Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు

వికీసోర్స్ నుండి

మార్గమనియు, ఆచరణయోగ్యమనియు మా తము గ్రహించి యేతాలూకావా రా తా కాయం దిట్టి సంఘముల నెలకొల్పి విద్య నభివృద్ధి జేయ జేయ మిమ్మందర ప్రార్థించుచున్నది. కనుక గ్రంథ భాండాగారికులారా ! మహాజను లారా !! చదువన నెట్టిదియో యెరుగక, చ దువరులఁజూచి సిగ్గుఁ జెందుచు, తమ జీవితము నెట్లు గడు పవలయునో గ్రహింపక యుండు విద్యావిహీనులగు మీ దేశీయ సోదరుల స్థితిఁజూచి మీ చేతనై సంత సాయము జేయ క మీరూరకుండవచ్చునా ! ఎట్లూరకుండ గలరు ? మీతోపా టాంధ్రమాతృగర్భమున జనించి మీకన్న హైన్యస్థితియందుండ, వారి కనత్వమే మీ హీనత్వముకాదా ? మనమం చర మాంధ్రమాతృగర్భమునం దుద్భవించిన యేకోదరులమని తెలసుకొని, ఆంధ్రమాతృ రక్తమే మన యెల్లర దేహములను బ్రవహిం చుచున్నదని యెఱింగికొని, యేకోదరత్వము, రక్త బాంధవ్యములకన్న మిన్న యగునది సున్న యని గ్రహించినచో నిదియొక ఘనకార్యము గాడు. కావున మీ సోదరులై మీకన్న బీదలై, మీ దయాభిక్షములకు వేచియున్నట్టియు, నా శించియున్నట్టియు, విద్యావిహీనులకు నిరక్ష రకుక్షులకు విద్యాదానముఁ జేయ గంకణము కట్టుకొని గ్రంథభాండాగారములు దేశమునకు నిజమగు నుపయోగవంతములుగా జేయుదురు గాక ! మఱల జరుగబోవు గ్రంథా గార సభనాటి కిట్టి సంఘము లొండు రెండేని స్థాపింపబడి ప్రారంభవిద్యాభివృద్ధికి దోడ్పడం ను గాక !

సత్తెనపల్లి హనుమంతరావు.

గ్రంధాలయములు.

శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారు అంగలూరు బాలసరస్వతీ పుస్తక భాండాగార వార్షికోత్సవ సమయమునందిట్లు జెప్పిరి:

విద్యాశాలలవలెనే గ్రంధాలయములు ప్రాచీన కాలమునందు మన భరతఖండమునఁ జాలఁ గలవు. అవి చేసిన కార్యములు వణ౯ నా తీతములు. కవి యొకగ్రంథమును రచించును. భాష కెల్ల నొకేప్రతియుండిన దానివలన లోక ములో నెందఱకుప యోగముగల్గును? ఇప్పటి వలె నప్పుడు ముద్రాలయములు లేవు. చక్క ని కాగితములు లేవు. అచ్చు లేదు. అందుచే గ్రంధములు విశేషవ్యా ప్తంగాంచెడివి కావు. అయినను మహాకవులయందుఁగల యాదర మునంజేసి పెక్కురు గ్రంధములను దాటి యాకులపై వ్రాసి లేక వ్రాయించి పఠించు కొనుచుండెడివారు. ఆగ్రంధములు వారికే యుపయోగించుచుండేవి. పోయిన మరల నట్టి . గ్రంధములను సంపాదించుట దుర్ఘ టమని యె ఱింగి వారు పరుల కా పుస్తకముల నిచ్చెడు వారు కారు. ఆయీవిషయములం గమనించి మన భరతఖండపుఁ బూర్వ రాజులు పెక్కు గ్రంధములను వ్రాయించి యొక భవనమున నుంచి చదువుకొనఁగోరు పండితుల కుచితము30 గా నిప్పించుచుండెడివారు. ఆపండితులు తమ పని ముగియఁగ నే ఆగ్రంధములను మరల ని చ్చెడివారు. ఇట్లే మనప్ర స్తుత భాండాగారము ల కంకురము భరతవర్షమున వేలకొలఁదివత్స రములక్రింద నే యేర్పడినది,

ఇది నవీనయుగము. మానవప్రపంచము సర్వవిధముల నభివృద్ధినందుచున్నది. భావము లు, శాస్త్రములు, తెలివి, నాగరికత దినదిన ము హెచ్చుచున్నవి. ప్రపంచయాత్ర నీనూ తనయుగకళలం దెలియక చేయుట దుర టము. దుర్ఘ అందు కేమిచేయవలయును? గ్రంధములం బఠి యించుటే. వివిధ విషయిక జ్ఞానముఁ గల్గించు కొను టే, అందుకుఁదగిన సాధనము లేవి? గ్రంథ భాండాగారములే.

తక్కిన హిందూసామ్రాజ్యముతో పాటు మన యాంధ్ర దేశమును ఈ విషయమున వెనుకపడియే యున్నది. అయినను గొలఁదికాలము నుండీ మన యాంధ్రులు విశేష యుత్సాహ ముంబూని వీనిని స్థాపింప యత్నించుచున్నా రని చెప్పుటకుఁ గొంత సంతసింపవలసియు న్నది. దినదినమును ఆంధ్రపత్రికలలోఁ క్రొ త్తభాండాగారములు జన్మించుచున్నట్లు చదు వుచున్నాము. దేశ మున నన్ని భాగములను ఈయుద్యమము కదలుచున్నది. అయినను ఇంతవరకు మనదేశమున గొప్పవి అయిదారు కంటె హెచ్చుగా లేవు. బందరు, ఏలూరు, కాకినాడవంటి పెద్దపట్టణములలోఁ గూడఁ దగిన భాండాగారములు లేకపోవుట చూడ మనమెంత దుస్థితియందున్నది తెలియఁగలదు, అయినను ఈలోపములను దొలఁగించుటకై ఆంధ్రదేశ పుస్తక భాండాగార సంఘము నెక దానిని గతసంవత్సరము స్థాపించినారని చెప్పుటకు నాకానందమగుచున్నది. కాని యిది రెట్టిపనిని జేయునో ముందు చూడవలసి యున్న ది. ఈ సంఘమువారు సంవత్సరమునకొకసా। సమావేశమయి నుంచి చెడ్డలను జర్చించ కొనుటతోనే తృప్తినొందక కొందఱు సం చారకులను నియమించి యాంధ్రలోకమున వివిధ భాగములందున నీసదుద్యము నెడ ననురాగము జనించునట్లును భాండాగారములను సా పించునట్లును జేయింతురుగాక, మరియుఁ గొందరు గొప్పవారు పోఁగయి జమీందారులను బెద్దవారిని యాచించి కొంతధనమును సంపా దించి మూలధనముగా నుంచి దానిపై వచ్చు డబ్బులోఁ గొంత భాగమును క్రొత్త భాండా గారములకిచ్చుచుఁ బ్రోత్సాహము చేసిన మేలుగానుండును.

అమెరికా దేశమున భాండాగారములు మ హత్కార్యముల నొనరించుచున్నవి. కొన్ని గ్రంధములను ముద్రించుచున్నవి. దీనికై కొ న్నిటికి ముద్రణాలయములు కలవు. మఱికొ న్ని రాత్రిపాఠశాలలు స్థాపించి బాలురకు బాలికలకు భాండాగారములు నెట్లుపయోగిం చుకొనవలసినది తెల్పుచున్నవి. పాఠశాలలం దు, రచ్చచావడులందు, న్యాయస్థానముల ముందు, బజారులందు, జిల్లాసభలందు, మత సభలందు, రాష్ట్ర సభలయందు అన్ని చోట్లను భాండాగారముల తరఫున బయలు చేసిన కా ర్యనిర్వాహకులు ప్రత్యక్షమై భాండాగారోప యోగముల నుదోషించుచు లోకమెల్ల భాం డాగారములతో నింపుచున్నారు. బాలురను, బాలికలను ఆకర్షించు జక్కనియాటల భాం డాగా రావరణములలో నేర్పఱచి వారికిఁ జదు వునందుఁ బ్రీతి కల్పించుచున్నారు. శాఖల ను సాపించి సమీప స్తలములలో గ్రంధము లేని వారిలో పములను దొలఁగించుచున్నవి.

శాస్త్రజ్ఞులకు, బండితులకు వివిధ వి షయములలో నూతన పరిశోధన చేయు వారికి నవి చేయు సాయము అమితము, గొ ప్పగొప్ప భాండాగారము లిట్టివారికి నిశ్శబ్దము గానుండు గదులను బ్రత్యేకముగా వందలకొ లఁది పుస్తకములతోఁగూడ నిచ్చి మేలు చే యుచున్నవి. ఉచితముగాఁ గొన్ని యెడలఁ జం దానైన స్వీకరింపకయే వారికి వలయు గ్రం ధముల నెన్ని యైనను సేవకునిమూలముగా నిం డ్లకుఁ బంపి మరలఁ దెప్పించుకొనుచున్నవి.

ఆ దేశమునందు బాఠకులను జక్క గానాద రింతురు. చనవుగా నెల్లరను బీరువాల దగ్గఱ కేగి గ్రంధములం దీసికొననిత్తురు. ఇందుచేఁ గొన్ని యెడలఁ బుస్తకములు పోవచ్చును. కాని వీరిమూలమున నెల్లరకు నష్టము కల్గిం పకుండుట మేలని యానష్టము సహించుచు న్నారు. ఇంకను వారుచేయు లోకోపకార కార్యములు వర్ణింపశక్యముగాదు.

ఈవిషయములనన్ని టిని నెఱ వేర్చుట మన దేశపు భాండాగారములకు సాధ్యమగునని నా యాశయముకాదు. మనకాసాయము, ప్రో త్సాహము, పట్టుదల, సంపద, ఐకమత్యము, విద్య, దేశారాధన, జీవనము లేవు. అయినను మీ రాయుతృష్టాదర్శములను మదిలో నుంచు కొనుఁడు. వీలై నప్పుడెల్ల నాయాదర్శముల లో మెక లేశము నేని మీశ కి కొలఁది చేయుఁ డు. ఉదారాశయములు కల్గియుండుట మాన వులకు జాలలాభకరము. మన భాండాగార ములవారెల్లఱు నీవిషయమును గమనింతు రే ని, నెర వేర్ప శక్తి కొలఁదిం బ్రయత్నింతు రేని ప్రపంచమునకు మహోపకారముకల్గును.

బెంగుళూరు గ్రంధాలయము.

మైసూరు ప్రభుత్వమువారివలన బెంగు ళూరునందు సార్వజనిక గ్రంధనిలయము స్థా పింపబడినది. ఇట్టి గ్రంధనిలయములను స్థాపిం చు విషయము తొలుదొలుత 1912వ సంవ త్సరమున మైసూరు ఆర్ధిక సభలో విద్యాశా ఖవారిచే ప్రస్తావింపబడెను. 1914వ సంవత్స రమున దొరతనము వారట్టి గ్రంధనిలయములను బెంగుళూరునందొకటియు, మైసూరునందొక టియు నెలకొల్పుటకు అనుజ్ఞనిచ్చిరి. బెంగు ళూరు గ్రంధనిలయమునకు గ్రంధములను కొ నుట మొదలగు ఖర్చులకుగాను రు 2000 ల నిచ్చిరి. ఇదిగాక సంవత్సరమునకు రు1500ల గ్రాంటునుగూద నిచ్చుచుందురు.

గ్రంధ భాండాగారము.

మ, అతివాచావిభవంబుతో సభలయం దాటోపమేపార ధీ యుతులై యెంత యుపన్యసించినను లేదొక్కింతయు లాభ మూ ర్జిత కార్యాచరణ ప్రవీణతయె వాసింగూర్చు జ్ఞానా ప్తికై జ ప్రతియూర న్నెలకొల్పు డాంధ్రులు సమగ్ర గ్రంథ భాండారముల్. పోచిరాజు సీతారామయ్య.