Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ద్వితీయ ఆంధ్దదేశ గ్రంథభాండాగార

వికీసోర్స్ నుండి

ద్వితీయ ఆంధ్ర దేశ గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభ.

రాజమహేంద్రవర పట్టణమున శ్రీ. వీరేశలింగ, వసురాయ పుస్తకభాండాగారములు యాహ్వానము నను సరించి 1915 సం॥ మేనెల 9వ తేదీ మే నెల 9 వ తేదీ మధ్యాహ్నము 2-30 గంటలకు శ్రీ వీ రేశలింగము గారి హైస్కూలు భ వనమున ద్వితీయ ఆంధ్రదేశ గ్రంధభాండాగార ప్రతిని ధుల మహాసభకూడెను. కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఘపట్నము, గింజాం, నెల్లూరు జిల్లాలనుండి 120 కంటె నెక్కు వగ ప్రతినిధు లేతెంచిరి. ప్రతినిధులును ఇతర జనులును మొత్తముమీద 800 మంది జనులు సభ వలంక రించిరి.

ప్రధమమున సన్మాన సంఘాధ్యక్షులగు శ్రీ బారు నరసింహారావు, బి.ఏ., బి.ఎల్., గారు తమ స్వాగతో పన్యాసమును జదివిరి. తరువాత చిలకమర్తి లక్ష్మీనర సింహంగారు పానుగంటి రామారాయనిం గారిని సభ కు అగ్రాసనాధిపతిగా నుండునట్లు కోరుచు వారి విష యమై కొంత ముచ్చటించిరి. పెద్దిభొట్ల వీరయ్య గారు ను, కొండమూడి శ్రీరాములుగారును పై విషయమును బలపరచిరి. అందఱు నేకగ్రీవముగ నొప్పుకొనుచు కర తాళధ్వనుల జేసిరి. అనంతరము శ్రీ పానుగంటి రామా రాయని గారిని పూలహారముతో గౌరవించి అగ్రాసనా సీనునిం జేసిరి. అగ్రాసనాధిపతి గారు తమ ప్రారంభోప న్యాసమును ఆంధ్రభాషయందు జడివిరి. శ్రీ రామారా యనింగారి సోదరులు గూడ నేతెంచి సభనలంకరించిరి.

తరువాత కార్యదర్శి గారిచే సభకు రాజాలమని వ్రాసిన లేఖలు జదువబడెను. అందు రవీంద్రనాధ ఠాకూరు గారి శాంతి నికేతన మందు విద్యాభ్యాసము జే యుచున్న రాయప్రోలు సుబ్బారావు గారు వ్రాసిపంపిం చిన పద్యములు మిగుల రసవంతములై, మనోరంజకము లై, భావపూరితములై సభ్యుల నందరిని ఆనందవార్థిలో నోలలాడించెను. తరువాత నాళం కృష్ణారావు గారు ఆం ధ్రదేశ గ్రంథ భాండాగార సంఘము యొక్క 1914 ఏప్రి లు మొదలు 1915 ఏప్రిలు ఆఖరువరకు జరిగిన వృత్తాం తమును జదివిరి. పిమ్మట విషయనిణయ సంఘమేరా టు గావింపబడి నాటి సభముగింపబడెను.

10 వ తేదీన ఉదయము 8 గంటలకు తిరిగి సభ కూడెను. ప్రధమమున వడ్డాది సుబ్బారాయుడు గారు దైవప్రార్ధన గావించిరి. తరువాత నూరి వేంకట నరసిం హం గారు ఆంధ్రదేశ గ్రంధభాండాగారోద్యమును గూ ర్చియు, సంచారపుస్తక భాండాగారములను గూర్చి పాద సుబ్రహ్మణ్యము గారును, గ్రంథాలయములన నేమి? అవి చేయదగిన పనియేమి? అను విషయమును గూర్చి అయ్యంకి వేంకటరమణయ్యగారును, దేశభాషాప్రాము ఖ్యతను గూర్చి వల్లూరి సూర్యనారాయణ రావు గారును, ప్రారంభవిద్యకు గ్రంథభాండాగారము లెట్లు తోడ్పడు ను ? యను వంశమును గూర్చి సత్తెనపల్లి హనుమంతరా వుగారును, గ్రంధపాలకుని ధర్మములను గూర్చి లేకుమళ్ళ వెంకాజీరావు గారుసు, గ్రంధ విభజనమును గూర్చి వెలి దెం డ శ్రీనివాసరావు గారిచే వ్రాయబడిన వ్యాసమును మరొ కరును, గ్రంథాలయ ధర్మములనుగూర్చి గుడిపాటి సూ ర్యనారాయణ గారును ఉపన్యాసముల నిచ్చిరి,

అంతటితో ప్రాతఃకాల సభ ముగిసెను, సాయం కాలము తిరిగి 8.20 గంటలకు సభ సమావేశమయ్యేను. గ్రంథ భాండాగారము లెట్లుండవలెను యను విషయము నుగూర్చి చితపంటి వేంకటరమణయ్య గారును, తీత్తి బ లరామయ్యగారును, దుగ్గిరాలనుండివచ్చిన వారొకరును ముచ్చటించిరి. (నా యనుభవము'లను గూర్చి కే. జోగా రావుగారు జెప్పిరి. ఆనంతర మీదిగువ తీర్మానములు జేయబడినవి:___

1.వ తీర్మానము.

గోపాలకృష్ణగో క్లే గారును, కొక్కొండ వేంకట రత్నం పంతులుగారును, పురాణం వెంకటప్పయ్య గారు ను, జొన్నవిత్తుల గురునాధం గారును, చనిపోయినందుల కీసభవారు వారి కుటుంబములకు తమ సానుభూతిని దెలుపుచున్నారు.

అగ్రాసనాధిపతి గారిచే నుపపాదింపబడినది.

2.వ తీర్మానము.

విద్యాభివృద్ధి చేయుటయందు గ్రంధాలయములు ముఖ్యస్థానములు గనుక (ఏ) ప్రస్తుతము ఆంధ్రదేశమున స్థాపింపబడియున్న గ్రంథాలయములకును, పఠనమందిర ములకును, మ్యునిసిపాలిటీ, డిస్ట్రిక్టు తాలూకా బోర్డుల యొక్క ద్రవ్యములనుండియు, ప్రొవిజ్షియల్ రివిన్యూ లనుండియు ద్రవ్యసహాయమును జేయుటకు సదుపాయ ములను గలుగ జేయవలసినదని ప్రభుత్వము వారిని ఈ సభ వారు ప్రాథి౯ంచుచున్నారు. (బి) ఆంధ్రదేశమధ్యము న అనుకూల మైన స్థలమునందు, ఆంధ్రభాషయందు ప్ర చురింపబడు గ్రంథములనన్నిటిని పత్రికలనన్నిటిని చెన్న పట్టణ ప్రాచ్యలీఖితపుస్తక భాండాగారమందలి ఇతర అముద్రిత గ్రంధప్రతుల నన్నిటిని జేర్చి ఆంధ్రదేశమందలి ఇతర గ్రంధాలయములకు సహాయభూతముగ నుండున టుల గ్రంధాలయము నొకదానిని ప్రభుత్వమువారు నెల కొల్పుట ఆత్యావశ్యకము గనుక అట్టి గ్రంథాలయమును త్వరలో స్థాపించుటకు ప్రభుత్వమువారిని ఈ సభవారు ప్రాథి౯ంచుచున్నారు.

ఈతీర్మానమును హానరబిల్ రావు బహద్దరు మో చర్ల రామచంద్రరావు పంతులుగారు ఉపపాదించిరి. ఒంగోలు పురవాసులగు మిట్టదొడ్డి సుబ్బారావు పంతులు గారు బలపరచిరి.

3వ తీర్మానము.

దొరతనము వారిచే ప్రచురింపబడు పరిశ్రామిక ఆ రోగ్యవిషయిక ప్రచురముల నన్నిటిని, జిల్లా గెజిటీలను, ఆంధ్రభాషయందు ముద్రింపబడిన గ్రంథముల పట్టిక లను ఆంధ్రదేశమునందలి గ్రంధాలయముల కన్నిటికిని ఉచిత . ముగా దయచేయవలెనని ఈసభనారు ప్రభుత్వము వారిని ప్రాథి౯ంచుచున్నారు.

4.వ తీర్మానము.

ఆంధ్ర దేశమునందంతటను గ్రంధాలయోద్యమము ను వ్యాపింపజేయుటకై సంచారకార్యదర్శి నేర్పాటుకే యుటకు కావలసిన ద్రవ్యమును సమకూర్చుటకు అంద ఱును సహాయపడెదరని ఈసభవారు జనులనందఱిని ప్రా థి౯ంచుచున్నారు.

5వ తీర్మానము.

ఆంధ్రదేశమునందున్న అన్ని పట్టణములయందును పల్లెలయందునుగూడ గ్రంథాలయములను గాని పఠనమం దిరములను గాని స్థాపింపవలెనని జనుల నీసభవారు ప్రా ధి౯ంచుచున్నారు.

6వ తీర్మానము.

ప్రతి గ్రంథాలయమును తాము గత సంవత్సరము నందు చేసినపతిని నివేదించుటకును, ముందు చేయబూ నుకొన్న పనిని గూర్చి ప్రస్తావన చేయుటకును, జనసామా వ్యమునకు సంఘాద్దేశ్యములను తెలియజేయుటకును గాను సంవత్సరోత్సవములను జరుపుటకును ఆసమయమున జ దువబడిన కార్యని వేదనమును ఈ సంఘపక్షమున బ్రకటిం చు పత్రికలో ప్రకటించుటకు గాను కార్యదర్శులకు బం పుటకును గ్రంథాలయ సంఘములను ఈసభవారు గోరుచున్నారు.

7వ తీర్మానము.

ప్రతినిధులకట్న ములవలన వసూలు అయిన సొ మ్మును సంచారకార్యదర్శియొక్క ఖర్చులకొఱకును ఇ తర ఖర్చులకొఱకును ఈ సభవారిచే నేర్పరుపబడిన గ్రం థాలయ సంఘమునకు ఇచ్చుటకు ఈసభవారు తీర్మానిం చుచున్నారు.

8వ తీర్మానము.

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘమునకు ఈ సంవత్సరమున నీదిగువ నుదహరింపబడినవారు కార్యని ర్వాహక సభ్యులుగ నెన్ను కొనబడిరి. అగ్రాసనాధిపతి,—— గౌ. మోచర్ల రామచంద్రరావుగారు. ఉపాగ్రాసనాధిపతులు, — చిలక మతి్ లక్ష్మీ నరసింహము గారు, నూరి నరసింహము గారు.

కార్యదర్శులు,—నాళం కృష్ణారావుగారు, అ య్యంకి వేంకటరమణయ్య గారు.

ఇతర సభ్యులు.

రొయ్యూరు రామచంద్రప్రసాదరావు గారు, రొయ్యూరు.
గోపరాజు బ్రహ్మానందం గారు, బెజవాడ.
బొడ్డపాటి శేషగిరి రావు గారు, పొద్దుటూరు.
బొడ్డపాటి హనుమంతరావు గారు, బొడ్డపాడు,
బాలసరస్వతీ సంఘము, అంగలూరు.
వేమూరి రాంజీ రావు గారు, మచిలీపట్నం.
కొడాలి శివరామకృష్ణారావు గారు, డిటొ
టి. యన్. శర్మగారు, ఉంగుటూరు.
నిడమర్తి లక్ష్మీనారాయణగారు, నిడమర్రు.
బెల్లంకొండ రాఘవరావుగారు, పమిడిపాడు. నర్సారావు పేటపోష్టు. సత్తెనపల్లి హనుమంతరావు గారు, దుగ్గిరాల. చట్టి నరసింహారావుగారు, గుంటూరు, చలా శేషగిరిరావు గారు, గుంటూరు. పులిపాక వెంకటరామారావుగారు, ఈమని. అంచే శివయ్య గారు, ఈమని. తెనాలి తాలూకా. కుప్పా శ్రీ రామశర్మ గారు, అనంతవరం. తెనాలి తాలూకా. అద్దంకి సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి. రామానుజ పు స్తక భాండాగారము, తుని. ఆకెళ్ళ వెంకట సుబ్బారాయుడు గారు, అమలాపురం. పీపిల్సు ఎస్సోసియేషన్, కాకినాడ, బిక్కని వెంకటరత్నం గారు, చోడవరం. రామచంద్రపురం తా. భాగి సుబ్రహ్మణ్యం గారు, శికింద్రాబాదు. ఇ. సుబ్బుకృష్ణయ్య గారు, హైదరాబాదు. చివుకుల అప్పయ్యశాస్త్రి గారు, శికింద్రాబాదు. యస్. నగరాజారావు గారు, జానోదయ సమాజం. నెల్లూరు. తిక్కనపుస్తక భాండాగారము, డిటో రామమోహనధర్మపుస్తక భాండాగారము, గండివరం, కడవలూరు పొష్టు, నెల్లూరుజిల్లా. పొణకా పట్టాభిరామరెడ్డి గారు, పొట్లపూడి, మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, విశాఖపట్నము. కే. జోగారావుగారు, ఎలమంచిలి. ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, బరంపురం. తిత్తి బలరామయ్య గారు, బారువ, డి. కృష్ణారావు గారు, బరంపురం. ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, పొద్దుటూరు, కడపజిల్లా. రామకృష్ణ పరమహంస రీడింగురూమ్, కడప, దేశపాండ్య సుబ్బారావు గారు, నంద్యాల. మిత్రమండలి, బళ్ళారి.

9వ తీర్మానము.

తెనాలి తాలూకా దుగ్గిరాల భాషాభిలాషిణీ సం ఘమునకు భవనమునునిర్మించుచున్న పునాదిపాటి గ్రామ వా స్తవ్యులును ఉదారస్వభావులునుగు, యేర్లగడ్డ పెన్నీ డు చౌదరి గారి కీ సభ వారు వందనము లర్పించుచున్నారు. ఇట్లే ఆంధ్రదేశములోని జమీందారులును ధనవంతులును గ్రంధాలయోద్యమమునకు సహాయమును జేయుదురని ప్రార్ధించుచున్నారము.

10 వ తీర్మానము.

ముందు సంవత్సరమీ సభను నెల్లూరు జిల్లాయందు చేయుటకు తీర్మానింపడమైనది. ఈతీర్మానమును పొట్ల పూడి వా స్తవ్యులగు పొణకా పట్టాభిరామ రెడ్డి గారు ఉ పపాదించిరి. నెల్లూరు వాస్తవ్యులగు యన్. నాగరాజా రావుగారు బలపరచిరి.

తదుపరి అగ్రాసనాధిపతి గారు తమ యంత్యోప న్యాసమును ముగించినపిమ్మట, కొవ్యూరు వాస్తవ్యులగు తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులు గారు అగ్రా సనాధిపతి గారికిని, ప్రతినిధులకును వందనము లర్పించిరి.

అంతటితో సభ ముగి సెను,

ఆహ్వాన సంఘాధ్యక్షులగు బారు శ్రీరామ నరసింహా రావుగారి యుపన్యాసము.

మహనీయులారా! ఆంధ్రభాషాభిమానులారా! ఆంధ్ర దేశాభివృద్ధి చికీర్షులారా!

ఆంధ్ర దేశ గ్రంధ భాండాగార ద్వితీయమహాసభా ప్రతినిధి ప్రముఖ సన్మానసంఘపతీ మున నాహృదయపూర్వక స్వాగతము నిచ్చుటకై నాకవకాశ ము కలిగింపఁబడినందుకు మిక్కిలి సంతసించుచున్నాను. ఈదినములలో తీవ్రనిదాఘతాపమున బాధలకోర్చి కడు దూరమునుండి మిక్కిలి ప్రయాసముతోఁ బ్రయాణము చే సి మాయాహ్వానమును గౌరవించి ఇచటికి దయచేసినం దులకు ఈభాండా గారోద్యమమునందు మీ కెల్లరకుగల సానుభూతీయు, నుత్సాహమును మాత్రమే కారణంబు. లు గాని మరియొకటి కాదు. ఇంత శ్రమపడి మీరంద టీ క్కడకు విచ్చేసినందులకు మీకుఁ దగిన సత్కారము లొనర్చి మీ భోజనమజ్జనపానాదులకుందగు సౌకర్యముల ను ఉచితరీతిని గలుగఁజేయునంతటి శక్తి మాకు లేనందు లకు మిక్కిలి చింతించుచున్నారము. అయినను ఈభా రము మాపై వైచుకొనుట దానిని జయప్రదముగా కొన సాగింపఁగల శక్తి మాకుఁ గలదనెడి ధైర్యముండికాదు. మీ యందఱివలె మాకును ఈ భాండాగారోద్యమమందు గల యుత్సాహమే కారణము. శ్రీమదఖండి గౌతమీపవి త్రసలిలస్నానపానములును, పౌరాణిక, చరిత్రాత్మక గాధలతో నిండియుండి సుప్రసిద్ధ ప్రాచీనాధునిక కవు లచే నలంకరింపఁబడినటువంటి యు, దక్షిణ కాశీ నా వా సిగాంచిన మారాణ్మ హేంద్రవర పుణ్యక్షేత్ర సందర్శన మును మాత్రమే మీకుఁ గలుగఁజేయఁగలిగిన లాభముల ని యెంచుకొనుచున్నాము. మేము మీయెడల జరుపవ లసిన యుదారకృత్యముల విషయమై మాకుఁగల యుద్దే శముల మాత్రమే మీరు భావించి లోపములను మన్నిం పఁ గోరుచున్నాము.

ఈ యాంధ్ర దేశ గ్రంథ భాండాగార, మహాసభ ని రుటి సంవత్సరము విజయవాడలో పుట్టిన పసికూనయని మీయెల్లరకు విశదమే, దీనిని కడుశ్రద్ధతో, నాదరము తోఁ బోషించి పెంచుభారము మనదైయున్నది.

ఆంధ్రసాహిత్యపరిషత్తు భాషాభిమానులైనయనే క రాజులయొక్కయు, రాజకీయోద్యోగులు మొదలయి నవారియొక్క యు నాదరమువలన వథికొల్లు చున్న సంగ తి మీకుఁ దెలిసియేయుండును. ఆపరిషత్తు యొక్క యు నీగ్రంధభాండాగార సభయొక్క యు నుద్దేశము లించు మించుగా సమానములై, యన్యోన్య సంబంధము గలవై యున్నందున నీ రెండు సభలును ప్రతిసంవత్సర మొక చోట నే యేక కాలమున జరుపుట యనుకూలమనియు, నవి పరస్పర సహకారములుగా నుండుననియు నాయభి ప్రాయము. ఇపుడు మీరంద జీవిషయమై కూడ నాలో చించి ముందు సంవత్సరమునుంచి యీమహాసభ యెక్క డ జరుగవలసియుండిన లాభకరమో నిశ్చయింపవలసి యున్నది.

ఈ యుద్యమము యొక్క ముఖ్యోద్దేశము జన సామాన్యమునకు జ్ఞానోపదేశము చేయుటయే. ఈ యు ద్యమము మన హిందూ దేశమునకు క్రొత్తకాదు. ఐహి 'ములకుఁ దగిన జానము మన పురాణముల కాముష్మికములకుఁ మనయందు నిబిడీకృతమై యున్నది. అట్టి పురాణములను వీధులలోను, తదితర బహిరంగ ప్రదేశములలోను పఠన ము చేయుటవలన, వీధినాటకములు మొదలగు వానిని ప్రదర్శించుటవలనను జనసామాన్యమునకు జ్ఞానోపదేశము కలుగఁజేయఁబడుచుండేడిది. కాని యిప్పటి కాలస్థితిని బట్టి అరీతుల జ్ఞానాభివృద్ధిని దీని కలుగఁజేయుట కందఱకవకాశము లేదు. ప్రాచీనకాలమున మన హిందూరా జ్యమున గూడ ననేక భాండాగారములను మనరాజులు నెలకొల్పి యుండిరన్న సంగతి చరిత్రలవలన తెలి సికొను చు న్నారము. తరువాత తురుష్క రాజ్యములో నెట్టి దుర వసకలిగి యెంతెంతటి భాండాగారము లెటులు నశించిన వో తెలిసిన యంశమే. ఇప్పుడో, ప్రస్తుతాంగ్లేయరా జ్యపాలనము నందలి ప్రశాంతకాలమున మన కట్టి క్కట్టులెల్ల తొలిగిపోయినవి. ఈ యుద్యమము ప్రబలి జనసామాన్యమునకు జ్ఞానదాయకమగుట కనుకూల సమ యమై యున్నది. ఈభాండాగారోద్యమమును సరియై న రీతిని నిర్వహింపజేసినచో నిందువలన గలిగెడు లాభ మమితము. అమెరికా దేశమున నీయుద్యమ మ సేక విధ ముల సర్వజనాదరణీయముగా జేయబడి దేశమున కమి తోపకారము కలుగ జేయుచున్నది. ఇట్టి భాండాగారముల వలననే జ్ఞానోపదేశమును బొంది ఆండ్రూ కార్నీ జీ అనునతడు అపరిమితైశ్వర్య సంపన్నుఁడై యట్టి లాభము నె యితరుల కందఱకు గలుగ జే మనిచ్చగించి తన యా జీతములో విస్తారభాగ మాయుద్యమము నిమి త్తము వి నియోగపఱచి యెల్లెడల గ్రంథభాండాగారములను స్థాప నముచేసి బీదసాదల కుచితముగా జానసంపాదన సాధ నముల కలుగజేసి యున్నాడు. అట్టి పద్ధతుల నెల్ల కడు శ్రద్ధతో పరిశీలించి శ్రీ బగోడా మహారాజు వారుగూడ తమ రాష్ట్రములో నట్టి భాండాగారములను స్థాపించి, కుగ్రామవాసులకు గూడ వానిలాభము నందజేయు నుద్దే శముతో (Circulating Libraries) పరివత౯న పుస్తక భాండాగారములను కూడ నెలకొల్పినారు. అట్టి ప్రయ త్నము లమిక ధన సాధ్యములు. మన కిప్పుడవి దుస్సా ధ్యములు. అయినను కాలక్రమమున దొరతనము వారి సహాయ్యమువలన గాని, మన పరస్పర సహాయమువలన గాని లేక జమీందారుల యొక్కయు మహారాజుల యొ క్కయు తోడుపాటువలన గాని యవి సాధ్యములు కా వచ్చును. ఈ భాండాగారములు చేయవలసిన కార్యవి ధానము మనకింకను సరిగా బోధపడలేదు. ఈ కార్యము నందు దగు ననుభవము గల వారిని నియమించి ఆయా దేశముల కనిపి, అక్కడక్కడి పద్ధతులను పరిశీలించి వానిని మన దేశమున బ్రవేశ పెట్టవలసి యున్నది.

ఈ భాండాగారముల నేయేవిధముగా నడిపిన నెక్కువ లాభకరముగా నుండునో యామార్గముల నెల్ల మీూ రారసి చూడవలయును. వీనిని గ్రమమైన విధమున నడిపినచో నత్యంతో పయోగకరములుగ మాత్రిము నిస్సందేహము.

మతాంతరుల నేకులు మన దేశమందుండి స్వమత భూషణము, పరమత దూషణము చేసి మనలను మత దూరులుగ జేయుచున్నారు. జనసామాన్య మజ్ఞా నాంధ కారమున మురిగియున్నది. ఇట్టి యరిష్టముల నన్నిటిని దొలగించుటలో నీయుద్యను మొక ముఖ్య సాధనము గనుక దీనిని క్రమముగ నుపయోగించు మార్గము ననుభవ శాలులైన విూరందఱు కనిపెట్టుదురు గాక! మనమట్టి విషయమై యిప్పుడు చర్చింప సమావేశమై యున్నా ము గావున నా నాస్థలములనుండి యిందుకొఱకై యిట కువచ్చిన ప్రతినిధులయెడల సన్మాన సంఘము వారి వలన కలిగిన లోపములనుమన్నింపుడని సంఘపక్షమున మిమ్ము లను గ్రమ్మఱ వేడుకొనుచు నపారానుభవము, కార్యని ర్వహణ నైపుణ్యము జ్ఞానసంపద మొదలగు సుగుణము ల కాకరమై మనకందఱకు మార్గదర్శకులుగా నుండదగు నగ్రాసనాధిపతి 'నెన్న కొని యీసభను జయప్రదము గా జరుపుదురు గాక!

మహాజన సభాధ్యక్షులగు హానరబిల్ పానుగంటి రామా రాయనిగారి యుపన్యాసము.

సోదరసోదరీమణులారా! భాషాభిమాన ఘనులా రా! ఆంధ్రగ్రంధాలయ కార్యనిర్వాహక సభ్యులారా! అవధరింపుడు..

ఆంధ్రమహామండలికి మండనాయమానమై రాజి ల్లు నీరాజమహేంద్రవరమున నేడు జరుగనున్న శ్రీమ దాంధ్రదేశ గ్రంధాలయ సభయందు నన్ను గౌరవించి యగ్రాసనాధి పతిత్వము వహింప నాజాపించినందుకుఁ దమయెడ నేనెంతయుఁ గృతజ్ఞుఁడను,

ప్రప్రధమమున లోకమున లిపి యేర్పడకమునుపు మానవులు తమ ప్రజ్ఞాబలముచే జ్ఞానమును సంపాదించి జ్ఞాననిధులై జిజ్ఞాసువులగు నితరులకుఁ దామెఱిగిన విష యములు సమయోచితముగఁ గఱపుచు లోకోపకారము చేయుచుండిరి. జ్ఞాన మభివృద్ధి కానుగాను నట్టి జ్ఞానము నశింపకుండుటకై జ్ఞానులు తాము సంపాదించిన జ్ఞానము ను ఛందోబద్ధమగు భాషయందు నిలిపి స్థిరపఱచిరి. మన వేదాదులట్టివి. వానిని మనఋషులు తమ శిష్య పరంపరకు గఱపి ప్రపంచమున వ్యాపింపఁజేయుచుండిరి. చిరకాలా నంతరము లిపి యేర్పడి జ్ఞానమును గ్రంధస్థాపితమై సుస్థి రమయ్యె. ఇట్లు జ్ఞానము లిఖిత గ్రంధస్థమైన యనంతరము నిట్టి గ్రంధము లగుదుగ దొఱకుట చేతఁ బ్రభువులు ప్రసి దేవాలయముల యందును దమనగరుల సరస్వతీ నిల యములందును నట్టి గ్రంధములు సంపాదించియుంచి జనులు ధారమును గల్పించుచుండిరి. ఇదియె మన దేశ మునఁ బుస్తక భాండాగారముల కారంభము.

మన దేశమున నార్యస్వతంత్ర ప్రభువులు ప్రభుత్వ ము చేయుఁచుండ భాండాగారములు క్రమక్రమముగా వర్ధిల్లుచుండినవి. తరువాత జైన బౌద్ధులు ప్రబలి తమ మఠ ములయందు మొదట తమతమ గ్రంధములను బిమ్మట నితర గ్రంధముల సైతము సేకరించి గ్రంధభాండాగారము సభివృద్ధి చేయుచుండిరి.

ఆనంతరము భరతఖండమున మహమ్మదీయ ప్ర భువులు ప్రవేశింప మన దౌర్భాగ్య కృష్ణ పక్షాంధతమస ము దేశమంతయు నావరించె. గ్రంథభాండాగారము లంగారకున కాహుతులయ్యె. జ్ఞానాభివృద్ధికి హానిగ లె. భాషలకు క్షేణ్యము సంభవించె.

అంతే భారతీయ భాగ్యవశమునఁ నాంగ్లేయ ప్రభు త్వమను శుక్లపక్షము బ్రారంభమయ్యే. ఆంగ్లేయ రాజ్య ము చల్లదనమున మాత్రము చందురునిబోలి వాని యస్రి రతి వహింపక సూర్యునిపగిది సుస్థిరమై తేజోవంతమై నిఖిలజీవనాధారమై దేశీయ స్వాతంత్ర్యప్రదాయక మై నాట నాటుకొని నానాటఁ జలపడుచు వెలుంగుచుండుగాత.

గ్రంధభాండా గారముల పునరుద్ధానముచేయ సమ యము వచ్చినయది. మనదేశము మహమ్మదీయ ప్రభు త్వాంధకారమున మునిఁగి బలవత్సుషి ప్తిని బొంది జీవచ్ఛ వముపగిది నిర్వ్యాపారతఁ జెందియుండు కాలమున నన్య దేశీయులు విజానమందును నాగరికత యందును మనల జ్ఞానమందాఁటి ముందు మిగిలిపోయిరి. మనము మేల్కొని మన ల మిగిలిపోయినవారినిఁ బరువంటుకొనవలసి యున్నది. ఇది ప్రబలప్రయత్న మున గాని సాధ్యము గానేరదు. మన యదృష్ట వశమున ప్రభుత్వమువారు మన కన్ని విధములఁ దోడ్పడనున్నారు. మన ముత్సాహసమన్వితులమై ప్రయత్నింపఁదగును. దేశమున కొలఁదిమందిమాత్ర ముత మజ్ఞానము సంపాదించుట వలన దేశాభివృద్ధి కలుగఁజాల దు. జనసామాన్యమునకు యధోచిత జ్ఞానము కలుగవల యు. వలయు గ్రంధభాండాగారముల స్థాపించి ముంద డుగిడినారము. ఇక వెనుకతీయక పట్టువిడువక మన ప్రయత్నమును గొనసాగించి కృతకృత్యులము గావలయు.

“విఘ్నేర్ముహుర్ముహురపి ప్రతిపాన్యమా నాః
ప్రారబ్ధము తమగుణానపరిత్యజంతి”

ఇట్టి గ్రంథాలయము లన్యదేశములందుఁ మిగులఁ బ్రబలి యున్నవి. వీనికిని పూర్వకాలపు గ్రంథాలయములకును గొంత తారతమ్యము కలదు. రాకపోకలకు సులభములు కాని కాలమందెక్కడ నేగ్రంథము దొరకునది గుటయే దుస్తరముగా నుండినది. తెలిసిన యనంతరము నొక్కొక్క గ్రంథమునకై యెంతెంత దూరప్రయాణ ములో చేయవలసియుండె. అచ్చులేనందున బ్రచురము లేక యెన్నియో కష్టముల యనంతరము లభించిన గ్రం ధమును మొదలునుండి చివరవఱకుఁ జేతులార వ్రాసికొ నినం గాని తనదిగాదు, ఇట్లొక్కొక్క గ్రంధమును సం పాదించుటయం దింతటి కష్టముండ నా కాలమున గ్రంథ భాండాగారములఁ జేర్చుటయన్న నెంతటి కష్ట కార్య మొ యోజింపుఁడు, ఇట్టి గ్రంథ భాండాగారము లరుదు గ మూలకొక్క టెక్కడెక్కడనో మాత్రముండుట చిత్రము గాదు.

పండితు లీ పుస్తక భాండాగారములకు యాత్రలు సలిపి యేఁడులకొలఁది యట నిల్చి జ్ఞానము సంపాదించు చుండిరి. అట్టి యాత్రికులకు వలయునన్ని విధములయిన సౌకర్యములును నన్న పానాది సాహాయ్యములును భాం డాగా రాధిపతు లొడగూర్చుచుండిరి. కాని యెన్ని చే నను జనసామాన్యమువు కీ గ్రంథభాండాగారము లుప యోగించుచుండినవి కావు. జనసామాన్యమునకు చదువ క్కఱలేదను నాకాలపు దురభిప్రాయము గూడ దీనికి గారణముగా నుండచోపు. అప్పటి యభిప్రాయము లెట్లుం డినను కాల మిప్పుడు మాఱినది. చదువందఱకు నవళ్య మనుట తేటపడినది.

ఇప్పుడు నేక దేశములయందు జనుల కందఱకును జదువను వ్రాయను దెలిసియుండవలసినదని నిర్బంధపఱ చు జట్టములఁజేసి యందు కనుగుణ్యముగ ధర్మపాఠశా లల సైతము నేర్పాటు చేయుచున్నారు. జనసామాన్య మునకుఁ జదువను వ్రాయను దెలియునంతవరకు మాత్ర మీ పాఠశాలయందు నిర్బంధముగ నేర్పవచ్చు నేగాని యంతకు పైన నిర్బంధ పఱచుట యిప్పటి కాలస్థితినిబట్టి కతవ్యముగాదు. అంతకుపైన జ్ఞానము సంపాదించుకో ను విషయములో స్వాతంత్య్రమునిచ్చి పైనఁ గోరువారి కవకాశము కల్పించి మాగణము చూపి సాహాయ్యము చే యవలయును. ద్రవ్యాద్యుపపత్తులుగల విద్యార్థుల కుత్త మపాఠశాలల నట్టి యవకాశము కలిగి యున్నది. అట్టి యుపపత్తులులేని బీదసాదలకు జ్ఞానాజ౯నకు గ్రంథాల యములే శరణ్యములు కావలయు. పాఠశాలలఁ జదువఁ దగినవారలు సైతము సర్వకాలమును బాఠశాలలయందు జదువుచుండుట సాధ్యము గాదు. పాఠశాలలను విడిచి న యనంతరము నూతనముగ నుత్పన్నములగు గ్రంధములఁ బదువవలయుననిన స్వయముగ వానిని సంపాదింపలేని వారికి నీ గ్రంథాలయములే శరణ్యములు.

గ్రంథసాన్నిధ్యము గ్రంధకత ల సాన్నిధ్యము సంతటిది. అట్టి యీసాన్నిధ్య మెంతటి మేలులఁ జేశూ ర్పఁగలదు. చదువని వారలంగూడఁ జదువఁ బురికొల్పగ లదు. నలువుఁటఁ జేరినతోడనే గ్రంథముల గురించిన ప్ర సావము రాకపోవదు. ఆమాటలు వినువారు గ్రంధముల స్వయముగఁజదివి యందలి సారస్యముల గ్రహింప్ నువ్వికు లూఱుచుందురు, తద్గ్రంథములఁ జదువ నిదియె పెద్ద ప్రోత్సాహము కాఁగలదు. కాఁబట్టి యీగ్రంధాలయ ముల నెంత విరివిగ నేర్పాటు చేసి జనుల కెంత సులభసా ధ్యములుగఁ జేసిన దేశమున కంత క్షేమము. నందేమూల నేమి జరుగుచున్నదియు నిముసములోన నె ఱుఁగ గలిగినట్టియు, మా సత్రియమున భూప్రదక్షిణము చేయనగునట్టియు, గడియలోన వేనవేల ప్రతుల ముద్రిం పఁ దగినట్టియు, నీకాలమున గ్రంధముల ప్రతుల సేకరిం చుట కష్టముగాదు. పాశ్చాత్య దేశస్థు లీవిషయమున నె క్కువ ప్రయత్నము చేసి యనేక గ్రంధాలయముల నే ర్పఱచి జనులకు మేలుజేయుచున్నారు. మన హిందూ దేశములో స్వదేశాభిమానమునకుఁ బేరు గాంచిన బరోడా మహారాజుగారు వారి రాష్ట్రమున ననేక పుస్తకభాం డాగారముల స్థాపించి ప్రజల కన్ని విధముల సుఖములు గలిగించుచున్నారు. ఇంతటితోఁ దృప్తినందక వారు కే వల కు గ్రామవాసులకుఁ గూడ : నీలాభము కలుగుటకుగా ను నూకూర దిరుగుచుండుటకునై చరద్గ్రంథ భాండా గారముల సయితము కల్పించి యితరులకు మార్గము చూ పుచున్నారు. మన మాతృభాష నభివృద్ధి జేయ సమకట్టి యున్నారముకదా. ఈ విషయమున మిగుల వనుభవము గలిగియుండు పాశ్చాత్య దేశీయుల గ్రంథభాండాగారము మాతృకలఁగా నిడికొని మన భాండాగారములు స్థిర ములుగాను జనోపయోగకరములు గాను నడుచునట్లు క ట్టుదిట్టములు జేయవలెను.

౧౭౫౩ వ సంవత్సరమున స్థాపింపఁబడిన బ్రిటిష్ మ్యూజియమను వస్తుప్రదర్శ కళాశాలా సంబంధమగు గ్రంథాలయము లోకములోని యన్నిటికన్న మిక్కిలి ప్రసిద్ధి కాంచినయది. ప్యారిస్ పట్టణమునందలి బిబ్లియోధి కె న్యాష నేల్ యను గ్రంథాలయము గ్రంధసంఖ్యయం దు బ్రిటీష్ మ్యూజియమును మించియుండినను పాఠక సౌ కర్యములగు నేర్పాటులందు బ్రిటిషు గ్రంథాలయమున కు సాటిరాదని చెప్పఁదగి యున్నది. ఈ బ్రిటిష్ గ్రంధా లయమందు ౧౫౫౦౦౦ ముద్రిత గ్రంధములును ౫౦౦౦౦ యముద్రిత గ్రంధములు నున్నవి. ఇందొక విశేషము. కేవల మాంగ్లేయ భాషా గ్రంధములేకాక యన్యభాషాగ్రంధము లుకూడఁ బెక్కులుగలవు. ఐరోపాఖండము దేశ భాష లలో నాయా దేశమున గల శ్రేష్ఠ గ్రంధ సముదాయముల నెల్ల నిందుఁ జేర్చియున్నారు.

ఈగ్రంథములన్నిటిని వలయాకృతిఁగల పఠనాల యమునఁ జుట్టును మంచల పై నమర్చియున్నారు. పఠనా లయములోని ౮౦౦౦౦ గ్రంథములలో పాఠకుల యవిచ్ఛి న్నో పయోగమునకై క్రిందియంతస్తున 90000 గ్రంథము లున్నవి. గ్రంథముల వాడునతఁడు చదువరులకు సహా యము చేయుచుండును. ఈగ్రంథాలయమునఁ జదువు టకు గ్రంథాలయాధిపతి యనుమతి యుండవలయు. ఈయనుమతి ౨౧ సంవత్సరమునకుఁ బై పడినవారికి మా మొసగబడును. వారికిని మఱియొకగృహస్థుని ప్రార్ధన మీఁదనె యొఁసగఁ బడును. చదువఁగోరువారు ముఖ్య గ్రంధాలయాధిపతి య నుమతిలేఖను గవాటమునొద్దఁ గనఁజఱచిన నే యంతః బ్రవేశము గలుగఁ కలదు.

౧౮౮౦ సంవత్సరమున ౧౩౩ ర రు చదువరు లీ గ్రంధముల నుపయోగించిరట. సామాన్య గ్రంధాల యములును బ్రత్యేక శాస్త్రగ్రంధాలయములును ననేక ప్రదేశముల న నేకము లున్నవిగాని యిదియే బ్రిటిషు ష్ట్రములలో ముఖ్యగ్రంధాలయము.

చందాలవలన నేర్పాటుచేయఁబడిన గ్రంధాలయ ములలో లండజ్ లైబ్రరియను గ్రంథాలయము ముఖ్య మైనది. ఆక్స్ఫర్డ్ పట్టణమునందలి బోర్డి లియక్ గ్రం థాలయమున నచ్చటి విశ్వవిద్యాలయ విద్యాబ్రహ్మచా రులకును, పలుకుతోడుఁగల వారికిని, ౧౮ సంవత్సరముల వయస్సుకు మిగిలిన యితరులకును మాత్రము ప్రవేశము కలదు. గ్రంధాలయ పాలకుల ప్రత్యేకానుమతిలేనిదె గ్రంధముల గ్రంథాలయము బైటకుఁ బంపుట లేదు.

బర్మనీ దేశపు గ్రంథాలయములలో జదువరుల వి వయమైన చట్టము లంతకన్న కొంత ధారాళముగ ను న్నవి. ప్రాయిక ముగ్మ యౌవనులకందఱకును బఠనాలయ మునఁ బ్రవేశము కలదు. గొప్పయుద్యోగస్థులకందఱకు ను, దటస్థుల ప్రార్ధనమీద నితరులకును గ్రంథములు చ దువ నవకాశము గలదు. పత్రికాశాఖకు మాత్రము ప్రవే శము గొంత కష్టతరము.

ఇటలీ దేశమున గ్రంథాలయములు తఱుచుగ భుత్వ సంబంధము గలవియై వారి విధులచేఁ బాలింపబడు చుండును, అమెరికా దేశమున గ్రంథాలయములు మిక్కి లి యాధునికములు. ఈ దేశమున గ్రంథాలయములు మి క్కిలి ప్రబలియున్నవి. కట్టుదిట్టములును జక్కఁగఁచేసి యున్నారు కాఁబట్టి నూతన సృష్టి చేయవలసియుండు మ నాకు మనయాంధ్రదేశ గ్రంధాలయ నిర్మాణమనందు వీరి గ్రంధాలయము లాదర్శములుగ నుపయోగింపఁ దగియు న్నవి. అయిన నీవిషయమున నిర్నయముగ నిబంధనలఁ జే యుట యన పేక్షణీయము. ఆయాసందర్భముల ననుస రించి సమయోచితముగ నేర్పాటులఁ జేసికొనుచుండవల యును, ఆయిన స్థూలముగఁ గొంత మట్టు కాలోచింపవ చ్చును.

గ్రంధాలయముయొక్క గృహనిర్మాణమువిషయ ములో గ్రంధాలయోపయోగమును జక్కఁగ నెఱిఁగిన యనుభవశాలి యభిప్రాయము ననుసరించి గృహభాగము ల నిర్మింపవలయు. పఠనాగారములు గ్రంథాగారములు కర్మాగారములు కార్యస్థానములు మొదలగునవన్ని యు నొక్కటొకటికిఁ గలసంబంధము ననుసరించి చక్కఁగ్ర సమర్పఁబడవలయు, గ్రంధాలయ మవిచ్ఛిన్నముగ వభి వృద్ధియగుచుండునది కనుక నట్టి యభివృద్ధి కభ్యంతరము లేకుఁడ గృహవిన్యాసము నేర్పాటు చేయవలయు, చె మ్మలేనిచోటున నగ్నిభయమున కెడమియ్యని పరికరము గృహనిర్మాణము చేయునదియుక్తము.

అలంకారముకం టె గ్రంధక్షేమమును సౌకర్యము ను ముఖ్యముగ గమనింపఁదగును. అయినను ప్రసిద్ధ గ్రం ధక ర్తల చిత్తరవులచే రమ్యముగ నలంకరింపఁబడి జనా కష౯కముగా నుండుట యవశ్యకము. పఠనాగారములు వైశాల్యముగలిగి వలయు నంతవాయు సంచారముగలవి గా ను, నైఘంటిక గ్రంధ భరితములుగాను నుండవలయు. పఠనాగారములలో స్త్రీ పురుషులకుఁ బ్రత్యేకమవకాశ ముండుట యుక్తము, ప్రథాన గ్రంధనిలయము పాఠకుల కుఁ బ్రవేశముండునది కాదు కావున నందు గ్రంథముల నిమిడిక నుంచవచ్చును. పొడవగు నిచ్చెనల నుప యోగింప నక్కఱలేకుండునట్లు మిక్కిలి యున్న తము గాని మంచెలను గోడలంటకుండ వెంబడిగా నుంచవచ్చు ను. నడుమ గజముచోటిచ్చి ద్విముఖములగు మంచెల నుంచవచ్చు. ఈ విధమున నెక్కువస్థలము నాక్రమింపక స్వల్పస్థలమునసే యనేక గ్రంధముల నిమిడింపవచ్చు. గ్రంథాలయము వలయాకృతిగ నుండుటలో స్థలము సిరాఁగలదు. మనుష్యులకువ లెనె పుస్తకములకును గాలి వెలుతురు నవశ్యకము గనుక దీనిని గమనింపఁదగును. గ్రంథములనుఁ జెదలంటకుండ దుమ్ముచేఁ జెడకుండను భద్రపఱచవలెను. గ్రంథాలయములకు ముఖ్యాంగము గ్రంధముల పట్టిక, పట్టికను మిక్కిలి నేర్పుతో నేర్పా టు చేయవలయు. పట్టికను జక్కఁగా నేర్పాటు చేయ కల నంతట గ్రంథాలయమునకు న్యూనత కలిగి దాని ము ఖ్యోద్దేశమునకు భంగము కలుగవచ్చును. చదువరు లకు వలయు గ్రంథము లున్నదియు లేనిదియు సు లభముగాఁ దెలియునట్లు పట్టికల నేర్పఱచ వలయు పాఠకుఁడే దేని విషయమును జదువఁగోరి యావి షయముననే యేగ్రంధకత రచియించిన యేయేగ్రంథ ములున్నవో తెలిసికొనఁ గోరవచ్చును. అది సులభముగ దెలియునట్లు పట్టికను గావింపవలయు. ప్రాయిక ముగ నొక్కొక్కగ్రంధాలయమునందును బహువిధపట్టిక లుం డవలయును, గ్రంధనామములఁబట్టియొక పట్టికను, గ్రంధవి వముమునుబట్టి వేఱకటిని నేర్పఱచునది యవశ్యము, గ్రంథాలయము వృద్ధిపొందుచుండుకొలఁది పట్టిక యు మాఱుచుండవలయును. పట్టిక నేర్పఱచుటలో గ్రంథా లయాధిపతి తోడ్పాటు ముఖ్యముగా నుండవలయును. గ్రంథాలయమునందుగల గ్రంథములను గ్రంధాలయాధిప తి యెఱిఁగియుండవలయును. పట్టికలు పలుమాఱు మా ఱుచుండుటనుబట్టి వాని వచ్చువేయించుట వ్రాయకరమై నేను వ్రయమునకుఁ బ్రాల్మాలక పాఠక సౌకర్యమునకై యచ్చొత్తించుట కార్యము. చదువరుల కుపయోగించు నీపట్టికలు గాక గ్రంథాలయ పాఠకుల యెఱుకకై మఱి రెండువిధములగు పట్టికలుండవలెను. ఒకటి గ్రంథసం పాదన పట్టిక . ఇందు గ్రంధాలయమునకు వచ్చు పూర్ణ గ్రంథములను గాని గ్రంధభాగములనుగాని మాసాది పత్రిక లనుగాని యప్పటప్పటికి జేర్చుచుండవలయు. ఎట్లు ల భించినది యెవరివలననో సంగబడినదియేనాఁడు చేరినది మొ దలగు నన్ని యంశములు నిందుండవలెను. రెండవది మం చలపట్టిక. ఏయేమంచయం దేయేగ్రంధములున్నదియు నిందుండవలెను.

గ్రంధాలయ పాలన.

పైనఁజెప్పిన రెండుపట్టికలనుబట్టి గ్రంధాలయపా లకు, డప్పుడప్పుడు గ్రంధముల నుండఁజూచుచుండవల యును. క్రొత్త గావచ్చిన గ్రంధములను గొంతకాలమువ రకును బ్రత్యేకముగా నుంచియుండి తరువాత వాని ని ర్హితసలములఁ జేర్చుచుండవలయు. గ్రంధాలయమునందు జదువరులకుఁ దోఁచు గుణాగుణములు సూచించి వారికిఁ దోఁచిన సంస్కారమార్గములను బోధించుటకుఁగా నొక పుస్తకము నుంచఁదగు. పత్రములఁగత్రించు నుద్యోగము చదువరులకు విడువక గ్రంధము రాగానే గ్రంథాలయో ద్యోగస్థులే యాపనిఁ దీర్చుచు గ్రంధములందు దుమ్ము నిలువనీయక నేర్పుతో గ్రంధములు నలుగకుండఁ దట్టివే యుచుండవలెను.

చదువఁగోరువారికి వలయు గ్రంధములఁ జదువ నవ కాశమిచ్చుటయే గాక యుక్తమగు విషయములను జదు వునట్లు జదువరులఁబ్రోత్సాహపఱచుటయు గ్రంథాలయ ప్రయత్నముగా నుండవలయు. ఈవిషయమై గ్రంధాల యములలో నప్పుడప్పుడు నుపన్యాసములఁ బండితులచే నిప్పించుచుఁ జరద్భింబ ప్రదర్శనములచే విషయముల జను లకు బోధపఱచుచుఁ జదువనివారికి సైతము చదువవలయు నను నభిలాష కలిగించుచుఁ జదువువారి కెట్టివిషయముల నేతీరునఁ జదువవలసినదియుఁ దెలుపుచు గ్రంధాలయ ముల యుద్యమము సఫలముఁ జేయవలయును. గ్రంధాల యపాలకుని సామర్థ్యమునఁ జాలవఱకు నీ కార్యము నెఱ వేఱఁగలదు. గ్రంథాలయపాలకుఁడు పండితుఁడు గాను గ్రంధములయందును దత్ప ఠనమునందును మిగుల నాసక్తి గలవాఁడుగాను, శాంతుఁడుగాను, గంభీరుఁడుగాను, సమయస్ఫూర్తి కలవాఁడుగా నుండవలయు, పాలకుని సహాయోద్యోగస్థులుగూడఁ జదివినవారుగాను ననుభవ శాలురుగాను నుండవలయును. ఐన మన దేశమున గ్రం ధాలయముల నేర్పఱచుట కిదియే యారంభముగాన మన కట్టి యనుభవముగల యుద్యోగస్థులు దొఱకుట దుస్సా ధ్యము. మొదట నేర్పడు గ్రంధాలయమున నట్టి యు ద్యోగస్థులకుఁ బనులఁ గఱపి కాలక్రమమున నేర్పడు గ్రంధాలయములకుఁ బంపుచుండవలయును. అట్టి యు ద్యోగములు నేర్చుకొనుటకుఁ గొందఱఁ బ్రోత్సహించి సహాయము చేసి వారల కుద్యోగముల నొసంగుచుండిన గొలఁదికాలములో నే వలయు నుద్యోగస్థులు దొఱకఁగల రని తలఁచెద.

గ్రంధముల నేర్పఱచుట.

కేంద్ర గ్రంథాలయమునందు భాషలోనున్న గ్రం ధములన్నియు నుండవలయుఁ గాని తక్కినశాఖా గ్రంధా లయములు నది సాధ్యముకాదు. మఱి యంతగాఁ గోఱఁ దగినదియును గాదు. కాఁబట్టి యట్టి గ్రంధాలయమున నే యేగ్రంధముల నుంపవలయుననులు చక్కఁగా నాలోచిం పఁదగిన విషయము. దుర్ణీతులఁ గఱపునట్టి గ్రంధముల గ్రంథాలయముఁ జేరనీయకుండుట క్షేమము. గ్రంథాల యము యొక్క స్థితిగతులను నుపపత్తిని అనుసరించి దొ ఱకఁగల గ్రంథములలోనుండి యుచితములగు గ్రంధము ల నేర్పఱచుకొనవలెను. కేంద్ర గ్రంథాలయమున మాత్ర ము భాషలోనియన్ని గ్రంథములుండుట యుక్తమని చె ప్పియుంటినిగదా? ముద్రిత గ్రంథములు ద్రవ్యసాధ్యములు. అముద్రిత గ్రంధములు కేవల ద్రవ్యైక సాధ్యములుగావు. ఇ దివరకట్టి గ్రంధములుఁజేర్చియుండు విద్యారసికులు మహా నుభావులందఱును దోడ్పడిన గాని సాధ్యముకాదు. ఇంక ముద్రించు గ్రంధముల విషయములోఁ బ్రభుత్వమువారు ను భాషాభిమానులకు ముద్రించువారును గ్రంధకర్తలును దాముముద్రించు ప్రతిగ్రంథము యొక్క ప్రతిని మన కేం ద్రగ్రంథాలయమునకుఁ బం పెద లేని వారు మిక్కిలి సహా యము చేసినవారగుదురు.

పత్రిక.

గ్రంథాలయమున కను బంధముగ గ్రంథాలయ వి వయమును గ్రంధవిమర్శనములను బ్రచురించు మాసపత్రి కయో వారపత్రికయో యొకటియున్న యుక్తముగానుం డును. కాలక్రమమున నట్టివిమర్శనయందు తేలినగ్రంధ ములు మాత్రమె పఠనీయ గ్రంథములు గాఁ గావచ్చును. ఆంధ్రరాష్ట్రమునఁ బ్రత్యేక విశ్వవిద్యాలయమునకై మ నము జేయు ప్రయత్నము సఫలమగు నేని కేంద్ర గ్రంథాల య మావిశ్వవిద్యాలయమున కనుబంధముగ నుండఁదగు.
మహాజనులార! గ్రంథాలయ ప్రయత్నము ద్రవ్యై కసాధ్యమనునది తమకు సమర్పక మె. ఆంధ్రులలో ప్రభు వులు ధనికుల నేకులుగలరు. శ్రీమాననీయ పీఠికాపురప్రభు ప్రభృత లయాచితముగఁ దమ సానుభూతిని నుదార దాతృత్వమును గనబఱచియితరులకు మార్గదర్శకులై యు న్నారు. అధైర్యపడి నక్కఱలేదు. సర్వేశ్వరుఁడు గ్రం థాలయ ప్రయత్నమును సఫలము జేయుఁ గాత,