గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 8/సంచిక 5
గ్రంథాలయ సర్వస్వము.
సంపు ౮. || బెజవాడ - నవంబరు 1929 || సంచిక ౫.
"గ్రంథాలయములు-ఆధునిక జీవితము
మన జీవితములో గ్రంథాలయములు యెటువంటి స్థానము నాక్రమించినది తెలిసికొనుట కనేక మార్గములు గలవు. అవి ఎటుల పెరుగుచున్నది, ఎటులు నడుపబడుచున్నది పరిశీలించిన తెలియును. ప్రధమమున వాటి సంఖ్య విషయము విచారింతము. గత 30 సం॥ల నుంచి ప్రపంచములో గ్రంథాలయముల సంఖ్య అనేక రెట్లు పెరిగినది. చెన్నపట్నములో సహితము వాటిసంఖ్య రెండు రెట్లధికమయ్యెను. ఏలనన 19వ శతాబ్దాంతమున కానిమర పబ్లిక్ గ్రంథాలయము, మద్రాసు లిటరరీ సొసయిటీ గ్రంథాలయము అను రెండు పెద్దగ్రంథాలయములుండెను. కాని యిరువదవ శతాబ్దమున మద్రాసు యూనివర్సిటీ గ్రంథాలయము స్థాపింపబడి అనేక విధముల వృద్ధిగాంచు చున్నది. ఇదిగాక నూతన పద్ధతులు కారము అచిరకాలముననే ఒక పెద్ద సార్వజనిక గ్రంధాలయమును స్థాపింపనున్నారట.
అనేక కొత్తమాదిరి గ్రంథాలయములు మన జీవిత కాలములోనే యుత్పన్నమయినవి. వీనివలన సర్వవిధములయిన మానవులకు గ్రంథాలయములయందభిరుచి కలిగినది. అందుచేత గ్రంథాలయముతో సంబంధములేని కులముగాని జాతిగాని మనము చూడము. అదియునుగాక గ్రంథాలయములు వ్యవధికలిగిన వారలకే గాక, నిముస మయిన విశ్రాంతి లేని గొప్ప వర్తకులకు కూడ అత్యావశ్యకము. రాను
とと 91 2 గ్రంథాలయ సర్వస్వము . గ్రంథాలయములకు వచ్చు కొత్తమాదిరి చదువరులకు అను గుణముగా అవికూడా కొత్తమార్గములు దొక్కినవి. ప్రత్యేక సాంకేతిక గ్రంథాలయములు గత 10 సం॥ల నుండియు పెచ్చు పెరుగు చున్నవి. అవి పరిష్కరించవలసిన సమస్యలు నూతనములును ప్రత్యేక ములును అగుటవలన చాల దేశములలో యీలాటి గ్రంథాలయము లను ఒక్కొక సంఘముగా యేర్పాటు చేసి వాటిని శ్రమమార్గమున నడుపుటకు ప్రయత్నించుచున్నారు. పాశ్చాత్య దేశములలో ప్రతిక ర్మా గారమును వ రకశాలయును తమ పనివారలకు, గుమాస్తాలకు వారివారి శాఖలయందు తగిన తరిబీడు చేయుటకు స్వంత గ్రంథాలయములను సాపించి వాటిలో వివిధ శాఖలకు తగిన నేర్పరులను యేర్పాటు చేసి నేర్పించుచున్నారు. ఆ గ్రంథాలయములు పెద్దవిగా నుండుటయేగాక దానిలోని గ్రంథ భాండాగారాధికారులును వారి అనుచరులును చక్కని అనుభవము :బీతు పొందిన వారలై పుష్కలములగు వేతనములతో నున్నారు. వర్తకులు కర్మాగారములు గ్రంథాలయములకు గ్రంధ భాండాగా రాధి కారులకు డబ్బు వెచ్చింప వెనుదీయరు. ఏలనన వారు ప్ర స్తుతకాలమున గ్రంథాలయముల యుపయోగములను బాగుగ గుర్తించి యున్నారు. P గ్రంథాలయములు యితర దేశములలో యెటుల బాగుగ నడుప బడుచున్నవో గ్రంథాలయ వ్యా ప్తివలన జాతీయశక్తి యెటుల విజృంభించుచున్నదో ఉపన్యాసకులు నిరూపించిరి. ప్రస్తుతకాలములో గ్రంథాలయములు పట్టణములకు పల్లెలకు ఉపయోగించుచున్న వి. జాతీయతలో నొక భాగ మయినవి. మన స్వ విషయము చెప్పుచున్నాను. మన రాజధానిలోని పరిస్థితులు తెలియ నివి కావు. గ్రంథాలయముల విషయమై కృషి బహు స్వల్పముగా జరుగుచున్నది. నేను మన గవర్న మెంటు వారిని మ్యునిసిపాలిటీల వారిని తూర్పుగో దావరిమండల గ్రంథాలయసభ. తీసిపోకుండునట్లు ధన సహాయము చేసి ప్రోత్సహించవలెనని. దీనికి జవాబుగా గవర్నమెంటువారు వారికి సహజమగు నీ క్రింది లిజవా బులు యీయకుందురుగాక. (1) దీనివలన ప్రజాసామాన్యమునకు లాభము చేకూరదు. (2) గవర్నమెంటువారు దీనివిషయమై ఆలోచించుకున్నారు. (లీ) గవర్నమెంటువారు గ్రంథాలయములను ఆర్థిక శాఖలో (సి) క్లాసుక్రింద వేసినారు. ఖ్య గ్రంథాలయములు మానవుని జీవితములో యెటువంటి మ • స్థానము నార్ద్ర మించుచున్నవో అధికారులు గ్రహించి దానికి చేయ తగిన సహాయమును శక్తి వంచనలేక చేయుదురుగాక యని కోరుచు నిరమించెను. (మదాసు గ్రంథాలయ సంఘ కార్యదర్శి రంగ నాథంగారి యుపన్యాసమునుండి వెణుతురిమిల్లి శ్రీరామారావు గారిచే వ్రాయ బడినది.)
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2025, prior to 1 January 1965) after the death of the author.