Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/శ్రీ వీరేశలింగకవి పుస్తక భాండాగారము

వికీసోర్స్ నుండి

లెను. ఇదివరకు ప్రచురించినవి, ఇప్పుడు ప్రచురింపబోవునవి, అన్ని గ్రంధములును ఇందు దొరకవలెను. ఇయ్యది ధనాధికు లెవరైన స్థాపింపవచ్చును. లేదా వాటాల పద్దతినైన నొక సంఘము స్థాపింపవచ్చును.

ప్రతిమానవుడు ప్రతిగ్రంథమును కొనగల ద్రవ్యసంపత్తి గలిగి యుండకపోవచ్చును గాని ప్రతి గ్రామము కలసి అధమపక్ష మొకగ్రంధముకొని పఠింపకపోలేదు. అట్టితరుణమువ కొద్దియెత్తుననైన పుస్తక భాండాగారములను ప్రతిగ్రామమున స్థాపించుటకై ప్రయత్నములు సలుపవలెను.

ఈ పై నుదహరించిన పుస్తకశాలవారు ఈగ్రంథభాండాగారమువారు తమతావున దొరుకు పుస్తకముల పట్టీలను విరివిగ ప్రతిగ్రామము ప్రతియింటా జేరునట్లు పంచి వేయవలెను. అం దేనెల కానెల నూతన గ్రంథములని ప్రశస్తగ్రంధములని పై పట్టిక లో జూపుచుండవలెను. వాటిపై ప్రముఖులిచ్చిన అభిప్రాయములను ప్రచురింపు చుండవలెను.

గ్రంధకర్త లైనవారు తమ గ్రంథములను ప్రాముఖ్యుల కుచితముగ బంపి వాటిపై వారి యభిప్రాయములు వచ్చునటుల చేయవలెను. వీలయినతావులనగా ప్రతిపట్టణములోను, ముఖ్య రెయిల్వేస్టేషనులలోను, సామాన్య అంగడులలోను, దొరుకులాగున కమీషన్ పద్ధతిని ఏజంట్ల నేర్పరచి అమ్మించవలెను. అట్టి ఏజంట్లు సరీగా లెక్క చెప్పరను భయముకద్దు. కాని సౌమ్యులనే యేరు కొనవలెను. పుస్తకధరలు కొంచెము సరసముగా నుండవలెను.

ఇందు విషయమై మన జయమంతయు, తుదకు ఆదానికల క్రింద మనము ధారాళముగా వెచ్చించు ద్రవ్యమునుబట్టియు ఆదానికలు వ్రాయురీతిని బట్టియు నుండుసని జ్ఞాపకముచేయుచున్నాను. ఆదానికల క్రింద విరివిగా వెచ్చించినవారు ఎవరును చెడిపోయినవారు లేరు. ఇందులకై హిగి౯ బాతం మున్నగు కంపినీల వారిని చూడుడు. వారెట్లు విరివిగ ఆదానికల ప్రకటించి వెల్లడించెదరో! మనలోను ఇందులకు విక్టోరియాడిపో, విలియం అండు కో, మున్నగువారు నిదర్శనముగానున్నారు.. ఈ పద్దతులమీద ఆంధ్రగ్రంథముల వ్యాపనకై ప్రయత్నింపుడని ప్రార్థింపుచు విగమించుచున్నాను.

కొడాలి శివరామ కృష్ణారావు.

శ్రీ వీరేశలింగకవి పుస్తక భాండాగారము, రాజమహేంద్రవరము.

దేశాభ్యుదయమునకు భాషాభివృద్ధి ప్రధమ సోపానము. భాషాభివృద్ధికిఁ బుస్తక భాండాగారము లె ప్ర ధాన సాధనములు. ఏదేశమునఁ బుస్తక భాండాగారములు మిక్కుటముగ వెలయుచుండునో, యా దేశము సకలకళలకు నెలవై నాగరకతకుఁ దావలమై యఖిల సంపదలతోఁ దులతూఁగుచు నత్యున్నతపదవి నలంక రించియుండును. భాండాగారములవలనఁ గలుగు ప్రయోజన పరంపరల లెస్సగ గ్రహించియె జర్మని, ఇంగ్లండు, అమెరికా, జపాను మున్నగు 'విదేశములవారు తమతమ దేశములఁ బ్రతి పట్టణమునఁ, బ్రతిగ్రామమున, వేయేల ప్రతిగృహమున భాండాగారములఁ గుప్పలు తిప్పలుగ వెలయింపఁజేసి ప్రపంచమునందలి జాతీయులలో నెల్ల నాగరకాగ్రగణ్యులని వినుతికెక్కి యుండిరి.

ప్రకృతము మనహిందూ దేశమునఁ గూడ పుస్తక భాండాగారముల యావశ్యకత గ్రహింపఁబడి బరోడా మున్నగు ప్రదేశములయందు భాండాగారములు నెలకొల్పబడుచున్నవి. మన యాంధ్రదేశమునందు సయిత మచ్చటచ్చట కొన్ని భాండాగారము లిపుడిప్పుడు స్థాపింపబడుచున్నవి. సుమారు పదునై దువత్సరముల క్రిందట మన యాంధ్ర దేశమున నాంధ్ర భాండాగారము లంతగ వ్యాపించియుండని సమయమున మనమాతృభాషకుఁ గలిగిన యీ అంతను గొంతవఱకు నివారించి యోపినంత వరకు దేశ సం సేవన మొనరింపఁగోరి, యాంధ్రభాషావధూటికిఁ బుట్టినిల్లనఁ దగు రాజమహేంద్రవరమున 'వీరేశలింగ పుస్తక భాండాగారమను పేరిట నొక భాండాగారమును స్థాపించిరి. శ్రీవీరేశలింగపుస్తక భాండాగారము 1900 వ సంవత్సరమున రాజమ హేంద్రవరమున శ్రీయుత నాళము కృష్ణారావుగారిచే స్థాపింపఁబడినది. ఈభాండాగారము మొట్టమొదట తెనుఁగు పుస్తకములతో నారంభింపఁబడి, కొంతకాలమువఱ కేనామమును ధరింపకయె చిన్న పఠన మందిరమువలె నొప్పుచు, నచ్చటికి వచ్చుచదువరులకుమా త్రమె యుపయుక్తముగ నుండెడిది. సేవకుఁడు లేకపో వుటచే పు స్తకములనింటికిఁ దీసికొనఁ గోరువారికడ చం దాలగైకొని పుస్తకములిచ్చు పద్ధతి యప్పుడు లేకుండె ను. ఐనను పరిచితులగు కొందరకు చందాలేకయే పుస్త కములు వారిగృహములకీయఁబడు చుండెడివి. ఇట్లొకవ త్సరము గడిచినపిదప కీర్తిశేషులైన శ్రీనాళము జగ్గారావు గారు భాండాగారాభివృద్ధికై పూనుకొని కేవల మొక్క యాంధ్రగ్రంధములతో నే భాండాగారము సంపూర్ణమైనది కాదనియెంచి, యందాంగ్లేయ గ్రంధములు గూడ పెక్కిం టిని జేర్చిరి.

అప్పు డీభాండాగారమునకుఁ దగిన నామ మొసం గు తరుణము వచ్చినదని యెంచి, తదీయ స్థాపకులును నభిమానులును జేరి “శ్రీ వీరేశలింగ యువజన సమాజము ” అను పేరనొక సంఘముగ నేర్పడి, భాండాగారమును ద మయధీనమున నుంచికొని, దానికి “శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము” అని నామకరణ మొనర్చిరి. తోడ నే యొక చిన్న మేడ యద్దెకుఁ దీసికొనఁబడి యందీ భాండా గారము నెలకొల్పఁబడెను. సేవకులు నియమింపఁబడిరి. పౌరులకడ చందాలఁ గైకొని వారికింటికి పుస్తకములు నిచ్చుపద్ధతి యవలంబింపఁబడెను. స్త్రీల కుచితముగ వా రి గృహములకు పుస్తకముల బంపుటయారంభింపబడెను. మఱియు నీ సమాజము మత సంఘసంస్కార విషయముల మొక్కవోనిదీక్ష వహించి తద్వ్యాప్తికై యనేక సభలఁ గావించియు, కరపత్రములను పొత్తములను వెలువరించి యు, భాండారాభివృద్ధికై నిరంతరము పాటుపడుచు, సుమారు 8 వత్సరములు తృప్తికరముగఁ గార్యములు నిర్వ హించి 1909 వ సంవత్సరమున విరమించెను.

అంత నీభాండాగారమును గూర్చి మొదటినుండి యు కృషి చేయుచున్న కొందఱు వేఱక సంఘముగ నే ర్పడి నూతన నిబంధనలను పద్ధతులను నేర్పఱచి ఆరు సంవత్సరములనుండియు శ్రద్దతోఁ బనిచేయుచు కొండా గారమును ప్రస్తుతాభివృద్ధికిఁ గొని తెచ్చిరి. ఇప్పుడీ బాం డారము పురమందిరము నందలి ప్రార్ధనసమాజ సౌధమున నలరారుచు, 42 గురు సామాజికులను, 218 మంది చం దాదారులను, 144 మంది స్త్రీ చదువకులను గలిగి 2200 ఆంధ్రగ్రంధములతో, 1900 ఆంగ్లేయ గ్రంధములతో, 228 సంస్కృత గ్రంధములతో, 55 తాళపత్రగ్రంధములతో నొప్పుచు, 53 ఆధ్రాంగ్లేయవార్తాపత్రికలచే నలంకరింప బడి, యనుదినము 30 మంది చదువరుల నాకర్షించుచు న్నది.

ఈభాండాగారము యొక్క ప్రధానో దేశములలో స్త్రీవిద్యాభివృద్ధి యగ్రగణ్య మైనది. ఈభండాగారము స్థాపించినది మొదలు నేఁటిదనుక స్త్రీలకు వారు కోరు పొత్తముల చందా గ్రహింపకయె వారినిలయములకు గ్రం ధాగార సేవకునిచే బంపి స్త్రీవిద్యను ప్రోత్సాహపఱచు చుండిరి. దీనికై ప్రత్యేకముగ నొక సేవకునిఁ గూడ నియ మించియుండిరి. ప్రస్తుతము 144 గురు నారీమణులు ఈ భాండాగారగ్రంధముల నుపయోగపఱచుచున్నారు. గత వత్సరమున సుమారు 2785 ఆంధ్రగ్రంధములు వీరిచేఁ బ ఠింపఁబడినవి. స్త్రీవిద్యను ప్రోత్సాహపరచుటకై గత వత్సరమునుండి స్త్రీలకు బహుమాన పరీక్షలు గావించు చున్నారు.

విజ్ఞానవల్లరిఅను పేరున నీతిబోధకములు జ్ఞానదాయ కములునగు కరపత్రములు నాలుగువత్సరములనుండి ఈ భాండాగారపక్షమున మాసమునకొక సారి ప్రచురింపఁబడు చున్నవి. జనసామాన్యము యొక్క హృదయ పీచులందు సుజానబీజముల నాటుట యీకరపత్రముల ముఖ్యోద్దేశ మై యున్నది. దీనికి శ్రీపాలపర్తి నరసింహము గారు కా ర్యదర్శిగా నియమింపఁబడిరి. مه గ్రంధభాండారముల కముద్రిత గ్రంధము లమూ ల్యాలంకారములు, ఒక పుస్తక భాండాగారము యొక్క యుత్కృష్టత యందలి యముద్రిత గ్రంధముల యొక్క సంఖ్యను బట్టి నిర్ణయింపఁదగును. ప్రాచ్యలిఖిత పుస్తక భాండారముల యొక్క ప్రయోజనము లనంతములు. ఇట్టి భాండాగారములు ప్రతిపట్టణమున ప్రతి గ్రామమున నెల

కొలుపఁబడవలయును.

శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము

చిలకమర్తి లక్ష్మీ నరసింహం

పెక్కు వత్సరములు అధ్యక్షులుగా నున్న
చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు

శ్రీ వీరేశలింగ పుస్తక భాండాగారము

నాళం కృష్ణారావుగారు

సంస్థాపకులగు నాళం కృష్ణారావుగా

మనయాంధ్ర దేశమున తాళపత్రగ్రంధము లింటింట ను కుప్పలుతిప్పలుగ నున్నవి. కాని యవి యటుకుల పైఁ బేర్పబడి కీటకములపాలై చివుకుచు జనసామాన్యమున కుపయుక్తములుగాక యున్నవి. ఇట్టి గ్రంధముల నెల్ల సంతరించివానిని సుస్థితియందుంచి జనోపయుక్తముగనో నర్చుట పుస్తక భాండాగారములు ముఖ్య విధియైయున్న ది. కాని యిపుడిప్పుడు మనయాంధ్రదేశమున వెలయుచున్న పుస్తక భాండాగారములు ముద్రిత గ్రంధముల నె కాని యముద్రిత గ్రంధముల సేకరించుటకై యత్నములు సలుప కున్నవి. ఇది మిగుల శోచనీయము. ఐనను ముద్రిత గ్రం ధములవలె సముద్రిత గ్రంధములు సంపాదించుట యెల్లరకు సుకరముకాదు. కావున ప్రస్తుత మిట్టిభండా గారములు ఆంధ్రదేశమునందలి ముఖ్యపట్టణములలో నైన నెలకొల్పఁ బడినఁజాలును.

ప్రకృతము మన యాంధ్రభాష యందు ప్రాచ్యలి ఖిత పుస్తక భాండాగారములు మూఁడుమాత్రమె యున్న ట్లు కన్పట్టుచున్నది. అందు ఒకటి తంజావూరునందు రా జుగారి కోటయందును, తక్కి నవి చెన్నపురిలో దొరతన మువారి చిత్రవస్తు ప్రదర్శనశాలయందొకటియు, ఆంధ్ర భాషాపరిషత్తువారి కార్యస్థానమునం దొకటియునున్నవి. ఇందు తంజావూరు పూర్ణముగ నఱవదేశము. అచ్చటి కేగుట యన్న ఆంధ్రులకు 'చీమకాశీ ప్రయాణము' వంటి ది. ఇఁక చెన్న పురియో, అచ్చటనున్న యాంధ్రులకంటె అఱవలే హెచ్చు. కావున నీరెండు ప్రదేశములు ఆంధ్రు లకు మిగుల దూరమున నుండుటచే, అందలి గ్రంధములు ఆంధ్రులకు ‘అందనిమ్రానిఫలములు', కావున నిట్టిభాండా గారములు ఆంధ్రులకందఱకు కరతలామలకములుగు నుం డునట్లు ఆంధ్రదేశమునకు మధ్య నున్న ప్రదేశములయం దున్నచో నత్యంతో పయుక్తముగ నుండును.

ఆంధ్రభాషకు పుట్టినిల్లయి, యాంధ్రమండలము నకు మండ నాయమానముగనున్న రాజమహేంద్రవరమున నిట్టి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమును స్థాపించ వలయునని చిరకాలమునుండి సంకల్పించుకొని రెండుసం వత్సరములక్రిందట తాళపత్రగ్రంధములను సేకరింప మొ దలిడిరి. పెద్దాపురవాస్తవ్యులగు శ్రీరాజా వత్సవాయ రాయజగ పతివర్మ గారు తమయాస్థానమున నున్న సుమా రు 40 తాళపత్ర గ్రంధగత్నములు ఈ భాండాగారవధూ టికి కంఠహారముగ నర్పించిరి. ఇప్పు భాండాగారమున తాళపత్రగ్రంధములును వ్రాతప్రతులును సుమారు 60 గ్రం ధములుకలవు. ఇందు పెక్కు గ్రంథములు ముద్రితము లై యున్నవి. శ్రీచిలకమర్తి లక్ష్మీనరసింహము గారీ సంఘము నకు పెక్కు సంవత్సరములు అధ్యక్షులుగ నుండియుండిరి.

ఈభాండాగార ముయొక్క ఉద్దేశములు.

1. ఆంధ్రగీర్వాణభాషలయందుఁ గల గ్రంధముల న న్నియు, వలనుపడినంతవఱకు నాంగ్లేయ గ్రంధములను అం దు ముఖ్యముగ హిందూ దేశ సంబంధమైన గ్రంధములను సంపాదించుట.

2. అముద్రితములగు ప్రాచీనాంధ్రమహాకవి ప్రణీత గ్రంధముల దొరికినంతవఱకు సేకరించి, యందు సుప్రసి గ్రంధముల నచ్చొత్తించుట.

3. ఆంధ్రా గ్లేయవార్తాపత్రికలను మాసపత్రికలను దె ప్పించుట,

4. ఈగ్రంధములను పత్రికలను పఠనమందిరమునకుఁ జనుదెంచు చదువరుల నెల్ల నుచితముగఁ జదువుకొన నిచ్చుట.

5. ఇందలి గ్రంధములఁ దమగృహములకుఁ దీసికొనఁ గోరుపురుషులకడ చందాగైకొని తన్మూలమున భాండా గారము నభివృద్ధిపరచుట.

6. ఇందలి గ్రంధములఁ జదువుకొనఁగోరు స్త్రీలకడ చందా గైకొనకయె వలయు పుస్తకముల వారిగృహాముల కు సేవకునిచేఁ బంపి స్త్రీవిద్య ప్రోత్సాహపఱచుట,

7. జ్ఞానదాయకములు దేశాభివృద్ధికరములు నగు ను పన్యాసములు నిప్పించుట,

8. భాషాభివృద్ధిని దేశభక్తిని నీతిని బురిగొల్పు పొ త్తములను పత్రికలను కరపత్రములను ప్రచురించుట.

9. స్త్రీ పురుషులయం దున్నతజ్ఞానమును పెంపొందిం చుటకై వత్సరమునకొకసారి పరీక్షలఁ గావించుచు నం దుఁ గృతార్ధులై నవారికి బహుమతుల నొసంగుట.

ఈ భాండాగారమునకు రాజమహేంద్రవరమున “హిందూబాల సమాజము " శాఖా సంఘముగ నున్నది. ఈ గ్రంధభాండాగారమునకు భవనమును నిర్మించుటకై ఆరు వేల రూపాయిణులు గావలసి యుండునని మదింపు వేసియు న్నారు. ఈగ్రంధాలయము యొక్క నామము యిటీవల “సర్వజన గ్రంధాలయ”మని మార్చియుండిరని దెలియవ చ్చుచున్నది.