Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథభాండాగార సంఘములు

వికీసోర్స్ నుండి

గ్రంథభాండాగార సంఘములు.

అమెరికా దేశము.

అమెరికాదేశ గ్రంధ భాండాగార సంఘము. “ఫిలడెల్ ఫియా” యను పట్టణమున 1876వ సంవత్సరమున ప్రసిద్ధీకులగు భాండాగారాధిపులచే సమకూర్పబడినది. ప్రధమవత్సరము నందా సంఘమున 108 మందిమాత్రము సభ్యులు గానుండిరి; ఇపుడా సంఖ్య 1900 వరకు బెరిగినది. ప్రాధమిక దశయందా సంఘము యొక్క వృత్తాంతములన్ని యు ఁగ్రంధభాండా గారపత్రిక' యందు బ్రకటింపబడు చుండెను. 1907 సం॥ నందు ఆసంఘమువారు ప్రత్యేక మొకపత్రికను బ్రకటింప నారంభించిరి. గ్రంధాలయ ప్ర యోజనముల నాలోచించుటయు, పరస్పరము అభిప్రా యములను అనుభవములను వెల్లడించుకొనుటయు, గ్రం ధాలయముల కొరకు ఉపయోగించుచున్న శ్రమను ద్రవ్య మును ఎక్కువయుపయోగ కరముగ వినియోగించు నటు ల జేయుటయు పుస్తకశాలాధిపత్యమును వృత్తిగ నభివృ ద్ధిజేయుటయు, ఆసంఘము యొక్క ముఖ్యవిధులై యు న్నవి. ప్రత్యేక మొక వ్యక్తివలన కాజాలని సంస్కరణ ములను అభివృద్ధులను సంఘముగా జేరుటవలన గలిగెడు బలమువలన సాధించుటయు, అందరును కలసి పనిజేయు టవలన గ్రంధాలయమునకు వినియోగమగు శ్రమను ద్ర వ్యమును తగ్గించుటయు, కష్టవిషయములను తీర్మానిం చుటకుగాను వివిధశోధనలను అనుభవములను పొల్చుకో ని చర్చించుటయు, సభలమూలమునను, ఉత్తరప్రత్యుత్త రముల మూలమునను పరిచయమును స్నేహభావమును అ భివృద్ధి జేసికొనుటయుగూడ ఈ సంఘము యొక్క అభిప్రా యములై యున్నవి.

ఈప్రకారము, సార్వజనిక గ్రంధాలయము విద్యా విధానమునందు ప్రాధాన్య భాగముగ వికసించి పెంపొం దుటకు వలయు అనుభవ వేద్యములగు మార్గములనన్ని టీని ఈసంఘము వెదకు చుండును. కొన్ని స్థలములయందు సాంఘికులప్రత్యేక ప్రయత్నములవలనను, మణికొన్ని స్థల ములయందు కొందరుకూడి ప్రయత్నించుటవలనను, గ్రంధాలయములను స్థాపిం స్థాపించుటకు గాని అభివృద్ధి జేయుటకు గాని ఈసంఘము పాటుబడుచుండును. తద్వారా ఉ త్తమంబగు విద్య సర్వజనులకును సులభసాధ్యమగునటు* లజేయును. పుస్తకశాలాధికారులును, గ్రంధాలయోద్య మమునందు అభిమానముగలవారందరును ఈ సంఘమునందు జేరవచ్చును.

అమెరికా దేశ గ్రంధభాండా గార సంఘముయొక్క స్థా పన మనేక దేశముల యొక్క దృష్టి నాకర్షించినది. దుమీద ఇంగ్లాండు దేశమునకు రాజధాని నగరంబగు (లం డను' నందు 1879వ సంవత్సరమున 'ఆమెరికా' ' 'ఇంగ్లాం డు' దేశముల పుస్తకశాలాధికారులందరును గలసి సమా వేళమై “సంయుక్త రాష్ట్ర భాండాగార సంఘము”ను ఏర్పాటు గావించిరి.

మఱియు అమెరికాఖండమునందు 'రాజధాని సం ఘములు'ను గలవు. 'అమెరికా దేశ గ్రంధభాండాగార సంఘము' దేశమునంతకును ఎట్టిలాభమును జేకూర్చు చు న్నదియో, యట్టిలాభమునే “రాజధాని సంఘములు” త మతమ - రాజథానులకు జేయుచున్నవి. కుగ్రామముల యందున్న గ్రంధశాలాధికారులు 'అమెరికాదేశ గ్రంధ భాండాగార సంఘము' యొక్క సభలకుబోవుట దుస్సా ధ్యము గానుండును. కాబట్టి అట్టివారు “ రాజధాని సంఘ ము”యొక్క సభలకు బోయెదరు. ఇట్టిరాజథాని సంఘ ములా దేశమున ముప్పదియారు గలవు.

చదువరులారా? ఇంతటితో ఇట్టి సంఘములకు మితియుండునని మీరు తలంచితిరేని అట్టియూహ సత్య మునకు దూరమైయుండును. ఒక్క పట్టణమునందుం డు వివిధ గ్రంథభాండాగారములవారు గాని, చుట్టుప్రక్క లనుండు గ్రామముల గ్రంధభాండాగారములు గాని, కూ డి గ్రంధభాండాగార సమాజముల నేర్పరచు కొనెదరు. ఈ సమాజములవలన వివిధ భాండాగారములవారు పరస్ప రపరిచయము నభివృద్ధి జేసికొని తమకు సంబంధించిన విమ యములను గూర్చి చర్చించుకొనెదరు. మఱియు విద్యాధి కులను రప్పించి వారి యుపన్యాసములను వినెదరు. ఇట్ల సమాజములలో కొన్ని గ్రంధవిషయ విభజనమునందును ఇతరవిషయములయందును గూడ అమూల్యమగు పనిని స ల్పినవి, గొప్ప గ్రంధాలయముల యందలి ఉద్యోగస్థులం దరునుగూడి “ఉద్యోగస్థుల సముదాయము”ల నేర్పరచు కొందురు. సమాజములకును వీటికిని స్వల్ప భేద ముండున ప్పటికిని వీరును వారు జేయు పనినే సలుపుచుందురు; వీరి సభలకు ఇతర పెద్దమనుష్యులను గూడ నాహ్వానము జే సెదరు.

ఇంతియ గాక గ్రంధాలయ సంఘములు' గూడ గలవు. ఇవి ఆయా పట్టణములకు సంబంధించి మాత్రముం డును. కావలసిన విషయములను ఇతరస్థలములకు బోయి నేర్చుకొనుటకుగాని, మహాజన సభలకు బోవుటకు గాని, కాలమును ద్రవ్యమును గలిగియుండని వారందరికిని ఈ సంఘములు అత్యంతో పయు క్తములు,

బరోడా రాష్ట్రము.

ఉచిత ప్రారంభ విద్యతో బాటు సరి సమానముగా గ్రంధభాండాగారోద్యమమును బరోడా రాష్ట్రమున నె లకొల్పబడినది. ఆరాష్ట్రప్రభువులగు శ్రీ శాయాజీరా వు మహరాజాగారు దీనికంతకును ప్రాణాధారము. పై న జెప్పబడిన మార్గముల ననుసరించియే బరోడా యందు ను “గ్రంధభాండాగార సమాజ” మొకటి స్థాపింపబడినది. గ్రంధభాండాగారోద్యమమునం దభిమానము గలిగినవా రందరును ఈసమాజమునందు జేరి వారికభిమానములగు వి వయములను గూర్చి జర్చింపవచ్చును.

బరోడాయందున్న కేంద్ర గ్రంధాలయమునందు మొదట నీ సంఘమిరువది యైదుగురు గ్రంధ భాండాగార కులతో ప్రారంభింపబడెను. ఇప్పుడు బరోడా రాష్ట్రము న మూడువందల నేబది కంటె నెక్కుడు భాండాగారము లుగలవు. సర్వగ్రంధాలయా ధ్యక్షులును నొక్కచో సమావేశ మైయందు వారియనుభవముల నన్యోన్యము దెలి సికొని, పుస్తకాలయ వ్యాపనమునకు సంబంధించిన వివి ధవిషయములను జర్చించుట వారి యుద్దేశము. ఈ సంఖ ము కేవలము బరోడా రాజ్యమునందలి గ్రంధాలయాధి కారుల నేగాక భరతవర్షమునందన్ని తావులను గలవారి నాకర్షించి, సంఘీభావమును వృద్ధిపరచి, జర్మనీ, యిం గ్లాండు, అమెరికా మొదలగు దేశములందువలె జాతీ యసంఘముగా నేర్పడుచున్నది.

ఆంధ్ర దేశము.

గ్రంధభాండాగారోద్యమమును గూర్చి ప్రపంచ మునందు జరుగుచున్న యభివృద్ధినిజూచి సంతసించి, ఆంధ్రదేశముయొక్క దుస్థితికి జింతించి, బెజవాడయం దున్న రామమోహన ధర్మపుస్తక భాండాగారము వారి యాదరణక్రింద 1914 సం. ఏప్రియలు నెల 10వ తేదీన బెజవాడపట్టణమున “ప్రధమ ఆంధ్రదేశ గ్రంధ భాండా గార ప్రతినిధులమహాసభ" కూడినది, “ఆంధ్రదేశమునం దు గ్రంధభాండాగారోద్యమమును వ్యాపింపజేయుట” యే ఈసభాతీర్మానములయందు ప్రాధాన్యమును వహిం చినది. ఆతీర్మానముల నన్నిటిని ఆచరణయందు బెట్టుట కుగాను “ఆంధ్రదేశగ్రంధ భాండాగార సంఘ” మేరా టు గావింపబడినది. కృష్ణాజిల్లా యందున్న బెజవాడ, గుడివాడ, తణుకు తాలూకాలయందును, గుంటూరుజిల్లా తెనాలి తాలూకాయందును, గోదావరిజిల్లా రామచంద్ర పురం తాలూకాయందును ఇతర తాలూకాలకంటే కొం చెమెక్కువ భాండాగారములు కలవు. అందుచేత ఈ తాలూకాలయందు గ్రంధాలయముల నేర్పాటు జేసి పని జేసిన మిక్కిలి యభివృద్ధి జెందుననుట కెంతమాత్రమును సందియము లేదు.



మ.

లలినొక్కొక్క తెఱంగు రంగులను లీలల్ మబ్బులందుండుటెం
ధాత్రిని బుష్పజాతిఁగనువిందుల్ సేయగా నైన వెం
దుల కోయుండుట రంగులంచని మది యోజింపగా గాంచితి
పలురంగుల్ గల యాటవ స్తువులు బాబాలకు దెచ్చుచో.(గీతాంజలి).