గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (రెండవ భాగము)/కారెంపూడిపాడు
6
కారెంపూడిపాడు
కైఫియ్యత్తు మౌజే కారెంపూడిపాడు, సంతు పొంన్నూరు,
తాలూకే సత్తెనపల్లి సర్కారుముత్తు ౯ జాంన్నగరు రాజా
మానూరి వెంక్కట రమణయ్యరావు గారు:-
స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహనశక పష౯ంబులు౧౫౮౬ (1694 A.D) అగునేటి ఆనంద్ధ నామ సంవ్వత్సర వైశాఖ బహుళ ౩౦ సోమవారం సూర్యోపరాగ పుణ్యకాల మంద్దు కృష్ణాతీర మంద్దున జొన్నలగడ్డ అంన్నం బొట్ల గారి పుత్రులైన మూతి౯భట్లుగార్కి మజుందాలు౯అయ్ని మహారాజశ్రీ మానూరి కొండ్డలరాయలగారి పుత్రులయ్ని వెంక్కంన్న పంత్తులుగారు సంతు నాదెండ్ల హవెలీ గ్రామాదులలో కారెంపూడిపాడు అనే గ్రామం అయిదు వరహాల్కు శ్రొత్రియంగా అగ్రహారం గ్రామ మిరాశీతో కూడా దానపతిక వాయించి యిప్పించ్చి నడిపించ్చినారు గన్కు అనుభవిస్తూవుంన్న పింమ్మట తద్దత్త పుత్రులయ్ని మానూరి వెంక్కటాయునింగారు ఆప్రకారంగ్గానే జర్గించిరి. గన్కు యీ మూతి౯ భట్లుగారు అగ్నిష్టో మంచేస్కుని నిత్య కర్మాద్యనుష్టాంన్నములు జర్పుకుంటూ వుంన్న మీదట యీమూత్రి౯ సోమయాజులుగారు పరలోక గతుడాయెను. యీయ్న కొమారుడయ్ని విశేశ్వర సోమయాజులు గారు వేదశాస్త్ర శ్రౌత జ్యోతిష విద్వజ్జనమంత్రంగ్గ ప్రబలులై సంస్తానములోఆస్తాన పూజిత ప్రాబలులై లౌకిక వైదిక ప్రాబలులై జర్పుకుంటూ వున్నంతల్లో యీయ్న అంన్న కొమారులయ్ని రాజామానూరి వెంక్కట కృష్ణంమ్మ బహద్దరుగారుంన్ను చాలా ప్రీతిచేశి ఆంద్దొళి కాశ్వ బహుమానములు యిప్పించ్చి పూర్వులు జరిపినట్టుగానే ఆగ్రహారపు దానపత్రిక వాయించ్చి యిప్పించ్చినడిపిస్తూ వుండ్డిరి. ఆంద్దు పిమ్మట రాజా వెంక్కట కృష్ణంమ్మగారి దొరతనంలో అప్పాజీ పంత్తులుగారి కొమారుళ్లు అయ్ని మానూరి వెంక్కదేశం పంతులుగారు సంతుహవేలిగ్రామాదుల వ్యవహారం విచారిస్తుంన్న అగ్రహారం గ్రామసనదు విశ్వేశ్వర సోమయాజులగారి పేరను వ. ౨౫ యిరువై అయిదు వరహాల్కు వృషనామ సంవ్వత్సర వయిశాఖ శుద్ధ ౧౫ ల రోజున వ్రాయించ్చి యిప్పించ్చినారు. దేశపాండాలు అయ్ని బలభద్రపాత్రుని అప్పన్నాగారు యీగ్రామానికి మిరాశి దానపత్రిక శా॥ ౧౬౭౭ (1755 A.D) అగునేటి యువనామ సంవ్వత్సర వయిశాఖ శుద్ధ ౧౫లు రోజ్ను విశ్వేశ్వర సోమయాజులు గారి పేరను వాయించ్చి యిప్పించినారు గన్కు మిరాశీల వాజుమాలతో కూడా అగ్రహారీకులు అనుభవిస్తూ వుండిరి. ఆంతట రాజామానూరి వెంక్కట కృష్ణంమ్మగారి పుత్రులయ్ని మానూరి వెంక్కటేశం గారున్ను తాలూకా పంచుకుంన్న మీదట యీభాగం వెంకటేశంగారి భాగంలో వచ్చినది. గన్కు తమ పూర్వులు జర్పించ్చిన క్రమంగ్గానే వ. ౨౫ యిరవై అయిదు వరహాల్ను శ్రొత్రియం బేరీజు నిన౯యంచేశి విశ్వేశ్వర సోమయాజులుగారి పుత్రులయిన మూతి౯ సోమయాజులుగారి అన్న కొమారుడయ్ని రామేశ్వర సోమయాజులుగారి పేరను దానపత్రిక వాయించ్చి యిప్పించ్చి శా॥ ౧౭౦౨ (1780 A.D) అగునేటి శార్వరి సంవ్వత్సర శ్రావణ బ౨ లు రోజ్ను యిప్పించడ మయ్నిది. దేశ పాండ్యా అయ్ని పౌత్మని చంన్నప్పగారు పూర్వ ప్రకారంగ్గానే మిరాశి దానపత్రిక శకం ౧౭౦౪ (1782 A.D.) అగునేటి శుభకృతు నామ సంవ్వత్సర శ్రావణ బహుళ ౧౫ రోజ్ను వాయించి యిప్పించ్చినారు. మానూరి వెంక్కటేశంగారి పుత్రులయ్ని రాజామాసూరి రమణయ్యారావుగారు ఆప్రకారంగానే జరిగిస్తూ వుంన్నారు గన్కు యీమూత్తి౯ సోమయాజులుగారుంన్ను రామేశ్వర సోమయాజులు గారి కొమాళ్లు అయ్ని వెంక్కట నరసింహ్వ సోమయాజులుగారుంన్ను మిరాశీల వాజుమాలతో కూడా అనుభవిస్తూ వుంన్నారు. శా౧౭౩౪ (1812 A.D) అగునేటి ఆంగ్గీరస నామ సంవ్వత్సర ఆశ్విజ బహుళ ౧౨ స్థిరవారము అగ్రహారమయ్ని కారెంపూడిపాడు గ్రామం ౧ కి గ్రామసీమ చిహ్నాలు.
గ్రామాన్కు యీశాన్యభాగమందున వట్టిచేరుకూరు ముట్నూరు కూడల్ని జొన్నలగడ్డ దక్షిణ మూత్తి౯ సోమయాజులు గారు వేయించ్చిన కుంట్ట చిహ్నా. అక్కడ నుంచ్చి తూపు౯ ముఖమయి నడవగా పులిచింతల కుంట పడియ చిహ్న. అక్కడ నుంచ్చి ఆగ్నేయముఖముగా ముట్నూరి చరువు దాటి దక్షిణముఖమేపోగా ముట్నూరు కొలి౯మల౯ కూడలి, ముంమ్ములు కుంట్ట పడియం, శంఖ చంక్రాత్కితమైన యర్రరాతి కుంట్ట చిహ్నా. అక్కడ నుంచ్చి పడమటి ముఖమయి నడవగా కొలి౯మల౯ తెరువుదాటి నైరృతి ప్రతీచిముఖమై నడవగా కాలి౯మల౯, మల్లారి కూడలి రాళ్ల కుంట చిహ్నా. అక్కడనుంచ్చి వుత్తరముఖమై నడవగా, వల్లూరి మంగ్గిపురం, కూడలి యర్రరాతి కుంట్ట వడియచిహ్న. అక్కడ నుంచ్చి వుత్తరముఖమై నడవగా వంగ్గిపురం తెరువుదాటి ఉత్తరముఖమై నడవగా నౌపాటి తెరువులో పిల్లికుంట్ట చిహ్నా. అక్కడ నుంచ్చి పడమటి ముఖమయి నడవగా మూలకుంట్ట చిహ్నా. అక్కడనుంచ్చి వుత్తరముఖముయి నడవగా వంగ్గిపురం చెర్కూరు కూడలి చిహ్నా. అక్కడనుంచి ఉత్తరముఖమై నడవగా మూల కుంట్ట తెల్లపొద చిహ్న. అక్కడ నుంచి తూపు౯ ముఖమై నడవగా జంమ్మకుంట వడియచిహ్న. అక్కడనుంచ్చి తూపు౯మఖమై నడవగా జచ్చుకుంట్ట వడియె చిహ్న. అక్కడ నుంచి తూపు౯ ముఖమై నడవగా చెర్కూరు తెరువు దాటిపోగా మంగ్గలకుంట్టవడియ నడవగాద... దపు కట్ట మీదుగా చిహ్న. అక్కడనుంచి తూపు౯ ముఖమై నడవగా యీశాన్యమూలను సోమయాజులుగారి పేరను వేయించ్చిన కూడలి పెద్దకుంట్ట చింహ్న."
ఏతాషాంమధ్య పత్తి౯ క్షేత్రం॥ స్వదత్తాద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం। పరదత్తా పహారేణి స్వదత్తాం నిష్ఫలం భవేత్ ౹ స్వదత్తాంపరదత్తాం వాయోహరేతు వసుంధరాం ౹ షష్టివష౯ సహస్రాణి విష్ణాయాం జాయతే క్రిమిః ౹
ఆన ౧౮౧౨ (1812 A.D) సంవత్సరం ది౧౫ తేది ఆంగ్గిరస నామ సంవ్వత్సర కాతి౯క శుద్ద ౧౧ ఆదివారం.
మ్మైక్రోఫిల్ము నెంబరు : 3,
మె. వాల్యూము : 22
పోలియో : 15 B - 16 B.