గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/గారపాడు (1817 A.D.)

వికీసోర్స్ నుండి

13

గారపాడు

కైఫియ్యత్తు మౌజే గారపాడు సంతు మునుగోడు, తాలూకే

చింతపల్లి, సర్కారు ముతు౯ జాంన్నగరు, యిలాభే రాజావాశి

రెడ్డి జగంన్నాధబాబు స్న౦౨౨౭ఫసలీ (1817 A.D.)లో

యీ గ్రామం కరణాలు గారపాటి వెంకటనర్సు లక్ష్మయ్య,

శింగరాజు వ్రాయించినది.

పూర్వం యీస్థళమంద్దు విస్తరించ్చి గారచట్లు బలిశి అరణ్యంగ్గా వుంన్నంద్ను యీ అరణ్యం ఛేదించ్చి యిక్కడ గ్రామనిర్మాణం చేసినంద్ను దీనికి గారపాడు అనే నామం వాడికె వచ్చినది. అందుకు దాఖలా యిక్కడ గారచెట్లు విస్తారంగా వుండ్డి వుంన్నవి. తదనంత్తరం గజపతి శింహ్వాసనస్తుడయ్ని గణపతి మహారాజులుంగారు యీ ఆంధ్ర దేశం స్వాధీనం చేస్కుని పృథ్వీరాజ్యం శేయుచుండగాను వీరి మహాప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శాలివాహన శకం ౧౦౬౭శక (1145 A. D) మంద్దు ప్రభుపుదగ్గిర దానం పట్టి సమస్తమయ్ని నియ్యోగులకు మిరాశి యేప౯రిచేయడల యీ గ్రామం శ్రీవత్సస గోత్రులయ్ని, ఆశ్వలాయన సూత్రులయ్ని నుదవరం వేటమరాజు అనే అతనికి యేకభోగంగ్గా యిచ్చినారు. తదనంత్తరం అనుమకొండ సింహాసనాధీశ్వరుడయ్ని కాకతీయ రుద్రదేవ మహారాజులుంగారి ప్రభుత్వం శాలివాహనశకం ౧౨౪౨ (1320 A.D) వర్కు జర్గిన పిమ్మట రెడ్లు బలవంతులయి యేలినారు. శాలివాహనం ౧౫౦౦ శకం (1578 A.D.) వర్కు వడ్డె రెడ్డి కన్నా౯టకాలు ప్రభుత్వం జర్గిన మీదట మొగలాయి అమలు వచ్చే గన్కు యీ కొండవీటి రెడ్డి శీమ సంతు బందీలు నిన౯యించ్చే యడల యీ గ్రామం మునుగోడు సంతులో దాఖలు చేసి సముతు చపుదలు౯, దేశ పాండ్యాలు, . అమీళ్ల పరంగా అమాని మామియ్యతు జర్గించ్చినారు. స్న౧౧౨౨ ఫసలీ (1712 A.D.)లో కొండ్డవీటి శీమ జమీదాల౯కు పంచ్చిపెట్టే యడల యీగ్రామం మునుగోడు సంత్తులో దాఖలు అయి వాశిరెడ్డి పద్మనాభునింగారి వంత్తువచ్చినది గన్కు తదారభ్యం పద్మనాభునిం గారు, చంద్రమౌళిగారు, చ్నిపద్మనాభునింగారు, నర్సంన్నగారు, పెదరామలింగంన్నగారు, సూరంన్నగారు, చ్నిరామంన్నగారు, జగ్గయ్యగారు, రామంన్నగారు ఆ జమీప్రభుత్వంచేశ్ని మీదట రాజావాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదరుగారు స్న౧౨౨౫ ఫసలీ(1815 A D,) వర్కు ప్రభుత్వం చేశినారు. యిప్పుడు యితని కుమారుడయ్ని వాశిరెడ్డి జగన్నాథబాబుగారు జమీ చేస్తూ వుంన్నారు. పూర్వం యిది జయ్నిపాడు. యీపాటిమీదనే గ్రామం యేప౯రచినారు. యీవూరినఢమ ఆంజ్జనేయులు వుంన్నారు. పూర్వం యీవూరి తూపు౯న విష్ణాలయమున్ను వారి నడ్ము శివాలయముంన్ను వుండెనట. యిప్పుడు ఖిలమైపరంగా పోయివున్నది.

కరణం గారపాటి వెంక్కట నరశింగ్గరాజు అనుమతిన లక్ష్మయ్య వాలు.

మైక్రో ఫిల్ము రోలునెంబరు : 3
మెకంజీ వాల్యూము : 22
ఫోలియో 24 B - 26A