గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/దాసు శ్రీరామపండితులు
దాసు శ్రీరాములు
(౧)
జన్మము
ఆంధ్ర దేవీభాగవతకర్తయైన దాసు శ్రీరామకవి యారువేల నియోగి, ఆపస్తంబసూత్రుడు, హరీతగోత్రీకుడు, దాసు కన్నయ గారికిని, కామాంబకు నేక సంతానము. వీరిపూర్వులు మహారాష్ట్ర బ్రాహ్మణులనియు గోల్కొండలో నుండుచు నక్కడనుండి యుద్యోగవశమున బందరు జేరియుందురనియు వీరి దేవీభాగవత పీఠిక వలన తెలియుచున్నది. కృష్ణాజిల్లా (ప్రస్తుతము), కైకలూరు (పూర్వము గుడివాడ) తాలూకాలోని యల్లూరగ్రహారము వీరికి బూర్వార్జితమైన నివాసగ్రామము. ఈకవి తన మేనమామల యూరగు కూరాడలో క్రీ.శ ౧౮౪౬ (1846) పరాభవ సం'చైత్ర శు.౧౨ (12)నాడు జన్మించెను.
బాల్యము
వీరికి ౯(8) సం॥లు వయస్సు వచ్చువఱకును స్వగ్రామాదులలోనే యుండి, యప్పటి దేశ వ్యవహారమునుబట్టి, ఆంధ్రనామ సంగ్రహము, అమరకోశము, మున్నగునవి చదువుచు ఆంధ్రగీర్వాణ భాషా పంచయము వల్లించుకొనుచు వచ్చిరి, వీరి మేనత్తకుమాళ్ళగు ఉప్పులూరి కనకాఖ్య కవియు, కృష్ణయ్యయు వీరితో బాటు వీరి తలిదండ్రులచే సాకబడియుండుటచే వీరికి బాల్యస్నేహితులుగ నుండిరి. వీరి బాల్యదశ దేవీభాగవత పీఠిక యందు రమ్యముగ వర్ణింపబడినది.
విద్యాభ్యాసము
వీరిని ౧౦ (10)వ యేట నాంగ్లేయ విద్యాభ్యాసము బందరులో నాకాలమున నున్నత స్థితియందున్న నోబుల్ కళాశాలకు తెలిదండ్రులు బంపిరి. నోబుల్ గారు క్రైస్తవమతప్రచారకుడుగ నుండి కొందఱు యువకులను గ్రైస్తవమతావలంబకులుగా జేయుచుండిరి. కీ.శే.చేవేండ్ర వెంకటాచలము పంతులుగారీ కవి గారి సమకాలీకులు. వారప్పటికే క్రైస్తవమతము స్వీకరించిరి. ఒక యేడక్కడ చదువుకొని; పిదప నీకవి గారి తలిదండ్రులు తమబిడ్డ నోబుల్ గారితో జనుపుగ దిరుగుచున్నట్లు తెలియుట చేతను, గొందఱన్యమత ప్రవిష్టులగుట నెఱిఁగియుఁడుట చేతను, ఆచట నుంచుట యుక్తము కాదని యింటికి ఔలిపించిరి. ఈయన బందరులో నుండగానే తప్పులు తప్పులుగా పద్యములల్ల నారంభించెను. వీరు పాఠశాలలో విద్యాభ్యాస మొనర్చినదీ యొక్క సంవ్సత్సరమే.
కవనము
ఇంతనుండి వీరు స్వయంకృషిచే జ్ఞానార్జన మొనర్చిరి. ఆంధ్రగీర్వాణములయందు బాండిత్యము సంపాదించుచు ౧౨వ యేట “సోమలింగ శతకము”*రచించిరి. పై కనకాఖ్య కవిగారును, వీరును గలిసి యీ కాలమున"శుకరం భాసంవాడ” మను చిన్న పుస్తకమును రచించి, యందు లోపములున్నట్లు దామే గ్రహించి, యల్లూరు చెఱువులో గలిపినట్లు కవిగారు చెప్పుచుండిరి. వీరి ౧౪ (14)వ యేట కనకాఖ్యకవి గారి సహాయముతో “సాత్రాజితీవిలాస”* మను యక్షగానమును రచించిరి. ఇయ్యది చిన్నతనమున వ్రాయబడినను ప్రౌఢముగా గన్పట్టును. C౬ (16)వ యేట కృష్ణార్జున సమరము రచించిరి.
జ్యోతిషము
ఇట్లు అల్లూరులో సుఖముగ కాలము వెళ్ళబుచ్చుచు దమ మాతామహులగు కూరాడ రామచెంద్రయ్య గారి యొక్కయు, వృద్ధులై యాగ్రామములో నివసించుచుండిన ముక్కామల లక్ష్మీనరసుగారి యొక్కయు సహాయమున జ్యోతిషశాస్త్రమునందు బ్రవేశమంది జ్ఞానాభివృద్ధి గావించుకొనుచుండిరి.
సంస్కృతము
ఇటుఁడ జ్ఞానార్జనమునందభిలాష గలవారగుటచే నాకాలమున గొప్ప సంస్థానములలో నొకటిగనున్న నూజి వీటి సంస్థానమునందు విద్యాస్థానమైన ఆకిరిపల్లె క్షేత్రమునకు ౧౮౬౫ (1865)సం॥ నందెవరికి జెప్పకుండ అర్ధరాత్రమునందు బయనమైపోయి యిచ్చట రమారమి ౧౦(10)మాసములుండి యచ్చటి పండితులయొద్ద సంస్కృత వ్యాకరణమభ్యసించిరి. అనంతరము నూజివీడు వల్లూరు సంస్థానములలో నష్టావధానము, వ్యస్తాక్షరీ కవిత్వములందు దమకౌశల్యమును బ్రదర్శించి మెప్పువడసిరి. ఇప్పటికి వీరికి ౨౦ (20)సం౹౹.లు. ఈ వయస్సులోనే "గొల్లపల్లి రఘునాథ శతకము”* ను “పంచనృసింహ క్షేత్రమాహాత్మ్యము”*ను ౨౨(22)వ యేట “సారసంగ్రహగణితము”*రచించిరి.
ఉపాధ్యాయత్వము
౧౮౭౨ సం॥ లో గుడివాడలోని ఆంగ్లేయ పాఠశాల కాంధ్రోపాధ్యాయుడుగ నేగెను. ఇక్కడ వీరాంగ్లేయపాఠములు స్వయంకృషి వలన నేర్చి యితరులకు జెప్పుచు వృద్దిపరచుకొనుచుండిరి. ఆంధ్ర గీర్వాణముల యందును గృషి సల్పిరి. మదరాసు వాస్తవ్యులుగ నుండి తెలుగువారిలో సుప్రసిద్ధులైన కీ.శే.రెంటాల వెంకట సుబ్బారావుగారు గుడివాడలో వీరిశిష్యులు. రమారమి ౨(2) సం॥లు మాత్రము గుడివాడలోనుండి, పిదప నా తాలూకాలోనిదే యగు కవతవరములో గ్రామస్ధులకోరిక పైన ఇంగ్లీషు, తెలుగు చెప్పెడి ప్రైమరీబడి స్థాపించి,తనయొద్ద చదువుకొనిన యొకని నక్కడ నుపాధ్యాయుడుగ నియమించి, ౧౮౭౪ (1874) సం॥ర మధ్యము వఱకు నక్కడనుండిరి. ౧౮౭౫ (1875)సం౹౹ లో డోకిపఱ్ఱు గ్రామస్తులచే నాహూతుఁడై యక్కడ నొక పాఠశాల స్థాపించి ఆంధ్రాంగ్లగీర్వాణములు బోధించుచు, కవిత్వము చెప్పుచు నా గ్రామస్తులచే జహుమాసములును' మెప్పును బడసిరి. ౧౮౭౫ (1875) సం॥లో 'తెలుగు జనరల్ టెస్ట్' పరీక్షయందును, మునసఫుకోటు ప్లీడరీపరీక్ష యందును గృతార్థులైరి. ఇదంతయు, వీరి స్వయంకృషి ఫలమే. మఱియు నీయేటనే "లక్ష్మణా విలాస”* మను గ్రంథమును లలితమైన శైలిలో రచించిరి.
బందరులో న్యాయవాది
౧౮౭౮ (1878) సం౹౹న వీరు రెండవతరగతి న్యాయవాది పట్టమును దీసుకొని మచిలీబందరు ప్రవేశించిరి. ౧౮౮౪ (1884) వరకు వీరక్కడనే ఉండిరి. ౧౮౮౦ సం౹౹లో ఇంగ్లీషు 'జనరల్ టెస్టులో గృతార్థులైరి. మరియు అనల్పతాకల్పవల్లి" అను సంఘ సంస్కరణ సంబంధమైన యొక పత్రికను స్థాపించి కొంతవఱుకు నడపిరి. ఈకాలమునందే వీరు "అభిన పద్య ప్రబంధ”1 మను శబ్దార్థాలంకార ప్రథానమైన యాభ్యాయికను గూడ రచించిరి. ౧౮౮౪ (1884) సం౹౹న దింగ్లీషులో మొదటి తరగతి న్యాయవాది పరీక్ష యందు గృతార్థులైరి. ఈ పరీక్షకు జదువుటలో వీరు దినమునకు ౧౯ (16) ఘంటలు కృషి చేసిరి. వృత్తి యందు మిక్కుటమగు పనిగల్గియుండియు దమ సహజ గ్రహణ ధారణ శక్తుల వలనను, దదేక దీక్ష వలనను, స్వయంకృషి వలనను, విజయము గాంచగల్గిరి.
ఏలూరులో న్యాయవాది
౧౮౮౪ సం౹౹లో ఏలూరులో సాపింపబడిన సబార్డినేట్ కోర్టులో వీరు ప్లీడరుగ బ్రవేశించిరి. నిడదవోలు ఎస్టేటు అని అప్పుడు పిలువబడుచుండిన శనివారపుపేట సంస్థానమున కధీశ్వరురాలైన శ్రీ పాపమ్మారావు రాణీగారు దత్తత గావించుకొనిన నూజివీటి వేంకటరామయ్య అప్పారావు గారు అప్పటిలో వీరికి మిత్రులైరి. మఱియు నాయన తన లౌక్యవ్యవహారములం దీయనను న్యాయవాదిగ నియమించుకొనుచు, వీరి పొండిత్యాదిగుణ విశేషములచే వీరియందు గౌరవభావముతో వర్తిల్లుచుండిరి. ఏలూరులో నుండగ వీరిఖ్యాతి యాంధ్ర దేశ మెల్లెడల వ్యాపించెను. సంగీతమునందభిరుచి గలుగుటచే గాయకుల బోషించుచు ప్రోత్సాహపరచుచుండెను. వీరియాజమాన్యము క్రింద గొంతకాలమొక సంగీత పాఠశాల యుండెడిది. ౧౮౮౬ (1886) సం౹౹న బసవరాజు రామబ్రహ్మముగారి ప్రోత్సాహమువలన నొక మాధ్యమిక పాఠశాల (హిందూపేట్రియాటిక్ స్కూల్) ను స్థాపించిరి. ఈ పాఠశాల ౧౮౯౦(1890)సం వఱకు జరిగెను.
విద్వత్య్రోత్సాహము
వీరు ప్లీడరుగానున్న కాలములో బ్రతి శ్రావణమాసములోను దసరా పండుగ దినములలోను విద్వత్పూజ జరిపెడివారు. పండితులు బరీక్షించి బహూకరించుటయందు వీరి సహన్యాయవాదియగు కీ.శే. జు౦ధ్యాల గౌరీనాధ శాస్త్రిగారు వీరికి సహాయముగ నుండిరి. వీరేలూరులో నున్నప్పుడు విద్యార్థులు (బంధువులు, తదితరులు) కొందఱు వీరిపోషణమందుండెడివారు. అభినయ శాస్త్రము
వల్లూరు సంస్థానాధీశ్వరులైన శ్రీ బొమ్మ దేవర వేంక టనరిసింహనాయుడు గారు వీరికి స్నేహితులు. వారిపక్ష మున వీరు న్యాయవాదిగ నుండిరి.౧౮౮౭ (1887) సం॥ప్రాం తమున నీ సంస్థానపు ముఖ్య దైవమగు వల్లూరు వేణుగోపా లస్వామినిగూర్చి కృతులు, పదములు, జావళీలు 1 రచిం చిరి. అభినయశాస్త్రమనిన వీరికి గడుబ్రీతి. స్వయముగ గొందఱకు బోధించుటయేగాక "అభినయకొముది”* యను గ్రంధము కూడ రచించిరి.
నాటక రచనము
౧౮౯౯(1899)సం౹౹లో ఇంటనే పండితులయొద్ద మురారి రచితములు మున్నగు నాటకములు తర్కాదిశాస్త్రములు నభ్యసించి ఆంధ్రమున బొత్తములు వ్రాయుచుండిరి. “తర్కకౌముది”* యను తెలుగు గ్రంథమును రచించిరి. నాటకాంధ్రీకరణము ఖేలనానుకూలముగ నుండుచుండె ను. ౧౮౯౦ సం౹౹న"జానకీ పరిణయ నాటకము* ను తెలిగించిరి. రంగస్థలమున కనుకూలముగ నుండునట్లు శ్రీ కాండూరి నరసింహాచార్యులు వారి సహాయముతో పాటలు కూర్చి చేర్చిరి. దీనితో బాటు “ మనోలక్ష్మీవిలా స"*మనునొక స్వతంత్య్ర నాటకమును గూడ రచించిరి.
సంఘసంస్కరణము
ఈ కాలమునందు ఏలూరులో గుంటూరు భానుమూర్తి యను పతిత సంసర్గీకా యూంవైదికులు ధనకాంక్ష చే బ్రాయశ్చిత్తము జరుప నిరాకరింప, శ్రీరాములుగారు చాటపఱ్రు వాస్తవ్యులయిన గుండు సుబ్రహ్మణ్య చయనులు గారి యాధ్వర్యము క్రింద నతనికి బ్రాయశ్చిత్తము గావింప జేసిరి. ఇందుపై నిరుకక్షల కనూయ పెరిగెను. ఈ సందర్భమున వీరు జరిపిన ధర్మశాస్త్ర చర్చ యద్భుతము. మూడు రాత్రులలో "పతిత సంసర్గీప్రాయశ్చిత్తకోపన్యాస ము”“ ఆచారనిరుక్తి” “దురాచార పిశాచి భంజని” యను మూడుగ్రంధములు వ్రాయగల్గిరి. ౧౮౯౨ (1892)సం౹౹లో "న్యాయకౌముది”*యను న్యాయశాస్త్రగ్రంథమును పద్యరూపముగ రచించిరి.
తెలుఁగునాడు
౧౮౯౨ సం॥లో " తెలుఁగునాడు" అను ఆంధ్ర వీధిని రచించిరి. ఇట్టి గ్రంథములాంధ్ర భాషలో మిక్కిలి యరుదు, శ్రీనాధుని వీధినాటకము జాతిలో జేరినదైన ప్పటికి, అందులోవలె నత్యంతముగ స్త్రీ వర్ణనమును, కవియొక్క స్వయంవ్యక్తిత్వమును ఇందు గానరావు. ఆంధ్రవీధిలో బ్రాహ్మణ ప్రశంస యను భాగము మాత్రమే రచించిరి. ఆంధ్రబ్రాహ్మణుల లక్షణములు ఇందు రమ్యముగ వర్ణింపబడినవి. జాతీయములతోనిఁడి శైలికడు హృదయంగమముగ నుండును. ఇవిగాక చక్కట్లదండ”1 యనునొక అచ్చ తెలుఁగు నీతి శతకమును రచించిరి.
వైశ్యధర్మములు
౧౮౯౪ (1894)సం౹౹ ప్రాంతమున నాంధ్ర దేశమున వైశ్య ధర్మవిషయమైన వివాదము ప్రబలెను. వేదోక్త కర్మల కర్హులమని వైశ్యులును, గారని కొందఱు బ్రాహ్మణు లును సభలు చర్చలు జరుపుచుండిరి. ఆ కాలమున డిస్ట్రి క్టు మునసబుగానున్న శ్రీ ఆత్మూరి లక్ష్మీ నరసింహ శ్రేష్టి గారు యజ్ఞము చేయుట తటస్థించెను. ఈవివాదములో శ్రీరాములు గారు వైశ్యులపక్ష మవలంబించి "వైశ్యధర్మ దీపిక ” † యను నొకగ్రంధమును “శ్రాద్ధ సంశయ విచ్ఛేది” యను చిన్నపొత్తమును రచించిరి.
౧౮౯౪ (1894) సం॥ నకు బూర్వమే అప్పుడప్పుడు “నమ స్కార విధిదీపిక” * చిలుకల కొలికి శతకము” * ముద్దుల గుమ్మశతకము” * రచించిరి. “సూర్యశతకము”ను భాషాంతరీకరించి:, సంస్కృతమున కామాక్షీ శతకము ” * వ్రాసి విగ్రహారాధనమును సమర్ధించుచు "విగ్రహా రాధన తారావళి” యసు పద్యమాలిక గూడ రచించిరి.
ఉపన్యాసములు
GJEY సం||న వీరు న్యాయవాదివృత్తి విసర్జించి రనియే చెప్పచ్చును. ఆదాని ప్రకృతమం దాపశ్యక మైన యాచారముస్కారవిషయమై జనసామాన్యమున కుపన్యాసములిచ్చును గొంత కాల మిల్లు విడచియే గడపిరి. గొప్పగళముతో అసమాన వాత్ప్రవాహముతో జనరంజ కమైన సూక్తులతో గృహాంతరములందే గాక బహిరంగ ప్రదేశములలోకూడ వీరుపన్యసించునప్పుడు వేలు జనము చేరెడివారు. సహజముఖ సంగీత సాహిత్య ప్రియుడగు టచే వకృత్వము మఱింత హెచ్చుగ నుండెను.
మద్రాసులో నాటకాంద్రీకరణము
౧౮౯౭-౯౮ (1897-98)సం౹౹లలో వీరు ఖండ్రిక సీతారామ వరము గ్రామము విషయములో శ్రీరాజా పాపమ్మా రావుబహడర్ గారితో వ్యాజ్యమాడుచుండు సందర్భమున మదరాసులో నుండిరి , అప్పు డీయనకు మిక్కిలి ప్రేమాస్పదురాలగు కుమార్తె వేమూరి శారదాంబకూడ తన భర్త అక్కడ చదువుచుండుటచే ఆపట్టణములో నుండెను. అక్కడనున్న కాలములో నాపురమందలి ఆంధ్ర విద్యార్థుల ప్రోత్సాహముచే కాళిదాస విరచిత యభిజ్ఞానశాకుంతలము” ను వీరు శుద్ధాంధ్రములోనికి భాషాంతరీకరించిరి.ఇందు రంగస్థలమున కనుకూలముగ దమకుమార్తె సాయమున గొంత సంగీత భాగము గూడ "జేర్పబడెను, “ముద్రాగాక్షసము"*ను గూడ అచ్చ తెనుగుననే వ్రాసిరి. మిశ్రాంధ్రములో “ఉత్తరరామ చరిత్ర”*" మహావీర చరిత్ర” “మాలతీమాధవీయము”§ “రత్నావళి" నాటకములును భాషాంతరీకరించిరి."కురంగగౌరీశంకర”* "మంజరీ మధుకరీయ”* నాటకముల స్వతంత్రముగ రచించిరి. ౧౮౯౯ (1899)సం౹౹ లో ఒక ధర్మశాస్త్ర చర్చావిషయములో వీరు నిజాంయిలాఖాకు బోయి వరంగలు మున్నగుప్రాంత ములలో నుపన్యాపము లిచ్చిరి.
దేవీభాగవతము
౧౮౯౯ (1899)సం౹౹ డిశంబరు నెలలో వీరత్యంత ప్రేముతో "బెంచి స్వయముగ విద్యగరపి, సంగీత సాహిత్యములందు నేర్పరిని గావించిన తన కడపటి సంతానమగు శారదాంబ శాశ్వతబ్రహ్మలోకమున కరిగెను. ఈవిచారనివారణోపాయములలో నొకటిగ ౧౯౦౧ (1891) సం౹౹ లో వీరు దేవీ భాగవత1 పురాణమును దెనిగింపదొడగిరి. ఈ కారణమును వీరు దేవీభాగవతిపీఠికయం దిట్లు వ్రాసిరి, “కారణాంతర వశంబున దైవ ప్రేరితుండనై శ్రీ దేవీభాగవతంబు తెలుగిం పంబూని -" ఈ దేవీభాగవతము మహాపురాణములలో నొక్కటి. ఈభారమైన కార్యము వీరయిదుమాసములలో ముగింపగల్గిరి. దేవీ భాగవత పీఠిక యందు కవిగారి వంశ చరిత్రము, స్వీయ చరిత్రమును దెలుపబడుటయే గాక వీరి కాంధ్రవ్యాకరణఛందోవిషయములందుగల యభిప్రాయములు గూడ గొఁతపఱకు వ్యక్తపరుపబడినవి. ఈగ్రంథ మచ్చుపడుటలో గొంత యాలస్యమయ్యెను ౧౯౦౬, ౧౯౦౭ (1906, 1907)సం॥లలో ముద్రణము ముగిసి ప్రచురింపబడెను. ఇది అల్లూరుసోమేశ్వరుని కంకితము గావింపబడెను. వీరు తమ గ్రంథము నచ్చొత్తించుచుండగా ములుగు పాపయ్య గారు ఆంధ్రీకరించిన దేవీ భాగవతమొండు కలదని వీరికి దెలియవచ్చెను. ఆధునికులగు తిరుపతి వేంకటేశ్వరకవులం రచియింప మొదలిడినట్లును దెలియును. దేవీభాగవత రచన కాలమందు గూడ వీరుత్తరాంధ్ర దేశమునందు సం చారము గావించుచు, నవమస్కంధమునందలి భక్తికల్ప ద్రుమశతకము పాలకొండలో రచించిరి.
౧౯౦౧ (1901)సం౹౹లో ఆషాఢమాసమధికమా, శ్రావణ మధికమా _యను చర్చగలిగి, యీ సంశయ విచ్ఛేదనము నిమి త్తము రాజమహేంద్రవరమున నొకపరిషత్తు సమా వేశమయ్యెసు. అందులకు అధిక మా సనిర్ణయము నియ మింపబడిన మువ్వురు తీర్మానకర్తలలో శ్రీరాములు గారొక్కరు. సభయందు వీరి తీర్మానమే (శ్రావణమధిక మని) ప్రబలి యామోదింపబడెను. స్కంధత్రయాత్మ కంబగు జ్యోతిషమునఁదు వీరికిగల ప్రావీణ్యమునకు వీరు వ్రాసిననిర్ణయము†సాక్షీ భూతమగుచున్నది.
గ్రంథప్రచురణము
౧౮౯౫ (1895)సం౹౹ లో వీరు న్యాయవాదివృత్తి మానినను ౧౯౦౨ (1902) సం౹౹ తన నాల్గవ కుమారుని వృత్తి యందు బ్రవేశ పెట్టి ప్రోత్సాహపరచుటకై తిరిగి ప్రవేశించి కొంతకాలము పనిచేసిరి. ఈ కాలములోనే ఖండ్రిక సీతారామవరములో నొక పాఠశాల స్థాపించిరి. ౧౯౦౨ సం౹౹ మొదలుకొని వీరు తమ గ్రంథముల ప్రాచుర్యము విషయమై కృషి చేసిరి. కొన్నిటిని స్వయముగను, గొన్నిటిని సాహి త్య విషయక మాసపత్రికలలోను, దమపుస్తకములనుబ్రచు రించిరి. ౧౯౦౫ సం౹౹లో ఖండ్రికి సీతారామవరములో
నదివఱ కెట్టి దేవాలయమును లేకుండుట జూచి చిన్న హనుమద్దేవాలయమును గట్టించి వపతి గల్పించిరి. బుద్ధనాటకము
బందరులో మండల బి.ఎల్ పట్టమును బొంది న్యాయస్థానమునందు మొదటి తరగతి న్యాయ వాదిగనున్నట్టియు, నాంధ్రగీర్వాణములందు ప్రజ్ఞావంతుడై నాటకాదుల రచించి, నాటక ప్రదర్శనా పరిజ్ఞానము నభివృద్ధి పరుప బద్ధకంకణుడైనట్టియు, వీరి రెండవకుమారుడు నారాయణరావు గారు ౧౯O౫సం॥లో కాలము చేసిరి. చనిపోవునప్పటి కాయన రెండంకములకు బైగా రచించియున్న " సంగీతర సతరంగిణి””యను బుద్ధ నాటకమును శ్రీరాములుగారు పూర్తిగావించిరి.
షష్ఠి పూర్తి
౧౯౦౫ సం||లో దమ స్వగ్రామమైన అల్లూరగ్రహారమునందు తమ పూర్వులవలన బ్రతిష్ఠింపబడిన శ్రీసోమేశ్వరస్వామికి విమానరూపకమైన యాలయము గట్టించుచు నాగ్రామమందే విస్తరించి యుండుచువచ్చిరి. ఆలయ ప్రాకారములే గాక చిన్న సత్రమును గూడ గట్టించిరి. ౧౯౦౬ సం౹౹ వీరికరువదియేండ్లు నిండుటచే బాల్య క్రీడాస్థానమగు అల్లూరులో షష్ఠిహాయనపూర్తిని సక్రమ ముగ జరుపుకొనిరి. ౧౯౦౬ సం౹౹ సెప్టెంబరు నెలలో వీరు కొందఱు స్నేహితులవలన నాహూతులై యుత్తరాంధ్ర దేశములో నుపన్యాసము లిచ్చుచు సంచారము గావించిరి. ఇందువలన వీరి కజీర్ణ సంబంధ మైనట్టియు, శ్వాసకోశ సంబంధ మైనట్టియు, రుగ్మత యేర్పడుట చేతి నేలూరువచ్చి యక్కడనుండి తమ జ్యేష్ఠకుమారుడున్న బెజవాడకు వచ్చి యౌషధ సేవ చేసిరి. కాని ప్రయోజనము కలుగ లేదు. ఈ సందర్భమున "భృంగి రాజు మహిమ” +మను నొక వైద్యగ్రంథమును రచించిరి.
అవసానము
౧౯ం౭ సం॥లో బెజవాడలో బిపించంద్రపాలుగారి మహోపన్యాసము జరిగిన సభకు వీరధ్యక్షత వహించిరి. ఈ కాలమునందు వితంతూద్వాహములలో భోజన సంబంధముగల పి.సుబ్రహ్మణ్యము విన్నకోట కోదండరామయ్యగారియింట జరిగిన యుపనయన సందర్భమున భోజనము చేయుట తటస్తించేను. ఇందుపై సాంఘిక వివాదములు ప్రబలెను, 'శ్రీరాములు గారు సంఘసంస్కరణ ప్రియుల పక్షముబూని బెజవాడలో శివాలయము మున్నగుచోట్ల ధర్మశాస్త్ర విచారణ సహితముగ ప్రసంగములంచేసి ప్రతికక్షుల వాగ్బంధనము గావించిరి. ౧౯౦౩ సం మే నెల మొదలు వీరి దేహస్థితి క్షీణింప నారంభించెను. ౧౯౦౮ సం॥లో వీరి మూడవ కుమారుని వివాహము జరిగెను. వివాహము జరిగిన పదునారవనాడే బంధువులందరు నింటనుండ, వీరు 63వ యేట కీలక సం౹౹ వైశాఖ శు౹ ౧౫ నాఁడు భగవత్సాన్నిధ్యము జేరిరి.
(౨)
వీరాంధ్ర దేశమున బలు తెరంగుల బ్రసిద్దికెక్కిరి. వీరి కొకశాస్త్రమునం దభిమానమనియు, వేరొకశాస్త్రమునం దభిమానము తక్కువనియు జెప్పవలనుపడదు.జ్ఞానాభిలాష మెండు. ఎందుజొచ్చినను పారంగతుడుకానిదే తనివితీరదు. ఆంధ్రగీర్వాణములందు బండితుడు, కవి. సంగీతాభినయశాస్త్రవేత్త, తర్క, జ్యోతిషములందు బ్రమాణము. లౌక్యమున న్యాయవాది. సంఘ సంస్కరణ ప్రియుడు. వీరు స్వయము బాలికా పాఠశాలల స్థాపించుటయు, తన కుమార్తెను సంగీత సాహిత్యములందు నేర్పరచిగావించుటయు వీరికిగల స్త్రీ విద్యాభిమానమును వెల్లడిచేయుచున్నవి.
వీరికవిత్వము కేవల మీశ్వరప్రసాదమని తమ దేవీ భాగవతమునం దిట్లు వ్రాసిరి; - "శ్రీ వేంకటేశ్వర వరప్రసాద సంభూతక విశ్వవిద్యావిశేష విబుధ జనకరుణానం పాదితోభయభాషా పాండితీధురీణ.” మఱియు,
"చ. పదియును రెండు వర్షముల
పాయమునందును దెల్గుపద్యముల్
వదలక కొన్ని కొన్ని చెలు
పంబుగ గూర్చితి సోమలింగ ప
త్పదమును నిల్పి యట్టి కవి
తారసధన్యుని నన్ను జేయనా
సదమలచిత్త పంజరని
శాంతుఁడు నిత్యడు సోమలింగడే!
చ. తిరుపతి వేంకటేశ్వరుడు
దేవశఖారుణి నాకునంగళా
గురుడగునంచు స్వప్న మున
గోరివచించిన యట్టి శైవభూ
సురవరుఁ జెప్పకా నిఖిల
సూరిజనస్తవనీయుడై కృపా
కరువగు సోమలింగడని
కాక మఱొండు దలంప నేర్తునే॥
చ. గురునొకనిం భజింప మదిఁ
గోరి తదేక పరత్వమూనిని
ద్దరగొని స్వప్నమందు నిశ
దూర్ణధియా నివటూరి పట్టిసే
శ్వరుడను శైవు డెవ్వనిని
సమ్మతి మద్గురుజే నాతని౯
దిరుమల వేఁకటేశ్వరుని
వేపశిఖామణి గొల్తునిత్యము౯
వీరి కాంధ్ర ఛందస్సునందు చజలమైత్రి, రఱ, లశ, లభేదములు మున్నగు విషయములపై గల యభిప్రాయములు దేవీ భాగవతోపోద్ఘాతము నందు వ్రాయబడెను.
దేవీ భాగవత శైలి నాతి కఠినము; ధార అనర్గళము. శైలి నిమిత్తమీ క్రిందిపద్యములుదాహరణముగ నియ్య బడినవి:
ఉ౹౹ తూరుపునుండి లేచి యల
తోయజమిత్రుని దెచ్చి తెచ్చి య
ద్దారి రథంబు బోవుటకు
దద్దయునడ్డముగా శిలామయం
బూరురునాడు దోప నటు
లున్న ననూరుఁడు సూచి చెల్లబో
సూర! యిదేమి చిత్ర మదె
చూడుము దారిని బోవవే మికి౯
కఠిన తెలి కుదాహరణములు:-
శా౹౹ విభ్రాజద్ధరిభక్తి యుక్తసుగుణా
విర్భూతి మద్బాలకా
ద్రభ్రో క్తిక్రమ సత్యతాప్రకటనా
ధ౯ ప్రీతి తస్సంగృహీ
తాభ్రచ్చేది సటానిలోగ్ర నఖదా
త్రాది క్రియాజృంభణ
ప్రభ్రష్ట ప్రలుగద్దిరణ్యకశిపు
ప్రాణా నృసింహాకృతీ,
- దేవీ భా.౧౦ స్కం.
వ౹౹ అనుచు నిజపక్ష వాతోద్ధూత బలాహక వ్రాతుండై యురువడించి మండిత మండలాగ్ర సఖంబులైన తనపాదనఖంబుల నారక్కనుమోర గీరిన ర క్తసిక్త వద నుండై వెనుకంజ వేయక భీకరంబుగా బోకరింపుచు మునిరాజు నొకతెన్నుఁదన్న వచ్చిన నడుమనడ్డమై రత్న ఫణుండు దాననిజసర్వరూపంబు దాల్చి ప్రళయకా భీలకీలికోలామాలామూలం బైనకాకోలంబుగ్రక్కుచు యోజనాయత ఫణాసందీప్త మాణిక్యచ్ఛటా ఛ్ఛిటలు దిక్తటంబులు నటింప ఫూత్కార మేదురం బైరోదోత రంబు భేదిల్ల నాగండా గొండి కండరిఁడి దండ చేయి కండఁగాఁడఁ గఱచిన కాటుతోన నేలం గూలివాయిఁ దెఱచి యడుగఱచి గంతుగొట్టినం గాంచి యాద్విజిహ్వ చూడామణి...
అభినవగద్య ప్రబంధము.
అచ్చతెలుఁగు వీరికి వశమైనది. శుద్ధాంధ్రనాటకము వీరి శాకుంతలము తప్ప వేఱఁడు గానరాదు. శైలి నిమిత్తము ఉదా:-
ఉ! గుండెలు జలరించెడి శ
కుఁతలయేగెడి గ్రుక్కమ్రింగి గొం
తేఁడిన మాటబొంగులగు
నేడువ నేడువఁ జూపుమాన్పడేన్
దండిగ గానకాపునయి
దగ్గఱదీసిన నాదుపాట్లెయి
ట్లుండగ గన్న గేస్తులకే
టో తొలుసారిగ బిడ్డనంపబోన్.
చక్కట్లడండ "తత్సమపదరహితముగ సులభ శైలిలో వ్రాయబడినది. సందర్భానుసారముగ డకీనీ భాషలో నుండి తెలుఁగులో వాడుకగానుండు పదములను, ఆంగ్ల పదములును బ్రయోగింపబడినవి. వక్రగతులు సాధ్యమైనంతవఱకు లేకుండునట్లు వ్రాయబడినది. లోకానుభవమువలన దెలియుచున్న వస్తువులు, వానిగుణములు క్రియలు మాత్రమే దృష్టాంతములుగ గైకొనబడినవి. " ఉదా:-
అచ్చి ఱచ్చిలకెక్కు నని బుచ్చిఁ బెండ్లాడ
బుచ్చి మిండలవెంటఁ బోవమఱుగు
తోటాకు పసరంచు దోసకాయలు దిన్న
దోసకాయది జల్బు చేసి విడుచు
కోడూరు బురదని మేడూరు బోయిన
మేడూరిలో జాస్తి మెట్టశిస్తు
జక్కి దాణాడి స్వారెక్కఁ బూనిన
బోయిబత్తెములకే పోవుగడన
గీ౹౹ కొంచెమిబ్బంది కలదని క్రొత్త బూని
ప్రాతవిడిచిన నది దానితాత యగును
అని పలుకు దాసు రాముఁ డిట్లచ్చతెరుగు
కబ్బమందమునిండ జక్కట్లదండ.
సొమ్ము. వీరికిగల లోకజ్ఞానమునకు తెణఁగునాడు సాక్షి. “ఇందాయాబ్రాహ్మణశాఖల వర్తనములు, ఆచార వ్యవహారములు, వేషభాషలు, కవిత్వపు పస చెడకుండ సాధ్యమైనంత నిస్పక్షపాతబుద్ధితో శక్తికొలఁది వర్ణించితి”నని గ్రంథకర్త పీఠిక యందు వ్రాసెను. సంఘ విషయముల గూర్చి యబాధకములగు చమత్కార కావ్యములు మన దేశ భాషలలో లేకుండుటం జేసి యాకొరత దీర్ప వీరుద్యమించిరి. ఈ గ్రంథమునుండి యుదాహరణములు: —
ఉ౹౹ త్రుళ్లక నీరు కావిమడి దోవతి కమ్ములు వెళ్ళబిళ్ళ కు
చ్చెళ్లిడికట్టి నీళ్లబుడివెంబొక చేతనుబట్టి దారిలో
జిళ్లలకొత్తుకొంచు నొక చేఁదడికొళ్లయిబెట్టి పెండ్లిప౦
దిళ్లకు భోజనాన కరుదెంచును వైదిక శేఖరుఁడిలన్
చ॥ నడవడుల న్నియోగిసరి
నామమునందును లౌక్యమాధ్వునై
వడి, మడిమట్రలందుఁ దుల
వెదికుతోనిక వైష్ణవంబు జో
ప్పుడు సముదాత్తభాగవత భక్తిని
యుక్తి, గోరంత లేదు నల్
గడలఁ బొసంగెడిన్ గణకమ్మకు
గుమ్మకు లిమ్మతమ్మలన్.
క్రింది తరగతుల వారి వర్తనములు, వేషభాషలు, స్వభావములు, బుధ్ధ నాటకమునందు జిత్రింపబడియున్నవి.
--దాసు దామోదరరావు.
