Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథభాండాగారాధిపతి

వికీసోర్స్ నుండి

గ్రంథభాండాగారాధిపతి.

గ్రంథభాండాగారములు సరస్వతీ దేవాలయములు. అందుండు భాండాగారాధిపతియే యర్చకుఁడు. భాండాగారములకు వచ్చుట యందు ముఖ్యోద్దేశము జ్ఞానాభివృద్ధిగావించుకొని తన్మూలమున ముక్తినిబడయుట. ఇందులకు సాధనము లెవ్వి?-గ్రంథములు. అట్టిచో సరస్వతీయాలయమునకు బోవునెడల మనకు ప్రచ్ఛన్న విగ్రహమయి కాన్పించువాడు భాండాగారాధిపతి.

కోపమన నేమొ భాండాగారాధిపతి యె రుంగకూడదు. సర్వదా శాంతస్వభావుడై యెవ రేగ్రంధమడిగినను విసుగుకొనక కావల సిన గ్రంధములు వారికిచ్చుచుండవలెను. ఆల యమందు దైవభ క్తి కందరును సమానమే. అందుచేతనే, జ్ఞానమును వృద్ధిపొందించు కొనుటకై వచ్చువారిని యాదరముతో భాం డాగా రాధిపతి ధనికులను, బీడలను యొ కేరీతి గ చూడవలెను. అప్పుడుగాని సరస్వతీ దేవి ప్రసాదమున కందరిని సమానహక్కుగలవా రినిగా చేసినవారుగారు.

భాండాగారకుడు అన్ని విషయములు తెలిసికొనిన వాడుగనుఁడవ లెను; ఆధునిక కవీశ్వరు లను గురించియైనను సరే, దేశనాయకులా చరించిన కార్యములు వారవలంబించిన పద్ద తులను గూర్చియైనను సరే, పరరాష్ట్రరా జ్యాంగ పద్ధతులను గూర్చియైనను సరే, ప్ర స్తుతమందున్న యేవిద్యను గూర్చియైనను సరే, వెయ్యేల! ఆబాల గోపాలపర్యంతము యవసరమగు యన్ని విషయములందారి తేరి యుండవలయును. వీటియందెట్టి సందేహము యిన తీర్పగల పాండిత్యముండవలెను. ఏవిష యమందెట్టి గ్రంధము లుపయోగకరములో వాని నెల్ల భాండాగా రాధిపతి తెలిసికొనియుండి వలెను. ఎవరయిన నాకాంధ్రభాషయందు స్వా డిత్యమెట్లలవడుననియడిగిన వాని కేయేగ్రంధి ము లుపయోగకరములో వానినెల్ల చూప లెను. ఎవరయిన మెక విషయమును గూర్చి వ్యాసము వ్రాయవ లెనన్న చో వానికి వలయ గ్రంధముల నెల్ల జూపవలెను. ఎవరయిన దేశ సేవ యొనర్చుటకు కుతూహలము గలదనిన మీ రీగ్రంధముల జదువుడు; ఈపద్ధతుల నను సరించిన మీ మనోభీష్టములు నెఱవేరును అని సూచింపవలెను, ఎంత విద్యావిహీనుడే తెంచి ఏవిషయమును గూర్చియైన ప్రశ్నించిన, విసి గికొనక, కసరక, ఆవిషయమును గూర్చి వా నికి దెలియజెప్పవలెను.

ఇట్లుగాక యెవరే విషయమును గూర్చి యడిగినను వారికి సలహానియ్యకుండిన, యే గ్రంధమడిగినను విసుగుకొనుచుండిన, యెవ్వరయిన భాండాగారమునకు మరునా డరుదెంతురా! వారి మనస్సుల యందలి సందేహములను దీర్చినచో మరుసటిదినమునుండియు వారు భాండాగారమునకు ప్రాత కాపులై యుందురు.

ఈవిషయమున గ్రంధ భాండాగారాధిపతులొక చిన్న సంగతి గమనింపవలెను. భాండాగారమందున్న గ్రంధముల నన్నింటిని భాండాగారాధిపతి చదివియుండవలెను. బాలు గెలి ౦ధములను చదివిన మంచిదో తెలిసికొన లెను. వృద్ధు లెట్టి గ్రంధములను చదువవలె అను విషయముగూడ తెలిసియుండవలెను. కబాలు డెవరయినవచ్చి దుష్ట గ్రంధము నేదైన కసారి యిండనిన, యివ్వనని చెప్పిన, వాడు డలిపోవునను భయమువదలి, “నాయనా ! ఎంకను కుర్రవాడవు. నీవడిగిన గ్రంధము నీ చదువతగినది కాదు. మరేమంచి గ్రంధము యిన యడుగుము. చూడు యీయీ గ్రంధమెట్లు దో” యని మంచి గ్రంధమునొక దాని నా బా నకిచ్చిన, వాడు సంతసించి, మనము గావిం -న నీతిబోధను మనమునందుంచుకొని, సదా గ్రంథాలయమునాశ్రయించియుండి, త్వరలో భివృద్ధిలోనికి రాగలడు. కొన్ని వేళలందు మ ముచూపిన గ్రంథము, వానికిరుచించునట్లుగా, మంచిపుట నొకదానిని వానిముందర చదివి ఎగిలినది గృహమున పఠింపుమని చెప్పినను రాల లాభకరముగ నుండును.

కొన్ని సమయములందు యంత్యంతాతుర తో, యెవరయిన నాకాగ్రంధము కావలె కు యిచ్చెద రాయనిన ఆగ్రంధము లేనియె కల లేదనిన వాని కెంతయో నిరుత్సాహమ నేను. అందులకు ప్రతిగా, అగ్రంథమునందలి విషయములే యీ గ్రంధమునందునుగలవనిమ కొక్క గ్రంధమునయిన చూపవలెను. లేనియె కల యాగ్రంధమెచ్చట దొరుకునో అచ్చట నుండి తెప్పింతునని చెప్పిన, వానికేంత యో పత్సాహముకలుగును. ఆహా! ఈభాండాగా రాధిపతియొక్క యాదార్యమేమని చెప్పవ నని, శ్లాఘించుచు, మరుసటిదినమునుండి ము, సూదంటు రాయికి యినుమెట్లు అంటు నియుండునో యట్లే వారును భాండాగార నంటి తిరుగుదురు.

ఇక కొందరు తమంతట తాము భాండా గారమునకు చదువుకొనుటకు రాక, తమస్నే హితులు వచ్చుచున్నారుగదా యని వచ్చు వారు గలరు; మర్యాద చెల్లించుకొనుటకై వచ్చువారు కొందరును గలరు. అట్టివారు భాండాగారమందిరమున కరుదెంచిన నే, య్యా! యీదినమున ! మంచి గ్రంధములు రెండువచ్చినవి చూచినారా ! యని వారికివ్వ వలెను. లేక యేదో వారికింపుగ నుండు యుప యోగకరమగు విషయమును గూర్చి చక్క గ సంభాషించుచు, తన భాండాగారమందున్న గ్రంధములలోని యుదాహారణలతో చెప్పిన యెడల, ఆగ్రంథములను గూర్చి వినిన వారికి వానిని చదువుటకు కుతూహలముజనించును. ఎప్పుడొక గ్రంథమును చదువుట కుత్సాహ ము జనించినదో యింకను కొన్ని గ్రంథములు చదువను అప్పుడే నభిలాష కలుగును. అడిగిన వారి

ప్రతి భాండాగారకుడును, సందేహముల నివారింప జూచుచుండవలెను. కంటబడిన గ్రంధము నెల్ల భాండాగారాధిపతి చదువుచుండవలెను. పాఠకమహాశయుల యు వానినెల్ల వి పయోగార్ధము తా నుచితరీతిని వాని నెల్ల మర్శించుచుండవలెను. అతనికి దెలియని విష యముండరాదు. జనులకు భాండాగా రాధిపతి దైవమువలె కాన్పింపవలెను. శాంతమాతని మోమున తాండవమాడుచుండవలెను. ఓర్ప తని నీడయై సంచరించుచుండవలెను. మాట లాడినపుడెల్ల ప్రేమరస మొలుకుచుండవలె ను, ఎల్లరితో నాతడు నిష్కపటమైత్రితో మెలంగుచుండవలెను. భాండాగారాధిపతి వి ద్యార్ధులకు గురువుగను, బాలురకు సహోద రుడుగను, వృద్ధులకు హితునివలెను, దుష్టప్ర వర్తకులకు భయంకరుడుగను, నీతిబోధకుడు గను నుండవలెను.

ప్రస్తుతమందాంధ్ర దేశమందున్న కొన్ని గ్రంధభాండాగారములు పురాణేతిహాసంబుల చెప్పించి, చదువరుల నాకర్షించుచున్నవి. మరికొన్ని యాటలను బెట్టి చదువరుల నాకర్షిం చుచున్నవి. కొన్ని వార సభలను గావించు చున్నవి. ఇంక నివియేగాకుండ, బాలుర బుద్ధిని వికసింపజేయు యాటలను అనగా 'వర్డ్సు బిలింగు' మొదలగు నాటలనుబెట్టి బాలురను రప్పింపవలెను, ఎప్పుడు ప్రచురింపఁబడిన గ్రంధమునప్పుడే తెప్పించుటవలన, పౌరులు చాలా మంది రాగలరు.

సభలను సమకూర్చి జనుల నాకర్షించుట నుగూర్చి చెప్పదలచితిని. చాలస్థలములందు సభలను గావించుచునేయున్నారు; కొన్ని చోట్ల యవి స్వల్ప కాలమున నే నశించుచున్నవి. సభ్యులను సభలకు రప్పించుటకు కార్యదర్శులుపడు కష్టముల నేను కళ్లార చూచియున్నాను. కాని యీ విషయమందు రెండంశములు ముఖ్యముగ చెప్పదలచియుంటిని. హాశ్యప్రధానములుగాక, నీతిబోకములగు నాటకములను ప్రదర్శించినయెడల కొంతమంది సభ్యులు రాగలరు. కొందరు కార్యదర్శులు, నాటకము లేల యాడవ లెను, హాస్యములోని కి సభదిగుననవచ్చును. సభ యొక్క తీవ్రము తగ్గకుండగ, సభ్యుల నాకర్షించు చిన్న చిన్న అంకములను, ప్రదర్శించిన బాలుర యొక్క వాధోరణి హెచ్చుటయేగాక సభ్యులును లమంది రాగలరు. సభ్యులు వివేషముగరాని సమయములందు కార్యదర్శులు నిరుత్సాహ పడ రాదు. అగ్రాసనాధిపతి, కార్యదర్శి, ప్రధానోపన్యాసకుడు యింకొక సభ్యుడుండిన చాలును. నేనొక భాండాగారమునకు కార్యదర్శిగానుండి రెండు సంవత్సరములు సభలను జరిపినాను. కొన్ని సభలకు నలుగురయిన వచ్చియుండ లేదు, కొన్ని సమయములందు, అ గ్రాసనాధిపతిగారితో ముగ్గురయిన లేరు. అ ట్టిసమయములందు నిరుత్సాహపడకూడదు. కొన్ని సమయములందు ప్రధమమున సభ్యు లు కొద్దిగ నున్నను, సభజరుగుచున్న సమయ మరి కొంతమంది సభ్యులు నిశ్చయ యి మందు ముగ రాగలరు. ఒక వేళ రాకపోయినను మ నము పట్టువిడవకుండ సభజరుపవలెను. ఇందు కుదాహరణముగ, 'క్రిస్టియను యెస్సోషి యేషను' ప్రధమమున స్థాపింపఁబడినప్పుడు యిద్దరు సభ్యులుండిరట. ఇద్దర ధైర్యపడక, పరిశ్రమచేయ, ఇప్పటికి ప్రపంచమందున్న ప్రతి పట్టణమందు, యట్టి క్రైస్తవసభలు గలవు. అట్లనే కలకత్తాలో బ్రహ్మసమా జము ప్రధమమున స్థాపించినప్పుడు ద్దరుండెడివారలట. ఇప్పుడన్ననో, యామతము ప్రపంచమందంతటను వ్యాపించినది. కా న యీసభలను జరుపు వారధైర్య 'మెంతమాత్రము పడకూడదు. ఇట్లెన్ని యోవిధముల గ్రంధ భాండాగారికులు తమగ్రంధాలయముల ను జనోపయోగకరములగునటుల జేయవచ్చు ను. మానవులెంద రెన్ని బిరుదులను పొందినను లాభము లేదు. ఎన్ని యుద్యమములుతల పెట్టిన నవియన్నియు వృధాయగును. ఈ యుద్యమమును దల పెట్టినవారే దేశవీరులు. అట్లు తల పెట్ట తగ్గవారే భాండాగారికులు.

టేకుమళ్ళ వెంకాజీరావు.