Jump to content

గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/కొప్పర్రు

వికీసోర్స్ నుండి

9

కొప్పర్రు

కై ఫియ్యత్తు మౌజే కొప్పర్రు సంతు నాదెండ్ల, ముటే

వేలూరు, తాలూకా చింత్తపల్లి ముత్తు౯జాంన్న గరు——

యీ గ్రామం పూర్వం నుంచ్చింన్ని కొప్పరు అనేపేరు ప్రసిద్ధిగా కల్గివుంన్నది. శాలివాహన శకం ప్రవేశమయిన తర్వాతను కొందరు రాజులు ప్రభుత్వము చెశ్ని తర్వాతను యీదేశాలకు అశ్వపతి నరపతి గజపతి అనేవి మూడు సింహ్వాసనాలు యేర్పడేగన్కు గజపతి సింహసనస్తుడైన గణపతి మహరాజులుంగారు శాలివాహనం ౧౦౫౬ శకం (1134 AD) మొదలుకొని ధర్మ వంత్తుడై రాజ్యం చేస్తూవుండ్డే యెడల వీరి దగ్గర మహప్రధానులయ్ని గోపరాజు రామంన్నగారు శా ౧౦౬౭ శకం (1145 AD) అగునేటి రక్తాక్షినామ సంవ్వత్సర భాద్రపద బ ౩౦ అంగార్కవారం సూర్యగ్రహణకాలమంద్దు ప్రభువు దగ్గర దానంబట్టి బ్రాహ్మణులకు గ్రామకణి౯కపు మిరాశీలు నిన౯యించ్చే యడల యీ కొప్పర్రుకు యజుశ్శా ఖాధ్యయనులయిన కొపర్తివారి సంప్రతి ౧ పుణ్యమూర్తివారి సంప్రతి ౧ వెరశి యీ రెండు సంప్రతుల ఆరువేలనియ్యోగుల్కు. సమభాగములుగా మిరాశీ నిన౯యించ్చినారుగన్కు తదారభ్య యేతద్వంశుజులయ్ని వారు కణీ౯కం మిరాశీలో నుండియున్నారు.

పయ్ని వ్రాస్ని గణపతి మహారాజులుంగారి పుత్రులయిన కాకతి గణపతి వారుంన్ను అధికారం చేసి తర్వాతను వీరి పుత్రులయ్ని కాకతియ్య రుద్రదేవమహరాజులుంగారు శాలివాహనం ౧౦౬౦ శకం (1138 AD) మొదలుకొని ప్రభుత్వం చేస్తూవుండ్డే కాలమంద్దు యీస్థలాన్కు వుత్తరపాశ్వ౯ మంద్దు శివాలయం కట్టించ్చి మల్లేశ్వర స్వామివారనే లింగ మూత్తి౯ని ప్రతిష్ఠ చేసినారు.

తదనంత్తరం శా ౧౨౪౧ (1319 AD) లగాయతు రెడ్లు యీదేశములకు ప్రభుత్వానకువచ్చి కొండ్డవీడు మొదలయ్ని నిర్మాణం చేయించే కాలమంద్దు యీ స్తలంలో విష్ణుస్తలం లేకుండా వుండేగన్కు పయ్ని వాన్ని మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్కు దక్షిణం గ్రామ మధ్యమందు విష్నుస్తలం కట్టించ్చి యీదేవస్తానాల్కు విశేషమయిన వసతులు చేసి పుత్స వాదులు జరిగించేలాగున కట్టడం చేసినారు.

వడ్డే కర్ణాటక ప్రభుత్వములు శా ౧౫౦౦ శకం (1578 AD) వర్కు జర్గిన తర్వాతను దేశమునకు మొగలాయి ప్రభుత్వము వచ్చెగన్కు దేశముఖి, దేశపాండ్య, మొదలయ్ని బారాముత సద్ది హోదాలు నిన౯యించి సర్కారు సముతు బందిలుచేశేటప్పుడు యీగ్రామం నాదెండ్ల సముతులో దాఖలు చేసినారు గన్కు సముతు ఆమీలలో లేదు. దేశపాండ్యాల మూలంగ్గా బహుద్నిములు అమాని మామ్లయ్యతు జర్గించినారు.

స్న౧౧౨౨ ఫసలీ (1712 A. D.) కొండ్డవీటిశీమ మూడువంట్లుచేశి జమీదార్లకు పంచిపెట్టే యడల యీగ్రామం నాదెండ్ల సముతులో చేరినంద్ను సర్కారు మజుందార్లు అయ్ని మానూరి వెంకంన్న పంత్తులుంగారి వంట్టులో వచ్చి నాదేండ్ల సముతు చిల్కలూరిపాటి తాలూకాలో దాఖలు అయ్నిది గన్కు వెంకంన్న పంత్తులుగారు ప్రభుత్వంచేస్తూవుండగా ఆధ౯త్తొందరను గురించి యేలూరు వగయిరా తొమ్మిది గ్రామాదులు ముఠా చేశి వాశిరెడ్డి పద్మనాభునిగార్కి విక్రయించిరి గన్కు పద్మనాభునిగారు, చంద్రమౌళినాయుడుగారు, పెదరామలింగంన్నగారు, నర్సంన్నగారు, సూరంన్నగారు, చ్ని నర్సంన్నగారు, చ్ని రామలింగంన్నగారు స్న౧౧౭౩ ఫసలీ (1763 A. D) వర్కు ప్రభుత్వంచేస్ని తర్వాతను జగయ్యగారు చినరామలింగన్నగారి తరుణమందు ప్రభుత్వాన్కు వచ్చి స్న౧౧౦౩ ఫసలీ (1763 A. D.) లగాయతు స్న౧౧౭౫ (1765 A. D.) వర్కు మూడు సంవ్వత్సరములు ప్రభుత్వం చేశెను.

తదనంతరం రామంన్న గారు స్న౧౧౭౬ ఫసలీ (1766 A. D.) లో ప్రభుత్వాన్కు వచ్చి సర్కారు జమీదారులయ్ని మాణిక్యారావువారి సావరాల నిమిత్తం గిట్టమి చేతను విస్తరించి కల్తను (కలతను) గురించి తమకు సహయ నిమిత్తమై అద్దంకి శీమ ప్రభువులయ్ని మందపాటి వారి సంస్తానములో సరదారులలో వుంన్నషువంటి కమ్మవారు బొల్లెపల్లి మేదర మెట్లవారు, నరహరిగారు, బత్తని శింగరప్పగారు, బత్తిని నర్సంన్నగారు, మేదరుమిట్ట గోపంన్నగారు, బొల్లెపల్లి తిరువెంగళప్పగారు, వీరు బహుక్షాత్రవంతులై యుందురు గన్కు పిలుపించుకొని వీర్కి సరదారీలుయిచ్చి యాభైమంది కమ్మవారితోటి తమకార్యక రామతుల్కు సహయం అయ్యేటట్టుగా నిన౯యించ్చి యీగ్రామంలో వుండ్డే తమస్తావరముంన్ను శిబ్బందివారి జీతాలకు గ్రామ కట్టుబడిగానుంన్ను యేప౯రచి వార్ని గ్రామములో కాపురంవుంచ్చి వారిసహయంవల్ల నుంచింన్ని, జయప్రదులయ్ని సదరహి ఫసలిలగాయతు స్న౧౧౯౨ ఫసలీ (1782 A. D.) వర్కు ప్రభుత్వంచేసి పయ్నివాన్ని ప్రకారం జర్గించినారు.

తదనంతరం రాజావెంక్కటాద్రి నాయుడుగారు స్న౧౧౯౩ (1783 A. D.)లో ప్రభుత్వాన్కువచ్చి పైని వ్యాస్ని కమ్మవారికి రామంన్నగారు నిన౯యించ్చి వసతులు మూడు సంవత్సరములు జర్గించి తదనంత్తరం జరిగించలేదు. స్న౦౨౦౭ ఫసలీ (1797 A. D.) లో (చిన) చ్చియోలూరి ముఠా గ్రామాదుల్కు తమతరుపు వ్యవహరస్తుడయ్ని కొలిపాక బ్రహ్మజీ పరంగా మజ్కురిలో వుండ్డే మల్లేశ్వరస్వామి వారికి పునః ప్రతిష్ట చేయించ్చి యీదేమునికి నిత్యనైవేద్య దీపారాధనల్కుకు ౧భూమిమాన్యం యిప్పించేవారు మరింన్ని గోపాల స్వామివారికింన్ని పునఃప్రతిష్ట చేయించ్చి నిత్య నైవేద్య దీపారాధనల్కుకు ౧భూమి యిప్పించ్చి ఉభయ దేవస్థానములకు కుచ్చెలు ౨యినాంయిప్పించ్చి ప్రభుత్వం చేస్తూవుండగా స్న౧౨౧౮ ఫసలీ (1808 A D.) లో గోపాలస్వామివారికి పయిని వాన్ని మేదరమిట్ట గోపన్నగారు గోపాలస్వామివారి ఆలయం శిథిలీకృతంగా వుండగా విప్పించి పునః కట్టించి స్వామివార్ని ప్రతిష్ట చేసినారు. స్న౧౨౨౧ ఫసలీ (1811 A. D.) వర్కు వెంక్కటాద్రి నాయుడుగారు ప్రభుత్వంచేస్తూ వుంన్నారు.

ది౨౮ఫిబ్రవరి అన ౧౮౧౨ సంవత్సరం.

మైక్రో ఫిల్ము రోలు నెంబరు: 1
మెకంజీ వాల్యూము : 1,
ఫోలియో : 29 R - 30.