గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథభాండాగారము
స్వరూపం
గ్రంధ భాండాగారము.
మ. అతివాచావిభవంబుతో సభలయం దాటోపమేపార ధీ
యుతులై యెంత యుపన్యసించినను లేదొక్కింతయు లాభమూ
ర్జిత కార్యాచరణ ప్రవీణతయె వాసింగూర్చు జ్ఞానాప్తికై
ప్రతియూరన్నెలకొల్పు డాంధ్రులు సమగ్ర గ్రంథ భాండారముల్.