Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 5/విద్యా నాగరికతాభివృద్ధినీ గ్రంథాలయము

వికీసోర్స్ నుండి

విద్యా నాగరికతాభివృద్ధినీ గ్రంథాలయము

కొత్తకోట, విశాఖపట్టణ మండలము

ఈ గ్రంధాలయము ప్రత్యేక గృహమున ప్రతిష్టింపబడియున్నది. మందిరము దేశనా యకుల పటములతో మిగుల మనోహరముగ శృంగారింప బడియున్నది. ఈ సత్కార్య నిర్వ హణమునకు ౩౪ గురు గల సంఘము గలదు. పద్ధతులున్నవి. క్రమముగ ననుసరింపబడుచున్న వి. ఇప్పటికి పుస్తకముల సంఖ్య ౨౦౧. వచ్చు పత్రికలు ౧ ఆంధ్ర ధైనిక పత్రిక, ౨కృష్ణాప త్రిక 3 భారతమాత ౪నవ్వులమూట నియోగి. ఈసం౹౹ర చైత్రశు౧నాడు గ్రంధాల యము స్ధా'పింపబడినను ఇప్పటికి ముప్పది సం ఘ సమావేశములు జరిగినవి. నీతి మతాధిక విషయములుపన్యసింపబడినవి. కొన్ని ఔషధ ములు తెప్పించి జనుల బాధలు పోగొట్టుచు న్నారు. ఇచటి గొప్ప సంతలో ప్రతివారము చలివేంద్ర పెట్టి దాహములిచ్చుచున్నాడు. గ్రంథాలయ సంఘ సభ్యులు యావన్మంది అ త్యంతోత్సాహముతో యీగ్రామమందును చుట్టు పట్టుల గ్రామములందును, విద్య, నాగరికత బాగుగ వృద్ధిపరచి జ్ఞానమును పెంపొందించుచున్నారు.

ఇట్లు విన్నవించు విధేయుడు
ముద్దా సోమప్ప శాస్త్రి.