గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/గారపాడు
14
గారపాడు
కైఫియ్యత్తు మౌజే గారపాడు, సంతు గుంట్టూరు, సర్కారు
ముత్తు౯ జాంన్నగరు తాలూకే, రాచూరు.
యీ గ్రామాన్కు పూర్వంనుంచ్చిన్ని గారపాడు అనే పేరు పుంన్నది. పూర్వం గోపరాజు రామంన్నగారు బ్రాంహ్మణుల్కు గ్రామమిరాశీలు వాయించ్చి యిచ్చెయడల యీగ్రామాన్కు ప్రధములు భారద్వాజ గోత్బులయ్ని వార్కి యిచ్చినారు.
రెడ్లు ప్రభుత్వం చేశేటప్పుడు వారితాల్కు అధికారులు రాచకొండ సూర్యనారాయణ సోమయాజులు వారు బహుతపః సంపంన్నులుంన్ను బ్రహ్మ విద్వాంసులుంన్ను ఆయివుంద్దురుగన్కు యీ గారపాడు వీర్కి అగ్రహారం యిచ్చినారుగన్కు పయ్ని వాశ్ని సూర్యనారాయణ సోమ యాజులు కుటుంబ్బయుక్తముగా అగ్నిహోత్రములతో కూడా యీగ్రామంలో ప్రవేశించ్చి గృహనిర్మాణములు చెస్కుని అగ్రహారం అనుభవిస్తూ యాగాద్యనుష్ఠాది సత్క్రియలు జర్పుకుంటూ బ్రాంహ్మణుల్కు అన్నదానం చేస్తూ సూర్యనారాయణ సోమయాజులు వీరికొమారులయ్ని తిరుమల సోమయాజులు వీరికొమారులయ్ని సూరి సోమయాజులు వీరి ఆత్మజులు వీరేశ్వర సోమయాజులు వీరిసుతులు తిరుమల సోమయాజులు వారివర్కు రెడ్డి వడ్డే కనా౯ట్క ప్రభుత్వములు శా౧౫౦౦శకం (1578 A.D) వరకు అనుభవించినారు. అంత్తట మొగలాయీ ప్రభుత్వంవచ్చె గన్కు కొండ్డవీటి శీమ సముతు బంద్దీలు చేసే యడల యీ గ్రామం గుంట్టూరు సముతులో దాఖలు చేసినారు గన్కు ఆదినములలో పయ్ని వాశ్ని తిరుకుల సోమయాజులు కొడ్కు అయ్ని యజ్ఞనారాయణ సోమయాజులు లౌకికములయంద్దు ప్రవీణులై వుంద్దురు గన్కు హయిదరాబాదు పరయంత్తరంవెళ్లి, మల్కి విధురాహిము మొదలయ్ని పాదుశహాలవారి తాలూకు వ్యవహారస్తులను అనుసరించ్చి సనదు తెచ్చుకొని యజ్ఞనారాయణ సోమయాజులు వీరికొమారు లయ్ని తిరుమల సోమయాజులు మొగలాయి అమలు, స్న౧౧౨౧ ఫసలీ (1711 A. D.) వర్కు అనుభవించ్చినారు.
స్న ౧౧౨౨ (1712) A.D. ఫసలీలో కొండ్డవీటిశీమ జమీదాల౯కు మూడువంట్లు చేశి పంచ్చిపెట్టే యడల యీగ్రామం రమణయ్య మాణిక్యారాయునింగారి వంత్తువచ్చిన రేపల్లె తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు రమణయ్యా మాణిక్యారాయునింగారు ప్రభుత్వంచేస్తూ గార పాటి అగ్రహారాన్ని సాలు౧కి పంన్నులు ౫వరహాల చొప్పున శ్రోత్రియం నిన౯యించ్చి పయ్ని వాశ్ని తిరుమల సోమయాజులు గార్కి యిచ్చిన వారై రమణయ్యగారు, మల్లంన్న గారు, శీతన్నగారు, గోపన్నగారు, జంగన్నగారు స్న౧౧౮౨ ఫసలీ (1772 A.D.) వరకు నడపించ్చిరిగన్కు క్రిష్ణసోమయాజులు అనుభవిస్తూ గ్రామాన్కూతూపు౯భాగమంద్దు శివ స్తలం కట్టించి గంగాధరస్వామివారనే లింగ్డమూత్తి౯ని ప్రతిష్ట చేశి నిత్యనైవేద్య దీపారాధనల్కు కు౧మాన్యం యిచ్చి యీశివాలయాన్కి దక్షిణభాగమంద్దు దిద్దలం కట్టించి శ్రీ ఆంజ నేయస్వామివారిని ప్రతిష్ట చేశి నిత్యనై వేద్య దీపారాధనుల్కు కు౦౹౦ పాతికె మాన్యం యిపించ్చినారు.
వీరికొమారులయి మల్లేశ్వరదీక్షితులు అనుభవించ్ని తర్వాతను మల్లు దీక్షితుల కొమారులయ్ని వీరావధానులు అనుభవిస్తూ వుండగా పయ్ని వాశ్ని జంగంన్నగారి తమ్ములయ్ని తిరుపతి రాయునింగారు సదరహిఫసలీ లగాయతు తాలూకా సఖం పంచ్చుకుని ప్రభుత్వంచే శేయడల యీగ్రామం తిరుపతి రాయునింగారి వంట్టులోవచ్చ్ని రాచూరు తాలూకాలో చేర్నిది గన్కు౧౧౯౭ ఫసలీ (1787 A.D.) వర్కు జర్గించినారు. స్న౧౧౯౮ఫసలీ (1788 A.D.)లో మహారాజశ్రీ కుంఫిణీవారు గుంట్టూరు సర్కారుకు ప్రభుత్వాన్కు వచ్చి మూడు సంవ్వత్సరములు అమానిమామ్లియ్యతుచేశిరి గన్కు అప్పట్లో జమీదారుమభ్య పెట్టి అగ్రహారం జర్గకుండ్డాచేశినారు.
తిరుపతి రాయునింగారు, వీరికుమారులయ్ని అప్పారాయునింగారు, శీతన్నగారు స్న౧౨౦౮ ఫసలీ (1798 A.D.) వర్కు అధికారంచేశ్ని తర్వాతను జంగ్గన్నగారి కొమారు లయ్ని భావయ్య మాణిక్యారాయునింగారు స్న౧౨౧౧ఫసలీ (1801 A.D.) వర్కు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వంచేశ్ని మీదట కుంఫిణీవారు రాచూరు తాలూకు యాలంవేశినంద్ను రాజామల్రాజు వెంక్కట గుండ్డారాయునింగారు కొనుక్కుని యిదివర్కు ప్రభుత్వంచేస్తూ వుంన్నారు.
స్న౧౧౯౮ (1788 A.D.) ఫసలీ లగాయతు పయ్ని వాశ్ని అగ్రహారీకుల్కు శ్రోత్రియం జర్గలేదు గన్ను యాజమానులనే కరిణీకములో వుండ్డి గ్రామక్కుమాయఘ (కమామిసు) మనాయింపు చేసుకుంటూ వుంన్నారు. రిమాకు౯ గ్రామంగుడికట్టు కుచ్చళ్ళు యనభై మూర పగ్గానను౬౪కుంట్టల ప్రాప్తిని అయ్ని కుచ్చళ్ళు-౨౫
కు. ౦ ౹ ౦ గ్రామ కంఠం -
- ౦ ౹ = వనంతోటలు ౨కి -
- ౦ 6 ౬ గ్రామాన్కు వుత్తరభాగం అగ్రహారీకుల వనంతోట వ౧కి
- ౦ 6 ౬ ......కునారి కొంమ్మురి అంద్దెలు వనంతోట౧కి...
కు. ౧ ౹ - చర్వులు, కుంట్టలు౫కి -
- ౦ ౻ ౦ గ్రామ చర్వు అగ్రహారీకులు చేయించి
- ౦ ౹ ౦ యింప్పాళ్ళపోతన అనే కాపువేయించ్ని చర్వుకు౧కి -
- ౦ 6 = కామ్మూరు అందెలు చరువుకు౧కి
- ౦ 6 = ముప్పాళ్ళ మూత్తి౯ కుంట్ట ప౧కి .
- ౦ 6 —— అచార్యుడ కుంట్ట వ౧కి -
- ౦ ౹ ౦ డొంక్కలు౪కి -
- ౦ ౹ ౦ వాగులు ౨కి .
కు. ౩ ౻ ౦ యినాములు-
- ౧ ౹ ౦ శ్రీస్వామి వాల౯కు 16
కు. కు. ౧ 5 శ్రీగంగాధరస్వామి వార్కి శ్రీఆంజనేయులు | యీ అగ్రహారీకులు - గుంటూరుకు వారస్తులయ్ని చక్రవత్తుల నృశింహాచాల్లకు QUO ౬ 6 ౬ గ్కాతతింమ్మా ౧౮ru EXPED కైఫియ్యతు ముత్తుజా అంగీరస నామ సంవత్సర కార్తీక బః సోమవారం ది 3... చ్యరం ఆన ౧౮౧౨ సంవత్సరం) గ్రామకై ఫీయత్తులు మైక్రో ఫిల్మురోలు నెంబరు : 4 మెకంజీ వాల్యూము : 81 ఫోలియో : 21 B 6