గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 8/సంచిక 1
అమెరికా దేశ గ్రంథాలయ సభ
అమెరికా దేశమందు ధర్మ గ్రంథాలయ సంఘము ఏర్పడి ఏబది సంవత్సరములు దాటినది. అప్పటినుండియు ప్రతివత్సరమును, ధర్మ గ్రంథాలయ సభలు జరుగుచు, ఈయుద్యమాభివృద్ధికై విశేషముగ దోడ్పడినవి.
ఈవత్సరము ఏబదియొకటవ సభ మేనెల 13వ తేదీ మొదలు 18 వ తేదీవరకు "వాషింగుటను" పట్టణమందు జరిగినది. ఈసభకు రమారమి 3,000 మంది ప్రతినిధులు విచ్చేసిరి. అనగా అమెరికా దేశ గ్రంథాలయ సంఘ సభ్యులలో నాల్గవవంతు సభ్యులు హాజరైరి. 13 వ తేదీ సాయంకాలను సభ ప్రారంభమాయెను.
ఆహ్వానము
ఆహ్వాన సంఘాధ్యక్షులగు జడ్జి వెండల్ ఫిలిప్సుగారు ఈరీతిని ప్రతినిధుల నాహ్వానించిరి:—
“ప్రపంచమునందెల్ల సౌందర్యవంతమును, మీదియును మాదియును నగు నీ "వాషింగుటను” పట్టణము నకు కొలంబియా జిల్లా ధర్మ గ్రంథాలయ పక్షమున మిమ్ములను హృదయపూర్వకముగ ఆహ్వానించుచున్నాను. ఈ దేశమునందు ఇదే విస్తీర్ణముగల పట్టణముల యందెల్ల, “వాషీంగుటను” పట్టణమునందు, తక్కువ గ్రంథాలయములును ఎక్కువ వివేకమును గల వని కాంగ్రెసు కమిటీలకు మా గ్రంథ భాండాగారి ప్రదర్శింపుచుండెను. ఈవిషయమును బట్టి “ఏమి యూహింపవలె” నను విషయము ప్రతివత్సరమును చర్చకు వచ్చు చున్నది. అందుచేత నీ సభ జరుగుటకు ఈపట్టణము మిక్కిలి తగి యున్నది. మీతో నాకుగల చిరకాల పరిచయమును బట్టి, మీయుత్సాహము ప్రశంసనీయమని చెప్పగలను. మీయొక్క ఆసక్తి దైవ దత్తము. అదివరకు ఒక గ్రంథాలయము అభివృద్ధి జెందుచున్న స్థలమునందెల్ల రెండు గ్రంథాలయములను వ్యాప్తి జెందించుటయే, మానవాభివృద్ధికి మార్గమును ప్రాప్యమును యని మీ కందరికిని తెలిసిన సంగతేను.
పెద్దవి చిన్నవి కలిపి ఎన్ని గ్రంథాలయముల ప్రతినిధులు ఇట కేతెంచిరి? ఎన్ని స్థలములనుండి వారు ఏ తెంచిరి? వారు వచ్చిన స్థలముల యొక్క దూరమునంతను కలిపినయెడల ఎంతపొడుగు అగును? వారి ఖర్చులను ఎవరిచ్చెదరు? వారిలో ఎందరు ఈ పట్టణమును అది వరకు జూచియుండిని? ఇక్కడకు వచ్చిన గ్రంథాలయము లన్నింటిలో ఎన్ని గ్రంథము లున్నవి? అగ్రంథము లన్నింటిని ఒకచోట జేర్చిన యెడల, ఈ పట్టణము సరిపోగలదా? ఈ గ్రంథాలయము లన్నింటిలో గల చదువరుల సంఖ్య ఎంత? ఈ గ్రంథాలయము లందు సంవత్సరమునకు ఉత్పత్తి ఎంత? ఎన్ని ఫలవంతములగు భావములు బహిర్గత మైనవి? ఎంతమంది యంత్ర విద్యాపారంగతులకు వారి చిక్కులు విడదీయుటకు ఈ గ్రంథాలయములు తోడ్పడినవి? ఎంతమంది మానవులు తమ చిన్నతనములో గాని పెద్దతనములో గాని ఈ గ్రంథాలయముల తోడ్పాటువలన చెడుపుస్తకములను వదలి మంచి గ్రంథములను చదువగలిగిరి? వృద్ధులయొక్క రోగుల యొక్క - వంటరిగా సుండు వారియొక్క ౼ ఎంతకాలము ఈ గ్రంథాలయములు నిధానము వలన ప్రకాశవంతమైనది?
ఎంతమంది వ్యక్తలకు ఈగ్రంథాలయములు తోడ్పడినవి?మానవుని బుద్ధికి తెలిసినంతవరకు, ఇక్కడకు వచ్చిన గ్రంథ భాండా గారికులకు తేలియనివిషయ మెద్దియైన గలదా! అన్ని గ్రంథాలయములలోగల అన్ని గ్రంథములలోగల జ్ఞానమంతయును ఒక మనిషికి తెలిసి యున్నచో ఆతనిని ప్రజలెట్లు గౌరవింతురు? నాకు దోచిన ప్రశ్న లివి. యోగ్యమైనట్టియు యూపయుక్తమైనట్టియు జ్ఞానమును సేకరించి తెచ్చి యిచ్చువారు గాను, నిష్పక్షపాతమైన సత్యమును వ్యాపింపజేయువాడుగాను, తాము పాక్షికముగా నుండుట కొక కక్ష్మి లేక - తాము వాదించుట కమతము లేక - తాము నిరూపించుట కొక ప్రతిజ్ఞలేక - సర్వసామాన్యత్వభావముతో నుండువారుగాను, మిమ్ములను ఆహ్వానించుచున్నాను. అనె క శతాబ్దముల క్రితము "అలెగ్జాండ్రా" పట్టణ వీధులయం దొక వైరాగి పోవుచుండెను. ఆతడు ఒక చేతియందు ఉదకముగల బొచ్చె నొకదానిని, రెండవ చేతియందు వెలుగుచున్న కాగడా నొకదానిని ధరించి యుండెను. ఆతనిని జూచి వింతపడినట్టి దారినిపోవువారు “వాటితో నేమిచేసెదవు?" అని అతనిని అడిగిరి. అందుల కాతడు ఇట్లు సమాధాన మిచ్చెను. “ఈయుదకముతో నరకమును ముంచి వేసెదను, ఈయగ్నితో స్వర్గమును కాల్చివేసెదను?" అమెరికా దేశ గ్రంథాలయ సంఘ సభ్యులారా! బుద్ధిహీను లందరి యొక్క స్వర్గలోకములును, మానవులందరిచే నిర్మింపబడిన నర డికలోకములును, కనబడక పోవునంతవరకును పట్టుదలతోను ఉత్సాహము తోను మీ యొక్క కార్యమును నెర వేర్చుచునే యుండవలయును”.
అధ్యక్షుకోపన్యాసము
“క్లీవులాండు” ధర్మగ్రంధాలయమునకు గ్రంథ భాండాగారిణి యగు “లిండా ఈష్టుమాను" అను యువతీమణి ఈసభకు అధ్యక్షత వహించెను. ఈసభలు జరిగిన ఏబది సంవత్సరములలోను స్త్రీలు అధ్యతవహించుటకు ఇది నాలుగవసారి. ఆమె ఈవిధమున తనయుపన్యాసము నిచ్చెను:-
"మన దేశ మందు గ్రంథాలయ సేవాభివృద్ధి యొక్క భావిస్థితిని గూర్చి కొంచెము యోచింతము ముందుకు జూచుటకు పూర్వము ప్రస్తుతస్థితినిగూడ జూతము.
అమెరికా దేశమందు అసలు గ్రంథాలయములే అభివృద్ధి జెంది యుండనియెడల ఈ దేశస్థితి ఎట్లు ఉండి యుండెడిదో భావింపుడు. అమెరికా దేశమునకు కొత్తగా వలసబోయినప్పుడు ఐరోపా దేశమందలి గ్రంథాలయముల స్థితిని యోచింపుడు. తరువాత జరిగిన శతాబ్దము లందు గ్రంథాలయ పద్ధతులందును, పరిపాలనయందును అభివృద్ధి ఏమాత్రమును లేడని తలంపుడు. నేడు అమెరికా దేశఘు యొక్క స్థితి ఏరీతిగా ఉండి యుండును?
కొన్ని గ్రంథాలయములు ఈ దేశమందు గూడ బయలు దేరి యుండి యుండును ౼ కాని వానియొక్క పదునారు పదునేడు శతాబ్ద పరిపాలనా పద్ధతులు, వాని నుపయోగించు కొద్దిమంది అదృష్టవంతులకుగూడ వానియొక్క విలువను సంకుచితపరచి యుండును. నేడు మన మెరిగియున్నట్టి ధర్మ గ్రంథాలయములు, పాఠశాల గ్రంథాలయములు, ప్రత్యేక గ్రంథాలయములు బయలు దేరక నేయుండి యుండును. జనసామాన్యము గ్రంథాలయముల తోడ్పాటు లేక నేయుండి యుందురు.
అట్టి స్థితిగతులందున్న అమెరికా దేశమునకును ఇప్పటి అమెరికా దేశమునకును విశేష వ్యత్యాసము కలిగి యుండుననియు, అభి వృద్ధికరములగు గ్రంథాలయ మార్గములును అందరికిని పుస్తకము లందుబాటులో నుండు ఏర్పాటులును ఈ దేశమునందు గలిగిన సత్యరాభివృద్ధికి స్త్రబలమైన కారణములనియు దీనివలన తేలినది. ప్రఖ్యాతిని వహించిన అనేకమంది అమెరికా దేశస్థులు తమ విద్యాభివృద్ధికిని తమజీవితములందు పొందిన ప్రావీణ్యతకును, గ్రంథాలయములందు లభించిన సావకాశములే మూలకందములని అంగీకరించెదరు. (అట్టివారి పేరులు చాల ఇయ్యబడినవి. వారిలో అమెరికా దేశ కోటీశ్వరుడును దానకర్ణుడును అగు ఆండ్రూ కార్టీజీ గారి పేరుగూడ గలదు). గ్రంథాలయముల ఉపయోగమువలన ఎంతమందికి సున్నితమార్గములును, సమయ స్ఫురణములును లభించినచో ఇక్కడనున్న ప్రతివారును లెక్కించి చెప్ప గలుగుదురు. ఇంక మనసంగతేమిటి? గ్రంథాలయములు కొనివచ్చిన పుస్తక సాంగత్యము లేనియెడల వ్యక్తిగతాభి వృద్ధియందు మన మందరమును ఎంత వెనుకబడియుండి యుందుమో? మనకు గ్రంథాలయములను గ్రంథలయ గ్రంథాములును లేనియెయడల మనకు మనోదృట్టి సంకుచితమై యుండును. మన బాధ్యతలు వానిని అనుసరించుటకు తగిన సావకాశములు - అల్పమై పోవును; మన జీవిత యోచనలన్నియు భిన్నములై యుండును. నాకింద పనిజేయు సహాయులొకరు చెప్పినట్లు “ఈ గ్రంథాలయము వలన గాక పోయిన యెడల, సామాన్య జీవితమును గడుపుచుండి యుందును”.
నా స్వగ్రామమగు "క్లీవులాండు” పట్టణమునందు గ్రంథాలయము లేనియెడల, కడచిన 60 సంవత్సరముల నుండియు ఆపట్టణము ఎట్లు ఉండియుండునో నేను తఱచు భావించు కొనుచుందును. అప్పుడీ పట్టణము నేడు ఉన్న స్థితియందుండదు. ఇప్పటివలె “సన్మార్గపట్టణ” మను పేరును పొందియుండదు. అభివృద్ధి మందముగా నున్నప్పుడు ఇట్టి యాలోచనలు నిరుత్సాహమును కలుగ జేయకుండుటకు మందులు.
గ్రంథాలయములు చేయగలుగుసేవ సంపూర్ణ వికాసస్థితికి వచ్చు ఆదర్శకమగు భవిష్యత్కాలమునకై మనము జూచుదము. మనము జూచు కొన్ని విషయము లేమి? ప్రతిపట్టణమును గ్రామమును వానికొరతలకు తగినట్టుగా గ థాలయమును గలిగి యుండుట; తాలూకా గ్రంథాలయముగాని, జిల్లా గ్రంథాలయముగాని దానికి తోడ్పడ నుండుట; ప్రతి గొప్ప పట్టణమందును, పౌరులందరికి తోడ్పడగల గ్రంథాలయము దానిశాఖలు ఉండుట; గ్రంథాలయము వల్లగాని, అప్పుడప్పుడు గ్రంథములు మోటారు బండ్లమీద వచ్చులు మూలమునగాని, లేక తపాలాఫీసు ద్వారా పుస్తకములు లభించుట మూలమున గాని, పల్లెటూళ్ళు అన్నియు మారుమూలల యందున్న పల్లెగూడ గ్రంథాలయ లాభమును పొందుట; అట్టివానికి పట్టణ గ్రంథాలయములు తోడ్పడుట; పట్టణ గ్రంథాలయములకు పుర గ్రంధాలయములు తోడ్పడు చుండుట; ప్రతి పాఠశాలకును; విశ్వవిద్యాలయమునకును గుండెకాయవలె పనిజేయుచున్న గ్రంథాలయముండుట; దుర్లభ వస్తు సంగ్రహశాలలందు పరిశోధనాసంస్థలందు - పరిశోధక గ్రంథాలయము లుండుట; ఇతర సంస్థలందు వారివారి రుచులకు అనుగుణ్యములైన ప్రత్యేక గ్రంథాలయము లుండుట; వర్తకము - పరిశ్రమలు - ప్రభుత్వము - మొదలైనవానికి ఉపయోగింపదగిన అనేక ప్రత్యేక గ్రంథాలయము లుండుట, పైన వివరించిన ప్రాకారము గ్రంథాలయము లన్నియు ఏర్పడిన వని తలంపుము. మనదేశమందున్న జనులందరికిని తగిన గ్రంథముల నంద జేయగలిగినన్ని గ్రంథాలయములు ఏర్పడిన వని తలంపుము. అవియన్నియు ఆదర్శకములై యున్నవని తలంపుము. ఈ గ్రంథాలయము లన్నియు ఆకర్షవంతములున, సదుపాయవంతమలును అగు భవనములయం దుంపబడును. అవి మంచి రసజ్ఞతతో నిర్మింపబడి, ఆకర్షవంతమగు ఆతిధ్యము నిచ్చుచుండును. గ్రామమునకు ఎక్కువ అవసరమునకు గావలసిన గ్రంథములన్నియు ఆ గ్రామ గ్రంథాలయమునందే యుండును. అప్పుడప్పుడు మాత్రము అవసరమగుచు సకృతుగా నుపయోగింపబడు గ్రంథములు కావలసినప్పుడెల్ల తాలూకా జిల్లా కేంద్ర గ్రంథాలయములనుండి వచ్చుచుండును. గ్రంథాలయములు పరస్పరము ఎరువిచ్చుకొనుట సంపూర్ణ సహకార భావముతో నుండును. అందువలన ఒక పరిశోధకునికి గాని, ఒక శాస్త్రజ్ఞునకుగాని అపరూపగ్రంథ మేదైనా కావలసి వచ్చిన యెడల ఏమాత్రము అలస్యములేకుండ దేశమునందు ఏగ్రంథాలయమునం దున్నను వెదకి తెప్పించి అందజేయబడు చుండును. ఒక చదువరి వచ్చి తనకు ఫలానా గ్రంథము కావలయునని అడిగినయెడల, “ఆగ్రంథము లేదు, దానికి బదులుగా ఈగ్రంథమును చదువుము” అని చెప్పవలసిన అగత్యము లేకుండ, ఆగ్రంధము ఏగ్రంథాలయ మందున్నను తమ గ్రామ గ్రంథాలయము ద్వారా తెప్పించి యివ్వబడుచుండును. అట్టిస్థితి వచ్చినప్పుడు గ్రంథాలయముల యుపయోగము అనంతముగా పెరిగిపోవును.
ఇట్టి ఆదర్శకస్థితియందు ఆదర్శక గ్రంథ భాండాగారులే గాక, ఆదర్శక గ్రంథాలయోద్యోగులు కూడ అగత్యమగును. అట్టివారు వారి వారి ప్రత్యేకమైన పనులకు అలవాటు పడినవారుగా నుండవలెను. అట్టివారికి ప్రత్యేక విద్యాభ్యాసమే గాక, ప్రత్యేకమైన తరి బీతు గూడ అవసరము. పసిపిల్లలు గ్రంథ భాండాగారులు పాఠశాల గ్రంథ భాండాగారలు - ప్రత్యేక విషయ గ్రంథాలయ గ్రంథ భాండా గారులు - మామూలు గ్రంథాలయ గ్రంథ భాండాగారులు, గ్రంథ వర్గీకరణము చేయువారు - (Catalogers) గ్రంథ వివరణ పట్టికలను తయారు చేయు వారు-(Bibliographers) చదువరుల సలహాదారులు - విషయసంధాన గ్రంధ భాండాగారులు" (Reference Librarians) ఇట్టివారందరును ఇప్పుడు మన మిన్నదానికంటే ఎక్కువ పాండిత్యము గలవారుగను, ఎక్కువ గ్రంథములను పరిశీలన చేసిన వారుగను, గ్రంధాలయ శాస్త్రమునం దెక్కువ జ్ఞానమును సంపాదించినవారుగను ఉండవలెను; మరియు అట్టివారు మానసిక శాస్త్రమునందు ప్రవీణులై యుండవలెను; తోడి మానవుల ప్రత్యక్ష కష్టములయందు సహజమగు దయతోను సానుభూతితోను కూడిన శ్రద్ధను కలుగ జేసి కొనువారుగా నుండవలెను.
ఇట్టి ఆదర్శక గ్రంథాలయములవలనను, గ్రంథ భాండాగారులవలనను నెరవేరున దేమి? కొన్ని తరములవరకు ప్రతివ్యక్తియును తన బాల్యమునుండి యావజ్జీవ పర్యంతము సద్గ్రంథముల యొక్క లాభమును ఆనందమును (అవి తన అవసరములకు తగినట్టుగా కుదుర్చుసలహాదారుల సహాయముతో - సరియైన సమయమున సరియైన గ్రంథము అందుబాటగుచుండినప్పుడు) పొందుచుండిన యెడల దాని యొక్క ఫలితమును నీ చేతనైతే భావింపుము.
ఇట్టి యావజ్జీవ సహచర్యము వలన తెలివితక్కువగా నుండు మానవులు గూడ లాభమును పొందుదు రనుటకు సందియ మేమాత్రమైన గలదా? అప్పుడు ఆధిక్యత లేనివారు, పరిశోధకులు, పండితులు, అందరునుకూడ తగినంత తోడ్పాటును పొంది, ప్రపంచ కళ్యాణమునకై అమూల్యమైన విషయములను కనుగొందురు.
మనము అమెరికా సంయుక్త రాష్ట్రములకును, కనడా రాష్ట్రమునకును మాత్రము గ్రంథాలయ సేవా విధానమును గూర్చియో చించుచున్నాము. కాని “అమెరికా దేశ గ్రంథాలయ సంఘ” మను మన సంఘము యొక్క పేరును సార్లళపరుప దలతుమేని, దీనియొక్క యుపయోగమును ఈఖండమందున్న ఇతర రాష్ట్రములకు గూడ వ్యాపింప జేయవలెను. క్రిందటిసంవత్సరము మనసభకు “మెక్సికో” దేశ స్నేహితులు కొంతమంది వచ్చిన పిమ్మట, ఆ దేశస్థులు కొంతమంది గ్రంథ భాండాగారికులు మన సంఘసభ్యులుగా చేరియున్నారు. మెక్సికో దేశమందలి విద్యాశాఖకు చెందిన డాక్టరు మోయిసెస్ గారు ఇటీవల మన దేశమునకు వచ్చినప్పుడు వారి ప్రసంగములను వినియుందురు. ఆ దేశమందలి జనసామాన్యముయొక్క అజ్ఞానదశయే ఆ దేశ కష్టములకు కారణమని ఆయన జెప్పియున్నారు. ఆయన యొక్క ఆదర్శము “భూమి - గ్రంథములు" అని; "భూమి - స్వాతంత్యము” అను ఆదర్శమును పెట్టుకొని మనపూర్వీకులు ధైర్యసాహసములతో పోరియున్నారు. కాని డాక్టరు. మోయిసెస్ గారి అభిప్రాయ ప్రకారము:౼
“విద్యావ్యాపక మైనచోట స్వాతంత్య్రమునకు దారిఏర్పడును" "మెక్సికో" దేశస్థులకు కావలసిన గ్రంథములు త్వరలో లభించు గాక, వారికి తగిన ఆహ్వానమిత్తము.
ఇంతేగాక, మనయుద్యమమును ఉత్తర అమెరికా దేశమునకు మాత్రమే నిరోధింప గూడదు. ఇప్పుడు ప్రపంచమందంతటను గ్రంథాలయముల ఆవశ్యకత బాగుగా గుర్తింపబడు చున్నది. కడచిన తరమందు అనేకఐరోపా దేశములు చితగ్రంథ వ్యాపనోద్యమమునందు తగినంత అభివృద్ధిని జూపియున్నవి. “ఫాసం” దేశమందు "ప్యారిసు” నగరమందున్న అమెరికా గ్రంథాలయమును, గ్రంథాలయ పాఠశాలయును విశేష ఫలితములను జూపియున్నవి. మనఏబదియవసభ ప్రపంచ గ్రంథ భాండాగారికుల సోదరత్వమునకు ఒక యుద్యమమును ప్రారంభించినది. దాని ఫలితముగా రాబోవు మాసమునందు "రోము” నగరమున ప్రపంచ గ్రంథాలయ సభ జరుగుచున్నది. మనలో కొంతమంది ఆసభ కేగెదరు. ఈవత్సరమున జరుగు ఆప్రపంచ సమ్మేళన సభకును, ముందు జరుగబోవు సభలకును ఫలితమేమి? కాలమే విశకరింప గలదు. కాని ఈసభ విషయమై అనేక దేశ గ్రంథాలయ నాయకులకు గల గాఢమైన శ్రద్ధనుబట్టి చూచిన, ఈసభ కూడి వివిధ విషయనులను చర్చించుట వలన ఉత్తరోత్తర ప్రపంచభావి భాగ్యోదయమునకు దీసికొని పోకమానదు.
ఇక్కడ మనదేశమందు, అభివృద్ధిని జెందిన గ్రంథాలయములు ఎక్కువమంది చదువరులకు సహాయపడు చున్నవి. ఆచదువరులు సాంఘికము - రాజకీయ ము - జాతీయము - అంతర్జాతీయము - ఇత్యాది విషయముల మీద తెలివితేటలతో గూడిన యభిప్రాయములను ఏర్పరచుకొనుటకై ప్రయత్నించుచున్నారు. దీనిని బట్టి ప్రపంచ సామాన్య పరిస్థితుల యందు గ్రంథాలయములకు గల తప్పించు కొనజాలని సంబంధము బోధపడుచున్నది. అందుచేత అన్ని సమస్యలకు సంబంధించిన యథార్థవిషయములను గురించిన నమ్మకమైన సంజాయిషీని, ఎప్పటి కప్పుడు సిద్ధపరచి యుంచవలసిన బాధ్యత మన గ్రంథ భాండాగారికుల మీద బడుచున్నది.
గ్రంథాలయముల ప్రాముఖ్యతను, స్థానిక - జాతీయ - ప్రాపంచికాభివృద్ధియందు వానికిగల స్క్రాబల్యమైన అధికారమును, నేను ఏమైన అతిశయించి చెప్పుచున్నానా? ఈ ప్రాముఖ్యతను, ఈ అధికారమును అతిశయించి చెప్పుట సాధ్యమా? గ్రంథాలయములే గనుక సమస్థ ప్రపంచమండలి విద్య యొక్కయు, జ్ఞానముయొక్కయు నిలయములైతే, ఈవిద్యను జ్ఞానమును వెదజల్లుటకు అవి ఇంకను ఎక్కువ ఉత్సాహముగల మార్గములేయైతే, వాని ప్రాముఖ్యతను మితిమీరి గణించుటకుగాని, మితిమీరి వక్కాణించుటకుగాని వీలుండునా? ఒకరు ఇట్లు జెప్పిరి. “మేము ఒకవర్తకము జేయుచున్నాము. ఆవర్తకము మేము జేయుచున్నది బంగారమునందుగాదు; నగలయందుగాదు; పట్టుబట్టలయుదుగాదు; సుగంధ ద్రవ్యములందుగాదు; పదార్థముతో గూడిన మరి యేయితర సరకుతోనుగాదు; మరి దేనియందు? దేవుని ప్రథమసృష్టియగు వెలుతురు నందు, వెలుతురు గలిగిన ప్రపంచమందున్న అన్ని భాగములును పెరుగును."
గ్రంథాలయములకు ఆదర్శకమగు పలుకుబడి గలిగి, ఆదర్శక పరిస్థితులు సంభవించు నప్పటికి విశేషకాలము పట్టవచ్చును. కాని విశేషదూరములను అమితవేగముగా ప్రయాణము జేయుచున్న కాలమిది. అభివృద్ధిని పొందుటకు ఏ యితర విషయముయొక్క మార్గము నందుకంటే కొంచెమైన ఎక్కువ ప్రతిబంధకములు మనమార్గము నందు కలవా? న్యాయముగా ఆలోచించిన లేవని చెప్పవచ్చును.
గడచిన పది సంవత్సరములలో జరిగిన గ్రంథాలయాభివృద్ధి, వెనుకటి సంవత్సరములతో పోల్చిజూచిన మిక్కిలి తీవ్రముగ నున్నదని చెప్పవచ్చును. అందుచేత ఇప్పుడు విజృభించియున్న శక్తులన్నింటిని కూడదీసి, మన సుపయోగించు కొనవలయును.
తుదకు మన ప్రస్తుతాంశమునకు వచ్చితిమి. దూరముగా దృగ్గోచరమగుచున్న ఉత్సాహవంతములగు గమ్యస్థానములకు దారి కొన్ని మెట్లకు పైగా అప్పటప్పట విస్పష్టముగా గానవచ్చుచున్నను, అక్కడకుమాత్రము వంకర టింకర మార్గములనే పోవలసియుండును. కాని పై మెట్టును స్పష్టముగా జూచి, అడుగును దృఢముగా వేయుచుందుమేని, గమ్యస్థానమునకు తప్పక పోదుము. అందుచేత మనము వెంటనే చేయవలసిన దేమనగా: మనము ప్రతినిత్యమును చేయు ప్రసంగములలో కొన్ని విషయములందు గ్రంథాలయ సేవ యొక్క విలువను ప్రయోజనమును ఇంకను ఎక్కువ అభివృద్ధికరముగ జూపవలెను. ఈకార్యమును నిర్వర్తించువారు ఎన్ని వేలమంది గలలో అన్ని విధములుగా ఈప్రసంగము లుండును, గ్రంథములతోను, మానవుల తోను, పని ఇంకను ఎక్కువ ఉపయుక్తముగా జేయు రికార్డులతోను మనము వ్యవహరింతుము. ఈ రికార్డులు కూడ ఉపయుక్త ములుగను మనోరంజకములుగను ఉండును.
యంత్రములతో జేయు ఒక పరిశ్రమ ముందు గల నిరుత్సాహమును, విసుగుపుట్టించునంత అభేద తీయును, గ్రంథాలయ కార్యకమమునందు మామూలుగా జరుగవలసియుండిన మిక్కిలికష్టమైన పనియందైనను లేకుండుట నిజముగా మన యదృష్టమని చెప్పవచ్చును. ఇంక శాస్త్రవిషయిక కార్యక్రమమునందు గల హింస మన కసలే లేదు. నేను ఇటీవల ఒకటీకాలమందును తయారు జేయుచున్న స్థలమునకు బోతిని. అక్కడ టీకాలకై ఒక మందును తయారు జేయు చున్నారు? దానికై అనే కరకముల సూక్ష్మజీవులను ఏరకమున కారకము వేరు జేయుచున్నారు ఒక రకము రెండువంతులు, ఇంకొక రకము మూడు వంతులు, వేరొకరకము రెండు వంతులు, ఈరీతిగా వేరుచేయబడిన వానిని తిరిగి కలిపి మందును తయారుజేయుచున్నారు. పోల్చి చూచిన యెడల గ్రంథాలయ మందు జరుగు కార్యక్రమమేదియును ఇంత చిక్కుగాను విసుగుదల ఉండదు. మానవులచే నవలంబింపబడు ఏవృత్తియైనను మనవృత్తితో సరిపోల్చుటకైన సావకాశము లేకపోవుట యేగాక, ఇందు అందరును వాంఛింపదగిన అనేక మంచిహంశములు గలవు. “బోధన” ను గూర్చిన ఒక వ్యాసమునందు ఇట్లు వ్రాయబడియున్నది:౼ “ఏవృత్తినైన స్థిరముగ నవలంబించిన యెడల ఒక వ్యక్తి యొక్క అక్కరల వ్యాప్తినది సంకుచిత పరచును. హృదయము యొక్క ఆర్ద్రదృష్టి నది తగ్గించి వేయును; మరియు నాతని నొక పరిపాటికి దాసునిగా జేయును.” కలుగ జేయునదిగాను
ఈవాక్యములు ఇతరవృత్తుల కేమైన చెందునేమోగాని, గ్రంథాలయ వృత్తికి మాత్రము ఎంతమాత్రమును చెందవు.
గ్రంథాలయ నిర్వాహకులు నిరంతరము మార్పు జెందుచున్న స్థితిగతులకును, ఆవశ్యకతలకును తమ ప్రతిష్ఠాపనలు వెనుకబడకుండ జూచు కొనవలయును. కార్యనిర్వాహకత్వమునందేమి – మరి యేయితర స్టితియందేమి - మనము ఏపనికైతే జవాబుదారిని వహింతుమో, దాని యందు యధార్థమైన అభివృద్ధిని జూపుటయందే మనదృష్టిని కేంద్రీకరింపవలెను. ఇట్లు జరుగుటకు సాధారణముగా ఇతర పనివారలతో పొఁదికగా కలిసి కార్యమును నిర్వహింప వలసియుండును. అనగా ఉపాయముగా కార్యక్రమమును ఏర్పరిచి, ఇతరులతో సహకారము జేయుట. గ్రంథాలయ నిర్వాహకులందరును ఉన్నతభావనలతో తమ కార్యసరణిని జరుపవలెను. వీధిలో తిరుగుచున్నప్పుడు, మన మందరమును గూడ మన మన గ్రంథాలయముల ప్రతినిధుల మేను. అందుచేత జనసామాన్యముయొక్క దృష్టినంతను గ్రంథాలయము వైపునకు దిప్పుట మన అందరియొక్క విద్యుక్తధర్మము. నీగ్రంథాలయమునకు నీవు పని జేయుట యనగా నీకక్షిదారులందరికి పని జేయుట; ఆకక్షిదారు లందు దగ్గరనున్న ఒక పాఠశాలగాని, లేక విశ్వ విద్యాలయముగాని, ఒక పట్టణముగాని, ఒక తాలూకా గాని చేరియుండవచ్చును. మన గ్రంథాలయమును చేయదగినంత ఉపయోగకరముగ చేయదలంతుమేని, మనకక్షిదారులతో మనము ఐక్యము కావలెను. వారి యక్కరలే మన యక్కరలకింద చేసికొనవలెను; ఇట్లు చేయుట యందే మన తెలివి తేటలు, మనయందుగల పొందిక, మన యోగృత పరీక్షకు వచ్చును.
మన గ్రంథాలయముయొక్క క్షేమమునకు బిమ్మట మన అమెరికాదేశ గ్రంథాలయ సంఘము యొక్క అభివృద్ధిని గూర్చి యోచింపవలెను. గ్రంథాలయ సేవను, గ్రంథ భాండాగారత్వమును అభివృద్ధి జేయుటయే ఈ సంఘస్సు యొక్క ప్రధాన అభిప్రాయములు. ఈ సంఘమునందు స్త్రీ పురుషులందరును గలిసి పదకొండు వేల మంది సభ్యులు గలరు. వీరందరును చేరి తమ ఉద్యోగ విషయములను అనుభవములను అంతను చేర్చి కూడబలుకుకొని, తమ అనుభవములను అందరియొక్క క్షేమమునకై వినియోగింప పాటుబడెదరు. ఈ సంఘమనకు శాఖలుగానున్న అరువదికంటె ఎక్కువ సంఖ్యగల ఉపసంఘముల సభ్యులుగా ఈ సంఘము యొక్క పెక్కువందల సభ్యులు పనిచేయుచున్నారు. ఈ సంఘముయొక్క ప్రధాన కార్యాలయమందు ఏబది కంటె ఎక్కువమంది ఉద్యోగులు పని జేయుచున్నారు. ఈ సంఘము యొక్క సేవ సభ్యులకు మాత్రమేగాక, గ్రంథాల యోద్యమవ్యాపనమునకు గూడ వినియోగింప బడుచున్నది. ఉపసంఘములయొక్క నివేదికలును ఈ సభయొక్క వివుల కార్యక్రమమును చదివిన యెడల, సభ్యులలో చాలమంది అమెరికా దేశ గ్రంథాలయ సంఘము నెడల ఎంత గాఢాభిమానమును గలిగియున్నారో, దాని అభివృద్ధికై ఎట్టిదక్షతతో పాటు బడుచున్నారో బోధపడగలదు. వ్యక్తిగతముగను, ఉపసంఘసభ్యులుగను ఈసంఘపక్షమున జేయుసేవతో తృప్తిని వహింపక చాలమంది సభ్యులు చేయవలసిన పనిని గురించి తారతమ్యతతో చింతని జేసి, ముందువెనుకల ప్రారంభింప వలసిన పనులను గూర్చి నిర్ణయించు చుండెదరు. ఇట్టి వారియొక్క అభిమానము లేకుండ నిర్వహింపబడిన మహత్కార్యములు చాల భాగము నెరవేరి యుండవు.
గడచిన కొద్ది సంవత్సరములలో నిర్వహింపబడిన పనులలో ప్రధానమైనవి, “కార్నీజీ కార్పరేషను” వారును తడితరులును ఈ పనులకై ప్రత్యేకించి యియ్యబడిన గ్రాంటుల వలననే నెరవేరినవి. ఇట్లు నిర్వహింపబడిన వానిలో కొన్ని:-గ్రంథాలయ శోధన, గ్రంథ భాండాగారత్వమునకు గావలసిన చదువునకు గావలసిన గ్రంథనిర్ణయము, ఈడు ముదిరినవారికి గ్రంథాలయము చేయదగిన పనిని గూర్చిన నిర్ణయము, చదువదగిన గ్రంథముల యొక్కయు చదువు అలవాటుల యొక్కయు పరిశీలన, ప్రత్యేక ఆశయములతో చదువు పద్ధతులు, వరదవచ్చిన ప్రదేశముల గ్రంథాలయముల పునర్నిర్మాణము, అంతర్జాతీయ గ్రంథాలయ సహకారము, ప్యారిసునందున్న గ్రంథాలయ పాఠశాల. ఈ ఏర్పాటులయందు కొన్ని పూర్తియైనవి; మరికొన్ని పూర్తికానున్నవి. ఈ విషయమై పనిజేయని కొందరి విమర్శనలు ఎట్లున్నను, వీనిని త్యెజించుటకు మనలో ఎవరైని అంగీకరింతుమా? గ్రంథాలయ శోధన సంపుటములు తయారు జేయుటకు పంపబడిన పరిశోధన ప్రశ్నల కుత్తరువుల నిచ్చి దానివలన బాగుపడని గ్రంథాలయ మొక్కటియైన కలదా ? ఆ సంపుటములను జూచి ఇతర గ్రంథాలయములను గూర్చిన వివరములను తఱచు తెలిసికొనుచుండ ఉన్న గ్రంథాలయ పెద్దియైన కలదా? గ్రంథాలయ పాఠశాలలకు నిర్ణయింపబడిన పాఠపుస్తకములు ఉత్కృష్టత జెందినవి కాక పోవచ్చునేమోగాని ; అంతకంటే మంచి పుస్తకములు బయలు దేరువరకుసు, గ్రంథాలయ పాఠశాలలకును గ్రంథాలయములకును ఆవి అత్యంతావశ్యకములు గావా?
మరికొన్ని ప్రత్యేక పరిశోధనలకును ప్రదర్శనములకును నిర్ణత కాలములకుగాను ఇయ్యబడిన విరాళములు అయిపోవచ్చినవి. ఇప్పుడు మనము ఆకార్యములకై తిరిగి ద్రవ్యమును సంపాదింపవలెను. లేనియెడల వానిని ఆపివేయవలసి వచ్చును. ముఖ్యముగా అవసరమైనవి ఇవి:— ప్రధాన కార్యాలయమందు గ్రంథాలయ పాఠశాల శాఖ, పిల్లల గ్రంథాలయ శాఖ, కాలేజీ, విశ్వవిద్యాలయ శాఖ, ఇతర దేశశాఖ, వీనిలో కొన్నింటికి ప్రణాళికలు తయారై సిద్దముగానున్నవి. మరికొన్నిటికి ఉపసంఘములు తయారు జేయుచున్నవి. కార్యదర్శి తన నివేదికలో, ఇంకను చాల ఏర్పాటులు చేయవలసినవి గలవని సూచించి యున్నారు. అవి యన్నియు మన గ్రంథాలయాభివృద్ధికి మూలాధారమైనవిగా నున్నవి. కాని దానిలో ప్రతిదానికిని ద్రవ్యము అగత్యమై యున్నది.
అందుచేత అట్టి ఘనకార్యములను నిర్వహించుటకై ఇంకను ఎక్కువధనమును సంపాదింపవలెను. ఎంత సుందరవంతములైన
ఆదర్శములైనను కావలసిన ద్రవ్యసహాయము లేనిది గిజగిజలాడిపోవును. ఈ "ఆదాయము" అనునది మన గ్రంథాలయములందే
గాక ఈ అమెరికా దేశ గ్రంథాలయ సంఘమందు గూడ మనల నెదుర్కొనినది. దానికి మన జవాబుదారీ లేదని తృణీకరింప
జాలము. ఏలయనగా కొంతవరకైన దానికి మన అందు జవాబుదారీయును కలదు.
మానవప్రయత్నములచే జరుగవలసిన అన్ని రంగముల యందును కూడ ఆదాయ సమస్య ఎదుర్కొనుచునే యున్నతరి, గ్రంథ భాండాగారికులు మాత్రము దీనినుండి తప్పించుకొనగలరా? గ్రంథాలయముల యొక్కయు గ్రంథాలయ సేవ యొక్కయు ఆవశ్యకతను గుఱించియు విలువను గుఱించియు మనకు దృఢముగా దెలియును. ఆ యావశ్యకతయును విలువయును అనేక మార్గముల ప్రదర్శింపబడినవి. ఇంకను ప్రదర్శించుటకు అనేక మార్గములు మిగిలియున్నవి. ఈ ఆధునిక కాలమునం దీప పంచకమునందు గ్రంథాలయముల ఆవశ్యకత నిమిష నిమిషమును ఎక్కువ యగుచున్న సంగతి మనకు బాగుగా దెలియును. ఉపయోగపడనట్టియు, నిరర్థక కార్యములకు వినియోగమగు చున్నట్టియు ఐశ్వర్య మెంతయో గలదు. కొందరు మానవులు తమ ద్రవ్యమును ఎట్లు సద్వినియోగము చేయుదనూయని తీవ్రముగ యోచించుచున్నారు. గ్రంథాలయముల యొక్క హక్కును జెప్పుటకు సందేహ మెందులకు? ఉదారవంతులు సహాయమును ఉత్సాహమును దీనిమీదికి తిప్పవలెను. అనేక ఇతర పనులకు పెద్ద మొత్తములు ఇవ్వబడినట్లు ప్రతినిత్యమును మనము విను చుందుము. మనము స్వంతము కోసము అడుగుచుండుటలేదే. అట్టిస్థితి యందు మనము శాయశక్తుల కృషి జేయుచున్న ఉద్యమ సహాయార్థము యాచించుటకు వెనుదీయు టేల?
యుక్తసమయమున తగిన శ్రద్ధను వహించితిమేని మన గ్రంథాలయ సంఘమునకు సొమ్ము సంపాదించుట చాల సులభము. మనము రెండులక్షల రూపాయలు సంపాదించు కొనునెడల కార్నీజీ కార్పరేషను వారు ఇంకొక రెండులక్షల రూపాయిల నిచ్చుటకు అంగీకరించినారు. గ్రంథాలయోద్యమముందు ఎక్కువమందిని ఉత్సాహవంతులుగ జేయుట “కార్నీజీ కార్పరేషను” వారు యుదేశ్యము; అందుచేత మన గ్రంథాలయ సంఘంమునకు కొత్తగా చేరిన సభ్యుల చందా మొత్తమునకు ఇరవై రెట్ల సొమ్ము మనకు వసూలైనట్లుగా ఎంచుకొనెనిదమని వారు చెప్పినారు. ఈరీతిగా, కావలసిన ద్రవ్యములో నాలుగవ వంతు సొమ్ము సమకూడినది. ఇప్పుడు మనకున్న సభ్యులలో నూటికి 15 మంది మాత్రము ఒక్కొక్క నూతన సభ్యుని చేర్పగలిగిన యెడల, మనకు కావలసిన సొమ్ము చేకూరగలదు. మనగ్రంథాలయములలో ప్రతిదానికిని, ప్రత్యేకావసరముల ఉన్న సంగతి నాకు తెలియక పోలేదు. మా గ్రంథాలయమునకు ఇటీవల వరకును పెద్దవిరాళములేవియు లేవు; వాస అవసరము మాగ్రంథాలయమునకు బాగుగా కలదు. కాని అమెరికాదేశ గ్రంథాలయ సంఘమునకు చేయుసహాయము మన గ్రంథాలయాభివృద్ధికి ఎంత మాత్రమును భంగకరము గాదు. దానివలన మనగ్రంథాలయముల అభివృద్ధికి దోహదము లభింపగలదు. ఈవిషయమున నాభాగము చేయదలపని యెడల, ఈవిషయము మీకు చెప్పియే యుండును.
ప్రపంచమునందుండు సర్వజనులను ఎక్కువ సౌఖ్యవంతులు గాను - ఎక్కువ తెలివితేటలు గల వారుగాను- ఎక్కువ శాంతవంతులు గాను - ఎక్కువ ఐశ్వర్యవంతులుగాను చేయుటయందు గ్రంథాలయములు ప్రాముఖ్యత వహింపగల వని నాదృష్టికి విస్పష్టముగ గన్పట్టు చున్నది.
అధ్యక్షుని యుపన్యాసమైన పిమ్మట కాంగ్రెసు లైబ్రరీ చాలకాలము గ్రంథ భాండాగారిగా నుండి ప్రఖ్యాతివహించిన “ఫుట్నాం” గారికి సన్మానపత్ర మియ్యబడినది. వారియెడల సద్భావమునకును, మెప్పుదలకును, స్మరణమునకును సందేశమొకటి పంపబడినది. విద్యాశాఖాధికారి గ్రంథాలయ సంఘముతో సహకార మొనర్చెదమని సందేశమంపెను, విద్యాశాఖయొక్క తోడ్పాటువలన గ్రంథాలయములు అమితమైన సేవను జేయుటకు అనేక సావకాశములు గలవు. కాలేజీలయందును, విశ్వవిద్యాలయములందును గల గ్రంథముల పట్టికలు 24,768 విద్యాశాఖ గ్రంథాలయమందు గలవు; ఇవిగాక 2865 చిన్న పాఠశాలలయొక్కయు, 11,995 పెద్ద పాఠశాలల యొక్కయు రిపోర్టులు గూడ గలవు. మరియు ఇతర దేశములందలి విశ్వవిద్యాలయములందలి గ్రంథములపట్టికలు 1750 గలవు. వీనికితోడు 10,796 టెక్స్ట్ బుక్కులు గూడ గలవు.
(సశేషము)
పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.1 (1929).pdf/19 పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.1 (1929).pdf/20
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.
Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.
This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.
The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.
This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.
Public domainPublic domainfalsefalse