గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రాహ్యపుస్తక విమర్శ
గ్రాహ్యపుస్తకవిమర్శ.
భరతఖండమునందు పుస్తకములకు పుస్తకాలయములకు చరిత్రకందని కాలమునాటనుండి యుత్తమ గౌరవస్థాన మొసంగబడుచుండినను, లిపి ప్రాచుర్యములో నుండినను, చదువను వ్రాయను, నేర్చుట విద్యకు ముఖ్యాంగముగా నెన్నఁబడినను, వీనితోపాటు జ్ఞానప్రాచుర్యమునందుమాత్రము లాతిదేశములకంటే వేయిమడుంగులు ధారణాశక్తి గౌరవము జేయఁబడుచుండెను. గ్రహణశ క్తితోపాటు ధారణగూడ ప్రయత్న పూర్వకాభ్యాసముచే నీదేశమునందు పెంపుసేయబడుచుండెను. పుస్తకము కంటేగూడ నొక్కొకతఱి ధారణకే పూజ్యత గలుగుచుండెను. మనకాది గ్రంధమైన వేదమునందు సంశయముగలిగినప్పుడిప్పటికిగూడ నచ్చయిన గ్రంథముల కంటె పండితుల ధారణయే ప్రమాణము. చదువను వ్రాయను నేరువనివాఁడు జ్ఞానశూన్యుఁడని యితర దేశములందు వాడినట్లు భరతఖండమందు వాఁడ నైతిఁ గాదు. జనాభాలెక్కలనుఁబట్టి నూటి కెంతతక్కువమంది చదువగలవారు తేలినను తక్కినవాండ్రందరు ప్రాకృతులనియుస్త్రీలు సామాన్యముగ గ్రహించబడినట్లు అజ్ఞానాంధకర నిమగ్నులనియు మనమధైర్యపడ నవసరము లేదు. కఠినతరములైన శాస్త్రార్ధములు జనులెరుంగక పోయినను, ధర్మాధర్మస్వరూపజ్ఞానము, యుక్తాయుక్త విచక్షణ, సాంప్రదాయ నేతృత్వము, జనసామాన్యమునకు కలుఁగకపోలేదు. సామాన్యజనులు వాడుకొను పదములు వేదశాస్త్రమూలకములు. అవి వారి ప్రవత౯నను శాసింపుచుండును. ఈవిషయము ముందు గ్రహించినగాని పుస్తకములు, పుస్తకాలయములను గుఱించి చర్చించబోవు వంశములు స్పష్టములుగావు. వ్రాయబడిన పుస్తకములేగాక వ్రాయని వేదములు, వ్రాయని యచలబోధ, వ్రాయని యాధ్యాత్మరామాయణము, వ్రాయని తత్వములు, వ్రాయని పదములు, ద్విపదలు, రగడలు జనసామాన్య కణ౯గోచరములై భరతఖండమునందు జ్ఞానవ్యాపకము చేయుచున్న విషయము మనమందరము ముఖ్యముగా నెఱుఁగదగినది.
కాన పుస్తకములన్న నేమో కొంత విచారించవలసి యున్నది. పుస్తకములన, ఆటలుగలిగిన కాగితపు బొత్తులు కావు. పుస్తకములన వ్యష్టి దేశము యొక్క సాంప్రదాయమును, అనుభవమును పరమావధులు, రుచులు, సంస్కారములు, మొదలగువాని స్థూల శరీరములు. ఈ యధ౯ము మనమంగీకరించినచో పూర్వోదాహృత సంస్కారాదులు గుణకర్మభేదములు కలిగిన వేరువేరు దేశములు వేరు వేరుగ నుండును. కానీ ఆయా పుస్తకములు గూడ వేరువేరుగ నుండును. ఇవియన్నియు 'మొత్తము మీఁద మానవసమిష్టి జ్ఞానదాయకములై యొప్పుచుండు. సాంప్రదాయములు, సంస్కారపరమావధులు, అన్నిదేశముల కొక్కతీరుగు నుంచవలయునని ప్రయత్నించుట యసంగతము. అవి యట్లుండుట యసంభవము. పృధక్త్వము కాపాడుట ముఖ్యక౯త కావ్యము. జనసమిష్టి జ్ఞానమును పొందగోరువానికి సర్వదేశపుస్తక సారమును గాంచవలసిన యావశ్యకత యేర్పడును.
భిన్న భిన్న దేశములకు కొన్ని సమానధర్మములు, విశిష్టధర్మము లుండును. సామాన్యవిశేష ధర్మస్వరూపము నెఱింగి వ్యష్టివ్యక్తులయందున్న విశిష్ట ధర్మములను కాపాడవలయును. ఆవిశిష్టధర్మరక్షణ తద్ధర్ములకే వలనుపడునుగాని లాతులకు చేతగాదు.
కాన మన విశిష్టధర్మములను తెలియపర్చి పెంపొందించు పొత్తములవశ్యపఠనీయములని యెరుంగునది. పుక్త కాలయములందు వీనికి ప్రధమ గౌరవస్థాన మొసంగుచుండవలయును. శ్రీరంగాది దేవాలయ నిర్మాణమునకు ఆర్యశిల్పిశాస్త్రము, “టాజ్ మహల్" నిర్మాణమునకు మహమ్మదీయ శిల్పము, అధ్యాత్మవిచారణకు భరతఖండజ్ఞాన సంస్కారము, ప్రకృతిశాస్త్ర కళానైపుణ్యమునకు పాశ్చాత్యవిజ్ఞానము, నిట్టుల నొక్కొక వ్యష్టి విశిష్టగుణములు నొక్కొకటి నొసంగుచు సమిష్టి జ్ఞానమును వృద్ధిచేయుచుండును.
వ్యష్టికి గాని సమిష్టికి గాని విద్యగఱప పెంచినప్పుడది ఆవ్యష్టి సమిష్టుల సంస్కార సాంప్రదాయాను సారము నొసంగబడవలయునేగాని తద్విరుద్ధ ప్రయత్నము వ్యర్థము.
ఆధునిక కాలమందలి పుస్తకములు కొన్ని సాంప్రదాయ జ్ఞానము లేక వ్రాయఁబడిన వగుటచే తద్భావములు పెండింటపాలికలలో తొలుదొల్తనేవళముగా వచ్చి వేరులో తంటకపాలి పడిపోవు భంగి యంతరించుండుమ, మఖలో పుట్టి పుబ్బలో మాడు పుస్తకములు, నాచంద్రస్థాయిలగు పుస్తకములు అను రెండు తెఱఁగులలో, వ్యష్టి సాంప్రదాయ సంస్కార పరిణామములు గలిగినవే యాచంద్రస్థాయిలగును. తక్కొరులు మొదటి తరగతి అని గ్రహించనగును. పుస్తకముల యొక్క యదాధ౯ము నెరింగి పుస్తకాలయములు స్థాపించినచో దేశమున కెల్లయెడల మేలు గలుగ గలదు.