. ఖండవీలు ౬౦ తూర్పు గోరంట వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ తెలగాణ్యుల సంప్రతి ౧ శౌనక గోత్రులు ఖండవీలు ౧౮౦ కంత్తేరు వెలనాడు కౌండిన్యస గోత్రులు సంప్రతి దామరపల్లె వెలనాడు సంప్రతులు ౨ కి హరితస గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు సంత్రత్తి ౧ ఖండవీలు ౧౦౦ పొత్తూరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ నల్లపాడు సంప్రతులు ౩కి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని పొత్తూరు వారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి ౧ భారద్వాజ గోత్రీకుల సంప్రతి ఖండవీలు ౪౫౦ గుంటూరు సంప్రతులు 3 కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని పొత్తూరివారు అందురు. వీరు వెలనాడు తెలగాణ్యులు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లెలవారందుకు తెలగాణ్యులు గాగెటీయ గోత్రులు సంప్రతి ౧ వీరిని పెద్దిరాజు వారందురు. యీ గుంటూరు ఖుడవీలు ౧౨౫౦ కి పాలెము ౪ కి పాలిమేర హద్దులు అలాయిదా వేశి గ్రామాదులు వేశి కొరిటిపాటి ఖండవీలు ౧౫౦ గరికెపాటి ఖండవీలు ౬౦ ఆగతవరం ఖండవీలు ౪౦ బుడుమపాడు ఖండవీలు ౨౫౦ యీపాలెములుజయినులు కాపురాలు వుంన్నవి. గనుక అలాయిదా గ్రామములు వేశి పాలెములు ఖండవీలు ౪౫ం పోగాను గుంటూరు కింద నిలచిన ఖండవీలు ౮౦౦ గడ్డిపాడు ప్రధములకు సంప్రతి భారద్వాజ గోత్రులు రెండు బంతుల వారు ఖండవీలు ఆగితవరం ప్రధముల సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు ౮౦ కొరిటిపాడు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౨౫౦ యీనాలుగు అలాయిదా గ్రామాలు చేశి మిరాశీలు యిచ్చెను. దక్షిణ పెద్దకాకాని వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౨౦౦ నంబూరు వెలనాడు సంప్రతి ౧ ఖణ్వస గోత్రులు ఖండవీలు ౨౬౦ కాజడ సంప్రతి వెలనాడు పరాశక గోత్రులు ఖండవీలు ౫౬ం వుత్తర చినకాకాని వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ తూర్పు జొన్నలగడ్డ వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ తూర్పు మంగళగిరి వెలనాడు సంప్రతి ౧ ఖంణ్వస గోత్రులు 3౫౦ ఆతుకూరు తెలగాణ్యులు పరాశర గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౬ం వుత్తర వుప్పలపాడు ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ దక్షిణ వుప్పలపాడు వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కొప్పరావూరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ సుద్ద

పల్లి ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౧౮ం మేంజెండ్ల ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ దక్షిణ గుండవరం వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు వీరిని అన్నదాన భొట్లవారు అందురు. ఖండవీలు ౬౦ చెముళ్ళ మూడి వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు ఖండవీలు ౬౦ దక్షిణ నారా కోడూరు సంప్రతులు ౨కి పాకనాడు శ్రీవత్స గోత్రులు శివదేవుని వారందురు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని సాధువారు అందురు. ఖండవీలు (మాతృ భిన్నం) గోడవర్రు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪౦ నైనవరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కొల్కలూరు వెలనాడు సంప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని గోపరాజువారు అందురు. పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని మాదిరాజువారు అందురు. ఖండవీలు ౮౦౦ వెనుపులి వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని యెల్లంపూడి వారందురు. ఖండవీలు ౧౮౦ అనుమర్ల పూడి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ఖండవీలు ౧౨౦ శేకూరు తెలగాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪౦ శలపాడు తెలగాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ తంగేళ్ళమూడి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి జాగర్లమూడి ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ యడ్లపల్లి సంప్రతులు ౨కి శ్రీవత్స గోత్రులు ప్రధములు సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరిని తురకావారు అందురు. ఖండవీలు ౮౦ వడ్లమూడి సంప్రతులు ౨ కి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వెలనాడు ఆనంత్తవరం ప్రధములు ఖండవీలు ౧౬౦ చేబ్రోలు సంప్రతులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని తుకకావారు అందురు. ఖ ౧౬౦ కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని బేచిరాజువారందురు. హరితస గోత్రుల సంప్రతి ౧ కి వీరిని కొంమ్మరాజువారందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కి వీరిని మల్లా ప్రెగడ వారందురు. చంన్నా ప్రెగడ వారి సంప్రతి ౧ ఖండవీలు ౬౦౦ కోవెల మూడి చంన్నా ప్రేగడవారు అందురు. ఖండవీలు ౧ళ౦ కోమిరిమూడి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లా ప్రెగడవారందురు. ఖండవీలు ౪ం నారికేళ పల్లెవెలనాడు హరితస గోత్రుల వారిని కొంమ్మ రాజువారు అందురు. సంప్రతి ౧ ఖండవీలు ౪౦. శ్రీరంగపురం కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ వీరిని దేచిరాజువారు అందురు. ఖండ వీలు ౪౦ యీశ్రీరంగపురం పూర్వం మూడు పూళ్ళపొలం కూర్చివూరు చేసినారు. వడ్లమూడి పొలంలో—ర్జంచెలియిపదింన్ని పెరుగుదురపాడు పురం ఖండవీలు ౧౬ న్ను చేబ్రోలు పొలంలో ఖండవీలు ౧౬ యీనలభై ఖండవీలు గ్రామంచేశిరి. పెనుగుదురుపాడు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వలివేరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని సమయ మంత్రి వారు అందురు. అంగలకుదురు నందవరీకులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కోరుతాడిపర్రు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని చంద్రమౌళి వారందురు. ఖండవీలు మంచ్బాళ్ళ వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ వట్టి చెర్కురు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ లేమల్లె వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ దక్షిణ చింత్తపల్లె కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ క్కారెంపూడి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కాట్రపాడు వెలనాడు కాశ్యపశ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పడమటి అనంత్తవరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ గొడ్లమూడి వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు 3౦ వుత్తర అన్నవరం భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬ తూర్పుదండమూడి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని సావడివారు అందురు. కొల్లిమర్ల వెలనాడు భారద్వాజ కణ్వస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం కొల్లికొండ ప్రధములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం వీరినే కేతనవారు అందురు. వఠేశ్వరం ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ఖండవీలు ౪ం వీరినే కేతన వారు అందుకు. యిప్పటం ప్రధములు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౫౦ గుండి మెడ వెలనాడు కంణ్వస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ చినవడ్లపూడి ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౨౪ చినవడ్లపూడి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ దేవంత్తుని వారు నందవరీకులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౮ పెదవడ్లపూడి వెలనాడు సంప్రతి ౧ వీరిని ముచ్చివారు అందురు. ఖండ వీలు ౧౪౦ తూర్పు దొండపాడు వెలనాడు సంప్రతి వీరిని మచ్చిరాజువారు అందురు. చిత్రావూరు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦ కొల్లెంపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు 3౦ కఠాంరాజు కొండూరు వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ మంచ్చికలపూడి పాకనాడు చికితస గోత్రుల సంప్రతి ౧ వీరిని కాణిదెంవారు అందురు. ఖండవీలు 3౨౦ దుగ్గిరాలపూడి పాకనాడు చికితస గోత్రుల సంప్రతి ౧ వీరిని కొణిదెంపాకవారు అందురు. ఖండవీలు ౧౬౦ చిరువూరి సంప్రతులు ౨కి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ హరితస గోతులు వీరిని కొమ్మరాజువారు అందురు. తెలగాణ్యం సంప్రతి ౧ హరితస గోత్రులు వీరిని వేంగ్గిరాజువారు అందురు. ఖండవీలు ౪౦౦ బొల్లవరం బ్రొతుములు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం శృంగారంపాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని గాదిరాజు వారు అందురు. ఖండవీలు ౪ం యీవని పాకనాడు శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బల్లికుదురు వారు అందురు. ఖండవీలు ౪౦౦ బోడివరం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ జువ్వెపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ వుత్తర చింతలపూడి ప్రధములు సంప్రతి ౧ గౌతమ గోత్రుల సంప్రతులు వీరిని బుద్దవరపువారు అందురు. ఖండవీలు ౧౦౦ నూతక్కి వెలనాడు సంప్రతులు ౨ కి కౌండిన్యస గోత్రుల సంప్రతి ౧ శ్రీవత్సస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦౦ వెరకుపూడి పాకనాడు సంప్రతులు ౨ కి భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని మల్లినాధవారు అందురు. శ్రీవత్స గోత్రులు పాకనాడు సంప్రతి ౧ వీరిని శివదేవుని వారందురు. ఖడంవీలు ౪ం దుర్గంపూడి తెలగాణ్యులు హరితస గోత్రుల సంప్రతి ౧ వీరిని వేంగ్గీవారు అందురు. ఖండవీలు ౪౦ మోరపూడి పాకనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని శివలేవుల వారు అందురు. ఖండవీలు ౪ం పెదకొండూరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని బొందిపాటివారు అందురు. ఖండవీలు ౪౦౦ యెక్కటల పెనుమర్రు వెలనాడు ముద్దటి గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం గొడవర్రు పాకనాడు శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరినిబల్లికుదురువారు ఆందురు. ఖండవీలు ౬ం మున్నంగి వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం దంత్తలూరు పాకనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని అడిదెంవారు ఆందురు ఖండవీలు ౬౦ పెదపర్రువెలనాడు గౌతమస గోత్రుల సంప్రతి౧వీరిని మండెంగవారు అనిరి. ఖండవీలు ౬ం చివ్వలూరు ప్రధములు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని ఉప్పలూరు వారందురు. ఖండవీలు ౮౦ అత్తోట వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ తూర్పు శిరిపురం వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం కొల్లిపర్ల వెలనాడు సంప్రతులు ౨కి కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని అంబ్బావారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని పెగడరాజు వారందురు. ఖండవీలు ౪౦౦ నందివెలుగు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ యెరికెలపూడి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి వీరిని గొల్లూరివారు అందురు. ఖండ వీలు ౩౦ తెలపోలు పాకనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి వీర్ని తుర్కా వారందురు. ఖండ వీలు ౨౫ అయితానగరు నందవరీకులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ వెలనాడిపాకనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని తుక్కావారందురు. ఖండవీలు 3౨౦ బందవరము వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ వీరిని కరణాల వారు అందురు. రాజనాపురం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గొప్పల వారు అందురు. ఖండవీలు ౪ం దావూలూరు ప్రథములు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౬0 బుర్రనిపాలెం వెలనాడు గౌతమ గోత్ప్రుల సంప్రతింఖండవీలు ౧౪౦ చినరావూరు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ పెదరావూరు తెలగాణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పుచ్చరాజు వారు అందురు. ఖండవీలు ౧౬౦ పెదపూడి తెలగాంణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని పుచ్చరాజు వారందురు. ఖండవీలు ౬౦ పినపాడు వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రులు వీరిని లక్కరాజు వారందురు. ఖండవీలు ౬ం అంతుమూడి వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని గాదిరాజువారందురు చిలుమూరు వెలనాడు శఠమర్షణ గోత్రుల సంప్రతి ౧ వీరిని అంన్నా పెగడవారు అందురు ఖండవీలు ౩౬ం అంన్నవరం వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని గాదిరాజు వారందురు. ఖండవీలు యీపూరు వెలనాడు సంప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని అక్కరాజువారు అందురు. శాండిల్య గోత్రుల సంప్రతి వీరిని అమ్మరాజు వారందురు. ఖండవీలు ౧౬౦ వెల్లమాడు వెలనాడు శాండిల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని అంమ్మరాజు వారందురు. ఖండవీలు ౬ం బలిజేపల్లి ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ నంద్దిపాడు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ బొద్దలూరు ప్రథములు శ్రీవత్సగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం బెముడు మూడు వెలనాడు హరితస గోత్రు సంప్రతి ౧ వీరిని అబ్బూరివారందురు. ఖండవీలు ౬౦ వుత్తర పట్ల ప్రధములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని నాదెండ్ల వారు అందురు. ఖండవీలు ౪౦ కొల్లూరు వెలనాడు పరాశర గోతులు సంప్రతి వీరిని నాదెండ్ల వారందురు. ఖ౩౪ం గుండ్ల పల్లి వెలనాడులోహిత గోత్రుల సంప్రతి ౧ వీరిని కర్లపాటివారందురు. ఖండవీలు నడిమిపల్లె వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౦ వీరిని కెర్ల పాటివారందురు. ఖండవీలు గూడపల్లి వెలనాడు లోహిత గోత్రులు సంప్రతి ౧ వీరిని కొర్లపాటివారు అందురు. ఖండవీలు ౬ం ఆరేపల్లి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ పొంన్నపల్లి ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ తూర్పు పెంచ్చికలపూడి ప్రధములు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతులు ఖండవీలు ౨౪ పెరవలి వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని జడవారు అందరు ఖండవీలు పెదకొండిపర్రు వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని ఆడిదెంవారు అందురు. ఖండవీలు పెనువర్రు వెలనాడు ఆత్రేయగోత్రుల సంప్రతి ౧ వీరిని ఆడిదెంవారు అందురు.ఖండవీలు ౮౦ అద్దేపల్లి తెలగాణ్యులు పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని బండా వారు అందురు. ఖండవీలు ౧౨ం గరులింద్దపల్లి తెలగాణ్యులు పరాశరగోత్రుల సంప్రతి ౧ వీరిని బండా వారు ఆందురు. ఖండవీలు ౪ం చినపులివర్రు తెలగాణ్యులు పరాశర గోత్రుల సంప్రతి ౧ వీరిని బండా వారు ఆందురు. ఖండవీలు ౬౦ అనంతవరం వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గుధంవారు అందరు. ఖండవీలు ౨౪ పెనుమూడి వెలనాడు కౌశికగోత్రుల సంప్రతి ౧ వీరిని కొండ్డవారు అందురు. ఖండవీలు ౮౦ దోనేపూడి వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ వెల్లటూరు వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ గొరికెపూడి వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ పెదపులిపర్రు వెలనాడు సంప్రతులు ౨ కి భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని చరాజువారందురు మౌద్గల్య గోత్రుల సంప్రతి ౧ కి వీరిని పులిగడ్డవారు అందురు.ఖండవీలు ౪౦౦ ఆళ్ళమూడి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ఖండవీలు లాం దర్శివెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ఖండవీలు ఓం జల్లేపల్లి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ఖండవీలు ౬౦ కొల్లి వాయి వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని వుర్మి వారు అందురు. ఖండవీలు ౪ం పల్లెకోన వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ ముద్దనంపాడు వెలనాడు కాశ్యపగోతుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ రావి అనంత్తవరం వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతీ ౧ ఖండవీలు ౪ం తూర్పు వేమవరం వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫ం మారేపల్లి వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౫౦ వూపూడి వెలనాడు పరాశర గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ విశ్వేశ్వరం వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ అరవపల్లె వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని వడ్లమూడివారందురు. ఖండవీలు ౪ం నల్లూరు వెలనాడు సంప్రతులు ౨కి ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ శౌనక గోత్రుల సంప్రతి ౧ వీరిని రుద్రదేవునివారు అందురు. ఖండవీలు ౩౮ం బూళికపల్లె పెసరు వాయువులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦... జయవరం వెలనాడు కౌండిన్యగోత్రుల సంప్రతి ౧ వీరిని శానంపూడి వారందురు. ఖండవీలు ౫ం ఆద్దవరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని శానంపూడి వారందురు. ఖండవీలు ౯౦ రాచూరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని శానంపూడి వారు అందురు. ఖండవీలు ౬౦ వోలెరు వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు వీరిని అక్కరాజువారు ఆందురు. ఖండవీలు ౩౦ పెంట్టరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి వీరిని వడ్లమూడివారు అందురు. ఖండవీలు ౩౨౦ రేపూడిపీటరుపాలెం అలాయిదాగ్రామాదులు ఆయను కౌండిన్య గోత్రులు వడ్లమూడి వారందురు. సంప్రతి ౧ ఖండవీలు ౨౪ దక్షిణ చేతవూడి వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ తూర్పు రుద్రవరం గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని విశ్వాత్ములవారు అందురు. ఖండవీలు ౧౬ చాట్రగడ్ర వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని విశ్వాత్ములవారు అందురు. ఖండవీలు ౪ం కామరాజు గడ్డవెలనాడు గౌతుమ గోత్రుల సంప్రతి ౧ వీరిని విశ్వాత్ములవారు అందురు ఖండవీలు ౫౦ కొమరవోలు తెలగాణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౪ భట్టుప్రోలు వెలనాడు సంప్రతులు ౨కి సంప్రతి ఖండవీలు భారద్వాజ గోత్రులది. కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ కామమూరు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ చినకోడిపర్రు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ చావలివెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని పింగళివారు అందురు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కనగాలు సంప్రతులు ౨ తెలగాణ్యులు వాధూల గోత్రుల సంప్రతి ౧ వీరిని కస్తూరివారు అందురు వెలనాడు సంప్రతి ౧ శ్రీవత్స గోత్రులు వీరిని మొఖాల వారు అందురు ఖండవీలు ౧౨౦ యింటూరు సంప్రతులు ౨ కి ప్రధములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని కేతనవారు అందురు. ఖండవీలు వెలనాడు సంప్రతి పరాశర గోత్రుల సంప్రతులు వీరిని బొమ్మరాజువారు అందురు. ఖండవీలు ౨౦౦ దగ్గుబల్లి వెలనాడు వశిష్ఠ గోత్రుల సంప్రతి ౧ ఖందవీలు ౪ం గోవాడ నందవరీకుల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౪ం యలవర్రు ప్రధములు కౌశిక గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం కొండమురి తెలగాణ్యులు సంప్రతులు ౨కి కాశ్యప గోత్రుల సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని బోల్లావారు అందుకు. ఖండవీలు ౮౦ యోపర్రు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ తురిమెళ్ల సంప్రతులు ౨కి ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ వెంపర్రు వెలనాడు శ్రీవత్స గోత్రులు సంప్రతి ౧ వీరిని వెమోశాలివారు అందురు. ఖండవీలు అంచోడపాడు వెలనాడు శ్రీవత్సగోతుల సుప్రతి వీరిని మోహలవారు అందురు. ఖండవీలు ౪౦ మోదుకూరు సంప్రతులు ౨కి ఆర్వలు ఖండవీలు ౨౦౦ చూడూరు సంప్రతి ౧ కి వెలనాడు శధమర్షణ గోత్రుల సంప్రతి ౧ వీరిని అన్నా ప్రెగడవారు అందురు. వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని మామిడివారు అందురు. ...ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨ళం కందెపి ప్రథములు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ చినగాదెలవరు నందవరీకులు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ పెదగాదెలవర్రు ప్రథములు సంప్రతి ఖండవీలు ౬౦ దక్షిణపరిమి ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కొత్తపల్లె వెలనాడు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ వీరిని శివదేవునివారు అందురు. ఖండవీలు ౫౦ మామిళ్ల పల్లె సంప్రతులు ౨ కి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ తెలగాణ్యులు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౫౦ తొంట్టిపూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గండవరపువారు అందురు. ఖండవీలు ౪ం వెల్లటూరు వెలనాడు శౌనగగోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౬౦ వేమూరు సంప్రతులు ౨ కి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని భీమరాజువారు అందురు. నందవరీకుల సంప్రతి ౧ వసిష్ఠ గోత్రులు ఖండవీలు ౧౬౦ జంపని వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦౦ యడపూరు వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ పచ్చళ్లపాడు వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు నందిరాజువారు అందురు. ఖండవీలు ౬౦ చదలవాడ వెలనాడు ప్రధములు సంప్రతి ౧ ఖండవీలు ౮౦ కామర్లమూడి ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ం జాతుపల్లి వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు ఖండవీలు ౩౦ ఆలపాడు ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪ం మండూరు సంప్రతులు ౨కి వెలనాడు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ వీరిని ముతకమల్లి వారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని సమయమంత్రి వారు అందురు. ఖండవీలు ౨౪౦ కూచిపూడి నందవరీకుల సంప్రతి ౧ కాశ్యపగోత్రుల ఖండవీలు ౧౨౦ పులిచింతల నందవరీకుల సంప్రతి ౧ ఖండవీలు ౨౦ మూలుపూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం పాంచాళ్లవరం వెలనాడు సంప్రతి ౧ ఆత్రేయ గోత్రుల సంప్రతులు వీరిని గడ్డవడవారు అందురు. ఖండవీలు ౬౦ కంటెపూడి ప్రధములు గార్గేయ గోత్రులు సంప్రతి ౧ ఖండవీలు ౪౦ కుంమ్మమూరు సంప్రతులు 3 కి వెలనాడు సంప్రతులు ౨కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని పరాజువారు అందురు. కొటికెలపూడి అనేటివారు సంప్రతి ౧ శౌనక గోత్రుల సంప్రతి ౧ వీరిని కొణిదెంబాక వారు అందురు. యిరికెంబాడు వెలనాడు గొర్గేయ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ పొన్నూరు తెలగాణ్యులు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౮౦ అల్లూరు తెలగాణ్యులు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ అరిమండ కరణ కమ్ముల సంప్రతి ౧ జమదగ్ని గోత్రుల ఖండవీలు ౬౦ కనపర్రు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ దక్షిణ చింతలపూడి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి వీరిని యడ్ల పల్లివారు అందురు. ఖండవీలు ౬ం నిడుబ్రోలు సంప్రతులు 3 కి నందవరీకులు భారద్వాజ గోత్రుల సంప్రతి వీరిని కట్టువారు అందురు. ప్రధముల సంప్రతి ౧ వీరిని కూనపూలివారు అందురు. వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరిని పూసపాటి వారు అందురు. ఖండవీలు ౧౬౦ వొడ్డిముక్కల భారద్వాజ గోత్రులు వెలనాడు సంప్రతి ౧ వీరిని పూసపాటివారు అందురు ఖండవీలు ౫౦ కొమలి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ జడపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ తూర్పు కోడూరు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౩౬ తూర్పు బొల్లవరం ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ వెలిచర్ల వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ నేరేడుపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦ ములకుదురు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ పాలపర్రు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ తూర్పుచుండూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ మాచయపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ పూండ్ల వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౦౦ (ఎక్కడ నుంచి భింన్నపు పత్రిక) అప్పికట్ల వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ నఁడూరు సంప్రతులు ౨కి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండ వీలు ౧౨౦ భరితెపూడి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ యాజలి సంప్రతులు ౨కి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ప్రధములు శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫౦౦ బందాము వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౨౮౦ వీరిని యాజలివారు అందురు. యండ్రివి వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరిని మాంచాల వారు అందురు ఖండవీలు ౮ం బామపాడు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు శాకమూరు ప్రధములు ఖండవీలు ౮౦ (యిక్కడమాతృ భిన్నం) అయిపోయిన గ్రామాదులు ఉత్తరగుడిపూడి భిన్నం నెమలికల్లు వెలనాడు సంప్రతి ౧ కౌండిన్య గోత్రులు సోపాడు ప్రధములు తిమ్మరు కోసూరి ప్రధీప్రధములు సంప్రతులు ౨కి కాశ్యప గోత్రుల సంప్రతి ౧ గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు 3౮౦ జువ్వలకల్లు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు ఖండవీలు ౧౦౮౦ కైతేపల్లి వెలనాడు సంప్రతులు ౨కి గౌతమ గోత్రుల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦౦ తూర్పు దొండపాడు వెలనాడు సంప్రతి ౧ వీరిని మచ్చివారు అందురు. ఖండ వీలు ౨౪ ధూళిపూడివెలనాడు సంప్రతి ౧ వీరిని బెజ్జరాజు వారు అందురు. తోటపల్లి వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ మొండేరు ౧ ఆముదాలపల్లె ౧ గోతిక ర్ణేశ్వరం ౧ ప్రజ్ఞామల అడవులదీవి ౧ వొదుమెంక ౧ యేలేరు ౧ అల్లపర్రు ౧ అల్లపట్ల ౧ ముత్తుపల్లి ౧ యీదుపల్లి ౧ పెదయడ్లపూడి ౧ అట్లూరు ౧ కావూరు ౧ చెరుకుపల్లి ౧ ఆరేపల్లి ౧ పూండ్లిపాడు ౧ సంగరం ౧ కొమరకోలు ౧ రాజవోలు ౧ శిరిపూడి ౧ బలుసులపాలెం ౧ పెదపల్లి ౧ యీ యిరువై నాలుగు గ్రామాదులు కుర్రువారు అనేటివారికి యేక సంప్రతిగాను యిచ్చి ఆరేపల్లిలోను రెండు సంప్రతులు శ్రీవత్స గోత్రులయిన నోళాల వారి కిచ్చినను చందవోలు సంప్రతులు ౨కి ప్రధములు సంప్రతి ౧ వెలనాడు సంప్రతి ౧ ఖండవీలు ౪౪ం ఆమర్తలూరు సంప్రతులు ౨ కి వెలనాడు హరితస గోత్రుల సంప్రతులు ౧ వీరిని పులిపాకవారు అందురు. కరణకంమ్మల సంప్రతి ౧ ఖండవీలు ౨౪౦ బాపట్ల వెలనాడు సంప్రతి ౧ వుపవెట్ల వెలనాడు సంప్రతి ౧ పెరవలి వెలనాడు సంప్రతి ౧ భిన్న అయివున్నది. గణపవరం వెలనాడు సఁప్రతి ౧ పేరాల వెలనాడు సంప్రతి ౧ అడుపలు వెలనాడు సంప్రతి ౧ కడకమరు వెలనాడు సంప్రతి ౧ పెదగంజాం వెలనాడు సంప్రతి ౧ కొండ్డ కోడూరు వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రుల చవడవరం వెలనాడు సంప్రతి ౧ వీరిని బల్లి కుర్వ వారందురు. ఖండవీలు ౮౦ దేవరంపాడు వెలనాడు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వెల్కపూడి వెలనాడు భారద్వాజగోత్రుల సంప్రతి ౧ కంత్తేరు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు వుత్తరనారాకోడూరు యీ రీతిగాను యీ హవేలీ గ్రామాదుల సంప్రతులు గణకస్థావరాలు గోపరాజు రాంమన్న నియ్యోగుల యిచ్చెను. (మాత్మభిన్నం అయివుండగా మధ్య మధ్యను వ్రాయక విడుస్తూ వచ్చినాను) దక్షిణ తుర్ల పాడు కౌండిన్య గోత్రుల సుప్రతి ౧ తెలగాణ్యులు వీరిని సంపుటం వారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౬౦ బుక్కాపురం సంప్రతులు ౨ కి కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ తింమ్మాపురం ౧ అప్పాపురం ౧ బాబాపురం ౧ నోబిల్లపల్లి ౧ గార్లపాడు ౧ నాగులపాడు ౧ బుస్సాపురం వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ వీరిని నారాయినివారందురు, ఖండవీలు ౪౦ చోడపాడు ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని పొనిపాకలవారందురు. ఖండవీలు ౧౬౦ ముక్కలమెర్రు ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ౧ వీరిని పాకాలవారు అందురు. ఖండవీలు ౧౮౦ పోతుకట్ట ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని మద్దిపట్లవారు అందురు. ఖండవీలు ౧౦౦ కొరుతవారు ప్రథముల సంప్రతి ప్రథముల కౌండిన్య గోత్రులు వీరిని చందలూరివారు అందురు. ఖండవీలు నేపాడు ప్రథములు సంప్రతి ౧ పల్ల పాడు ప్రథముల సంప్రతి ౧ గొట్టిపాడు ౧ కొండజాగర్లమూడి తెలగాణ్యులు సంప్రతి ౧ ఖండవీలు ౬౧ కొండకోడూరు వెలనాడు గౌతమగోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ చవడవరం వెలనాడు సంప్రతి ౧ వీరిని పిల్ల లమర్రి వారందురు. ఖండవీలు ౮౦ మశివుత్తర గ్రామాదులు యీతముక్కుల గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని చింతరాజువారందురు. ఖండవీలు ౨౦౦ మదనూరు తెలగాణ్యులు గౌతమ గోత్రుల సంప్రతి వీరిని చింతరాచు వారందురు. ఖండవీలు ౩౦౦ ముశిపక్షతి గ్రామాదులు పాకలవెలనాడు కౌశిక గోత్రులు సంప్రతి ౧ వీరిని గౌతనాధవారు అందురు. ఖఁడవీలు ౪ం బిజ్జెనంపల్లె వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతమ నాధవారు అందురు. ఖండవీలు ౩౦౦ తుంమ్మలగడ్డ వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతనాధవారు అందురు. ఖండవీలు ౬౦౦ కథియోడు వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతనాధవారు అందురు. ఖండవీలు ౮౦౦ చినగంజాం యదాస్తు యినగర్తి పాడు వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౪౦ యేదుమూడు ప్రథములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ పోతుమర్రు ప్రధములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరు దేశాంత్తులైనారు. ఖండవీలు ౪ం డేగల బేతపూడి వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫ం జనార్దనపురం వెలనాడు హరితస గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮ం తోటపల్లి తెలగాణ్యులు వాధూల గోత్రుల సంప్రతి ౧ వీరిని కస్తూరివారు అందురు. ఖండవీలు ౧౦౦ వుత్తర పొణుకుమాడు దేవవరం పడమర మంగళగిరి ౧ దక్షిణం గంగంవరం దోకురిటిగుండ్ల ప్రథములు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండ వీలు ౪౦ శిద్దాపురం గౌమ గోత్రుల సంప్రతి ౧ ఖండనీలు శిద్దాపురం గౌతమ గోత్రుల ఖండవీలు ౪౦ అనంత్తవరం ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ పినపాడు ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬ వీరిని నందంవారు అందురు. ఖండవీలు ౨౪ పెదపాడు ప్రధములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని నందంవారు అందురు. ఖండవీలు ౮౦ యక్కటిల వుప్పలపాడు ప్రథములు కాశ్యపగోత్రుల సంప్రతి ఖండవీలు తూర్పు శానంపూడి ప్రథములు కాశ్యప గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు చింతాళూరు వెలనాడు సంప్రతి శౌనక గోత్రులు వీరిని దొండ్డవరపు వారు అందుకు. ఖండవీలు ౧౬౦ గుండ్లవడ్లపూడి వెలనాడు సంప్రతి ౧ కుంభంపాడు వెలనాడు కాశ్యపగోత్రులు సంప్రతి ఖండవీలు ౪౦ చిన మద్దూరు ప్రథములు ఆత్రేయ గోత్రుల సంప్రతి ౧ వీరిని ముదునూరివారు అందురు. ఖండవీలు వుత్తరంయెనుమదల పెరి ప్రధముల సంప్రతి ౧ వీరిని కసువరాజువారు అందురు. ఖండవీలు ౪౦ వెంకటాపురం ప్రథములు సంప్రతి - కృష్ణాపురు ప్రధములు సంప్రతి యేటుకూరు వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౧౮౦ పడమట మున్నింగి కరణకమ్ముల సాయింఖాయిన గోత్రుల సంప్రతి ౧ వీరిని గౌతరాజు వారు అందురు. సాయింఖానస గోత్రులు ఖండవీలు ౬ం కల్లెవరం వెలనాడు కౌశిక గోత్రుల ౧ వీరిని లక్కరాజు వారందురు. వీరిని హరివారు అందురు. ఖండవీలు ౧౪౦ అయ్యపరం వెలనాడు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని మాజిరాజు వారందురు. ఖండవీలు ౨౪౦ తూర్పుజోంన్నలగడ్డ వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౮౦ పంత్రఁగి కరణకంమ్మల సంప్రతి ౧ వీరిని గౌతమరాజువారందురు. ఖండవీలు ౬ం పైడిమరు వెలనాడు ఆత్రేయ గోత్రుల సంప్రతి వొండ్రంగంవారు అందురు ఖండవీలు ౮౦ వేమవరపు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౫ం అయిబాల ప్రథములు కాశ్యప గోతుల సంప్రతి వీరిని మంగలపల్లి వారందురు. ఖండవీలు ౪ం పుత్తర దొండపాడు ౧ ఆరుమాక ౧ వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి వీరిని కొండ వారందురు ఖండవీలు ౮ం బుద్ధవరం వెలనాడు సంప్రతి ౧ గౌతమ గోత్రులు పెనుమూడి వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని గందంబారాణావారు అందురు. ఖండవీల ౬౦ తాడిగిరి ఖండవీలు ౮౦ రావికొమ్మపాడు ఖండవీలు ౪౦ రొంబాలు ఖండవీలు ౨౪౦ కంచర్ల వెలనాడు కౌండిన్య గోత్రుల సఁప్రతి ౧ వీరిని చూచిరాజు వారు అందురు ఖండవీలు ౨౪ వొలివేరు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని సమయం మంత్రి వారు అందురు. కోరుతాడిపర్రు వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని చంద్రమౌళివారు అందురు. ఖండవీలు ౪౦ పినపాడు నందవరీకుల సంప్రతి ౧ గౌతమగోత్రులు ఖండవీలు ౪ం పెదపాడు నందవరీకులు గౌతమ గోత్రుల సంప్రతి ౧ ఖండవీలు ౬౦ అమర్తులూరు సంప్రతులు 3 కి వెలనాడు సంప్రతులు ౨కి హరితస గోత్రుల సంప్రతి వీరిని పులపాకవారు అందురు. భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని సాయినివారు అందురు. కరణకంమ్మల సంప్రతి ౧ మౌద్గల్య గోత్రుల సంప్రతి ౧ వీరిని తింమ్మరాజువారు అందురు. ఖండవీలు ౨౪ం రెడ్లవారి యేలుబడి వీరియింటిపేరు దొం త్తివారు అందురు. వీరు పంట రెడ్లు శ్రీకృష్ణానది పుత్తరం ఆశ్వపతులు యేలుచూ వుందురు. యేలేశ్వరం హద్దుచేసి నరపతులు పడమట దక్షిణ రాజ్యంబు యేలుచూవుండి యీగజపతులు యేలేశ్వరం హద్దుచేశి తూర్పు రాజ్యం యేలుచూవుండి తదనంతరమందునను యీదొంతి అల్లా రెడ్డి అనుమ కొండలను కాపురం వుండే వేమిశెట్టి అనే వైశ్యుని పరుసవేది అపహరించిమల్లా గుర్తంమ్మ అని దేవతను బంగారం ప్రతిమెను. సంపాద్యంచేస్కుని అనుమకొండనుంచి కొండవీడు ప్రవేశం ఆయెకు. ఇతనివెంబడిగాను వేమశెట్టి హత్యవచ్చెగనుక ఆపరుసవేది కొల్లాగుంమ్మ దేవతతోను కొండవీటిలోనిలిచి కొండవీడు, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునికొండ, పల్లెలుదుర్గాలు కట్టించ్చి నరపతి యుపతులకు యదురులేక యేలుబడి నలుగురు కుమాళ్ళుతోను వీరు నూరు యేండ్లు యేలిరి: ధర్మాపరాయణులై అకరణ అలవణంగా బ్రాహ్మణులకు అగ్రహారాలు యిచ్చి గృహారాజు మేడ గట్టించి చోట్ల పెదారు వెంక్కటేశ్వర్లు గట్టి పడమటి శృంగానికి గృహరాజు యేడకుంన్ను కనకతోరణం కట్టించిరి. శ్రీనాధుడు యీరేపల్లె వార్కి కవీశ్వరుడు గనుకను యీరెడ్లవారికీర్తి ప్రశస్తి ఆయను. యీ రెడ్లవారు అనుమకొండ నుంచి కొండవీడు వచ్చిన సంవత్సరం॥ శ్రీశ్రీమచ్చెకాబ్దేష్టా చలాభ్రి......

శ్లోకం॥ రెండు సంఖ్యా ప్రవృత్తెసంధాత
నాబ్దె అల్లాడభూ పేసుముకుందదేశః
దొంతైన్వయః కుండిన మాజధామః
తస్యపార భలేంద్రస్య కుండిన క్షోణీవాసతః ।
...................ధ్యచతురః ౹
పుత్రః సత్యవర్ధపరాయణః ౹
తేషాంశ్రేష్ఠిత యోరాజా వేనుభూపాలసత్తమః ౹
బ్రాంహ్మణీభ్యశ్చతశ్వాత్మా రెంశగామాందదౌ శ్రీమాత్ ౹
త్రయోరేగికులినేభ్యోద్రావిడేభ్యశ్చపిపంచ్చ్యప ౹
వెలనాటి కులేభ్యశ్చ పట్త్రంక గ్రామసత్తమాః ॥

యీరెడ్ల అకరణం అలవణం గాను బ్రాహ్మణులకు అగ్రహారాలు యిచ్చిరి. పోలయ వేమంన్న ప్రధములు ౧౨ సంవ్వత్సరంబులు యేలెను. అటుతర్వాతను ఆంన్న వేమన్న ౩౦ సంవ్వత్సరంబులు యేలెను. అటుతరువాతను అనవేమారెడ్డి ౧౨ సంవ్వత్సరంబులు యేలెను. అటుతరువాతను కొమరగిరిరెడ్డి ౧౪ సంవ్వత్సరంబులు యేలెను. అటుతర్వాతను కోమటి వేమంన్న ౨౪ సంవ్వత్సరంబులు యేలెను. అటుతరువాతను రాజనవేదున ౪ సంవ్వత్సరంబులు యేలెను. యీరాజనవేమన యేలిన నాలుగు సంవత్సరంబుల దుర్మార్గ నడతల్కు పన్ను పుచ్చుకొనె గనుకను సారం యెల్లయ్య అనే బంట్రోతు భార్య ప్రసూత అయితెను పురిటి పంన్ను తెమ్మనిరీగన్కును ముత్యాలమ్మ గుడిదగ్గిరను రాజనవేమనను పొడిచి చంపెను. రెడ్లవారికుదురు సరి యీఆరుగురు నూరు మేండ్లు యేలిరి యీరెడ్లు యిచ్చిన ఆ... రపు గ్రామాదులు చెరువు విప్రధర్మమం వెంకటేశ్వర ప్రీతిగాను అలాయిదాగాను నియ్యోగులకు యిచ్చెను.

శ్లోకం॥ లబ్ధం పెరుహిభూం ఓశశిరవే శ్రీభోగలింగశ్య
సర్వంత త్తే సహ సూరనార్యా శుధియాధారాపియః
పూర్వకం ఆత్రేయ నవసుంధరైః ౹
క వేధునాస్యయ్యాప్య భాగాషకః చాతుంబి రూపుతి
నామక ......... ప్రఖ్యాత మేతద్భవె శ్రీయూచిరుపులి

వానోనేశ్వసూప్రతిగాను ఆవూరి నియ్యోగులకు యిచ్చిరి ... క్క శీమను యిచ్చెను. కాణిదెన రాచపూడి యీ రెండున్ను బ్రాహ్మణుల అగ్రహారాలకు అగ్రహారాలు యిచ్చిమున్కు అగ్రామాదులు రామంన్న నియ్యోగులకు యిచ్చినవి. రాచపూడి సంప్రతులు ౨కి కౌశిక గోత్రుల సంప్రతికి పడ్మటి రెట్లపాడు గోంగ్గులపాడు యీ రెండు గ్రామాదులలో యిప్పించెను. ఆత్రేయ గోత్రుల సంప్రతికి యీమనిలోను బల్లికురువ వారు యేకసంప్రతిలో పాతికె సంప్రతి యిచ్చెను. కొణిదెన సంప్రతి ౧ కి శౌండిన్య గోత్రులు వీరికి యీవని బల్లి కురువ వారి ముప్పాతికె భాగంలో పాతికె యిచ్చెను. రెడ్డిదత్తి ఆగ్రహారాలు వేంగ్గినాటివారికి మూడు గ్రామాదుల వారికి నుంన్ను యిచ్చిన వారికి క్రాపపరాశర గోత్రులయిన నాదెండ్ల వార్కి గుంటూరులోను మిరాశీలు యిప్పించి యీక్రాపవేంగ్గినాటి బ్రాహ్మణులును కాశ్యప గోత్రులు వీరిని గోడవర్తివారు అందురు. యేక భోగంవీరికి యిచ్చిరి. తూర్పు దండ్డమూడి రామంన్న యిచ్చినమిరాశీ- ప్రధములు కౌండిన్య గోత్రులు వీరిని సావడివారు అందురు. వీరికి గాజువోలు సంప్రతిలోను యిప్పించి యీదండమూడి వేగినాడు బ్రాహ్మణులు కాశ్యప గోత్రులు మండూరి వారు అనేటివార్కి యిచ్చిరి. దక్షిణ గుడిపూడి రామంన్న యిచ్చిన మిరాశి తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు వీరిని సోమనవారు అందురు. వీరికి కొంమ్మూరిలోను మిరాశీ సంప్రతి యిప్పించి యీగుడిపూడి వేగినాడు బ్రాహ్మణులకు ఆత్రేయ గోత్రులు వీరిని మంత్రవాది వారందురు. వీరికి యిచ్చిరి. యీమూడు గ్రామాదులు వేగినాటివారికి యిచ్చినారు. శ్రీద్రావిళ్లకు యిచ్చిన గ్రామాదులు అయిదు. శ్రీలు పొంన్నపల్లి ఆరెపల్లి యీ రెండు గ్రామాదులకు రామంన్న యిచ్చిన మిరాశీలు ప్రధములు కౌండిన్య గోత్రులు వీరిని ఘట్టువారు అందురు. వీరు దేశాంతరులు అయినారు గనుకను ద్రావిడ బ్రాహ్మణులకు యిచ్చిరి. పొంన్నపల్లి ద్రావిళ్లు—— వీరిని కూతురాజువారు అందురు. భారద్వాజ గోత్రులు వీరికి యిచ్చిరి. యేక భోగంగాను ఆరెపల్లి ద్రావిళ్లు పరాశర గోత్రులు వీరిని తట్టువారు అందురు. వీరికి యేక భోగంగాను యిచ్చిరి. గూడపల్లి నడిమపల్లి యీ మూడు గ్రామాదుల్కు రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు లోహిత గోత్రుల సంప్రతి ౧ వీరిని కోలపాటివారు అందురు. వీరికి ఓలేటి లోను సంప్రతి యిప్పించి యీ గ్రామాదులు ౩ నిన్నీ ద్రావిళ్లకు యిప్పించిరి. యీగూడవల్లి ప్రతిగ్రహీతులు కౌండిన్య గోత్రులు. వీరిని యోద్భాంవారు అందురు. వీరికి యిచ్చిరి. నడిమిపల్లి పకాద్గల్య గోత్రులు వీరిని కొమాండూరివారు అందురు. వీర్కి యిచ్చిరి. గుండ్లపల్లి కౌశిక గోత్రులు వీరిని యోలివారు అందురు. వీరికి యిచ్చిరి. యీ అయిదు గ్రామా దులు ద్రావిళ్లకు యిచ్చిరి. శ్రీశ్రీ వెలనాటి బ్రాహ్మణులకు ౩౬ కి చినపులివర్రు గురిగింద పల్లె అద్దేపల్లి యీమూడు గ్రామాదులు రామంన్న యిచ్చిన మిరాశీలు తెలగాణ్యులు పరాశర గోత్రులు సంప్రతి ౧ వీరిని బండారువారు అందురు. వీరికి పెదపులిపర్తిలోను సంప్రతి యిప్పించ్చి మూడు గ్రామాదులు బ్రాహ్మణులకు యిచ్చిరి. చినపులివర్రు శ్రీవత్స, గోత్రులు వీరిని కూచిమంచివారందురు వీర్కి వెంపటివార్కి అనేటివార్కి యిచ్చిరి. సంప్రతులు ౨ కి యిచ్చిరి. గురిగిందపల్లి కందావారు అనేటివారికి యిచ్చిరి. యేక భోగంగా అద్దేపల్లి శ్రీవత్స గోత్రులు రై తావారు అనేటివార్కి యిచ్చిరి. యేక సంప్రతి పెనుమూడి నందవరీకులు ౨న్ను గ్రామాదులకు రామంన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు సంప్రతి ౧ కౌశిక గోత్రులు వీరిని గంధంవారు అందురు. వీరికి ఆత్తోలు శిరిపురం యీ రెండు గ్రామాదులలోను సంప్రతి యిప్పించి యీ పెనుమూడి అనంతవరాలు భారద్వాజ గోత్రులు ప్రభలవారు అనేటి వార్కి యీ రెండు గ్రామాదులు యిచ్చెను. యేక సంప్రతి ౧ పెనుమర్రు పెదకొండిపర్రు యీరెండు గ్రామాదులకు రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు ఆత్రేయ గోత్రులు వీర్ని ఆడిదెంచారు అందురు. వీరికి పెదపులివర్తిలోను సంప్రతి యిప్పించి యీ పెను కుర్రు భారద్వాజ గోత్రులయ్ని పనపాటివారు అనేటివారికి యేక సంప్రతి యిచ్చిరి. పెదకొండ పర్రు యీ భారద్వాజ గోత్రులయిన పిసపాటివారికింన్నీ వాధూలగోత్రులయిన సుమాళంవారీకింన్ని రెండు సంప్రతులుగా యిచ్చిరి. పెరవలి రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరిని జడవారు అందురు. వీర్కి ఓలేటిలోను సంప్రతి యిప్పించి యీ పెరవలి తాడేపల్లి వారు హరితస గోత్రులున్నూ హేమాద్రి వారు అనేటివారికి యీ ముగ్గురుంనూ మూడు సంప్రతులు పెరవల్కి యిచ్చిరి. కొల్లూ రి రామన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు పరాశర గోత్రులు వీరిని నాడెండ్లవారు అందురు. కొల్లూరు కాపులు ౨ న్ను యేక సంప్రతి గనుకను గుంటూరిలోను వీర్కి సంప్రతిగాను యిచ్చి యీ కొల్లూరు ఆరుతెగలవారికి యిచ్చెను. తూమునూరువారు అనేటివారికి ౧ కలగవారు అనేటివార్కి ౧ గ్రంధేశిరివారు అనేటివార్కి ౧ బుర్రావారు అనేటివార్కి ప్రభలవారు అనేటివార్కీ ౧ పీసపాటి వారు ఆనేటివార్కి ౧ యీ ఆరుతెగలవాండ్లకు ఆరు సంప్రతులు యిచ్చిరి. యీ తూమునూరివారు హరితస గోత్రులు జర్రావారు లోహిత గోత్రులు ప్ర.....కు (మాతృభిన్నం) వృత్తులు ౨౦౦ చిలుమూరు రామన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు షడవర్ష గోత్ప్రులు వీరిని అన్నా ప్రెగడ వారు అందురు. వీర్కి యీ వూరిలోను సంప్రతి యిచ్చి యీచిలుమూరు శాండిల్య గోత్రులు హరివారు అనేటివార్కి యిచ్చిరి. ఏక సంప్రతిగ పిడపర్రు రామంన్న యిచ్చిన మిరాశి గౌతమ గోత్రులు వీరిని మండెంగవారు అందురు. వీరు లింగధారులు అయివుండి తమ బంధుసమేతంగాను అరవై యిండ్లవారు మను ఖండించుకొని జంగాలలో కలిసిపోయిరి గనుకను యీ పిడపర్రు మూడు తెలగా బ్రాహ్మణులకు యిచ్చిరి. కౌశిక గోత్రులయిన యెనమంద్ర వారు అనేటివారికి నైషథంవారు అనేటివార్కి చిలుకూరువారు అనేటివార్కి యీ మూడుతెగలవార్కి యిప్పించిరి. చిలుకూరివారు హరితస గోత్రులు యక్కటి పెనుమర్రు రామంన్న యిచ్చిన మిరాశీని వెలనాడు సంప్రతి ౧ ముద్గల గోత్రులు వీరు దేశాంతరులు అయిపోయినారు. గనుకను బ్రాహ్మణులకు యిచ్చిరి. పిల్లుట్ల వారు అనేటివారికి వుడుతావారు అనేటివారికి పిసపాటివారు అనేటివారికి యిచ్చిరి. పిల్లుట్లవారు శ్రీవత్స గోత్రులు పిశపాటివారు గౌతమ గోత్రులు పుడుతావారు యీమూడు తెగలవార్కి యిచ్చిరి. చివ్వలూరు రామంన్న యిచ్చిన మిరాశి ప్రథముల సంప్రతి ౧ వీరిని వుప్పలవారు అందురు. వీరికి కఠవరంలోను సంప్రతి యిప్పించి యీ చివ్వలూరు తూమునూరువారు అనేటి వారికి హరితస గోత్రులకు యేక సంప్రతి యిచ్చిరీ పెదపూడి ఆదిపూడి యీ రెండు గ్రామాదులున్ను రామంన్న యిచ్చిన మిరాశీలు తెలగాణ్యులు కౌశిక గోత్రుల సంప్రతి వీరిని పువ్వరాజువారు అందురు. వీర్కి గుంటూరులోను సంప్రతి యిప్పించి యీ గ్రామాదులు ౨ న్ను బ్రాంహ్మణులకు యిచ్చిరి. పెదపూడి శాండిల్య గోత్రులు యెల్లే పెద్దివారు అనేటివారికి ఏకభోగం యిచ్చిరి. పెదరావూరు మూడు తెగల వారికి యిచ్చిరి. జాగర్లమూడివారు శ్రీవత్స గోత్రులకు బొల్ల వారు అనేటి వార్కి గారుమంచ్చివారు అనేటి వార్కి యీ మూడు తెగలవారికి యిచ్చిరి... పినపాడు రామంన్న యిచ్చిన మిరాశి గౌతమ గోత్రులు వీరిని...... లక్కనవారు అందురు. వీరికి నూతక్కిలోను మిరాశీ సంప్రతియిప్పించి యీపిసపాడు తూమునూరు వారు హరితస గోత్రులు అయ్యగారివారు భారద్వాజ గోత్రులు ఆంగలకుదురు జఝువరుపు వారు అనేటి వార్కి యిచ్చిరి. ఏక భోగంగాను యిచ్చిరి. వలివేరు రామంన్న యిచ్చిన మిరాశి గౌతమ గోత్రులు వీరిని సమయం మంత్రి వారు అందురు. వీరికి చుండూరిలోను సంప్రతి యిప్పించి యీ వలివేరు హరితస గోత్రులు రూపాకులవారు అనేటివారికి యిచ్చిరి. ఏకభోగంగాను కోడితాడిపర్రు రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు కౌశిక గోత్రుల సంప్రతి ౧ వీరిని చంద్రమౌళివారు అందురు. వీరికి చుండూరిలో సంప్రతి యిప్పించి యీ కోడితాడిపర్రు జమ్ములమడకవారు అనేటివారికి కౌండిన్య గోత్రులకు యిచ్చిరి ఏకసంప్రతి దక్షిణ మర్రిపూడి రామన్న యిచ్చిన మిరాశి తెలగాణ్యులు శ్రీవత్సగోత్రులు వీరిని నాగరాజువారు అందురు. వీర్కి కొంమ్మురిలోను సంప్రతి యిప్పించి యీమర్రిపూడి శాండిల్య గోత్రులయిన కంభంపాటివారికి అనేటివారికి యిచ్చిరి. పెదచెర్కూరు రామంన్న యిచ్చిన మిరాశి తెలగాణ్యుల సంప్రతులు ౨కి భారద్వాజ గోత్రుల సంప్రతి గౌతమ గోత్రుల సంప్రతి ౧ న్ని యీ రెండు తెలగాణ్యుల వారికిన్ని మిరాశీలు భారద్వాజ గోత్రులకు కందుర్తిలోను సంప్రతి యిప్పించి వీరిని కొమ్మరాజువారు అందురు. గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరికి గుంటూరిలోను సంప్రతి యిప్పించెను. వీరిని బుద్దివారు అందురు. యీ పెదచెర్కూరు తెగల బ్రాహ్మణులకు యిచ్చెను. భాగస్థులు గుంటూరివారు అనేటివారికి గోరివారు అనేటివారికి అందుకూరివారు అనేటివారికి వంక్కవారు అనేటివారికి కందుర్తివారు అనేటివారికి పాలపర్తివారు అనేటివారికి వీరు యేడు తెగలవారికిన్ని యిచ్చిరి. తూర్పు గండిపాడు రామన్న యిచ్చిన మిరాశి ప్రథములు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ వీరు దేశాంతరులయిరి గనుకను యీ గంటిపాడు శ్రీవత్స గోత్రులు కొత్తపల్లి వారు అనేటివారికి యిచ్చిరి. ఏకసంప్రతి పెదకొండూరు రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు గౌతమ గోత్రుల సంప్రతి ౧ వీరిని దొండపాటివారు అందురు. వీరిని కొల్లి పరలోను సంప్రతి యిచ్చి యీ కొండూరు రెండుతెగలవారికి యిచ్చిరి. మక్కపాటి వారు అనేటివారికి పుచ్చావారు అనేటివారికి గౌతమ గోత్రుల వారికి తుంమ్మపూడి శృంగారంపాడు యీ రెండు గ్రామాదుల్కు రామంన్న యిచ్చిన మిరాశీలు వెలనాడు సంప్రతి ౧ కాశ్యప గోత్రులు వీరిని గాదిరాజువారు అందురు. వీర్కి నంబూరులోను సంప్రతి యిప్పించి యీ రెండు గ్రామాదులుకుంన్నూ ....తుంమ్మపూడి శ్రీవత్స గోత్రులు జున్ను సానివారు అనేటివారికి ఏకసంప్రతిగాను యిచ్చిరి. శృంగారపాడు కౌండిల్య గోత్రులు వెలమూరి వారు అనేటివారికి ఏక సంప్రతి యిచ్చిరి. పెదవడ్లపూడి రామన్న యిచ్చిన మిరాశి వెలనాడు మంచిరాజువారు అందురు వీరికి మంగళగిరిలోను సంప్రతి యిప్పించ్చి యీ వడ్లపూడి హరితస గోత్రులు వేమూరివారు అనేటివారికి ఏకభోగంగాను యిప్పించిరి. కురగల్లు రామన్న యిచ్చిన మిరాశి ప్రథములు కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ వీరిని కేసంన్న వారు అందురు. వీరికి తాడికొండ లోను సంప్రతి యిప్పించి యీకురగల్లు హరితస గోత్రులు వీరిని యనమంద్ర వారు అందురు. కౌశిక గోత్రులు ఏక సంప్రతి ౧ ధరణికోట రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు సంప్రతులు ౨ కి మాదిరాజు వారు సాయింఖ్యాయింనస గోత్రులు సంప్రతి ౧ బొమ్మకంటివారు భారద్వాజ గోత్రుల సంప్రతి ౧ న్ని వీరికి తమ్మవరందిడుగు యీ రెండు గ్రామాదులలోను సంప్రతి భాగం యిప్పించి ధరణికోట బ్రాహ్మణులకు యిచ్చిరి. కొండూరి వారు అనేటివారు శాండిల్య గోత్రులుకు తీర్థాలవారు అనేటివారికి హరితస గోత్రులు వీరికి కప్పగంతువారు అందురు కౌశిక గోత్రులు వీరికి మూడు సంపతుల్కు యిచ్చిరి. వుత్తర గోరం రామన్న యిచ్చిన మిరాశి నందవరీకులు వీరికి సంపతులు ౨కి శ్రీవత్స గోత్రుల సంప్రతి ౧ కౌండిన్య గోత్రుల సంప్రతి ౧ న్ని వీరికి పెదకూరపాటిలో సంప్రతి యిప్పించ్చి మల్లాది వారు అనేటివారు హరితస గోత్రులు వీరికి, సంప్రతులు యిచ్చిరి. గరికిపాడు రామన్న యిచ్చిన మిరాశి వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రులు వీరికి పెదకూరపాటిలో సంప్రతి యిప్పించి యీ గరికెపాడు కాశ్యపగోత్రులు కొలిచిన వారు అనేటివారికి ఏక సంప్రతిగాను యిచ్చిరి. కొల్లి మర్ల రామన్న యిచ్చిన మిరాశి వెలనాడు భారద్వాజ గోత్రులు సంప్రతి ౧ వీరిని శింగంపల్లి వారు అందురు. వీరికి పచ్చలతాడిపర్తిలో సంప్రతి యిప్పించి యీ కొల్లి మర్ల కౌండిన్య గోత్రులు వీరిని పెద్దిభొట్లవారు అందురు. వీరికి యిచ్చిరి. ఏక సంప్రతి గాను బండారుపల్లె రామంన్న యిచ్చిన మిరాశిలు ప్రథములు భారద్వాజ గోత్రులు వీరిని గోవాడవారు అందురు. వీర్కి తాడికొండలోను సంప్రతి యిప్పించి యీపండాపల్లె శ్రీవత్సగోత్రులు కంచిభొట్లవారు అందురు సంప్రతి యిచ్చిరి. ముల్లారు రామంన్న యిచ్చిన మిరాశీ వెలనాడు కౌండిన్య గోత్రులు ఆరాధ్యులవారు అందురు. వీరికి గొల్లి పరలోను సంప్రతి యిప్పించి యీ ముట్లూరు ప్రథములు కౌండిన్య గోత్రులు జొంన్నలగడ్డవారు నైషధంచారు పాలపర్తివార్కి మూడు సంప్రతులు యిచ్చిరి. కోడూరి రామన్న యిచ్చిన మిరాశి ప్రథములు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరికి మండూరిలోను సంప్రతి యిప్పించ్చి యీకోడూరి భారద్వాజ గోత్రులు మాధవపెది వారు అనేటివార్కి యేకభోగంగా యిచ్చిరి. పెనుపులి రామంన్న యిచ్చిన మిరాశి వెలనాడు గౌతమగోత్రులు వీరిని తొలపూడివారు అందురు. వీరికి కొల్కలూరీలోను సంప్రతి యిప్పించ్చి యీపెనుపులి మూడుతెగలవారికి యిచ్చిరి. జంన్ని సానివారికి ౧ ఆకిళ్లవారు అనేటివార్కి జనమంచి వారు అనేటివార్కి యిచ్చిరి. సంప్రతులు 3 కి పెనుగుదురుపాడు రామంన్ని యిచ్చిన మిరాశి ప్రథములు కౌండిన్య గోత్రులు వీరికి సంప్రతి చుండూరులోను యిప్పించ్చి పెనుగుదురుపాడు రెండు తెగలవారికి యిచ్చిరి. హరితస గోత్రులయిన నాదెండ్లవారు అనేటివార్కి అనుముచ్చివారు అనేటివార్కి యిచ్చిరి. శ్రీ వెలనాటివారికి ౩౬ వేగినాటివారికి 3 ద్రావిళ్ల కు ౫ యీ గ్రామాదులు ౪౪ రెడ్లు అకారణంగాను అగ్రహారాలు యిచ్చిరి. కోమటి వేమంన్న గృహరాజు మేడకట్టించ్చినాడు. కనుక తోరణం కట్టించెను. యీయకమామీసునను శ్రీనాథుడు కవీశ్వరుడు సొలస పొలంలో పాలెము యీ దొంత్రి అల్లారెడ్డి కూతురు వేమాంబ అని కుమార్తె ఆ వేమాంబ కుమార్తె ఆయిలంమ్మ అందురు. యీ ఆయిలంమ్మ సంక్రాంతి పండుగ వస్తేను తనకు పండుగ ఖర్చు కావలెను అని అల్లారెడ్డిని ఆడిగె గనుకను వార్కి ఖర్చుకు యినాంగాను ఆరెండుపాలెములు పొలిమేర హద్దులు పెట్టించె గనుకను అయిలంమ్మ పేరిట అయిలవరం అనిరి. సంక్రాంతి పండుగకు యిచ్చెను. గనుకను సంక్రాంతిపాలెం అని నామము అయెను. అలాయిదా గ్రామాదులు ఆయను. యీ రెడ్లువారు కొండవీడు మీది దుర్గం కట్టించ్చి కావు ఆశం౬౦౦౦ కొంమ్ములు ౧౨౦౦౦ రెండుకొమ్ములు అయితెను కొత్తడం కొత్తడానికి వకలి ప్పనను కాపు ౬౦౦౦ కిందను కాపు ౬౦౦౦ యీ చొప్పున దుర్గంకాపు ౧౨౦౦ జరందుల పేర్లుకు నేటి అయ్యబురుజు ౧ ఆళ్ల వాజరజు బ్రంహ్మదేవర గుండ్లమల్లి గురంమ్మ బురుజు ౧ వీరంన్న బురుజు పోతరాజు బురుజు ౧ రాజుబురుజు ౧ వీరిని తిరుపతి అనె బురుజు ౧ పెదతిరుపతి అనే బురుజు ౧ మిర్యాల చట్ట ౧ ఝుట్టబురుజు ౧ చుక్కలకొండ నెమండ్లబండ ౧ పావలలు కుర్వీ ౧ యేడుగుండలు ౧ గులిజికాలువ ౧ గంజామహల్ ౧ పడమటి పెద్దగవిని ౧ తూర్పున కట్టెలవడి ౧ యీ చొప్పున బురుజులకు పేరు బురుజులు కొ త్తడాలు కాశెనాయకులు పరివాలాలు మొహతాదులపేర్లు వుదయరావు సౌజనరావు, గణపతిరావు. జంన్నపనాడు. కటినెండు సూరపనేడు, మాచినేడు తిరువెలమనాయకులు, బలిజనాయకులు వినోదరావు మహీపతీరావు, భూపతిరావు ముత్తలనెడు సోమరౌతు బుక్కా నాయకుడు అక్కానాయకుడు పండ్రిగి రామానాయకుడు తులవా వెంకటాద్రి నామనాయకుడు సూరానాయకుడు శ్రీగిరినాయకుడు సాబంతుకు యిక్కుర్తి తిమ్మనాయకుడు యడ్పలకొండ నాయకుడు చిరంరంగారావు అంబటి చంద్రా నాయకుడు ముత్యాల నాయకుడు ముంగరోతు వీరబలిజ నాయకులు తుర్కానాయకులు దాజిమ నాయకుడు హస్యమ నాయకుడు అబ్దల్లా నాయకుడు అల్లి నాయకుడు రాజానాయకుడు కరీంన్నాయకుడు దాముచినాయకుడు వీరుతురక నాయకులు. యీనాయకులు తమ యినాములువుంన్న ఆశంక్కాపు౧౨౦౦౦ యీచొప్పున దుర్మం కాపువినికొండ బెలంకొMడ నాగార్జునికొండ దుర్గాలు యీచొప్పున గాకాచిమల్లు మాటకాడై గజపతి నరపతులకు అలవిగా కను వుండే రెడ్డి కరాజ కలుసు వేరుపడి కొండవీటి శీతలు ౧౪ గిరిదుర్గాలు గురంమ్మవారికి దేవతానువరుసలెడి నిక్షేపం శ్రీనాధుడు కవీశ్వరుడు వీరికీర్తి ప్రఖ్యాతి చెయ్యండం నానాదేశాల యందు వెనగ ఆయను. గన్కు కృష్ణదేవరాయులుకు శ్రీ నాధుని క్కావనం రెడ్లవారు కవీశ్వరుడు అనీ వినికిడి. ఆయన గనుకను శ్రీనాధుంణి చూడవలెనని పిలిపించె గనుకను శ్రీనాధుడు విజయనగరం పోయిరాయలసంన్నిధాన మందునకు నిలచినంతలోను శ్రీనాధుడు పుట యెవర్కులేదు గనుకను నీద యేపూరు అని అడిగింగనుకను శ్రీనాధుడు రాయదేవునితో యిచ్చిన పద్యం॥

సీస పద్యం ॥ పరరాజు పరదుర్గ పరవైభవ వజ్రలకోస కొని నితనాడు
కొండవీడు పరిసంధి రాజన్య బలము

బంధించు౹ గురు త్తైన వురుద్రాడు చటుల విక్రమ
కళాసాహసం బొనరించు కుటివారు
నకు జోడు ముగురు రాజులకును మోహంబు బుట్టించు
కొమరు మించిన యట్టి కొండవీడు
చజులమత్తేభ సామంత సరవిరభటన నెకహటి। ప్రకట
గంధ శింధరాభట మొహనారాల దనరు
కూర్మిన మదావతికి జూడు కొండూరు।।

అని శ్రీనాధుడు అనే గనుకను అప్పుడు శ్రీనాధుడు అని గుర్తు యెరుక తగిలి బహుమానం గాను కూర్చుండ నియమించెను. కొంన్ని దినములు జరిగిన తదనంతరమందునను కృష్ణదేవరాయలు గృహరాజు మేడ గట్టించవలెనని యత్నం విచారించేగనుకను రాయలవారు విచారించి శ్రీనాధుని మాటకు చూచిరంమ్మనమని తగువారిని పంపించే గనుక శ్రీనాధుడు యిక్కడను విచారించి తగువారిని కొండవీటికి ఫర్మాయించెను. తనమాట అభద్ధం అవుతుంన్నదని కోమటి వేమన్నకు వుత్తరం పంపించెను. యిక్కడ రాయలు దేవుండు గృహరాజు మేడ కట్టించవలెనని యత్నంగాను యిక్కడ కొండవీటిలోను వేమారెడ్డి కట్టించినాడు అని కట్టించెను. యిక్కడను భావించి తమవారిని తగువారిని చూచిరమ్మని పంపించినాడు. వాడు యిక్కడికి రాకముంన్నే యిక్కడమాట తప్పితంగాకుండా వారు వచ్చేటప్పటికి గృహరాజు మేడ కట్టించమని రెడ్డికి వుత్తరంవాశి పంపించెను. గనుకను రెడ్డి ఆవుత్తరం చూచుకొని శ్రీ నాధుడు ఆడిన మాట తప్పించెను. గృహరాజు మేడయెంత త్వరను యేరీతిని అయ్యీని విచారించి చింతిస్తు వుండగాను వారిదేవతవల్ల గురంమ్మవచ్చి రెడ్డిని నీవు చాలా చింతిస్తూన్నావు నీవు వూరిలోను పోతురాజు గుడి ద్వారంవద్దను తుంమ్మవున్నది. పోతురాజుకు నీపేరు బెట్టి పుత్తరం వాశి మనుష్యులను ఆంపిస్తేను పోతురాజు ఆతుంమ్మయిస్తున్నాడు ఆతుమ్మ తెప్పియి స్తంభం చేయించి శ్రీఘంగ్గాను కట్టించుమని స్వప్నలబ్దమాయెను గనుకను అప్పడి నీపులూరు పోతురాజు రెడ్డి తన పేరు బెట్టించ్చి మేము యిక్కడ గృహరాజు మేడ కట్టిస్తున్నాను స్తంభం బేడు మీద్వార మందునవున్న తుమ్మదయచేయించవలెనని పుత్తరం వాశి మనుష్యులను పంపించె గనుక ఆపోయినవారు ఆజాబు పోతురాజు ముందర చదివి ద్వారం ముందరం జాబు వుంచిరి గనుకను వారి చెవులకు కొంచి పొంమ్మంన్న ధ్వనివినపడెను గనుకను ఆతుంమ్మ నరికి తెప్పించి తొమ్మిది రోజులకు మేడ అయ్యేటట్టుగాను కట్టించెను. రాయలు వారి తగువారు వచ్చినంతలోను కోమటి వేమంనవార్ని చాలా బహుమానము చేసి పంపించిరి గనుకను వారు పోయిరాయలు వేమంన్నతోను కట్టించిరి అని విన్నవించిరి. అప్పుడు శ్రీనాథుణ్ని చాలా బహుమానంచేశి కృష్ణ దేవరాయలు శలవు యిప్పించి పంపించిరి. శ్రీనాథుడు రాయలు వారి చాతను బహుమానము అందుకొని వచ్చెను. యీరీతిన రాజ్యం నూరు యేండ్లు యేలి బ్రాహ్మణులకు ఆకరణం అటు వనంగ్గాను అగ్రహారాలు యిచ్చిరి. శాశ్వతముగాను గృహ రాజు మేడ గట్టించి బొల్లుయోరు వెంకటేశ్వర్లు గట్టు పడమట శృంగ్గాన్కి గృహరాజు మేడకు కనక తోరణం కట్టించి ధర్మపరాణులై నూరు యేండ్లు యేలిచనిరి. నూరు యేండ్లు యేలి చనిరి. రాజువేమన చివరనాలుగు యేండ్లు యేలి దుర్మార్గపు నడతలు నడిచెగనుకను సారం యల్లయ అనే బంట్రౌతు దుర్గంలోకి యెక్కి రాంగాను ముత్యాలమ్మ గుండ్లు అని గుండ్ల మెట్ట దగ్గిరను పొడిచి చంపెను. అంతటతోను రెడ్లవంశం సరి పోయెను. శ్రీరాయలువారి యేలుబడి శ్రీరాయలు వారియింటి పేరు అందురు. శిలగోత్రులవారు అందురు. కృష్ణ దేవరాయులు రెడ్లుయేలిచన్న తదనంతరమందున రెడ్లవారు యేలిన శీమలు కర్ణాటకం కింద కల్పవలెను. వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, కొండవీడు, కొండపల్లెలు సాధించి వెయ్యవలెనని మనస్సునపూహించి వుపశ్రుతి దేవతను తలంచి రజకునిపదకురిడి వాన్కి సంతోషం చాతను తనలోతాను పాడుకున్న వాక్యం——

కొండవీడు మనదేరా,
కొండపల్లి మనదేరా,
కాదని యవ్వడు వాదుకువచ్చిన
కటకందనుకామనదేరా

అని తనలోను పదంగాను పాడుకొనెను. గనుకను ఆవాక్యం శకునం విచారించి యీదేశాలు సాధకానకు యిదేముహుర్తమని వాణువను పైనాకు అప్పాజీకి ఖబురు అంపించెను. అప్పాజీతో చెప్పమంన్న వాణ్ని యెటుమొకంగా వుండి చప్పవలెను అనివచ్చినవాణ్ని అప్పాజీ అడిగితేను తూర్పు ముఖంగ్గా నిలుచుండి చెప్పుమని చెప్పెను. గనుకను రాణువను తూర్పు దిక్కున యిలాదిగుమని భేరి వేయించి అదేముహుర్తంగా తల్లి౯ వచ్చి కొండవీడు వచ్చెను. కొండవీడు సాధకం ఆయెను. కొండవీడు కింద చెల్లేశేషులు సాధకం ఆయెను. ఈ కొండవీటికి దిగువకోట పెట్టించి నౌనులు నాదెండ్ల గవుని కొండపల్లి గవును అని నామంగనుకను చేశారు. వినికొండ బెల్లంకొండ, నాగార్జునకొండ దుర్గాలు సాధించి కొండపల్లి దగ్గరను వీడు విడిచి కొండపల్లి సాధకం అయిన తదనంతరమందునను గజపతివారి మీదికి దాడియెత్తి ఆరంట్ల కోనకొల్ల బుచ్చి గజపతివారి మీదను ముత్తక నేశనగకను ఆగజపతి తన కూతురునితన గండ్డ పెండేరము రాయల్కు యిచ్చెను. అక్కడ నుండి శింహాద్రి దగ్గటసు జయశిల నిల్పివచ్చి గజపతికూతురుని పెండ్లాడి తులాభారం తూగి బ్రాహ్మణులు యజమాని పెత్తనం అడిగిన వారికి యిచ్చెను. వృత్తి క్షేత్రాలు యిచ్చెను. రాజ్యం యేలుచూ వుండి ధర్మపరాయణులైన శ్రీకృష్ణ దేవరాయలు యిచ్చిన గ్రామాదులను రాయదత్తి అన్కుందురు. శ్రీ మంగళాద్రి స్వామివారినైవేద్య దీపారాధనలకు మంగళగిరి ౧ నంబూరు ౧ యీ రెండు గ్రామాదులను యిచ్చెను. యీమని శ్రీరాముల్కు రాము పాలెం యిచ్చెను తాళ్ల పాకల యిచ్చిన గ్రామములు కొండవీటి హవేలీలోను కోనేటి చింనన్నగారికి వినుకొండశీమలోను మిన్నకల్లు ౧ అద్దంకి శీమలోను కలెమర్ల ౧ యీ రెండు గ్రామాదులుయిచ్చెను. వీరు పొలిమేరలకు పోయి కంభాలు వేయించిరి. దిరుగు కోనేటి తిరువెంగళయ, గారికి యిచ్చెను. కాశిపాడు మధార అయివుండగాను కాళెపాడు యిచ్చెను. యీ కాళిపాడు వాన్కి ముందు యిచ్చెను. మధుర ఆయగనుకను యీతిరువెంగళయ్య గార్కి యిచ్చెను. గనుకను యీ తిరువెంగళయ్యగారు దిడుగ కువకంభాలు వేయించిరి వుత్తర గుండవరం గ్రామం కోనేటి తిరువెంగళయ్యగారికి యిచ్చెను. యీ యనకరకంభాలు వేయించెను. యీమని శిద్దిరాజు వెంకటాద్రి ఆనేటి అయ్యవార్ల గారికి యిచ్చెగనుకను యీ కృష్ణదేవరాయలు చోడవరం జవ్విపూడి యీరెండు మధుక అయిపుండె గనుకను యీమధురాలు రెండూ కల్పి యిచ్చె గనక యీకోనేటి అయ్యవార్లుగారు పొలిమేర కల్పికరకంభాలు వేయించెను. గొడవర్రు అనే గ్రామం అంన్నరామభొట్లుగారికి పొన్నగంటి గోపీనాధుడు అని అతనికి వంకపల్లి వారు అనేటివారికి యీ మూడు తెగల వారికి యిచ్చెను. పొన్నిగంటి పొలం లోను పాలెంపొలిమేరహద్దులు పెట్టించ్చి పొంన్నగంటి గోపీనాధునికి యిచ్చెను. ఖండ్రికె తూర్పు శ్రీరంగపురం ఆరు యిండ్లవైష్ణవుల్కు యిచ్చెను. వెంన్నాదేవి పాలెములు ౨కి ఒక పాలెం నగరిలో గాజులు తొడిగేవాన్కి యిచ్చెను. గనుక అయిదావూరు అయను కంకణాపల్లి అనిరి. యీవేన్నాదేవి పాలెంలోను రెండు పాలెం పెంపు వచ్చి భట్టుకు యినాము యిచ్చి హద్దులు బెట్టించె గనుకను అలాయిదా గ్రామములు ఆయెను. భట్టుపాలెం అనే గ్రామం ఆయెను భట్రాజుకు యిచ్చెను. తూర్పు రుద్రవరం అనే గ్రామం జంగాలకు యిచ్చెను. జంగాలపల్లి అనే గ్రామం జంగాలకు యిచ్చెను. గజరాజుది వేలుపురం బోగందానికి యిచ్చెను. ఆబోగముది తనకు పొలము చాలదని అడిగెగనుకను ఆచుట్టున నీవు ఒకనాడు యెన్ని వూళ్లుపోయి పొలిమేరలు కలియతిరిగి వస్తుంన్నావో అంన్ని పూళ్లపొలం నీకు వేల్పూరు కిందను కల్పినడిపిస్తున్నారు అని కృష్ణ దేవరాయలు ఆనెగనుకను ఆబొగముది రోకంట్టికండ్ల శిద్దాపురం పెరిటపాడు అనంతవరం చినపాడు పెదపాడు అనే గామాదుల పొలం పొలిమేరలు ఒక్కనాడు తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికీ వేలుపూరిలో నువచ్చి అప్పడే ఆభోగంది పరలోక యాత్ర చేశెను. దానివాండ్లు వేలుపూరు కిందను పాలెములు గాను యిచ్చెను .... యీకృష్ణ దేవరాయలు కొన్ని గ్రామాదుల్కు యజమాన పెత్తనం యిచ్చి వృత్తి క్షేత్రాలు గ్రామానకు వకటి రెండూ యీచొప్పున యిచ్చి గ్రామ పెత్తనం యిచ్చెను. వైదికులకు కొల్లిపర్ల పెత్తనం యిచ్చెను. మాచెర్లవారు అనేటివార్కీ మహకాళి ఆనేటివారికి మున్నంగి చేతన భొట్లువాయ అనేటివారికి యిచ్చెను. యీగనిసగరంవారు అనేది వార్కి యిచ్చెను. దంతలూరు పీసపాటివారు అనేటివారికి యిచ్చెను. కృష్ణానది దక్షిణం గొడవర్రు పిళ్లుపాటి అనేటివారికి యిచ్చెను. తోరిపిల్లలమర్రి వారు భాగవతులవారు నందలవారు అనేటివార్కి యిచ్చెను. నందివెల్లు కఠివరాలు రెండున్నూ పన్నాలవారు ఆనేటివారికిచ్చెను. మంచ్చాల శిష్టావారు అనేటివారికిచ్చెను. సుద్దపల్లి దంటువారు అనేటివారికిచ్చెను. జంపని వంగవేటివారు అనేటివారికి యిచ్చెను. పడమట జొన్నలగడ్డ పోత వరాలు అనే గ్రామాదులు రూపాకులవారు అనేటివారికి యిచ్చెను. వోలేరు వంగలవారు అనేటి వారికి యిచ్చెను. పెదపల్కలూరు బొండుపల్లివారు అనేటివారికి యిచ్చెను. దుగ్గిరాలపూడివారు పేరిటవారు అనేటివార్కి యిచ్చెను. నల్లూరు రామరాజుండ్డ కాపాడు గ్రామాదులు కొత్తపల్లి వారు అనేటివారికి యిచ్చెను. వెల్లటూరు తంగ్గిరేలవారు అనేటివారికియిచ్చెను. తాళ్లూరు గుండె పూడివారు అనేటివారికి యిచ్చెను. కొల్కలూరు అనేటిగ్రామం సూరావఝలరామంన్న, వాటులి లింగన్న, గోడాసర్పయ్య, కర్రా అచ్చన్న, గుల్లెపల్లి శింగయ్య, కొప్పిళ్ళ యర్రయ్య, పయిడి పాటిమల్లంన్న, శ్రీపాద తింమ్మన్న, మణులగూరివారు, అవ్వారివారు, వేదాంతంవారు, దచ్చెటి నారాయణ యీపన్నెండు తెగల వార్కి యిచ్చెను. యీరీతినను యజమాని పెత్తనం యిచ్చి వృత్తి క్షేత్రాలు యిచ్చెను గనుకను రెడ్లు యిచ్చిన ఆగ్రహారాలు కర్ణాటకం కిందను శీమలు నడువ వాయెను. గనుకను యీరెడ్లు యిచ్చిన అగ్రహారాలు ... పూండ్లవారు ౪౪ గ్రామాదులవారు మనకు అగ్రహారాలు నడువకపాయెను. మనంమే యజమానులమై వుండి వుంటిమనగ్రామాదుల్కు యజమాన పెత్తనానకు పరాయీలకు ఆంపసేమో మనము వుండి పరాయి పెత్తనం అయితే మనయజమానత్వం యేమని పోయిరాయల దర్శనంచేశిరి గనుకను రాయల దేవుడు మిరాశి కరిణీకపు స్థావరాలు వుండి చేసి యీ రెడ్డి యిచ్చిన గ్రామాదులవారికి యేవూరివార్కి ఆవూరు యజమాన పెత్తనం యిచ్చెను. యీయజమాని పెత్తనం రాయదత్తివారు అందురు. బలభద్ర పాత్రునివార్కి స్థానికకరిణీకం వచ్చిన మచ్చట యీరాయలదేవుని యేలుబడి కొండవీటిశీమకు స్థలకరిణీకము సంప్రతి ౧ వీరిని సంపుటంవారు అందురు. యీసంపుటం కోనప్ప అనిపడు పెత్తనంచేశెను. గుర్రంబలభద్రయ్య అనే అతడున్ను నుదురుపాటియర్రయ్య అనీ అతడున్ను నుదురుపాటియర్రయ్య అనే ప్రధముడున్ను వారు యిద్దరున్నూ అన్యోన్య స్నేహంచేతను పరమహంసులు కలసి అనుసరపక్షంచేశి అంన్ని స్తంభన విద్య నేర్చుకొని వచ్చి యీసంపుటం కోనప్ప దగ్గిరను చాకిరివుండి కొన్ని దినములు జరిగినంతలో తమకు స్థలకరిణీకం వున్నదని ఆకోనప్పతోనూ కలహంచేశి తమకు లేదు అని ఆకోనప్ప ప్రమాణంచేస్తెను. విడిచి పెట్టము అని ఆపక్షానకు మాకు భాగం వున్నది. మేము విడిచిపెట్టము అని గుండా తనం చేశిరి. గనుకను ఆసంపటం కోనప్ప వీండ్లు గుండాలు వీండ్లతో తగూకు (తగపుకు) యేమనిపోను ప్రమాణం యేమని వప్పను పెద్దతనం నిల్వదు వీండ్లు బహుగుండాలు. యీ పెత్తనం లేకున్నామానె వీండ్ల చేత ప్రమాణంచేశి గెలిస్తేను నేను పెత్తనంచాలిస్తున్నాను అంన్నది మంచ్చిది వీండ్లవలెను తాను గుండాతనం చేస్తే పెద్దతనం లేకపోతున్నదని విచారించి ఆకోనప్ప మీకుస్థలకరణీకం వున్నదని కదా మీరు ప్రమాణం చెయ్యమనేది మీకు కద్దని ప్రమాణం చేశి తెల్చి పెత్తనం మీరు చెయ్యండి తాను పెత్తనం చాలించుకుంటాను అనెను గనుకను యీబలభద్రయ్య యరయ్య యిద్దరున్ను ఒప్పి ఆగ్నిహాత్రములోను కర్రమండు పరమహంసక్రియి పెంపునను మండ్డుగెలిచిరి గనుకను ఆకోనప్ప పెత్తనం చాలించుకొనెను. బలభద్రయ్య యర్రయ్య యిద్దరున్ను దేశ పెత్తనం చేశిరి. వీరిని బలభద్రపాత్రుడు యర్రాపాత్రుడు అనిరి గనుకను బలభద్ర పాత్రునివారు యరాపాతృనివారు అని అందురు. యీగుర్రం బలభద్రయ్య తెలగాణ్యుల కౌండిన్య గోత్రుడున్ను నుదురుపాటి యర్రయ ప్రధముడు భారద్వాజ గోత్రుడు స్థలకరిణీకం యీరీతిని సంపాయించిరి. యాదాస్తు ఆసంపుటంవారు తెలగాణ్యులు కౌండిన్య గోత్రులు యీసంపుటంవారికిని పెళ్లారివారు అనునామాంకితం ఆయెను. గజపతిరాజు తిరిగి దళం కూర్చుకొని వచ్చుట యీకృష్ణ దేవరాయలు యీచొప్పన యేలి గజపతి వారిని సాధించి రాజ్యంతీసుకొని బ్రాంహ్మణులకు వృత్తులు యిచ్చి ధర్మంనడిపించికొంన్ని వర్షంబులు యేలి కృష్ణదేవరాయలు చనెను. అతనంతరమందునను గజపతివారు బలువు పైరి యీరాయలు కొండవీడు హవేలివుంచి వినికొండ బెల్లంకొండలు ౨ న్ను పరగణాలు చేసి నిమకాళా శీమలు ౧౧ న్ను కర్ణాటకం కిందకల్పినారు గనుకను యీగజపరులు కర్ణాటకం కింద కలిపిన శీమలు కొండవీడు వినుకొండ బెల్లంకొండ నాగార్జునకొండలు గజపతివారు తిరిగి తీసుకొని పోవలెనని దశంచేసుకొని వచ్చిరి. గనుకను రాయలువార్కి బలుపులేక యుండే ఆసమయ మందున గజపతివారికి యెదురులైరి గనుకను కృష్ణదేవరాయలు చనిపోయిన వెనుకను బలువులేదు గనుకను అల్లసాని పెద్దన జీవంతుడై వుండేగనుకను యీశీమలు గజపతివారు ఆక్రమించుకొని పొయ్యె పనివచ్చెను. సంస్థానములోను బలుపు లేదాయనని విచారించి గజపతివారికి వుత్తరం వాయించి పంప్పించెను......

పద్యం :-
రాయరాహుత్తనే రాక యేనుగ వచ్చి
ఆరటుల కోనె కోరాడు రాడు
సంపేట నరపాల సార్వభౌముడు కాంచు
తలుపులకు కురురీ కెల్పునాడు
శెలగొల సింహ్వంబు చెరధిక్కరిజీరి
శింహ్వద్రి జయశీల జెర్పునాడు
గరిమహం నిబ్బరగండ పెండేరంబు
కూంతురి రాయల కొసుగువాడు
చిరజాలదానాడు పూడప్ర
చిక్కితివొ జీర్ణమైతి వొదిక్కులేక
కన్నడం చెట్లు జొచ్చితి గజపతేంద్రా
తెరచి నిలుకుక్క జొచ్చిన తెరవుగాదె ॥

అని అల్లసాని పెద్దన ఉత్తరం అంపించే గనుకను ఆవుత్తరం చూసి అజపతి గజపతి వారు దిరిగి దిగి స్థలముంద్కు పోయిరి. దేశాలు కర్ణాటకం కిందను నిలిచెను. యీవెనుకను రామదేవరాయలు యేలెను. అటుతరువాతను అల్లుడు రామరాజు యేలెను. ఆ తరువాతను జటామాల మాగరాజు యేలెను. యీమాగరాజు స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవరుషంబులు ౧౩౩౩ (1415 A.D.) అగునేటి స్వభాను నామ సంవత్సరమందునను అత్తోట పొలంలో పాలెం అత్తోట సతూపలు ౧౫ యీవనిపోలంలో తూపలు ౧౫ యీ ౩౦ తూపలకు పాలిమేరహద్దులు పెట్టించి కుంభవరం నామంచేశి శ్రీ ఆగస్తేశ్వరస్వామికి నిత్యదీపారాధన ఖర్చుకు కుంభఅంమ్మసామి అనే సానె వైశ్యవశానను యిచ్చెను. ప్రత్యారితరం వూరు ఆయెను. కుంచవరం ఆయెను ఆతర్వాత అశ్వపతులు యేలిరి ఆతరువాతను సదాశివరాయలు యేలి యితని యేలుబడి ఆగ్రహారాలు యిచ్చెను. శ్రీబ్రాంహ్మతులకు నాగార్ణవ శీతాంశు సంఖ్యాబ్దే శాలివాహనే. క్రోధి సంవ్వత్సరమాహే స్వశాకపురందదౌ

శ్లోకం ॥ చిల్కరులకులేజాతాం వల్లభాచార్య
దేశసంప్రతి సదాశివరాయ పురందదౌ ౹

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వత్సరంబులు ౧౪౬౦ (1538 A D.) అగునేటి క్రోధినామ సంవత్సరమందునను చిల్కమర్తి వల్లభాచార్యులుగార్కి చినకూరపాడు ఆగ్రహారం యిచ్చెను. సదాశివరాయదత్తి గోవాడ అగ్రహారం శవర్తుగతి భూసంఖ్యే శాకాబ్దేశాలివాహనే! శ్రీసదాశివరాయేంద్రొ శోభకృన్నామవత్సలే. వల్లభాచార్య విఖ్యాయా చిలకమర్తి కువాయవై! ధర్మ సంస్థాపనార్దాయదదౌ గోసానికాపురే స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు ౧౪౬౫ (1543 A D.) అగునేటి శోభకృతునామ సంవత్సర మందు నను గోవాడ యిచ్చెను. ఆకుమర్లపూడి సప్తషష్తాధి భూసంభే శాలివాహనే శ్రీ సదాశివరాయే ద్రావిశ్వరుకు శరద్వజవల్లభాచార్యమర్యాయ చిలుకమర్తికులాయచ యీశ్వరార్పణ బుధ్యా వైహనుమర్ల పురందదౌ, స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకపరుషంబులు ౧౪౬2 (1545 A.D.) అగునేటి విశ్వాసునామ సంవత్సరమందునను అనువర్ణపూడి యిచ్చెను. పుత్తరం నారాకోడూరు కంనాళ్ళ ఆయ్యవార్లగారికి యిచ్చెను. వీరు వాధూల గోత్రులు మదతుబాటి పొలంలో యిచ్చెను. వేమవరపు పొలంలోను తూపలు ౨౫ గొంగలాగడ పొలంలోను తూపలు ౨౫ యీ మూడు వూళ్ల పొలం తూపలు ౭౫ తూపలు సాలుకు హద్దులు నిల్పి ఖండికె అనేనామంచేశి ముడుంబ్బు అయ్యవార్ల గారికి యిచ్చెను. దక్షిణతాళ్ళూరి పొలంలోను తూపలు ౫౦ ఖండికే చేశి శ్రీరంగపురం అని నామంచేశీ అయిదు యిండ్ల వైష్ణవుల్కు యిచ్చెను. యడ్లపాటి పొలంలోను తూపలు ౩౦ ఖండిక చేశి విశ్వనాథుడు అనే బ్రాహ్మణుడికి యిచ్చెను. విశ్వనాధుని ఖండికె అనిరి. యీమనిలోను రాముపాలెంలో తూపలు ౭౫ శ్రీరఘనాయకులు స్వామికి నైవేద్య దీపారాధనలకు యిచ్చెను. యిది సదాశివరాయని వేల్పూరి భోగంది తక్కిన మార్ల పొలంలోను యీసదాశివరాయలు జంపనివారు అనేరాచవార్కి కొల్పుబడి యిచ్చెను. ఆ జంపనివారు ముంన్కు బోగందానికి యిచ్చినారు. ఆగ్రామాదులు తమకు క్కూడ దనిరి. గనుకను యీకొండవీటి శీమ గ్రామాదులలోను కోసూరు ౧ చామర్రు ౧ చింత్తపల్లి ౧ కుంటమద్ది ౧ జటపల్లి ౧ మాదిపాడు ౧ తాడువాయి ౧ చల్లగరికె ౧ యిది తొమ్మిది గ్రామాదులు జంపనివారికి యిచ్బె గనుకను ఆగ్రామాదులు జంపనివారి కిందను ఆలాయిదా అయిపాయను. యీసదాశివరాయలు చనిన వెనుకను జూపల్లి రంగపతి రావు యేలెను. యీ రంగపతిరావు వల్లభాంబాపురం కృష్ణకుస్నానం నిమిత్తం వచ్చిగనుకను బ్రాహ్మణులు జొన్న బియ్యంతోను ఆశీర్వదించిరి. యిది యేమిటి అని అడిగెను. ఆ బ్రాహ్మణులు తమకు యీ గ్రామంలోను వర్తిపొలంలేదు అనిరి. ఆ వల్లభయపురంపు పొలిమేరను అంటనపోటి యీవనిరాముపాలెపుపాలం దేవుని యీనాం తూపలు ౭౫ బ్రాంహ్మణులకు యిచ్చి పొలిమేర హద్దులు నిల్పించి వల్లభాంభాపురం కింద్దరు ... యీ రంగ్గపతిరావు యేలుచూపుండి మంగణాదేశ్వరునకు నిత్యోత్సవంచేశెటందుకు కంచేపద్మసాని అనేసానెకళావతి పడమటి గుడిపూడి పొలంలోను తూపలు ౩౦ యీనాం యిచ్చే గనుకను గుడిపూడి వారు పోలంచూపితే అబ్యూరికరణం కొండయ్య అనే ఆతడు ఆపొలం తమ పూరిదని ఆనవాటు చేశగనుకను ఆ పొలం పద్మసానికె నడిచినది కాదు. ఆనవాటున వుండెను. యివి ౨ న్ను రంగపతిరావు ధరపూ... ర్వప్రక్రియ లబ్దాలు మిరాశీలు అమ్ముకుని దేశాంతరులు అయినవారు. అతత్పూర్వం క్రయాలు లేవు. ప్రధమం క్రయాలుచేసి మీరాశీలు అమ్ముకొని దేశాంతరులు అయిరి. యీ క్రయాలు ప్రళయకావేరి నీడలు కాటూరి కరణం వెలనాడు కొండిన్య గోత్రుడు మంత్రయ అనే అతడు వుద్యోగ సంచారునను వచ్చెను. ఉద్యోగ ధర్మానను వుండి బెల్లం కొండశీమ గ్రామాదులు కొన్నిటికి గుత్తగదారుడై వున్నంతలో స్వస్తికి జయాభ్యుదయ శాలివాహన శక వరుషంబులు ౧౩౨౩ విష్ణుచిత్రభాను సంవత్సరాల వామం తగిలి కొందరు మిరాశి రూకలు విడిచి తరులయి పోయి క్షామం తీరితర్వాతను తిరిగివచ్చి మిరాశీలలో వుండి తర్వాతను స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశకవర్షంబులు ౧౭ఽ౩ అగునేటి (1441 AD) రౌద్రి సంవత్సరంవర్కు యీ మంత్రయ బెల్లంకొండ గ్రామాదులకు నిభాచేస్తూ వుండేగనుక రౌద్రి సప్తక ప్రభవ పంచ్చకమని ద్వాదశవర్ష క్షామంతగిలెగనుక నిర్వహించలేకను అర్ధను జీవనము లేనివారు దేశాంతరులయిపోయ్యే టప్పుడు కొండకాపూరు, గురుజేపల్లికి యీ రెండు గ్రామాదుల్కు సంప్రతి ౧ భారద్వాజగోత్రులు బుల్లి గంప వారనేటివార్కి యీ రెండు గ్రామాదులు అంతా అంమ్ముకొని పోదుమని మంత్రయ తోను అనిరి. గనుకను ఆమంత్రయ విచారించి వీసం అయిదు వరహాల చొప్పునను క్రయం చేశె గనుకను ఆమంత్రయ అర్ధసంచితుడు గనుకను కొండకావూరు యిరుజేవల్లి పదహరు వీసాలు చేసి ఒక్కొక్క వూరు కొండ్డకాపూరు... క్రయగరం గురుజెపల్లి క్రయం యేక్రయగరం కూడా ౧౬౦ వరహాలకు రెండు గ్రామాదులు మిరాశీలు క్రయంచేశి పుచ్చుకొనెను. విప్పర్ల కరణాలు ప్రధముల తోరణాలువారు అనేటివారు... విప్పర్ల యిచ్చెము అని అంటిగరం యనబై ౮౦ వరహాల్కు యాకసంప్రతి అని కోరెను. తొండపి యేక సంప్రతి వెలనాడు సంప్రతి యిచ్చి క్రయగరం యీ నాల్గు గ్రామాలు అంమ్ముకొని వారు దేశాంతర్లు అయిపోయిరి గనుకను కెండిందింబ్బ నారపరాజు అనే అతడు పాకనాడు విరితసగోత్రుడు చిలుకూరు నంది గ్రామం రెండు క్రమముగ ౮౦ భీమవరం ౧౬ం యీవాశినక్రయంగ ౮౦ భీమవరం క్రయం ౬ం యీ ౩ న్ను క్రయంగ ౧౪౦ కి ఆకౌండిన్య గోత్రుడయిన మంత్రయ అమ్ముకొని దేశాంతరుడై ఆయెను. గాదలవర్రు కరణీకం ప్రధుములు కౌండిన్య గోత్రులు యీప్రథుముడు అని మాచిరాజు అని అతడు మండూరి కరణం మతుకుపల్లి నాగరాజు అని అతన్కి. తన యాకభోగం సంప్రతి సగభాగంగ ౪౦ నలుభయి వరహాల్కు అమ్ముకొని దేశాంతరుడు అయ్యెను. తమ్మవరం బొమ్మకంటి సుందరయదిడుగు కాశేపాళ్లు రెండున్నూ మాదిరాజు కృష్ణంరాజుకొని తమ్మవరం సభాగం పాతికే క్రయంకొన్న పాతికెలు రెండు యీదిగుడు భాగం కొంన్ని బొమ్మకంటి సుందరయ అనుభవించెను. దిడుగుభాగం పాతికే క్రయం పాతికెలు రెండు అయితవరం తన భాగం పాతికె కాశీపాడు క్రయం యేక సంప్రతి యీమూడు గ్రామాదులు యీ మాదిరాజు కృష్ణంరాజుకొని అనుభవిస్తూవుండి తదనంతరమందు యీ బొమ్మకంటి సుందరయ్యకు దొడ్డవిప్పత్తువచ్చి నిరవహించలేకను యీ సుందరయ పరాశర గోత్రులైన మార్కు వారు అనేటివారికి అంమ్ముకొనెను. తంమ్మవరం తనభాగం మూడు పాతికెలుగ ౫౦ కు అంమ్ముకొని యితడి అయిన దిడ్డుపాతికె వుండెను. తంమ్మవరం పాతికె మాదిరాజు కృష్నంరాజుకు వుండెను. చికితస గోత్రులయ్ని కొణిదెం బాక వారి సంప్రతి పూసపాటి వారు అనేటి వార్కి క్రయానకు ౭౫ అమ్ముకొనిరి. భూమారుజయవరాజులు రెండు గ్రామాదులు కౌండిన్య గోత్రులయ్ని శానంపూడి రాగరాజులు అనేటి అతను భారద్వాజ గోత్రుడైన ధూళిపూడి కరణం గంగరాజు అనేటి అతను భారద్వాజ గోత్రుడైన ధూళిపూడి కరణం గంగరాజున్కి రెండు గ్రామాదులు నూటనలుబై వరహాల్కు అంమ్ముకొని దేశాంతరు లయిరి. దావరపల్లి కరిణీకం సంప్రతులు రెండింటికి సంప్రతి వీసాలు యెన్మిదింటి చొప్పు సాల్కు పదారింటికి చేసుకొని యీ చామరపల్లిలోను సగం సంప్రతి పడమట గోరంట బ్రాహ్మడు హరితస గోత్రుడు మల్లాది తిరుమలభూ స్తితిని అతనికి అంమ్ముకొనిరి. పెదమద్దూరు వెలనాడు సంప్రతి ౧ భారద్వాజ గోత్రుడు వీరిని మువ్వారవారు అందురు. శింగయఅనేఅతడు శ్రీ దంత్స గోత్రుడైన దామరాజు గంగరాజు అనే అతనికి క్రయంగ ౬౦ కు అమ్ముకొని దేశాంతురులై పోయెను. అమర్తలూరిలోను పులిప్పాకవారు హరితసగోత్రులయిన సంప్రతిలోను వీసరి భారద్వాజ గోత్రులయిన సాయినివారిని సంప్రతిలోను సాహని వారు అని ఆతడు పులిపాక కాళ్ల వెంక్కంన్న అనే అతడు వీరు యిద్దరున్ను మాచళ్ల వరవు కరణంకు అడ్డగడజన్ను వెంక్కంన్న అనే అతనికి అమ్ముకొని వీరు అయిదు వరహాలకు పొడుమధర్కకు పది వరహాల్కు అంమ్ముకొని సాలుని రామయప్పపులిపాక కాళ్ల ... వెంకన్న యిద్దరున్ను దేశాం తురులయిపోయిరి పెడచెరుకూరు బ్రాంహ్మణులు కొనరాజులువారు అనేటి వారికి ... నియ్యోగల్కు వుంచి పోయిరి. పొరువగుట్కి నందవరీకలును దివివారు అనేటి వారింన్ని వుంచి అంబటిపూడి కరణాలు పాలుని వారు పోయిరి. పెరవలి కొల్లివారు అనే వెలనాటినియ్యోగులను వుంచిపోయిరి. చినపులివర్తిపాడు భట్టిప్రోలు కరణాలను వుంచిపోయిరి. గోరంట బ్రాహ్మణులు కట్టమూరి నియ్యోగులు వెలనాటి వారికి వుంచిపోయిరి. అమృతలూరిలో హరితస గోత్రులయిన పులిపాక వారి సంప్రతిలోను కాళ్ల వెంకన్న కొమరై చింన్నగావుండగాను యీ కాళ్ల వెంకంన్న పాంశ్విఖ వరపకరణం ఆత్రేయ గోత్రుడు అడ్డపుడవారు అందురు. యీ అడ్డగడవల్ల వెంకనన్న అనే అతన్కి యిచ్చి వివాహంచేశి పులిపాక కాళ్ళ వెంకన్న తన కరణీకంలోను పర్కధార పోశెను. చిన్నపలకలూరిలోను శౌండిన్య గోత్రుడు వీరిని పట్టస్వామివారందురు. యీ పట్టస్వామిన్ని అన్నంరాజుత్న మేనల్లుడు మాస్నగంటి రామయ్య అనే అతన్కి తన కొమార్తెను యిచ్చి వివాహం చేశి యాక సంప్రతిలోను కరిణీకం ధారపోశెను. వీరు ప్రధములు భట్టిప్రోలు కౌండిన్య గోత్రులు మెడుకొండూరు కరణం వెలనాడు భారద్వాజ గోత్రులు వీర్ని భయిరవరాజు వారందురు. వీరినే కొమ్మరాజు వారు అందురు. వీరిని మేడి కొండవారుఅందురు. యీ భయిరవరాజుశరభయ్య అనే అతడు యీభట్టిప్రోలులో పాటం చిన్నంరాజు అనే అతణ్ణి మేనల్లుడు గనుకను తన కుమార్తెను యిచ్చి వివాహంచేశి తన భాగం లోను పర్కభాగం ధారపోశెను. పూసపాటివారి సంప్రతిలోను క్రయం అమ్ముకొనిరి. కౌండిన్య గోత్రులకు చిన్నదాన్ని యిచ్చి వీసందహయిత్రం యిచ్చిరి. నల్లూరి వెలనాడు కౌశిక గోత్రులు వీరిని రుద్రపోలిన వారందురు. యీ రుద్రదేవుని సంగరాజు అనే అతడు పూసపాటివారు వెలనాటినియ్యోగుల. . . గెనారాయణ అనే అతన్కి తన కుమార్తెను యిచ్చి యీ నల్లూరితో తన కరిణికంలో పర్కధారపోశెను. చిల్కూరు నందిగ్రామ పెదమక్కెన చింతలపూడి యీ నాలుగు గ్రామాదులలోను మంత్రియరాజు నర్సయ అనే అతడు భారద్వాజ మంగ్గినపూడి అక్కయ్య అనే అతన్కి యీ నర్సయ్య - కుమార్తెను యిచ్చి వివాహంచేశి మంత్రయ కొన్ని క్రయం యాకభోగంలోను పాతికె భాగం యీనల్గు గ్రామాదులలోను యిచ్చెను. ముప్పాతిక భాగం తాను వుంచుకొనెను. సాతులూరు కరిణీకం భారద్వాజ గోత్రుడు దత్తిమల్లయ అనే అతడు తన కుమార్తెను ఆత్రేయ గోత్రుడైన చిలుపూరి కరణం కొంమ్మరాజు పొట్టలింగ్గరాజు వివాహంచేశి తన సంప్రతిలోను యీ లింగరాజుకు పరకరణీకం యిచ్చెను. పరిలెపూడి భార ద్వాజ గోత్రుడైన శానంరాజు అనే అతడు తన కుమార్తెను కాశ్యప గోత్రుడైన మత్కుపల్లి వెంక్కటయ అనే ఆతనికిచ్చి వివాహంచేయించి పర్మకరణికం యిచ్చెను. చినపులివర్రు ప్రతి కరిణికం తెలగాణ్యులు హరితస గోత్రులు వీరిని వేంగ్గివారు అందురు. యీవేంగ్గిరంగయ అనే అతన్కి కుమార్తె మరుగుజ్జురు అని యెవ్వరు బంధువులును పుచ్చుకొకను వుండిరి. గనుకను పెరకలపూడి కరణం వెలనాడు భారద్వాజ గోత్రులు వీరిని మల్లినాధుని వారు అందురు. అనే ఆతనికి చింన్నదాన్ని వివాహంచేశి తన సంప్రతి భాగంలోను పాతికే కరిణికం చినపులిపర్రు యిచ్చెను. యీ వనిపాకనాడు శాండిల్య గోత్రులు వీరిని బల్లి కుర్వవారు అందురు. యీ బల్లికుర్వ బాచయ అనే అతడు తను కుమార్తెను నోచళ్ళపల్లి నాగరాజు అని అతడు కౌండిన్య గోత్రుడు యీచింన్న దాన్ని ఆ నాగరాజుకు వివాహంచేశి యీ పనిలోను తన సంప్రతి భాగంలోను ఆ బాచయకు వీసంకరిణీకం యిచ్చెను. తాను వుద్యోగ ధర్మం చేతను పలనాడు పోయినాడు. యిది పర్యంతం మన్ను సంప్పటం కోనప్ప వాశిన ప్రకారం కొల్లి పరలోను కృష్ణానది తూర్పునుంచి వెలనాడు కాశ్యప గోత్రుడు వీరిని ముక్కా మలవారు అందురు. బుండపాటివారికి బంధువుడై వుండి వచ్చే గనుకను యీకొల్లిపర బొండపాటి వారు గౌతమ గోత్రులు వీరి యింట్లో చిన్నదాన్ని యీముక్కామంగ్యయ అని వారిని యిచ్చి వివాహంచేశి తమ భాగంలోను పరక కరిణికం యిచ్చెను. బొడపాటి వెంగన అనే అతడు కొల్కలూరు కౌండిన్య గోత్రుడైన గోపరాజు గోపయ అనే ఆతన్కి మేనల్లుడైన భరితేపూడి కొండయ అనే అతనికి కాశ్యప గోత్రుడు వీనికి యీ గోపయ కుమార్తెను యిచ్చి వివాహంచేసి. వీసకరిణీకం తన భాగంలోను యిచ్చెను. మోదుకూరు అర్వ లు హస్తకులయ్నివారు వసిష్ఠ గోత్రులు వీరిని అడిదెవీటి వారు అందురు. తెలగాణ్యులు యీ అడిదెవీటిశిట్లయ అనే అతడు తన మేనల్లుడైన విశ్వామిత్ర గోత్రుడైన మాదగుంట గుర్వయ అనే అతనికి చింన్నదాన్ని యిచ్చి వీసం తనభాగంలోను యిచ్చెను. కౌండిన్య గోత్రుడైన కాటూరు మంత్రయ కొన్న నందిగామ పెదమక్కెన చింతలపూడి యీ మూడు గ్రామాదులలోను యీ మంత్ర రాజు నర్సయ్య అనే అతడు భారద్వాజ గోత్రుడైన మరిగెనపూడి అక్కయ అనే అతనికి తన కుమార్తెను యిచ్చి వివాహం చేశి యీ మూడు గ్రామాదులలోను తన యాకభాగంలోను పాతికె యిచ్చి ముప్పాతికే చేసుకొనెను. నుర్రతారు వెలనాడు భారద్వాజ గోత్రులను సంప్రతి ౧ వీరిని బంధువులు యితన్కి మేనల్లుడు సాయిఖానుడు గోత్రుడైన మాదిరాజు యీ గంగరాజు కుమార్తెను సాయింఖానస గోత్రుడైన బాపయ అనే అతన్కి యిచ్చి పాతికే తన యాక భాగంలోను యిచ్చెను. నారాయణపురం బేతపూడిలో యీ రెండు గ్రామాదులు పాకనాడు బల్లికుర్వపాడు అందరు యీబల్లి కుర్వయ దివాకరుని కుమార్తె చుట్టకాండ్లతో జగడం పుండ గాను చిన్నదానికి వివాహంగాక వుండగాను నాదెండ్ల అన్నా పెగడవారు శఠమర్షణ గోత్రులు యీ అన్నా పెగడ వెంకన్న అనే అతనికియిచ్చి వివాహంచేశి తన యేక భాగమయిన నారాయణపురం బేతపూండ్లలోను పరామిరాశి యిచెను. (యిక్కడను మాతృ భిన్నం) కొర్రపాడు సంప్రతులు ౨కి పాకనాడు శ్రీవత్స గోత్రులు శివదేవుని వారి సంప్రతి యిచ్చి ప్రథములునే తనవారు అనేటివారు కాశ్యప గోత్రులు సంప్రతి ౧ న్ని యీ కేతన ప్రభాకరయ అనే అతడు యీమంత్రరాజు అనే అతడు నందిగామ, భీమవరం చిలుకూరుకొనెగన్కను యీ మంత్రి రాజుకు ఆరూరి తనభాగం అమ్మజూపె గనుకను శివదేవుని త్రిపురయ అనే భాగస్థుడు నేను సంప్రతిని వుండి పరాయికి నేను యియ్యను అని తన బంధువుడు కంటెపూడికరిణీకం దొడ్డవాడు బల్లికత్వ తిమ్మరాజు ఆత్రిపురరాజు విచారించి అకొర్రపాటి కేతనవారి సంప్రతి ౮౦ వరహాలకు క్రయం పుచ్చుకొని యీ తిమ్మరాజు సమత్రిపుర రాజ్కు సగం సంప్రతి పుచ్చుకొనిరి. సామతారమల్లపరాజు అని అతడు భారద్వాజ గోత్రుడు త్రిపురరాజుకు బంధువుడు గనుకను త్రిపురరాజు తనుకొంన్న సంప్రతి అర్థం పాతికెగ ౨౦ వరహాలకు ఆసాంతలూరి మల్లపరాజుకు యిచ్చెను. యీ బల్లికుర్వ తింమ్మరాజు తాను పుచ్చుకొన్న సగం సంప్రతి ఆ సాతులూరి మల్లయ్యకు యిరవై వరహాలకు యిచ్చి కట్టెంపూడికి చెర్వు వేయించెను. యీ కొర్రపాటికి శివదేవుని త్రిపురయ సంప్రతి పాతికె, సాతులూరు మల్లపరాజు ఆర్థసంపంతి యీ బల్లి కుర్వతిమ్మరాజు పాతికె కౌర్రపాడు తనవారి సంప్రతి యీరీతున క్రయానకు అంమ్ముకొనిరి యీ ప్రభాకరయ తనజ్ఞాతి మల్లయ్య అనేఅతణ్ణి కలుపుకొని పెదపణిదెరపు సంప్రతి చిట్లూరి కరణం భారద్వాజ గోత్రుడు తమకు బంధవుడు గనుకను కొండ చినమక్కెన తనకు అనే ప్రధమున్కి తన సంప్రతిలోను ముప్పాతికె భాగం ౬. వరహాలకు అంమ్మి పాతికె భాగం తమకు పంచుకొనిరి. లగడపాడు కేతనవారికి ఏక సంప్రతిగను తమబంధువులు ఆలూరి రంగయ అనే అతనికి ౮౦ అమ్ముకొనిరి. చినమక్కెన తమది ఏక సంప్రతి గనుక గొరిశెవోలు రంగరాజు అనే ప్రధమున్ని క్రయం ౮౦ వరహాలకు అంమ్ముకొని యీ కేతరాజు ప్రభాకర మల్లయ్య యిద్దరు కొణిదెంబాక నారపరాజు ఆపెదముక్కెన యీ చింతలపూడింన్ని ౨ న్ను తమకు యేక సంప్రతి గనుకను కౌండిన్య గోత్రుడైన కాటూరి మంత్రరాజ్కు అంమ్మి పెదమక్కెన ౮౦ అతడు వీరు కలసి దేశాంతరులు అయిరి. దిడుగు తుమ్మవరాలు ౨ న్ను భారద్వాజ గోత్రులు బొమ్మకంటి వారు పాతికే సంఖ్యాయనస గోత్రులయిన మాదిరాజువారు పాతికే, కౌశిక గోత్రులయ్ని కటకూరివారు పాతికె, ధూళిమెడ్డవారు గౌతమ గోత్రులు పాతికె యీనాలుగు తెగలవారు వెలనాడు వీరు అనుభవిస్తూవుండి తదనంతరమందునను యీరౌద్రి సప్తకమందు నిర్వహించలేక తడుగుతంమ్మవరాలున్ను యీ కటుకూరి వారున్ను ధూళిమెట్ట అన్నంరాజు వారు తమ భాగము ౨ రెండు పాతికెలున్ను అంమ్ముకొని పోవలెనని విచారించి వీరు అంమ్ముకున్న లక్షణం- మోరెంపూడి వఝులు అనే అతడు శ్రీవత్స గోత్రులు వెలనాడు నియ్యోగి, క్రయం చేశిరి గనుకను కనుబొమ్మకంటి సుందరయ అనే అతడు తాను సంప్రతి భాగస్థుణ్ణి వుండిపరాయిల్కు అంమ్మనియ్యను అని వారు వఝులతో చేశిన క్రయం తంమ్మవరం రెండు తెగల వారు రెండు పాతికెలు క్త్రయం ౫౦ బొమ్మకంటి సుందరయకొనెను. దిగుడు పాతికెలు ౨ న్ను సాయింఖాయినస గోత్రుడైన మాదిరాజు కృష్ణంరాజు కొనెను. క్రయం ౮౦ వరహాలు. యీరెండు గ్రామాదులు క్రయం ౧౩౦ వరహాలకు కటుకూరి నాగయ్య ధూళిమెట్ట అన్నంరాజు దిడుగు తంమ్మవరాలు తమిమిరాశి అమ్ముకొనిరి. కాశిపాడు ప్రధములు భారద్వాజ గోత్రులు వీరిని రాచనాల వారు అందురు. యీ రాచనాల వెంకన్న అనే అతడు యీ సాయింఖాయినస గోత్రుడైన మాదిరాజు కష్టంరాజుకు ౬౦ వరహాల్కు అంమ్ముకొని దేశాంతరులు అయిపోయిరి. కటుకూరి నాగయ ధూళిమెట్ట అన్నంరాజు రాజనాల వెంకన్న యీ ముగ్గురు దేశాంతరులయి ఓరుగల్లు కాశ్యప గోత్రులు వెలనాడు వీరిని యద్దనపూడి వారు అందురు. యీ యద్దనపూడి గోపరాజు అంమ్ము కొనెను. ఆంబటిపూడి కరణం నందవరీకులు భారద్వాజ గోత్రులైన గోపాలుని బాపిరాజు అనే అతనికి క్రయం ౫౦ వరహాల్కు అంమ్ముకొని యద్దపూడి గోపరాజు దేశాంతకుడు అయెను. ఆ గోపాలుని బాపిరాజు తనకు స్నేహితుడని ప్రధముడు అయ్ని దీవిలక్ష్మయ్య అనే అతణ్ణి ఆచోరు గంటికి హస్తగతం వుంచెను ....ంగల్లు ఏక సంప్రతి ప్రధములు యీ గోపాలుని బాపిరాజుకు సగం సంప్రతి ౪ం నలుభై వరహాలకు అమ్ముకొని దేశాంతరులు ఆయెను. యీ ధరణికోట పొలంలోది అమరేశ్వరం ప్రభవ పంచకమందు యీ ధరణికోట బ్రాహ్మణులు అగ్రహారాల్కు తూపలు ౧౬౪ పోయి హద్దుచేశి అమరేశ్వరం ప్రధములు గౌతమ గోత్రులు ఆత్తోట వారు అనేటివారికి గ ౬౦ ఆరువయి వరహాల్కు అమ్ముకొని ఆత్తొటవార్కి యీ ధరణికోటకు హస్తకంలివుంచి ధరణి కోట బ్రాహ్మణులు దేశాంతరులు అయిరి, కొల్లిపర కొండపాటి శరభరాజు అతన్కి గౌతమ గోత్రుడు బుద్ధవరపు వేలనాడు సంప్రతి ౧ వీరిని తోరణాలవారు అందురు గౌతమ గోత్రులు తోరణా తింమ్మరాజు యీబొండ పాట శరభరాజు అని అతన్కి .... బుద్దవరం ౪ం వరహాలకు అమ్ముకొనెను. రాజనాల పురం వెలనాడు కౌశిక గోత్రులు సంప్రతి ౧ కొల్లిపర కౌండిన్య గోత్రులు వీరిని ఆరాధ్యుల లింగరాజు అనే అతన్కి.... రాజనాపురపు వారని తరిగొప్పల వారు అందురు. యీతరిగొప్పల విశ్వపతి అనే అతడు యీఆరాధ్యుల లింగరాజుకు క్రయం గ 3 ౨ వరహాల్కు అంమ్ముకొని వీరు యిద్దరు దేశాంతరులయిరి. వీరిని కౌండిన్య గోత్రులు కంత్తేరు వెలనాడు కౌండిన్య గోత్రులు సంప్రతి ౧ వీరిని యద్దనపూడివారు అందురు. యీవెంకన అనే అతడు రామకూరి రఘుపతి అనే అతన్కి ౯౦ వరహాలకు అమ్ముకొని పోయెను. ఇవి పూర్వక్రయాలు యీగ్రామాదులు రౌద్రి సప్తక ప్రభవ పంచక క్షామానకు అంమ్ముకొని దేశాంతరులు అయిపోయిరి. అర్ధ జీవనం గల వారు పోలేదు. వీరిని యాద్వాదశాబ్దాలు పట్టలుకొట్టి ధర వక్కరీతున అంమ్మినది గనుక జీవంతులు అయివుండిరి దేశాంతరులు అయిపోయి తిరిగివచ్చి జల్లిగంపవారు ప్రధములు భారద్వాజ గోత్రులు యలమందలో సంప్రతులు సంమ్మెహిని వీసంక్రయ లబ్దంకు కొనుక్కొని కుదురు కొనిరి. మంచికంటివారు నల్లపాటిలోను సంప్రతులు 3 లో వీసంమ్నువాని క్రయానకు కొనిరి. కొరితపూడివారు అనేటివార్కి సంముక్కా విక్రయాలు కొనిరి. మేడికొండూరులోని హ్రింసంసంమ్నొవాని క్రయానకు కొనిరి. పడివీసాలు గౌతమ గోత్రులయిన యాంబలూరి వారు పదివీసాలు అవిరి ప్రత్తివాడు కరిణీకం యోలూరి వారు అనేటివారు పరకనం మ్నోవాని కొనిరి. (అక్కడ మాతృభిన్నం) హస్తకులను నిల్పి పోయిరి. కొన్ని వూండ్లవాండ్లు కామరాజుగడ్డ బాట్రగడ్డ రుద్రవరాలకు విశ్వాత్ములవారు లింగధారులు గనుకను తమశీఘ్యలయిన భారద్వాజ గోత్రులకు హస్తకంవుంచిపోయిరి. మోదుకూరి అర్వలు వశిష్ట గోత్రులను వుంచిపోయిరి. కెల్లిమర్ల నియ్యోగులను వుంచిపోయిరి. అంగ్గలకుదురు తమ బంధువులను పినపాటి వారు గౌతమ గోత్రులుకు మంచిరాజు వారు అందురు. పెనుగుదురుపాడు రాచవారి వెంబడి వచ్చిన బాంహ్మణులు దేశాంతరులు అయిరి గనుకను భారద్వాజ గోత్రులు నియ్యోగులు ఆక్రమించి వీరు వెలనాడు పెనుపులిశెనల వారిని హస్తకం వుంచిపోయిరి. వీరు నియ్యోగులు వెలనాడు పెదకొండూరు బ్రాహ్మణులు కంభంమెట్టవారు ముచ్చికంటివారు అనే వారిని వుంచిరి. పెడపర్రు కొల్లిపరవారిన వుంచిపోయిరి. పెదరావూరు సాయింఖాయినస గోత్రులు ప్రధములను వుంచిరి. పెదపూడి బ్రాహ్మణుల అమృతలూరి కరణం మౌద్గల్య గోత్రులను నందవరీకుంణ్ణి వుంచి ధరణికోటవారు ప్రధములు గౌతమ గోత్రులు అత్తోటవారు అనేటివారిని వుంచిరి. వీరిని నడిమిపల్లి గూడవల్లులు నియోగినివుంచిరి. వీరిని నడిమిపల్లి పేర్తున పోయిరి. యీరీతున ఉంచి దేశాంతరులు అయిపోయింది. గనుకను లూనియోగ్యులు కొన్ని ఊళ్ళను తామే ఆక్రమణచేశిరి. కొన్ని పూళ్లవారువచ్చి యీవణ స్తకులను వెళ్లదోలిరి. బండారుపల్లి వాస్తుకలు వీరు ఆక్రమించిరి. చిలుకూరి అంమ్మ రాజువారు అనేటివారు ప్రభవ సంచక సప్తకాల్కు హస్తకులను వుంచి దేశాంతరులు అయినారు. స్వస్తిశ్రీ విజయాభ్యుదయశాలి వాహన శరవరుషంబులు ౧౫౦౦ మీదట ప్రమాదినామ సంవత్సర చైత్రశు ౫ అంగారకవారం ఝాముపొద్దుయెక్కినవేళ కొండవీటి దుర్గం పోయివుంచి అశ్వపతులు తీస్కునిరి తురకల యేలుబడి ఆయను. కొండవీడు కొండపల్లులు ముర్తుజాంనగరు ముస్తుభాంనగరు అనిరి. యీరెండు సర్కారులు అశ్వపతులు బేరీజుచేసే గనుకనుమూర్తుజాంనగరు శిస్తుయొక్క ముస్తుభాంనగరు శిస్తు తక్కువ అయగనుకను రావిపూడితో కూడ పధ్నాల్గు మాండ్లశిస్తు ...ముస్తఫాంనగరులో కల్పిరి గనుకను యీ రెండు సర్కారుల శిస్తు సమం చేశి రాయిపూడి అలాయిదావిలాయితీ అనిరి. పాములపాడు ౧, తెగలపూడి ౧, ధరణికోట ౧, బందం రాపూరు ౧, రావిపూడి ౧, ముద్దళం ౧, ఉండవల్లి ౧, పెనుమాకు ౧, తాడేపల్లి ౧, ప్రాతూరు ౧, కుంచనపల్లి ౧, తూమునూరు ౧, దావులూరు ౧, యీపధ్నాలుగు గ్రామాదులు కొండపల్లి శిస్తు కిందవి... లాయీఖేహి ఆయెను. గోకర్ణేశ్వరపు పొలంలో పాలెంపూరు బెనిజాంపట్టణములో ఆయను పేరు వుప్ప... మహాలు చేశి యీమహలు కింద గ్రామాదులు నిజాపట్టణము ౧, పెరవలి ౧. అల్లపర్రు ౧, పూండివాడ ౧, కాటూర్లు ౧, మొండ్రేడు ౧, ఆముదాలపల్లె ౧, చెరుకుపల్లె ౧, గణపవరం ౧, యేలేటిపాడు ౧, రాజవోలు ౧, అడవులదీవి ౧, కూచనపల్లి ౧, వుల్లిపాలెం ౧, పోటుమెర్క ౧, చినమట్లపూడి ౧, పెదమట్ల పూడి ౧, పల్లపట్ల ౧, పెదపల్లె ౧, కొమరవోలు ౧, వెంటపాలెం ౧, ధూళిపూడి ౧, బాపట్ల ౧, కడకుదురు ౧, గంజా ౧, చందవోలు ౧, అమర్తలూరు ౧, వెలగపూడి ౧ , పేరాల ౧, కొత్త మంగళగిరి ౧, దేవరంపాడు ౧ , యీ ౩౨ గ్రామాదులు నిజాంపట్నం, రాజురాజం జూనామహలు, నిజాంపట్నం అలాయిదా ఆయెను. కొన్ని మధురాల కింద వుండే గనుకను జంపనివారి కిందను కోనూరు ౧, చామర్రు ౧, చింతపల్లి ౧ గింజుపల్లి ౧, కుంటద్ది ౧, బుడపల్లి ౧, తాడువాయి ౧, చల్లగరికె ౧, మాదిపాడు ౧, ఈ తొంమ్మిది పూళ్ళు జొంప్పినవారి కిందను అలాయిదా అయిపోయెను. కైత్తేపల్లీ వుదయగిరిలో కలిపిరి. పరుచూరు అద్దంకిలో కలశెను. కేశనపల్లె, యెనమల మంద ౧, తొండపి ౧, మామం కొసూరు ౧, జువ్వలకల్లు యీ ఆరు గ్రామాదులు బలుకొండ కిందచేరి పోయెను గనుకను దేశస్తుల విచారించి పధ్నాలుగు శీమల్కు పధ్నాలుగు సంతులు చేశిరి. సముతు కింది గ్రామాదులు యీమునుగోడు ౫౬- పాలడ్గు ౧౪ నాదెండ్ల ౬౬ హవేలి ౪౪ తాడికొండ ౨౨ మంగళగిరి 33 నూతక్కి ౧౪ చేబ్రొలు ౩౬. గుంటూరు ౩౪ పొన్నూరు ౪౪ చెర్కూరు ౧౨ సంతరావూరు ౧౦ కూచిపూడి ౫౪ పులివర్రు ౫౨ పాలెములు పూర్లు మధురాలు ఆయను. కౌమాలు బేరీజు చేశేవరకు యీ కొండవీటిశీమలను... మధురాలు అయివుంన్న గ్రామాదులు చోడమధురాల గ్రామాల కింద దాఖలాలు చేశినది. మందపాడు పెనుమూడి సమీతు ౧, రావిఅనంతవరపు పూడిసమేతు ౧, తూర్పు కొమరవోలు చాట్ర గడ్డ సమేతు ౧, తాడిగిరి కొప్పోడు ౨ న్నూ కొల్లూరు సమేతు ౨ న్ను తూర్పు పెంచికలపూడి పెరువలి సమేతు ౧, దగ్గుమల్లి గోవాడ సమేతు ౧ , వుత్తరంపల్లపట్ల అలపాటి సమేతు ౧, కందేవి చోరు ౧, పులిచింతలపూడి కూచిపూడి సమేతు ౧. అయితానగరు తెనాలి ౧, బుగ్గవరం రాజనాలపురం ౨ న్ను కొల్లిపర సమేతు ౨ న్ను దుర్గంపూడి పెరుకలపూడి సమేతు ౧ చోడవరం జువ్విపూడి ౨ న్ను లయు సమేతు ౨ న్ను దేవరపల్లి చిల్కలూరు సమేతు ౧ బొల్లవరం చిలపులి సమేతు ౧ , పుత్తర ఉప్పలపాడు తూర్పు దొండపాడు ౨ న్ను పెదవడ్లపూడి ౨ వుత్తరనారాకోడూరు కంతేరు సమేతు ౧ ప్రయ్యంమిట్ట నిడుముక్కుల సమేతు ౧, పడమటి దొండపాడు తుళ్ళూరి సమేతు ౧ , ఉత్తర గుండవరం నెమలి కంట సమేతు ౧ గొపీనాథపురం పెదపల్కలూరు సమేతు ౧ , తిపురాపురం వెంకటపురం రెండున్ను యన్మదల సమేతు ౨ గొట్టిపాడు ప్రత్తిపాటి సమేతు ౧, పడమటి కొమరవోలు పసుమర్తి ౧ నాగులపాడు, గార్లపాడు, కొల్కలూరి సమేతు ౨- సాపాడు పల్లిపాడు వంగిపురం సమేతు ౧, పోతవరం పడమట జొంన్నలగడ్డ ౧, త్రిపుర సుందరపురం సాతులూరు సమేతు ౧ , నక్కలగుడిపూడి పడ్మట పెంచికలపూడి సలసమేతు ౨ అముదలపల్లె కొమెరపూడి సమేతు ౧ దక్షిణ గంగవరం కొర్రపాటి సమేతు ౧ చిల్కలూరు నందిగామ సమేతు పత్మట జంపని చిన తక్కెళ్ళపాడు తుముళ్ళగుంట యీమూడున్ను పెదతక్కిళ్ళపాడు సమేతు 3 న్ను దేచవరం వుత్తర పోణుకుపాడు పడ్మట మంగళగిరి యీ న్ను పెదకొండూరి సమేతు ౩ దక్షిణం కొంపల్లె అల్యూరం సమేతు శానంపూడి, మందపాటి సమేతు ౧, వుత్తర తుర్లపాడు వరగాని సమేతు ౧, వుత్తర రంగవరం కుంట, పెదకూరపాడు సమేతు ౨ రామాపురం అంతలూరు సమేతు కాశిపాడు దిడుగు సమేతు ౧, వుత్తర పొట్టాపురం, పుత్తర కోపల్లె పడ్మటి ఒకేపల్లె సమేతు 3 తింమ్మాపురం, అప్పాపురం, మోచళ్ళపల్లి, నాడెండ్ల సమేతు ౪ అగతవరం, పెదకాకాని ౧, బుడమ, కొరివేడు, గరికిపాడు ఈమూడున్ను గుంటూరు సమేతు బోడపాడు పోతుకట్ల కుంకలమర్రు సమేతు యక్కటల వుప్పవరపాడు సమేతు పినపాడు పెద కూరపాడు సమేతు ౨ పడమట మున్నంగి కాజ సమేతు ౨ అలరాల యాదలి సమేతు ౧, రోకుంటిగుండ్ల శిద్దాపురం మెట్టపల్లి అనంతవరం పినపాడు, పెదపాడు యీ ౬ గ్రామాదులు గజరాయని వేల్పూరి సమేతు అయ్యవరం కంచెర్ల కరెవరం సమేతు ౨ యివి దాఖలా యీవుండెలనాటి మాటలు ఖండవీలు అనంగ్గాను కుచ్చళ్లు అనుట ఖండవీలు ౨ అయితేను కైలుకుచ్చెల అందుకు కుంటలు ౪౦౦ అయితేను కుచ్చల. యీకుచ్చెళ్ల పేరు పూర్వకత్తెర యందురు. యీన్నూరు కుచ్చళ్ల పేరు మర్తుక అందురు. యీవెన్కున పొండినలనూరు కుంటల కుచ్చల పేరు ఖండవీలు అందురు. యీవెన్కును ౮౦ కుంటలకు కుచ్చెలపేరు ఖండలి అందురు. ఖండ్రవాటు అనంగ్గాను గ్రామంలో తునకు ఖండెమనంగ్గాను బారలో సఖముఖండి అనంగాను పుట్టెడు అనుట, మారద అనంగాను కుచ్చల అందురు. తూపకుచ్చెల ౨౹౹ సంఖ్య కుచ్చడ్లు యిన్ని సంఖ్యలు అయ్ని పదహారు పురనాలుగు బారలుఘటకర్తి అంన్నాను, మర్తువు అంన్నాను, తూపలు అంన్నాను. చింన్నపాటి పెద్దపాటి విచారించుకునేది. జాగీర్లు యిచ్చినాడు దక్షిణం యీపూరు ౧ కుక్కలమర్రు చోడపాడు ౧ , యీనాల్గు గ్రామాదుల్కు వుప్పుటూరు అయిల్లాఖానునికి ౧౨౦౦౦ వేలవరహాల్కు జాగీరు యిచ్చిరి గనుకను యీగ్రామాదులు వుప్పుటూరి కిందను కల్సిపోయను. యీ అబ్దుల్లాఖానివారు ఉప్పురువ యీగజపతివారు అలాయిదా పొలిమేర హద్దులు నిల్పి గ్రామాదులు చేశిరి. పైటేటిపొలంలో పాలెం రేపూడి ౧, చినకూరపాటి ముప్పాలపూడి ౧ యీపనిపొలంలో పాలెం దుగ్గిరేలపూడి ౦, చేబ్రోలు వడ్లపూడి పొలం పెనుగుదురుపాటి పొలం కల్పివడ్లపూడి పొలంలో పాలెం శ్రీరంగపురం యీనాల్గు గ్రామాదులు జగపతివారు చేశినవే. రెడ్ల వారు చేసిన గ్రామాదులు సొలస పొలంలో పాలెం సంక్రాంతిపాడు అయిలవరం ౨ యీగ్రామాదులు రెడ్ల వారు పొలిమేర హద్దులు చేశిరి.కృష్ణదేవరాయలు వ్రాసిన గ్రామాదులు :—వెంన్నాదేవి పొలంలోను పాలెములు ౨ కి పొలిమేర హద్దులు చేశ్ని గ్రామాదులు భట్టుపాడు అనేగ్రామం కంకణాలపల్లి అనిరి పొంన్నకంట్టి పొలంలో పాలెం పోలిమేర హద్దులు చేశి ఖండికి చేశి పొంన్నగంటి గోపినాధునకు యిచ్చెను.పొంన్నకంటి ఖండికె అనిరి. యీమూడు గ్రామాదులు కృష్ణదేవరాయలు పొలిమేరనిల్పి గ్రామాలు చేశెను. తరువాత జటామాలి మగరాజు అత్తోట పొలంలో పాలెం హద్దులు నిల్పి కంచవరం వూరు ఆయను. యీవని అత్తోట యీరెండు ఊళ్ల పొలం కల్పి గ్రామం చేశిరి తుర్కాజ్యం అయిన వెన్కును తాళ్లూరి పోలంలోను తూపలు ౫ం ఖండ్రికె చేశి శ్రీరంగపురం అని గ్రామం కట్టించి పొలిమేర హద్దులు నిల్ఫిరి. యడ్లపాటి పొలంలో తూపలు ౧౦౦ ఇతర పొలిమేర హద్దులు చేశి విశ్వనాధుని ఖండ్రికె అని నామం గనుకను చేశాను. గ్రామాదులు యెడ్లపాఖ పొలంలో తూపలు 32 కార్యాలపొలంలో తూపలు ౧౨॥ గరికిపూడి పొలంలో తూపలు ౧౨॥ సదాశివరాయలు చేశిన గ్రామాదులు నుదురుపాటిపొలం దేగడగడ్డపొలం వేమవరపు పొలం యీమూడు పూర్లు పొలం ౭౫ పొలిమేర హద్దులు చేసి ముడుంబ అయ్యవార్ల గారికి ఖండ్రికె యిచ్చిరి. గ్రామం కట్టించెను. ఈఖండ్రికె గ్రామం ఆయను. వంకాయలపాటి పొలం తూపలు ౩౩౹౹౦ పొలం ౧౦౦ తూపల పొలం బాణాదార్లకు యినాం యిచ్చిరి గనుకను యీబాణాదార్లు కాశీ విశ్వేశ్వరుని పేరిట పాలెం కట్టి హద్దులు పొలిమేరలు చేశిరి గనుకను విశ్వనాధుని ఖండ్రికె అనిరి. తుర్కల యేలుబడి పాటిబండ్లపొలంలో పాలెములు రెండు కట్టుకొని కాపురాలు వుండి పొలిమేర హద్దులు చేశి జూలాల్పరం, ముస్సాపురం అనే గ్రామాదులు ఆయను. ఆమీనుబాదా యాంబలూరి పొలంలోనిది అల్లిపురం వెదపణిదంపు పొలంలోది. జటాలుఖానుని పొలంలోది దర్యాపురం అనిరి. వుత్తరగంగవరం అనే గ్రామం యక్కాట పులిపాక అనే గ్రామం జెబతుపురం అయ్యెను. ములుకుట్ల అనే గ్రామం యస్సాపురం ఆయను. యీకొండవీటిశీమ గ్రామాదులు హవేలీ గ్రామాదులలోను యీవెన్కను వీరు చేశ్ని గ్రామాదులు కాకనుమున్కు పూర్వపు గ్రామాదులు ౬౦౦ యివి శీమామూలం అయినద్ది. కొండవీటికి మాణిక్యారావు, వచ్చిన సంవత్సరం...శ్రీవీరి యింటిపేరు కృష్ణానది వారందురు. వీరు వోరుగంటి దుర్గానికి నాయకులయిన తర్వాతను యీకృష్ణానికొండన్న అని అతన్కి సంతతి లేదు యితని తంమ్ముని కుమారుడు చిన్నవాడు యీచిన్నవాణ్ణి వెంట పెట్టుకొని యీకొండన్న ఖుదాహుశాదశ౯నానకు వచ్చెను. గనుకను ఖుదాహుశాన్కు కొమాళ్లు లేరు గన్కును యీచింన్నవాణ్ణి చూచి చాలా దయవచ్చి మాటలు మాణిక్కాలు యీచిన్న వాని వనిదయివచ్చి మాణిక్యారాయుడు అనీ పేరు యిచ్చి యితన్కి కొయ్యల కొండదుర్గానికి నాయకరానికిని ధరణిని చేసె గనుకను కొయ్యలకొండలో యితని మన్వంతరం వుండిరి. యితని కొమారుని మన్వంతరానను విధురాముని నమామోనునకొయ్యల కొండ విడిపించి కొండపల్లి దుర్గాన్ని నాయకరం అంపించ్చిరి. యీ కొండపల్లిలోను కొంన్ని దినములు జరిగిన తదనంతర మందునను కొండవీడు కొండపల్లెలు తుర్కాణ్యం అయ్ని తర్వాతను కొండపల్లె నుంచి కొండపల్లి నాయకరానకు వచ్చిరి. వీరు వచ్చి సంవత్సరము స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశకవరుషంబులు ౧౫౦౭ అగు నేటి తారకనామ సంవత్సర అశ్వీజ శుద్ధ ౧౦ గురువారం ముంమ్మన్న మాణిక్యారాయడు ప్రవేశము యీయన బాల్యనామము ముంమ్మన్న అని నామాంకితము గనుకను ముంమ్మన్న మాణిక్యారాయుడు అనిరి. యాదాస్తు మానూరువారు వచ్చిన సంవ్వత్సరములు మానూరివారు మజుము వప్పుకొని తురకాణ్యం అయిన ౧౩ సంవ్వత్సరములకు వచ్చిరి. వీరు వచ్చిన సంవ్వత్సరం స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు ౧౫౧౫ అగునేటి నందన సంవత్సరమున వచ్చినారు. ఇక్కడికి పొదిలెశీమ స్తలకరణం పోలంరాజు పెద అన్నంరాజు వుద్యోగ ధర్మం చాతను వుండి వాశిన ప్రకారము పొలిమేరతొక్కగలందులకు విజ్ఞానేశ్వర వచనంతెనుగు పద్యము.

గ్రామంబు పొలిమేర కరయు చెనిలు పట్టి
కాలాంతరంబున కలశెనేని
విధువిధుల గొల్లల వేటకొండ్రను వొంత
చేవికలువెవుడి శేయువారి

పరగసీమకు ముంన్ను పాతిన బోగాలు
యిసుమును లాసుర్రు పైరు నలువ (మరియు)
కట్టిన కట్టలు కొడ్నభావులు
కూపముల తటాకవనము
యిందులో నసమెతటనే కట్టి నేమయు
లేకుంన్న పల్లెలందు...చుట్లపట్లున్న ప్రభులు సాక్షిగాగ
ప్రతిపట్టినపుడేమీ తెలసి నరుడు నడువవలయు !!
సాక్షులకు !!

పుత్రీ పుత్రహీనుని భృష్ణుని కృష్ణుని సంగహీనుసింధునాటదాని బదిర ప్రొందుంగు...బాలుని గుణహీనుసాక్షి సత్యములకు జనధునడ్మలో!! ధారాదత్తము దత్తపుత్ర క్రయములన్ దౌహిత్రమున్ భోగ్నములన్.

పారంపర్యము జ్ఞాతి లబ్ధమును మార్చెనట్టి సమ్మతోద్ధారోంశంబును రాజుదత్తియును వజదత్తిం జైనకంన్నాలిపరి సహయ సంప్రతి యదృశ్యంబున్నది కుంస్థితులూ గోరంట గరికిపాటను నడిచిన పూర్వవృత్తాంతం శ్రీయీరెడ్లు అగ్రహారములు యిచ్చి భూమి యేలి చనిన తదనంతరమందునను కృష్ణదేవరాయలు యేలెను. యీయన యేలుబడిలోను రెడ్లు యిచ్చిన అగ్రహారాలు నడిపించకపాయను. శీమలు కర్ణాటకంకింద కల్సుకొని గ్రామాదులు కొంన్ని శీమలకింద కల్పుకొని బెల్లంకొండ గ్రామాదులు ఇరువయినాలుగు గ్రామాదులు అడ్సుపల్లి వారు అనే కంమ్మవారికి కొల్వుబడి కిందను మొకాసా యిచ్చిరి. గనుకను యీ అడ్సుపల్లి వార్కి యిచ్చిన గ్రామాదులల్లోను రెడ్లవారు యిచ్చిన ఆగ్రహారాదులు గోరంట గరికిపాడు చిలుకొండ గామాదులలో కల్పియిచ్చినారు గనుకను యీ అడ్సుపల్లి వారు యేలుచూవుండి తదనంతరమందునను రెడ్లవారు యిచ్చిన అగ్రహారములు నడిపించకను యీ అగ్రహారము పూండ్లవారికి కృష్ణదేవరాయలు చేను పెత్తనం కరిణీకపు మిరాశీలు యిప్పించి అగ్రహారాలు నడువదాయను గనుకను గరికిపాటి వారిని మల్లాదివారు అందురు. యీ రెండు గ్రామాదులవారు తమ... కృష్ణదేవరాయలు తిర్గి అగ్రహారాలు యిచ్చినట్టు గాను దొడ్లేటికంసాలెవారి చాతను గరికిపాటివారి పలుకులు రాగి పలకలు అయిదుచేయించి రాయలు యిచ్చినట్టుగాను శాసనం వాయించిరి గనుకను గోరంటవారు పలుకులు చేయిస్తూ వుంన్నారు గనుకను ఆదొట్లేటిలోను చేయించగాను యీ అడ్సుపల్లివారికి అశ్రితుడు అయి వుండి తెలగాణ్యులు యోలూరివారు అని బ్రాహ్మణులు వచ్చి అడ్సుపల్లివారితో చెప్పిరి. గనుకను అడుసుపల్లెవారు రాయలవారితోను యేమాటచెప్పినా విని అంటువుండే గనుకను యీకృష్ణదేవరాయల్కు యెరుక పరచి చేసిన అగసాలెవాణ్ణి తెప్పించిరి గనుకను అగసాల వాడు గరికిపాటి బ్రాంహ్మణులకు చేసి యిచ్చినారు గోరంటవారు చెయ్యమంటే చేస్తూవుంన్నాను అనిచెప్పి గనుకను యీరు గోరంటవారు పల్క చేయించినారు. అని యేమి వుపద్రవము వచ్చునో అని దేశాంతరులు అయిపోయిరి. వీరు దేశాంతరులు ఆయిపోతేను యీగోరంట రెండు భాగములు చేసి యీ అడ్సుపల్లి వారు ౧ భాగం, వకభాగం కౌండిన్య గోత్రులయ్ని యోలూరువారు తనకు ఆశ్రితుడు గనకను యీయేలూరి వార్కి శోత్రియం యిచ్చిరి. ఆగ్రామం లేఖపత్రము వాయను యీఅడ్సుపల్లివారు కట్టమూరివారి కరణాలు అయ్ని నియ్యేగులు చాతను కరణీకం వాయించిరి. యీ రీతున కొంన్ని సంవత్సరంబులు జరిగించిన తదనంతరమందునను యీ అడ్సుపల్లి వారు వదలి పోయిరిగనుకను గరికిపాటివారు గోరంటవారు తిరిగి గ్రామాదులలోకి వచ్చిరి గనుకను యీకట్టమూరి నియోగ్యులు గోరంట కరణీయం తనదని మల్లాడివార్కి కరణీకం వుత్తేజో పార్జనలు యివ్వకపోయిరి గనుక యీ కట్టమూరినియ్యోగులు మల్లాడివారు వుభయత్రులు కలత పెట్టుకుని తగవున పడిరి గనుకను తగువువారు పెద్దలయ్ని వారు విచారించి యీగ్రామము రెడ్లవారు యిచ్చిన మిరాశీ యీవెన్కను రాయలవారు మిరాశీ యజమానత్వం యిచ్చి నారు సూకు కరణీకం యేరీతినవచ్చినదిని అక్సుపల్లివారు వీరులేకుండగాను మీ చాతను వాయించుకొన్నారు అని తగుచె పెట్టి వారు మల్లాదివారిని కట్టమూరినియ్యోగులును పాప పుణ్యాల్కు దలణోలచేసి కట్టమూరి నియోగ్యులును మల్లాదివారి చాతను తగూవారు జీతంకిందను యాభై వరహాలు యిప్పించి నియ్యోగుల్కు అక్కరలేకుMడ చేశిరి. శ్రీ శ్రీ యీ రెడ్లు యిచ్చిన అగ్రహారపు వూండ్లవారు తమకు నడువక పాయనని అంన్నారు గనుకను యీ వెన్కను నాలుగు అయిదు గ్రామాదులవారు రాయదుర్తిపల్కులు చేయించినారు. గనుకను కృష్ణదేవరాయలు అగ్రహారాలు నడిపించెనూలేదు. తాను యివ్వలేదు. సంప్పటం కోనప్ప వాయించిన ప్రకారము ॥

శ్రీ శ్రీ శ్రీ రామ ॥ శ్రీ శ్రీ ఆంజనేయ॥

శ్రీకృష్ణార్పణమస్తు......

11

గుంటూరు అనేది పూర్వం అరణ్యముగా వుండి అగస్త్యులున్ను గౌతములున్ను వీలు౯ గుళ్ళు నిమా౯ణంచేసి గ్రామం యేప౯రిచి అచ్చట వక పెద్ద గుండు వుంన్నందున గుంటూరు అనే వుంచిరి.

తాలూకే చింతపల్లి, సర్కారు ముర్తుజాన్నగరు. బుచ్చయ్య పొత్తూరి సుందరరాము వారు వాయించినది.

పూర్వం యీ గుంటూరు కేవల అరణ్యంగా వుండేటప్పుడు త్రేతాయుగమందు అగస్త్యులున్ను గౌతమ లున్ను సంచారార్థమయి యీ అరణ్యానికి వచ్చినంతట యీ అరణ్యమందు వఖ బ్రహ్మాండమయ్ని గుండు వుండేది. ఆ గుండువద్ద వఖ కుటీరము యేర్పరచుకొని యీ గుండుకింద ఒక తీర్థం నిర్మాణంచేసి యీ గుండుకు యీశాన్యభాగమందున అగస్త్యులు లింగ ప్రతిష్టచేసి అగస్తేశ్వరుడనే అభిదానం వుంచినారు. యిందుకు దక్షిణభాగం గౌతములు విశే ప్రతిష్ట చేసి గోపాలస్వామివారనే అభిదానం వుంచి పూజోత్సవములు చేసి కొంన్ని దినాలు యిక్కడ అగస్త్య గౌతములు వాసంచేసినారనింన్ని యిక్కడ స్తళజ్ఞులు చెప్పుతున్నారు. యిక్కడి స్తళపురాణం అవాంతంలో పోయ్నిదనింన్ని చెప్పుతున్నారు. ఆమీదట కలియుగా నంతరం జయనులు మహాప్రబలమయి కాశీనుంచి ప్రదేశాన్కి వచ్చి యీశీమ యా త్తున్ను ఆక్రమించ్చుకొని యీ అరణ్యమందు వుండ్డే గుండ్డుంన్ను యీ లింగాంన్నింన్ని చూచి యిది మహాపురుషుల ఆశ్రయమన్నింన్ని యిక్కడ గ్రామనిర్మాణం చెయ్యవలెనని యోచన చేశి యీ గుండుకు ఆగ్నేయభాగాన గ్రామనిర్మాణం చేశి గుంటూరు అనే నామధేయం వుంచి యీగుండుకు దక్షిణభాగమందు వఖజయిన ఆలయం కట్టి జనబింబ ప్రతిష్ట చేశి పార్శనాధు తీర్థంకరరు అనే నామధేయం వుంచి సమస్త పూజోత్సవములు నడ్పించినారట యిందుమాత్రం తెలుస్తుంన్నది.

వీండ్లు వుంటున్నది ఆ తదనంతరం కొంన్నిదినాలుకు మోహనరాజు గోపాలరాజు అనే రాచకొమారులు యిద్దరు వుత్తరదేశం నుంచి కుష్టు వ్యాధిచాత అనేక తీర్థయాత్రలు చేస్తుంన్ను అనేక బలంతోటి యీ గుంటూరి మార్గంగాను వచ్చి యీ గుండువద్ద మొకాంచేసి యిద్దరున్ను వినోదార్థంగా యీ గుండుమీద యెక్కి యీ గుండుకింద వుండేటి తీర్థం చేతోటి తీసుకొని చల్లుకొని వళ్ళు యావత్తును తడుచుకొనేటప్పుట్కు ఆకుష్టురోగం దురదల్యాకుండ వుండేటపుట్కి అప్పుడు వీరు యీ తీర్థములో యేమో మహాత్యంవున్నదనింన్ని యోచనచేశి యీ తీర్థములో ఆరునెలలు స్నానపానం చేశేటప్పట్కి కుష్టు విమోచనము అయి పరిశుద్ధదేహులయినందువల్ల ఆపుడు వీరు తెచ్చిన ధనం యావత్తున్ను వ్రాయంచేసి యీగుండు పగలకొట్టి యీ గుండు కింద బ్రహ్మాండమయిన ఒక చెరువుగా తొవ్వించి యీ చెరువుకు పూర్వభాగమందు సోపానులు కట్టి అక్కడ వినాయకుంణ్ని ప్రతిష్టచేసి వినాయక పట్టమనాన్కి నామధేయం వుంచి యీ అగస్తేశ్వర గోపాలస్వామివార్కి గర్భగుడి మొఖమంటప ప్రాకారములు కట్టించి సమస్త పూజోత్సవములు జరిగించినారు.

తదనంతరం విష్ణువర్ధన మహారాజు రాజ్యం భారం చేస్తున్ను వుండి యీ కొండ్డవీటి శీమలో అనేక అగ్రహారాలు యేర్పరచి బ్రాంహ్మణులకు యిచ్చినందుకు దాఖలా యీశీమలో అనేక మంది వారు యిచ్చిన అగ్రహారాలు అనుభవిస్తుంన్నారు. అపుడున్ను యీగుంటూరు అగస్తే శ్వర గోపాలస్వామివారికి సకల వుత్సవాలు యాధావిధిగా జరిగినవి ఆతదనంతరం వడ్డేవాండ్లును మహాప్రబలమయి వుత్తరాదినుంచి యీ కొండ్డవీటి శీమకు వచ్చి యీశీమ యావత్తును ఆక్రమించుకొని యీశీమ యేలుతూవుండగాను తూర్పు శీమ నుంచి రెడ్డివాండ్లు యీ కొండవీటికి వచ్చి యీవడ్డేవాండ్లుతోటి యుద్ధంచేశి జయించి యీశీమ యావత్తు తమ స్వాధీనం చేసుకొని యేలుతూ వుండగా యిప్పుడు వుండే యీ వాశిరెడ్డివారి పూర్వులు రెడ్డివారితోకూడా కొండ్డవీటికివచ్చి వారి శాయహగాలతో తిరుగుతూవుండి వారి అనుగ్రహం సంపాదించుకొని వారివల్ల యీశీమలో కొన్ని సమతులు జాగీరుగా అనుభవించినారు. ఆమీదట వారివాహన శకవరుషంబులు ౧౫౩౧ (1109 A.D) అగునేటి క్రవ సంవత్సర మందు శ్రీమన్మహామండలేశ్వర రామదేవరాయలు ప్రధివిరాజ్యం చేయుచుండగాను అప్పుడు యీగుంటూరుకింద దసాలేశులుగు పాటెలు చెల్లుతూ వుండేది. అపుడు వీరి కార్యకర్తలయ్ని సాళ్వతిమ్మరసయ్య అయిండ్లు నాదేండ్ల అప్పరయ్యగారు యీ గుంటూరికి అయిదు సంప్రతులు కరణాలును యేర్పరచి పూర్వం వాశిన దండకవిలెలు ప్రకారం యీగుంటూరి మిట్ట మెరగరి అద్దులు యేర్పరచి యిచ్చినందుకు దాఖలా యీ గుంటూరి కరణాల దండకవిలె హజూరు వుంన్నది. ఆమీదుట కొంన్నిదినాలకు వాశిరెడ్డి వీరప్ప నేడు అనేకంమ్మఅయిన సదరపా రాయలవద్దకిపోయి వీరిని అను నరపక్షంచేశి వీరి కార్యభోగాలు చక్కపెట్టుతున్నూ వుండి వారి అనుగ్రహం సంపాయించుకుని వారి నుంచి నందిగామ శీమ జమీందారి సంపాయించుకుంన్నారు. తదనంతరం యీయన కొమారుడయిన వారిరెడ్డి పెద రామంన్నగారు నందిగామ శీమ జమిందారు అనుభవిస్తున్ను రాయల అనుగ్రహం నిందాసంపాయించుకొని వారినుంచి బందరు సర్కారులో పెనకంచి, చేబ్రోలు శీమలు కూడా జమీందారు యేర్పరచుకొన్నారు. తదనంతరం మొగలాయి అయిన పింమ్మట హిందుస్తానం నుంచి మొగలాయి వాండ్లువచ్చి రామదేవరాయలతోటి యుద్ధంచేశి జయించి విజయనగరం తీసుకొని యీకొండవీడు, వినుకొండ, బెల్లంకొండ మొదలయ్ని దుర్గాలలో త్మఠాణా పుంచుకొని గోలకొండ ముఖాం యేర్పరుచుకొని వుండగా యీయన కొమారుడయిన చినపద్మనాభునింగారు హైదరాబాదులో వుండె సుభావారివద్దకిపోయి వారిని అనుసరపక్షం చేసుకుని వారి కార్యభాగాలలో తిర్గుతున్ను వుండి వుండగా గోలకొండలో వుండే షహఅలం-పాదషా వారికి యితని యందు నిండా యనుగ్రహంవచ్చి యీ కొండవీడు వినుకొండ బెల్లంకొండ శీమలు జమీదారి వాశియిచ్చి సదరు వాలు దయచేయించి నందువల్ల అదే ప్రకారం యితను సదరిహి పాదుషహవారి చాత అనుజ్ఞ పుచ్చుకొని యీకొండవీటికివచ్చి జమీదారి చేస్తుంస్సు సుభావారికి పేషకను యిస్తు యిరువయి సంవత్సరములు ప్రభుత్వం చేశినారు తదనంతరం యితని పెంపుడు కొమారుడు అయిన చుబ్బ రాఘవయ్యగారు ప్రభుత్వానకు యేర్పడి ప్రభుత్వం చేస్తూవుండగా గోలకొండ సుభావారి తరపున ముసామరతన్, పరాసే మహాలల్లి అనే యిద్దరు పరాశిలు వచ్చి యీకొండవీటి శీనుతో త్మఠాణావేస్కుని యీగుంటూరులో ప్యాట యేర్పరచి యీప్యాట మధ్యమందున ఆరు బురుజుల ఖిల్లా కట్టుకొని అభిల్లాలో వుండి కొన్ని దినాలు అధికారం చేసినారు. అప్పుడున్ను సదరహి చుబ్బరాఘవయ్య జమీదారి చేస్తున్ను యీమిరాశిలో కుండాసుభావారికి పేషకసుయిస్తూ వుండేను. తదనంతరం అతని అన్న అయిన చంద్రమవుళిగారు ప్రభుత్వాన్కి యేర్పడి జమీదారి చేస్తుంన్నూ వుండి యీకొండవీడు వినుకొండ బెల్లంకొండ వగై రా శీమలు భరించేటందుకు శక్తిల్యాక యీ కొండవీడు శీమ మూడు వంట్లుచేశి మానూరివారు మాణిక్యరావు వారికి ౨ రెండు వంట్లుంన్ను వకవంటు తాముంన్ను పుచ్చుకొని యీప్రకారంగా కొన్ని దినములు ప్రభుత్వం చేసినారు.

శాలివాహన వర్షంబులో ౧౬౪ం అగునేటి(1718A.D) హేవళంబి నామ సంవత్సరమందు యితని తంమ్ముడయిన రామలింగన్న గారు జమీదారి ప్రభుత్వం చేస్తువుండగా అపుడు యీగుంటూరి చుట్టును కేవల అరణ్యంగా వుండేది. అప్పుడు సదరహి పేద రామలింగన్నగారు యీఅరణ్య యావత్తున్ను సదరించి యీగుంటూరికి పశ్చిమభాగమందు రామచంద్రపురమనే ఆభిదానంచాతవక అగ్రహారం కట్టించి దక్షిణ దేశాల నుంచి అనేక గోత్రబ్రాంహ్మణులు పిలిపించి వాండ్లకు సర్వాగ్రహారంగా యిచ్చి మరిన్ని అనేక మందికి యీశీమలో వృత్తి స్వాస్యాలు యిచ్చినారు. యీరీతిగా యీ పెదరామలింగన్నగారు వారి శాలివాహన శక వరుషంబులు ౧౬౬౦ దాకా జమీయేలినారు. తదనంతరం యీయన అన్న అయిన సూరంన్న గారు రెండ్డు సంవత్సరములు భూమి చేశినారు. వారీ తదనంతరం వారి జేష్ట అయిన చిననరసంన్న గారు యేడు సంవత్సరములు జమీ అనుభవించినారు. ఆమీదట యీయనతమ్ములయిన చినరామలింగన్న గారు ప్రభుత్వాన్ని ఆరంభించి భూమి చేస్తూవుండగా పూర్వంన ప్రకారం యీశీమ యెధావిధిగా సమస్త పూజోత్సవములుంన్ను భూమి యీరీతిగా పన్నెండు సంవత్సరములు జమిచేసినారు. తదనంతరం యీయన పెంపుడు కొమారుడయ్ని జంగన్నగారు ప్రభుత్వం చేస్తూవుండగా యీశాలివాహన శక వర్షంబులో ౧౬౮౨ లో (1760 A.D) హైదరాబాదు నుండి శ్వామలదాసు అనే గుజరాతీ సావుకారు కుటుంబ సహితంగ్గా వచ్చి యీ జగ్గన్న గారి అనుమతిమీద యీగుంటూరుకి వచ్చి యూ గుంటూరికి యీశాన్య భాగమంద్దు యిండ్లు కట్టి అగ్రహారం యేర్పరిచి యిరువయినాలుగు మంది బ్రాంహ్మణులను వుంచి వారికి వెల ౧ కి అయిదు రూపాయిలు పాలు యిస్తుంన్ను వున్నందువల్ల శ్యామదాసు అగ్రహారయనింన్ని రూఢిపడినది.

ఆమీదట యీజంగన్న గారు కొన్ని దినములు ప్రభుత్వం చేశి యీయన పడిపోయే టప్పుడు యీయన కొమారుడు అయిన రెడ్డి వెంకటాద్రి నాయడు మూడు సంవత్సరములవాడు గనక యీయనను దగ్గరవుంచుకొని యీజంగన్నగారికి జనక సంమ్మంధమయిన తమ్ముడు రామన్న గారు ప్రభుత్వం చేస్తూవుండగా వెంకటాద్రి నాయనిగారికి పద్దెనిమిది సంవత్సరములు అయిన తదనంతరం రామన్నగారు యీవెంకటాద్రి నాయనింగార్కి తమ వ్యవహారం యావత్తు వప్పగించి, తన కొమారుడయ్ని పాపయ్య గారిని తంమ్ముడు కొమారుడయ్ని మోళయ్యగారిని వ్యవహారస్తులును సరదార్లు మొదలయ్ని వెంకటాద్రి నాయనింగారికి ముద్రికనిచ్చి అప్పగింత పెట్టి తాము శరీరం చాలించినారు.

తదనంతరం శాలివాహన శక వరుషంబులు ౧౭౦౪ (1782 AD) వెంకటాద్రి నాయనింగారు ప్రభుత్వానికి యేర్పడి ప్రభుత్వం చేస్తున్ను సుఖావారి వ్యవహారంవున్న మట్టుకు వారికి సహాయం చేస్తున్న వారి వ్యవహారం చక్క పెట్టుతున్ను వుండగా అనుగ్రహం మన్నే సులతాను బహదరు అనే ఖితాబున్నుయిచ్చి యింకా ఆనేక బహుమతులు యిచ్చి నడిపించినారు. ఆమీదట కుంపిణీవారి అనుగ్రహం వల్ల అనేక పాశ్యాలు జయించి వారి అనుగ్రహం సంపా యించుకొని యిప్తిదాయలగాయతు ముపై అయిదు యేండ్లు ప్రభుత్వం చేశినారు. ఆమీదట శాలివాహన శక వరుషంబులు ౧౭౩౧ అగునేటి విళంబి సంవత్సరం యీగుంటూరి కాపరస్తుడు చమిట వెంకయ్య అనే వాడు యీ గుంటూరి అగస్తేశ్వర స్వామివారి గుడికి యీశాన్యభాగ మందు కళ్యాణ మంటపం కట్టి శాసనం వేశినాడు.

యిప్పుడు యీఅగస్తేశ్వర గోపాలస్వామివారికి కుచళ్లు పొలం నిత్య నైవేద్యానికి నడిపిస్తున్నారు.

మొగలాయీ ఆయిన పిమ్మట హైదరాబాదు సుభావారి తరపునుంచి యీముర్తుజాం నగరానికివచ్చిన హాపీబుల తహశీలు పేర్లు:

హపీబుల తహశీలు పేర్లు :

౧ రాజబాలకిషన్
౧ జాతిజతి బెగు
౧ యిసమొహద్దినుఖాన్
౧ మస౯ మ్మవ౯ఖాన్
౧ మొహతరింఖాన్
౧ సహెబుజాదా
౧ వరజుల్లాఖాన్
౧ ముళ్యెమరత౯ము శెలల్లి పరాశీలు
౧ యెపురా పాదుషా
౧ నవాబు హసనల్లి ఖాన్
౧ మీరుయిసమలీఖాన్
౧ మీరు అబ్జాను షా
౧ షకురుల్లాబెగు

వీరి దినాలలో కోకోణి కొక్కిట్టినది. నవాబు మనసూరు జంగు యితను అదవనిలో వుండే ప్రభుత్వం చేస్తూవుండును యీ శీమ యావత్తు అదవలి కింద చెల్లుతూ వుండెను. యితని తరుపునుండి వచ్చిన హాపీబుల పేర్లు.

౧ రాజబిజన్ ఖాన్
౧ ఖానుసాహెబు
౧ రాజాబహదరు
౧ బిసరాజా
౧ మీరు సాహెబు యితనుడికవీసుతోటి యుద్ధంచేశి చచ్చినాడు.
౧ తాబుడిఖాన్
౧ షత్తుల్లాఖాన్
౧ మహంమ్మదుయక రాంఖాన్ యిగుంటూరిలో అయ్యేధాన్యం తహశీలు వడ్లలో

రామసాగరాలు కుసమలు మోటబావులకింద అయ్యేది.

జామతోటలు, నింమ్మ, దానింమ్మ వెలగ వగై రాలు

మిన్ములు
పెసలు
తమిదలు
కొర్రలు
భామలు
బొబ్బరలు
అనుమలు
పులివలు
శనగలు
ఆమెదాలు