Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/జన్మకథ (పద్యములు)

వికీసోర్స్ నుండి

జన్మకథ.

శ్రీయుత రవీంద్రనాధ ఠాకూరుగారిచే వ్రాయబడినదానినుండి అత్తిలి సూర్యనానాయణ గారిచే భాషాంతరీకరింప బడినది.

'ఏకడలనుండి వచ్చితి నెఱుఁగఁ జెప్ప
నమ్మ! యెచ్చోటఁగన్గింటి వమ్మ! నన్ను ?”
ననుచుఁదల్లిని బసిపాప యడుగఁ జొచ్చె;
నంత శిశువును దనయక్కునందుఁ జేర్చి
యింతకన్నీరు విడుచుచు నింతనగుచు,
నీవిధంబున నుత్తర మిచ్చే, మాత:-
నాదు మురి పెంపుబిడ్డ! వినంగదమ్మ!
యల్ల నా బాల్యమందాట లాడునప్పు
డూయెలలోన నాతోడ నుంటివమ్మ!
మట్టి శివుఁ జేయ నెద సమకట్టినపుడు,
చేయుచును జెఱుపుచును వచ్చితిని నిన్ను;
నాదు గృహదైవతముతోడ నీదుమూర్తి
వెలయు చుండెను సింగపుఁ బీఠియందు;
పూజజేసితి నిన్నుఁదత్పూజనమున
బిడ్డ ! నాముద్దు పట్టి! సత్ప్రియములైన
మధురవాంఛల నెల్లఁ, బ్రేమముల నెల్ల,
రాగముల నెల్ల, మాయంబ బ్రతుకునందు,
మఱియు నమ్మమ్మ జీవితమహితవార్థి
జీవమందుచు నుంటివి చిన్నయపుడు.
మన గృహంబును బాలించు మానవతికి
మెడీని యుగయుగంబులు డాగియుండి యెపుడు
నూర్జితానందమును గూర్చు చుంటికదవె
బాల్యమున నాదుహృదయంబు ప్రసవమట్లు
క్రమవికాసము నందెడి కాలమందు
దానిచుట్టును గమ్మని తావివౌచు
వెలయుచుంటివి గాదె! నీలలితమైన
మార్దవంబు నదెట్టులో మచ్ఛరీర
మునను జవ్వనమున్నిల్పఁ బనుచుచుందు,
బిడ్డ! ముద్దులపట్టి! యీవిశ్వమందుఁ
బరిఢవిల్లువాని కనుంగుపట్టి వీవు!
శాశ్వతా పరివర్తిత చారుమూర్తి
వఖిలవిశ్వంబు నుదయించునపుడ యుంటి
వైహిక స్వప్న జీవనమందు నుండి
సత్పదార్థ మురీతి నా స్వాంత మందుఁ
గూడి యాడంగ నోబిడ్డ! కోర్కెలూర
గురుత రానంద వార్ధులఁ గూడి యిటకుఁ
దేఁబడితివీవు; నీమోముఁ డేఱిచూడఁ
దెలియరాదయ్యె నీమాయ తేటపడఁగ;
నెల్ల వానికిఁ జెందుచు నెసఁగునీవు
నాపదార్ధంబ వెట్లేదు? నాతనువునె
నీతనువునందుఁ జుంబింతు; నీ వొకర్తు
బిడ్డవై యుంట, నాముద్దుబిడ్డ ! నవ్వు
చుండి యీ భూమికరుదెంచి యుంటి వీవు.
నిన్నుఁగోల్పోవుదునెయంచు, నేభయాన
నదిమి పట్టుదు బిగ్గ నా యక్కు నందు;
నిన్నను క్షణమేఁ గననేరకున్నఁ
దద్దయు న్విలపించెదఁ దనువు మఱచి;
నాసుకోమల హస్తంబునక్ గనంగ
నెట్టిమాయ విశ్వధనంబునెల్ల నొకట
నెట్టుబో నెగ్గిపట్టెనో యెఱుఁగ; బిడ్డ!