గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/జపానుదేశమందలి ప్రాచీనపుస్తకాగారములు
జపాను దేశము.
ప్రపంచమందలి ప్రతిఖండమందును ప్రాచీనకాలమునుండి విద్యావ్యాసంగమునం దభిలాష గల వారలుండిరి. జపాను దేశమందును నట్టివారుండిరని చరిత్ర ప్రతీతి.
షి.మెక్షుూ పరగణాలోని ఆషికగా నగరమందున్న భాండాగార మతిప్రాచీనమైనది. పూర్వము 8 మొదలు 11 శతాబ్దముల వరకుగల హెయినా రాజుల కాలము జపానీయుల స్వణ౯ యుగమని పిలువబడెను, ఆకాలమున పద్యగద్యాత్మకములగు ననేక గ్రంధముల వ్రాతప్రతులు చేర్చబడెను.
నియుమీయను చక్రవతి౯ కాలమున ననగా క్రీ.శ.842 సం॥ ప్రాంతమున టమూరాఒనో అను నొక గవర్నరు ఆపరిసరమున నొక పాఠశాల స్థాపించెనని యింకొక ప్రతీతి కలదు. ఎట్లయినను 1467 సంవత్సర ప్రాంతమున నాగావో అను నతనిచే నింకొక పాఠశాల స్థాపింపబడుట రూఢి. ఇందులోనే యొక ప్రసిద్ధపుస్తకభాండాగారం ప్రారంభింపబడెను. 15వ శతాబ్దమున నొరిజానీయుసూజీయను నుద్యోగస్థుడీ భాండాగారమునకు 'భూతులనిచ్చి గ్రంధములనేకములను జేర్చిను. కాలక్రమమున నిచ్చోటనే పుస్తకములచ్చుబడెను.
టోకుగా వాయియాషు అను నాతడు కన్ఫ్యూషియసు యొక్క ప్రతిమనొకటి యీ పాఠశాలలో నుంచెను. ఆ ప్రతిమ నేటికిని గలదు. కన్ఫూషియను అనునాయనచే రచియింపబడిన గ్రంధములు 18 ఇందుగలవట.
తరువాత కనజావాలో 12వ శతాబ్దమధ్యమున స్థాపింపబడిన యింకొకపుస్తక నిలయము కలదు. సానిటోకీహాజోయనువానిచేనిది స్థాపింపబడెనని చరిత్రకారులు నమ్మెదరు.
ఈపుస్తక భాండాగారములు రెండును లేచిన కాలముననే యూరపునందును భాండాగారములు 'స్థాపితములాయెను. జపానీయు లిప్పుడీ పుస్తక భాండాగారములను జూచునప్పుడు వాని సంస్థాపకులను కొనియాడుచున్నాడు. పఠనముందిరములు, పుస్తకాగారములు దేశమున నన్ని వైపులు నెలకొల్పబడినపుడు ముందు యుగమున రాబోవు జనులు కృతజ్ఞత గలవారుగనుందురు.