Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు

వికీసోర్స్ నుండి

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు, వారి యుడుపులు.



క్షాత్రయుగమునాఁటి మనవారి స్థితిగతులను వారి యాచారవ్యవహారములను దెలుపు ముఖ్య గ్రంథములు భారత రామాయణములు. వేల సంవత్సరములక్రింద నుండిన మన పూర్వికులెట్టి యుడుపులను ధరించుచుండిరో తెలిసికొనవలయుననిన మన మా గ్రంథములతో నెక్కువ పనిఁగొనవలసియున్నాము. ఈ యంశమును గుఱించిన వివరములు వానిలోనైనను విస్తారముగా గానరావు. అయినను ఉన్న సంగతులను బట్టి మన మేమి గ్రహించవలయునో చూతము.

పురుషు లాకాలమున ధరించుచుండిన యుడుపు లు మిక్కిలి సామాన్యమైనవి. అప్పటివారి యుడుపు లనఁగా, ఎక్కువపొడవు తక్కువ వెడల్పుగల రెండు విడి వస్త్రములుమాత్రమే యైయుండవచ్చును. ఒకటి కట్టుకొనఁబడునది, రెండవది కప్పుకొనఁబడునది. మొదటిది నడుమునుండి క్రిందిభాగమును గప్పుచుండెను; రెండవది నడుముమీఁది భాగము నాచ్ఛాదించుచుండెను. ఈయూహ కేవలము కల్పితమైనదని తలఁపఁగూడదు. ఇది సప్ర మాణమనుట నిస్సంశయము. ద్రౌపది కౌరవసభలోనికి లాగికొనిరాఁబడినపుడు, దుర్యోధనుఁడు ఆమె చూచు చుండఁ గాఁ దన కుడితొడమీది వస్త్రమును దొలగించేనని మహాభారతమందున్నది. దాదాపుగా నిప్పటికాలమున వాడుకయందున్న విధమున ధోవతిఁ గట్టికొనిన నేకాని అతఁడట్లు తన కుడితొడను ఆనాచ్ఛాదితముగాఁ జేయుట సంభవింపదు. రాజు మొదలు జనసామాన్యమువఱకు నందఱును ధోవతి నే కట్టుకొను చుండినట్లుకూడ తోఁచుచున్నది. భేదమేమైన నుండినచో వస్త్రముయొక్క మృదులత్వమునందును నేతయొక్క సన్నదనమునందును ఉండవచ్చును. ధృతరాష్ట్రృఁడు పుత్రునిశరీరము కృశించి నందునకుఁ గారణమునడుగు సందర్భమున నిట్లనును “నీవు ప్రావారవస్త్రములను ధరించుచున్నావు. మాంసముతో నన్నమును భుజించుచున్నావు. దివ్యాశ్వముల నెక్కి సవారీచేయుచున్నావు. ఇట్టి నీవు కృశించుటకుఁ గారణ మేమి?” (ప్రావారవస్త్రము'లనఁగా నేమో వ్యాఖ్యాత వివరించలేదు. అయినను పైశబ్దమునకు మనము అందమైన వస్త్రములని యర్దము చెప్పిన చెప్పవచ్చునని తలఁ చెదను, శరీర ్వభాగము నాచ్ఛాదించుచుండిన రెండవ వస్త్రమును గుఱించి మనకంతగాఁ దెలియదు. మత గ్రంథములలో వచ్చిన (ఉ త్తరీయ' శబ్దమునుబట్టి మన మీ రెండవ వస్త్రముండెనని నిశ్చయించుకొన వలసినవారు మైతిమి. ఈవస్త్రము వెనుకఁజెప్పిన ప్రకారము శరీరోర్ధ్వభాగమున గప్పికొనఁబడుచుం డెడిది. కొన్ని వేళలయందు కుడి చేయి ఆనాచ్ఛాదితముగా వదలివేయఁ బడుచుండెను. అట్టి సమయమున నీ యుత్తరీయము కుడిచంక క్రిందినుండి యెడమభుజముమీఁదికిఁ బోవుచుండెనని యూహింప వలయును. విద్యార్థులు తమ చేతిని బయటకు తీసియుంచవలయునని మనుస్మృతి విధించియున్నది. దీనికి వ్యాఖ్యాత (ఉత్తరీయము కప్పక బయటకుఁ దీసియుంచ వలయునని యర్థము చెప్పియున్నాఁడు. పురాతన కాలపు హింద్వార్యులు యుద్ధ సమయములందు ఉత్తరీయము నిట్లే వైచికొని దాని చెఱఁగులను ఎడమభుజము పైనఁ గట్టిగా ముడి వేసికొనుచుండిరని తోఁచుచున్నది.

  • క్షాత్రయుగమనఁగా మన దేశ చరిత్రములోని యొక నిర్ణీతకాలము, ఈశాలమున మనదేశమునందలి వీరకావ్యములుగు రామాయణ భారతములు రచింపఁబడి

నందున దీనికి క్షాత్రయుగమని పేరు పెట్టఁబడినది. పాశ్చాత్యవిద్వాంసులును వారి ననుసరించిన మనవిద్వాంసులును ఈయుగముయొక్క పరిమితి వేయిసంవత్సరముల (క్రీ. పూ, ౧ ౨౩౦ నుండి క్రీ. పూ. 300 సంవత్సరములవఱకు) దాని సిద్ధాంతీకరించియున్నారు. సి. వి. వైద్యా ఎం.ఏ., ఎల్. ఎల్, బి. గారు క్షాత్రయుగ వైశాల్యమును ఇంచుమించుగా క్రీ. పూ. 3000 నుండి క్రీ. పూ ౨౫ం వఱకు నిర్ధారణ చేసియున్నారు. వీరి యభిప్రాయముతో నంద జెకీబవించకపోయినను, వీరు చెప్పిన యంశములను వివరములను మనము పాశ్చాత్యవిద్వాంసులచే నిశ్చయింపఁబడిన క్షాత్రయుగమునకే వర్తించునవి యని యూహించుకొనవచ్చును. వైద్యా గారి మతిమున భారతయుద్ధము క్రీ- పూ. 3000 వ సంవత్సరమున జరిగినది- గ్రంథము తరువాత కొలఁదికాలమునకే వ్రాయఁబడినని వారభిప్రాయపడుచున్నారు, 1. నిత్యముద్ధృతపాణిస్యాత్ వెనుకఁ జెప్పఁబడియున్న రెండు వస్త్రములు తప్ప, అధమపక్షము క్షాత్రయుగారంభమున, హింద్వార్యులు మ ఱయుడుపులను ధరించియుండినవారు కారు లాగు లు జాకెట్లు ఎట్టివో వారెఱుఁగరు, కోట్లు చొక్కాలు వారికిఁ దెలియవు. బట్టలకు గ త్తిరించి తీరుతీరు ఉడు పులుగా గుట్టుట ఆకాలమున లేదు. కుట్టుపని మొట్ట మొదట బహుశః * 'సెమిటిక్కు'లలో ఁబుట్టినదై యుం డవచ్చును. అది గ్రీకులు పంజాబు దేశమును జయించిన కాలముననో, అంతకుఁ బూర్వము హింద్వార్యులకు పా రసీకులతో సంబంధము కలిగినట్టి డెరయసు పరిపాలన కాలముననో మనదేశమునఁ బ్రవేశించి యుండవచ్చును. రామాయణమున + కుట్టుపనివాఁడు వచ్చియున్నాఁడు. కాని మహాభారతమున వానిజాడ ఎచ్చటను కానరాదు. ఇంతమాత్రమున మహాభారతము రచింపఁబడిన కాలమున కుట్టుపనివాఁడు ఉండ నేలేదను అభావవాదమున కవకాశము లేదు. అది యటుండనిండు. మొత్తముమీఁద క్షాత్రయుగారంభమున హింద్వార్యులలో పురుషులు రెండు వస్త్రములలో నొకదానిఁ గట్టికొని రెండవదానిఁ గప్పుకొనుచుండిరని విశ్వసించుటయందభ్యంతర మేమి యును లేదు.

ఆకాలపు స్త్రీలు సైతము రెండు వస్త్రములనే ధరిం చుచుండిరని తోఁచుచున్నది. అయినను వీరివస్త్రము లు పురుషుల వస్త్రములకంటే నెక్కువ పొడవుగా నుం డెడివి. కట్టుకొనఁబడు వస్త్రము శరీరోర్ధ్వభాగమును గూడ_అనఁగా భుజములవఱకు గప్పియుంచుచుండె ను. చేతులను మాత్రము దానితో కప్పుకొనక విడిగా నుంచుచుండిరి. గుజరాతు, బంగాళము, మద్రాసు, ద క్కనులలోని _స్త్రీలు నేఁటికిని అట్లే తమ చీరెలఁ గట్టు కొనుచున్నారు. ఉత్తరీయము తలపైనఁ గప్పుకొనుచు సమయమువచ్చినపుడు దానిని మునుకుగా వేసుకొనుచుం డిరి. ఉత్తరహిందూస్థానమం దిప్పటికిని స్త్రీలు ఉత్తరీ యమును విధిగా ధరించుచుందురు. దక్షిణహిందూ దేశ

ఇది ఏచ్య - ౦డముయొక్క పశ్చిమభాగమున నుండిన యొక జాతి, i తున్న వాయి 73 మండు ఇప్పుడు వాడుకలోనున్న చీరెలు పొడవుగానుం డుటవలన వేస్తే యుత్తరీయము అనవసరమయినది. ఉ త్తర హిందూస్థానమున ఇప్పటివలెనే పూర్వమునఁ గూడ స్త్రీలు బయటికిఁబోవునపుడు మాత్రమే యుత్తరీయము ను ధరించుచుండిరి.

ద్రౌపదిని అంతఃపురమునుండి బలాత్కారముగా కా రవసభకు ఈడ్చుకొనివచ్చిన సందర్భమును వర్ణించుచు మహాభారతమున వ్రాయఁబడిన సంగతులు పైయభిప్రా యమును బలపఱచుచున్నవి. సభాంగణమున నామె పలుమాఱు ఁ నేను ఏకవస్త్రను' 'ఏకవస్త్రను' అని లిపుట్టునట్లు మొఱ పెట్టుకొనెను. దుర్యోధను నాజాను సారము ఆయేకవస్త్రమును గూడ వదల్ప యత్నించిరి. ఈ సంగతులను విచారించి చూచితిమేని ఆకాలమున స్త్రీలు కట్టుకొను వస్త్రము నులభముగా నూడివచ్చునట్లు ధ రింపఁబడు చుం డెననియు, మొలనూలువంటి దేదియు నుం డలేదనియు, ఇప్పుడు ఉత్తరహిందూస్థానమునందు డుకలోనున్న లంగావంటిదానిని వారు తొడుగుకొను చుండలేదనియు తేలుచున్నది. లంగావంటి వస్త్రమే యెనయెడల నంత యవలీలగా నూడియుండునా ? ఆకా లమున రవిక యనఁబడునదికూడ నుండలేదని తోఁచు చున్నది.

ఈ సందర్భమున నొక చిత్రము చూడఁదగి యున్నది. పురాతన కాలపు గ్రీకు స్త్రీ పురుషులు ధరించుచుండిన యుడుపులను హోరు వణి౯ంచి యున్నాఁడు. అవి మన హింద్వార్యుల వస్త్రము లను బోలి బోలి యున్నవి. హోమరు కాలపు స్త్రీ ము నుగాక "ఎక్కువ పొడవు తక్కువ వెడల్పుగలట్టిది యు దేశములో నే తయారయినట్టిదియు కత్తిరింపు గాని కుట్టుపని గాని లేనట్టిదియు నగు నొక వస్త్రమును గట్టు కొనుచుండెను; ఆ వస్త్రము భుజముపైన నొక సూదితో ను నడుముచుట్టు మొలనూలుతోను బిగింపఁబడుచుండె

చేతులు బయట నే యుండుచు వచ్చెను". పురు

షులకు మొలనూలు ఉండలేదు. పైన సుల్లేఖింపఁబడిన

అభావవాదమనఁగా, ఒక గ్రంధమున ఒకానొక వస్తువు ప్రసక్తి లేదు కనుక ఆగ్రంధము రచించఁబడిన కాలమున అష్టవస్తువే యుండ లేదని వాదించుట. fl Women of Homer by Walter Capt. Perry. పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/104 పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/105 పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/106 పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/107 పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/108 పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/109