గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/బెంగళూరు గ్రంధాలయము
స్వరూపం
బెంగుళూరు గ్రంధాలయము.
మైసూరు ప్రభుత్వము వారి వలన బెంగుళూరు నందు సార్వజనిక గ్రంధనిలయము స్థాపింపబడినది. ఇట్టి గ్రంధనిలయములను స్థాపించు విషయము తొలుదొలుత 1912వ సంవత్సరమున మైసూరు ఆర్ధిక సభలో విద్యాశాఖవారిచే ప్రస్తావింపబడెను. 1914వ సంవత్సరమున దొరతనము వారట్టి గ్రంధనిలయములను బెంగుళూరునందొకటియు, మైసూరునందొకటియు నెలకొల్పుటకు అనుజ్ఞనిచ్చిరి. బెంగుళూరు గ్రంధనిలయమునకు గ్రంధములను కొనుట మొదలగు ఖర్చులకుగాను రు.2000ల నిచ్చిరి. ఇదిగాక సంవత్సరమునకు రు.1500ల గ్రాంటును గూడ నిచ్చుచుందురు.