గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 2/గ్రంథాలయములు-అవి చేయవలసిన పనులు
స్వరములనుబ్రస్తగించెడు పాటకులకు అమృత సదృశంబయిన గీతియబ్బదేము! మొగము నవనీతమృదులమై యెగయు చెలికి మనసునవనీతమయి యుండదనుటెనిజము!
వనలతలకును నుద్యాన వనలతలకు భేదమరసినకవి యెంత వేత్త యగునో! గాత్రమెత్తి యా బైరాగి కన్నె యట్లు పాడుచుండెను, వాకిండ్ల వాడ లెల్ల చిత్త గువులలో రాణించు చెలువుదోఁ చె ఎచటివారచ్చటనె చలియింపకుంట. వీధి వీధులఁ బొరలె నాబిడ విలాస రాగలాలిత గానతరంగ భరము తెలి తమలపాకు తీవ పాదులకుఁ బాఱు ధవళజలకుల్య భాతినార్ద్రంపుగతుల. ఆమె పాడిన పాటల నాలకించి అందుముకుళించియున్న భావార్థమెంచి ఒక విధం బైన యున్మాద చకితదశల కగ్గమైతిమే మిరువుర మద్భుతముగ .
గ్రంథాలయములు-అవి చేయవలసిన పనులు.
భీమవరము తాలూకా కుముదవల్లి యందలి శ్రీ వీరేశలింగ కవిసమాజము యొక్క పదునెనిమిదవ వార్షికోత్సవ సమయమున అగ్రాసనాధిపత్యము వహించిన అయ్యంకి వేంకటరమణయ్య గారిచే నియ్యఁబడిన యుపన్యాసము.
ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమునందు మీ భీమవరము తాలూకా ప్రథమమునఁ బేర్కొనవలసియున్నదని తెలుపుట కేంతయు సంతసిల్లుచున్నాఁడను. దేశమునందు గ్రంథపఠ నాభిలాషగాని, వార్తాపత్రికాగ్రహణాసక్తి గానివి శేషముగకలుగనప్పుడే, రాజకీయాందో ళనావశ్యకతను పట్టణములయందు సహితము జనులు బాగుగ గ్రహించియుండనప్పుడే, మీ తాలూకాయందు “ఉండి" గ్రామమునను మీ గ్రామముననుగూడ సమాజముల నేర్పఱుచుకొని స్వాభివృద్ధిని గలుగఁ జేసికొనవలయుననెడి వాంచ జనించుట మిక్కిలి ప్రశంసనీయము. భరతఖండ పితామహులగు దాదాభాయి నౌరోజీగారి యొక్కయు, ఆంధ్రదేశ పితామహులగు రావు బహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారి యొక్కయు పవిత్ర నామములతో మీరెండు సమాజములను ప్రారంభించుట మిక్కిలి యానందమును గొల్పుచున్నది. తన నిరుపమాన దేశాభిమానముచేతను, స్వార్థ త్యాగము చేతను, దీక్ష చేతను భరతఖండమునం కార్యనిర్వహణ దంతటను పూజ్యభావముతో వెలుంగుచున్న శ్రీ దాదాభాయి నౌరోజీగారియొక్క గొప్పతనమును గ్రహించి నేఁటి కిరువది సంవత్సరములకు ఁ బూర్వమే బూతాలూకాయందున్న ఉండి గ్రామమున వారినామముతో “నౌరోజీ క్లబ్బు" నేర్పఱుచుటయు, నవీనాంధ్ర వాఙ్మయమున కంతకును మార్గదర్శియు సంఘము నందు ప్రబలియున్న దురాచారములను నిర్మూలింప తన యావజ్జీవితమును ధారవోయఁ గంకణము గట్టుకొనిన మహనీయుఁడును నిరుపమాన స్వార్థత్యాగియు నగు శ్రీ వీరేశలింగము పంతులుగారి యెడల మీకుఁగల కృతజ్ఞతను జూపుటకై నేఁటికి పదు నెనిమిది సంవత్సరములకుఁ బూర్వమే మీరు శ్రీ వీరేశలింగ కవి సమాజము నేర్పఱుచుటయు మి క్కిలి గొప్పసంగతులని నాయభిప్రాయము.
ప్రాచీన కాలమున మన భరతఖండమునఁ గల గ్రంథాలయములను గూర్చి కాని, నవీన కాలమున పాశ్చాత్యదేశములయందు గ్రంథా లయోద్యమమును గూర్చి జరుగుతున్న ప్ర యత్నములను గుఱించి గాని నేనిచటఁ జెప్పఁ బూనుకొనలేదు. నవీన కాలమున గ్రంథాల యముల యవశ్యకతయు, అవి ఆంధ్రదేశము నందు జనులయొక్క స్థితిగతుల నభివృద్ధి చే యుటకుఁగాను ఎయేముఖములు పనిచేయవ లసియున్నదియు కొంచెము చెప్పెదను.
ప్రపంచమునందలి దేశములన్నింటికంటే ను మనదేశమునం దెక్కువగ అజ్ఞానదేవత తాండవమాడుచున్నది. మూరతా పిశాచ మునకు మన దేశమన్న మిక్కిలి ప్రియము. సౌఖ్యముగ తిని దేహయాత్రనుఁ గడపుటయే జీవితో దేశమను తలంపులు ప్రబలుచున్నవి. కాని, జీవితధర్మమేమి? అను నాలోచన తోఁ చుట లేదు.
దీనికి కారణమేమి? మన దేశ మునందు వి ద్యాధికుల సంఖ్య స్వల్పము. విద్యనార్జించు టకు కొందఱు మాత్రమర్హులు. ఈ స్వల్పసం ఖ్యాకులైనను విశేషభాగము జ్ఞాన సమన్వి తులు కారు. అట్టి స్వల్ప సంఖ్యాకులు జనసా మాన్యముయొక్క గతులను నడుపవలసినవా రుగానున్నా గు,జనసామాన్యమునకు సంబంధిం చిన సకల విషయములను అట్టి కొందఱు మాత్రము నిర్ణయింపవలసినవారుగా నున్నా రు. వీరి భావనా ప్రపంచమునకును నిజమ గు స్థితిగతులకును సంబంధమేలేదు. దేశము లోనున్న జను లందరును తమనలెనే సౌ ఖ్యవంతులై ఆనందము ననుభవించు చు న్నారని వీరిభావన. నిజమగు స్థితిగతుల ను కనుఁగొనుటకుఁ గాని, ఒక వేళ 'కనుఁగొ న్నను వానికి తగిన ప్రతిక్రియ చేయుటకుఁగా ని వీరికి సామర్థ్యము లేదు. ఇట్టిస్థితి దుర్భరము. కావున మనమిప్పుడాలోచింపవలసిన సంగతి ఏమనఁగా విద్యాధికులును జ్ఞానవంతులును కొందఱు మాత్రమే ఉండఁదగినదా ? లేక అందఱును విద్యాధికులును జ్ఞానవంతులును నై యుండవచ్చునా?
లైనను. పురుషులైనను. జనసామా న్యమంతయును గూడ విద్యావంతులును-జ్ఞా నవంతులునునై యుండవలెను. భావికాలము న నుదయింపఁబోవు మహాపురుషులందఱియొ క్క బీజములును ఈ కాలమునందలి జనసా మాన్యము నందంతర్గర్భితములై యున్నవి. అనువగు దోహదమునిచ్చితిమా ఆబీజములు మొలక లె త్తి క్రమముగ తరువులై మహావృ క్షములై పరోపకార పరతంత్రములగును. మున్నెక కాలమున నాగరికాగ్ర గణ్యమై తన విజ్ఞాన తేజస్సుచే ప్రపంచమునంతను ప్రజ్వరి ల్లఁజేసి పవిత్రమైన యీ దేశముమీఁద విద్యా ధిదేవతకు నేఁడు దయతప్పినది; ఆ దేవత యొక్క దయ సంపూణముగ నబ్బినఁగాని మనకు పురోభివృద్ధి లేదు; ఆమె దయను సంపాదించు టకు మనమిప్పుడు ఘోరమైన తపస్సు చే యవలసియున్నది.
ఈతపస్సును చేయుటకు మనము వనాం తరములకుఁగాని నిర్జన ప్రదేశములకుఁ గాని, కొండగుహలకుఁగాని వెళ్ళనక్కఱలేదు; మన ము నివాసముచేయు గ్రామములయందే ఆల యని ర్మాణము చేసికొనిన చాలును. “ఇదివఱ కే ప్రతిగ్రామమునందును దేవాలయములు గలవే, వానినిపోషించుటయే కష్టతరముగా నున్నది. తిరిగి ఆలయనిర్మాణము చేయుట ఎందుల”కని మీరు ప్రశ్నింపవచ్చును. కాని మనమిప్పుడు చేయవలసినది దేవాలయనిర్మా ణముకాదు. గ్రంథాలయనిర్మాణము. దేవాల యనిర్మాణమువలన ఆముష్మికములను మా త్రము సాధింపవచ్చును. నేఁడు ప్రపంచము నందు ఉన్న తిస్థితిని బొందవలెనన్న ఆముష్మి కముగ ఔన్నత్యమును సంపాదించిన చాల దు. ఒక మనుజుని యాత్మ జ్ఞానప్రపూతమై యుండవచ్చును; కాని ఆతని దేహము కూడ ఆరోగ్యవంత మైయుండవలయును. ఈ రెండు నుగూడ సమానస్థితిలోనున్నఁగాని మనుజుఁ డభివృద్ధి మెందుట అసంభవము. ఇదేవిధము గ ఒకజాతి ఆముష్మిక ముగ ఔన్నత్యమును జెందియున్నను, ఐహికముగగూడ ఉన్న తల్లి తస్థితి లోనున్నఁగాని అది సమగ్రమగు అభివృద్ధిమెం దుటకు వీలు లేదు. కావున మనమిప్పుడు నిర్మిం పఁబోవు ఆలయములు ఐహీ కాముష్మికముల కు రెండింటికి నిగూడ సహకారులగునవిగ ఉం డవలెను; ఇట్లు ఇహపరములకు రెండింటికిని సహ కారులగు ఆలయములకే గ్రంథాలయ ములని పేరు ; ఈ ఆలయములకు జనులు అందఱునుగూడ వెళ్ళలేకపోవచ్చును. అంత మాత్రముచేత అట్లుపో లేని జనులకు గ్రంథా లయములవలనఁ గలుగవలసిన పుణ్యము లభిం పక పోవలసినదేనా? ఎంతమాత్రమును కాదు. ఆ యాలయమునకు వెళ్ళఁ గలిగిన వారందఱు ను తాము సంపాదించిన పుణ్యమునందు కొం తభాగమును వెళ్ళలేనివారికి నిత్యమును థా రవోయుచుండుట ధర్మమైయున్నది. దేవా లయములకుఁబోవుటవలనఁ గలుగు పుణ్యము ధారవోయుటవలన అదితఱిగిపోవచ్చునేమో కాని, ఈ గ్రంథాలయములకుఁ బోవుట వల నఁ గలుగు పుణ్యము ఇతరులకు ధార పూసిన కొలఁదిని తఱుగుటకు మారుగ సెరఁగుచునే యుండును. ఇదే దీనియందలి ఆధిక్యము. మనము గ్రంథాలయమునకుఁ బోయి జ్ఞాన సముపార్జనము చేయవచ్చును. కాని, లయమునకు రాఁజాల ని వారును, వచ్చి దాని యుపయోగమును బొందఁజాలనివారును మ న దేశమునందెండఱోకలరు. అట్టివారిని వంతులుగఁ జేయుటఎట్లు? ఒక వైపున జ్ఞాన దాయకములగు గ్రంథాలయములు వెలయు చున్నవి ; మఱి యొక వైపున అజ్ఞానతిమిర బా ధితులగు మూఢజనులున్నారు. మధ్యనున్నారము, మనమో కాన, మనము వానికిని వీరికిని పరస్పర సంబంధము కలిగింపవలెను. ఈ మహ త్తరమైన కార్యమును నెఱవేర్చుట ఎట్లు ? అనఁగా పుస్తకములకును సామాన్య జనులకును పరస్పర సంబంధము కలుగఁజేయవలయును గదా ! అట్టి స్థితికలుగుటకు అవియునువారు ను పరస్పరము తగియుండవలెను. పుస్తకములకు జనులు తగియుండవలెను. జ నులకు పుస్తకములు తగియుండవలెను. పర స్పరముగా తగియుండక పోయిన యెడల మన ముచేయుపని అంతయును వ్యర్థమే ; బూడిద లోపోసిన పన్ని రే. సామాన్యజనులు పుస్త - కములకు తగియుండరనుట వ్యర్థప్రసంగము; ఏలయన వారికి తగిన పుస్తకములనే మనము సమకూర్పవలెను. ఒక వేళ తగిన పుస్తకము లు లభ్యముకాని యెడల వారికి తగినటుల బోధించుటయైన మనకు చేతఁగాని పనికాదు. సామాన్యజనులకు తగిన గ్రంథములను సమ కూర్చుటలోగాని, వారికి జ్ఞానమును గలుగఁ జే యుటలోఁగాని ప్రథమప్రయత్న ములయందు మన మపజయము పొందవచ్చును. అంత మాత్రముచేత మనము ప్రయత్న పరాఙ్ముఖు లము కానక్కజు లేదు. ఒక మార్గము సరిపడ నియెడల మఱియొక మార్గమున పోవలసి యుండును; ఒక సారి కార్య కారిగానియెడల మ ఱియొకసారి తిరిగి ప్రయత్నింపవలసియుండు "ను; అంతే. ఇటుల మనవిధ్యుక్తధర్మమును వి డువక తోడివారిని వారి పిల్లలను అజ్ఞాన తి మిరగుహనుండి వెడలించి ఔన్నత్యశిఖరము నధిష్ఠించునటుల చేయ టకు సదా పాటుపడు చుండవలయును. ఎవరికి మనము సాహాయ్య ము చేయవలసియున్న దో వారినిగూర్చి ప్రథ మమున చక్కఁగా విచారింపవలెను; భేషజ వేషముల నన్నిటిని విడిచి, వారు మనల తమ తోడివారుగా భావించుకొనునటుల వారిదగ్గ ఱకుపోయి, వా రేమికోరుదురో అడిగి తెలిసి కొన వారికొఱఁతలను తీర్పవలెను. కొన్ని సమయములయందు వారి అఁతలు మన భావనలకు భిన్నములై యుండును. యినను, మొదట వారేమి కోరుదురో తెలిసి కొనవలె ; పిమ్మట వారి వాంఛలు నెఱవేర్ప వలె. ఈ కార్యము వేసవికాలపు సెలవులలోఁ గాని శీతకాలపు సెలవులలోఁ గాని చేయఁదగి నది కాదు. ఇది జీవితమునంతయు ధారవోసి చేయవలసిన మహత్కార్యము.
కొందఱు వివిధ దేశముల యొక్క వార్తల ను మాత్రము వినఁగోరెదరు. వారికట్టివార్త లనుమాత్రమే చదివి వినిపింపవలెను. క్రమ ముగ వారు ఇతరవిషయములను గూర్చి కూ డఁ దెలిసికొన నిచ్చగించెదరు. కొందఱు పు సకములను వినఁగోరెదరు. వారికి పుస్తక ములనే చదివి వినిపింపవలెను. ఆపుస్తకము లు వారికి తగియుండునని మీరుమాత్రము తలంచునవియై యుండఁగూడదు. వారుకో రునవియు వారి రుచులకనుగుణ్యముగ నుండు నవియునై యుండవలెను.
ఇంతవఱకును, విశేష ముగ, చదువు కొనఁజాలని జనుల నెటుల నాకర్షించి జ్ఞాన వంతులనుగఁ జేయవలయునో చెప్పితిని. ఇక ముందు చదువుకొనిన జనుల నెటుల నాకర్షిం పవలెనో తెలిసికొనఁ బ్రయత్నింతము. గ్రం థాలయమునందు కొన్ని బీరు వాలనిండ వు స్త కములనుంచుటమాత్రము చాలదు. ఆబీరు వాలెప్పటికప్పుడు ఖాళీగా నుండవలెను. అనఁ గా వానియందలి గ్రంథములను ఎల్లప్పుడును జనులు చదువుచుండవలెను. చదువుకొనున లవాటును కలుగఁచేయుట మనవిధి. ఈయల వాటు ఒక దినమునఁగాని ఒక సంవత్సరమునఁ గాని కలుగఁ జేయఁజాలము. కావున, ప్రథమ దశలయందు జనులు గ్రంథముల నెక్కువగ నుపయోగింపనియెడల గ్రంథాలయస్థాపకు లు దిగులు పడవలసిన అవసరము లేదు.
(౧) గ్రంథములు. (అ) గ్రంథ భాండా గారికుడు. (3) భవనము. అనుమూడును గ్రం థాలయమునకు ప్రాణాధారములు. ఎవరై నను ఏవిషయమునైనఁ దెలిసికొనవలెనని కా నీ, ఫలానాగ్రంథము కావలెనని కాని, గ్రం థాలయమునకుఁ జనుదెంచినచో భాండాగారి కుఁడు తనకావిషయము తెలియదనియు తన దిచిన్న భాండాగారమనియు చెప్పకాదు విషయమునుగూర్చి తనకు డెలియకున్నను ఆపుస్తకము తనభాండాగారమునందు లేకున్న ను తనగ్రామమునకు దగ్గనున్న పట్టణము లోని భాండాగారములకుఁ గాని పెద్దలయొద్ద కుఁగాని వెళ్ళి ఆవిషయమును దెలిసికొనవలె ను ; ఆ గ్రంథమును సంపాదింపవలెను. ఎక్క డను దొరకనియెడల ఏభాండాగారమైన కొ నునటుల చేయవలెను. పల్లెయందుఁగాని ప ట్టణమునందుఁగాని నివసించియుండు ప్రతిపురు షుఁడును స్త్రీయును ఏయేగ్రంథములను జదు వనిచ్చగలిగియుండిన ఆయా గ్రంథములు నెల్ల సంపాదించి వారికందఁ జేయవలెను. చందా దారుఁడై నను కాకపోయినను ఈ సౌకర్యము ను గలిగించుట మంచిది. గ్రంథ భాండాగారి కుఁడు పుస్తకముల కాపరి మాత్రమైయుండఁ బోక, చదువరులకుఁ గావలసిన పుస్తకముల ను పుస్తకములకుఁగావలసిన చదువరులను సమకూర్చువాఁడుగా ఉండవలెను. గ్రంథాలయమును జ్ఞానమునకును, సన్మార్గత కును దోహద ప్రదేశముగ నుండునటుల చేయ వలెను. అటులగానియెడల, ఉపాధ్యాయుఁ డు లేని పాఠశాలవలె అది నిరర్థకమగును. అతఁడు గ్రంథాలయమునకు స్వంతముగా భవన ముండుట మిక్కిలి యావశ్యకము; గ్రామము నందొక పాఠశాలయందుఁగాని, దేవాలయ మునందుఁగాని, సత్రమునందుఁగాని, పెట్టుట కంటె, ప్రత్యేక భవనమునందుంచుట మిక్కి లి కర్షకముగ నుండును. ఈయావశ్య మును గ్రహించి విరిదినఱకే భవననిర్మాణ మును జేసియుండు టెంతయు ప్రశంసనీయము. గ్రంథాలయములయందుత ఱుచుగశాల 66. గ్రంథములకంటే నవలలు మొదలగు విశేష బుద్ధి నుపయోగింప నగత్యము లేని సులభం గ్రంథములనే విరివిగచమనుట సహజమైయు న్నది. అందుచేత ఆయా గ్రంథములయందలి విషయములనుగూర్చియు వాని యుపయోగ మునుగూర్చియు గ్రంధభాండాగారికులు తఱు చుగ నుపన్యాసములనిచ్చుచు బోధింపుచు ఆ గ్రంథములయెడల అభిరుచిని కలిగింపవలెను. శాస్త్రగ్రంథములు మొదలగు కఠిన గ్రంథము లను అందఱును చదువునటుల చేయుట కింతకం టె మంచి పద్దతి లేదు. ఇందుకుదృష్టాంతము:- “విజ్ఞానచంద్రి కామండలి” వారిచే నిటీవలఁ బ్రక టింపఁబడిన “వ్యవసాయశాస్త్రము”, “ఆర్థిక శాస్త్రము”, “రాయచూరు యుద్ధము”, యనగరసామ్రాజ్యము” ఎంతమంది చదివియు న్నారో ఏగ్రంథాలయము యొక్క గాని పు స్థ కముల నిండ్ల కుఁదీసికొనిపోవుపట్టీని దీసి చూ డుఁడు. ( రాయచూరుయుద్ధము', విజయనగ రసామ్రాజ్యము' అనుగ్రంథములను నూఱు మందిజదివియున్న ఒక్క రైన 'ఆర్థికశాస్త్రము' చదివియుండరు ; వ్యవసాయ శాస్త్రము'ను ఒకరిద్దఱు చదివియుండిన చదివియుండవచ్చును. ఇట్టిస్థితియందు గ్రంథ భాండాగారి చేయఁదగిన దేమి? 'వ్యవసాయశాస్త్రమునం దేయేవిష యములు వివరింపఁబడియున్న వెూ, ఆవిషయ ములను పఠించుటవలనఁ గలుగులాభము లెవ్వి యో, అప్పుడప్పుడు ఉపన్యాసములమూల మునఁ జెప్పుచు అగ్రంథమునందలి కొన్ని భాగ ములనుజదివి బోధించుచుండవలెను. ఇట్లుబో ధించుచుండిన కొంత కాలమునకుఁగాక పోయి న మఱికొంత కాలమున కైన ఆగ్రంధమునందా స క్తి జనియింపకపోదు. ఈవిధముగ గ్రంధ
భాండాగారికుఁడు తన గ్రంథాలయమునందలి సుల నాకర్షించి, వారియభ్యుదయ పరంపరకుఁ గారణభూతుఁడై తనరవలెను.
పాఠశాలయందు మనము విద్యాభ్యాసము నుజేయుట ఎట్లో నేర్చుకొందుము. గ్రంథాల యమ’నందావిద్యను అభ్యసించి జ్ఞాన నేత్రము ను వికసింపఁజేసికొందుము. జ్ఞానసముపార్జన ముతో మాత్రము తృప్తినిజెంది ఊరకుండిన విద్య వలనఁగలుగ వలసిన లాభములను మనము సంపూర్ణమగఁ బొందఁజాలము. విద్యవలనఁ గలిగిన జ్ఞానమును మనజీవితమునం దనుభవ సిద్దమగుదానినిగ నొనర్పవలెను. చాలమంది ఈవిషయమును మఱచి తమజ్ఞానమును వ్యర్థ మగుదానినిగఁ జేసెదరు. అందుచేత వారు ప్రపంచమునకు వ్యర్ధులగుటయేకాక తమ యంతరాత్మలకుఁగూడ వ్యర్థులగుచున్నారు. చదువుకొనిన విద్యవలన మాత్రమే మనము గొప్పతనమును సంపాదింపఁజాలము. చేసిన సత్కార్యములవలననే మన జీవితము వికాసమునుపొంది యశోవంతము కాఁగలదు. కావున సోదరులారా! సంపాదించిన ఎంత అల్ప జ్ఞానమునైనను మననిత్యజీవితమునం దనుభవ సిద్ధమగునటుల చేసిన నేకాని మనజాతియొక్క భావిస్థితి తృప్తికరముగ నుండదను సంగతిని ఎల్లప్పుడును జ్ఞప్తియు కుంచుకొనుఁడు.
సోదరులారా! మీ గ్రామమునందు గ్రంథాలయమును స్థాపించి ఉపయోగకరములగు అనేక గ్రంథములను జేర్చుచున్నారు. అట్లు గ్రంథములను సేకరించుటతోడనే మీధర్మ ము పూలికా కాలేదు. మీకు గ్రంథాలయ మున్నందులకు ఫలముగా గ్రామము ఉన్నతస్థితిలోనికి రావలెను; ప్రపంచమునం ది ప్పుడు జరుగుచున్న అభివృద్ధియందు గ్రా మమున నివసించియుండు ప్రతి పురుషుఁడును, స్త్రీయును, పిల్లవాడునుగూడ పాలుపంచు కొనవలెను. సూగ్రామమిట్టి ఉన్నతస్థితికి వ చ్చుటకు మీరు తదేకనిష్ఠతో అనేక సంవత్స రములు ఎడ తెగక కష్టపడి పనిచేయవలసి యున్నది.
శ్రీ వీరేశలింగకవి సమాజము-కుముదవల్లి.
శ్రీమద్విక్టోరియామహారాణీ చక్రవతిజ్ఞనీ గారి డైమండు జూబ్లీ మహోత్సవ సందర్భమున తమకుగల రాజభ క్తిని వ్యక్త పరచుకొనుటకై, లోకోపకారపారీణులై సంఘసంస్కారధురీణులై ఆంధ్రదేశమాత కడుపున బుట్టి లోకమం దెల్లెడల ప్రఖ్యాతినిగాని ప్రసిద్ధకాముడై విలసి ల్లుచున్న బ్రహ్మశ్రీ రావుబహద్దర్ శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులువారియందు గల దృఢమగు భక్తివిశ్వాసానురాగములనుబట్టి "శ్రీ వీరేశలింగకవి" సమాజమును ఈ చిన్న గ్రామములో శ్రీ భూపతి రాజు లచ్చిరాజు గారి చావడిలో శ్రీ పండ్రంగి చిన్నమరాజుగారి అధిక ప్రోత్సాహముచే ఆ 1897 సంబరం జూన్ నెల 22వ తే - దీని గ్రామస్థులచే స్థాపింపబడినది. ఈ సమాజప్రతిష్ఠా పనకతజ్ఞలగు చిన్నమరాజు గారు తమవద్దనున్న గ్రంధసా మగ్రినంతయు దీని కుచితముగా నిచ్చుటచేతను వాటి నవ లోకన జేయించి విపులముగ బోధించి జెప్పుచు వార్తాప త్రికాభిరుచిని గలిగించుటచేతను ఈ సమాజము క్రమా నుగతముగ అభివృద్ధికి రా మొదలు పెట్టెను. అందుచే ఆస్థలము కుశలమగుటయు, మరికొన్ని ఇతర కారణము