గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్రమునందనుస్వారము
ఆంధ్రమునందనుస్వారము
పురాణమిత్యె వనసాధుసర్వం| నచాపికావ్యం నవ
మిత్యవద్యం |సన్తః పరీక్ష్యాన్య తరద్భజన్తె | మూఢ
పరప్రత్య య నేయబుద్ధిః॥
యని అభయుక్తోకి కలదు. ప్రాచీనులు చెప్పిన మాత్రాన సాధువనియు, నవీనులు చెప్పినమాత్రాన నసాధువనియు నెంచక గుణాగుణ విచారణచేసి సత్పురుషులు గ్రహింతురనియు నట్లు కాకుండుట మూర్ఖపద్ధతీయనియు దీని భావము. బాలాదపి సుభాషితమ్మను మాట యీయధ౯మునే దృఢపఱచుచున్నది. ప్రియ పాఠకులారా, నేనీదృష్టితోనే త్రిలింగయను పత్రిక యందుండిన “ఆంధ్రము నందనుస్వార కలదా” యను వ్యాసమును జదివితిని. అవ్యాసములో వక్తవ్యాంశమునకు ముందుగా నుండు కొన్నిమాటల న్యాయదృష్టితో నంగీకరించితిని. అవసరమైనను గాకపోయినను బ్రాచీనార్యులను సంస్కృత వ్యాకరణ రచయితలగు పాణిన్యాదులఁజేసిన స్తుతికి మిగుల సంతసించితిని. ఆంధ్రవైయాకరణాలకేమి, ఆధునిక కేవల సంస్కృత వ్యాకరణాభిజ్ఞులకేమి, కొంత యజ్ఞానమారోపించినను వీరు చూపింపఁబోవు నపూర్వ విషయము గ్రహించుటకై సైచితిని. చివరకు నామతమిందు పైఁ దెలుపవలసిన యవసరము గన్పట్టినందున, నాపనికిఁ బూనితిని.
ఆవ్యాసమెంత పొడుగుగ నుండినను దాని సారమిది:_ “ఆంధ్రము నందనుస్వారము లేదు. ఙ, ఞ, లున్నవి. అను స్వారమునకు కవర్గము పరమగుచో, 'జ' కారమును చ వర్గము పరమగుచో 'ఞ'కారమును, ట వర్గము పరమగుచో 'ణ' కారమును, త వర్గము పరమగులో 'న' కారమును 'ప' వర్గము పరమగుచో 'మ, కారమును స్వారస్థానమందు వ్రాయవలయును. పఙ్గ, గఞ్జ, కణ్డ,కన్త, చమ్బు యధాశ్రమముగా నుదాహరణములు. సూక్ష్మదృష్టితో విచారించిన నుచ్చారణ స్థానముల బట్టి, బోధ కాఁగలదు. పాణినీయములోని "నశ్చాపదాన్తస్యఝలి,” “మోనుస్వారః," అను సూత్రములచే నిరనునాసికలగు స్పశ౯లు నూష౯లు పరమగునపుడు ఆపదాన్త నకారమునకును పదాన్తమందుఁ గూడ మకారమునకును అను స్వారమువచ్చును. “అను స్వారస్యయయి పరసవర్ణః” అను సూత్రముచే నీయనుస్వారమునకు స్పశ౯లు సంతస్థలములు పరమగునపుడు క్రమముగా ఙ, ఞ, ణ, న, మ, లగును. లక్ష్యములు, అఙ్కితము, ఆఞ్చితము, కుణ్డితము, శాన్తము, గుమ్భితము అని వ్రాయుట సాధువు గాని, అంకితము, అంచితము, కుంఠితము, శాంతము, గుంభితము అనునవి యెట్లు సాధువులు గావో అట్లే పంగ, గంజి, కండ, కంత, చంబు అనునవి కూడ సాధువులు గావు."
కాని సంస్కృతమున నింకొకటి విచారణీయాంశము గలదు. “హిపదాన్తస్యయను సూత్రముచే పదాన్తమగు ననుస్వారమునకు వర్గీయములు పరమైనచోఁ బరవసవర్ణము కంసఞ్జఘాన యనియు ననుస్వార ఘటితరూపము కంసంజఘాన యనునదియు సాధువే. కానీ సంస్కృతమును, తద్వైయాకరణులఁ బ్రమాణముగాఁ గొనిన మనము “దృతంచ బిందుస్యాత్,” “ప్రధమా విభక్తి కమోర్బిందుశ్చ” యను సూత్రములచే పదాన్త నకార మకారములకు బిందువులను వచ్చెంగమలాక్షుఁడు భయంపడి యనువాని నొప్పుకొనవలయుఁ గదా. అట్లయిన నాంధ్ర మున ననుస్వారమున్నదని యైన ననవలె, లేనిచో సంస్కృత వ్యాకరణ ప్రణేతయగు పాణినికింగొంత యజ్ఞత నారోపింపవలయును. గీర్వాణ వ్యాకరణ ప్రణేతల నంత పెద్దగాఁ బొగడిన మీరలాయన కజ్ఞత నారోపింపఁజాలరు. కాననాంధ్రమున ననుస్వారమున్న దనియొప్పుకొనుఁడు. ఇంక పంగ యనునట్టి యేక పదములుండునవి యనుస్వారములా పంచమ వర్ణములా? "తస్యస్యాచ్చ పూర్ణ బిన్దురపి” “షవట్త్రింశదత్రేతే," ఇత్యాది సూత్రములు తప్పులని చెప్పిన యాక్షేపము తప్పా కాదాయని విచారింపవలయును. అనుస్వారమునకు స్థానము కేవలనాసిక, వర్గీయ పంచమవర్ణములకు నాసిక, తత్తద్వర్గ స్థానములగు ఙకారమునకుఁ గంఠము, ఞ-కారమునకుఁ దాలువు, ణకారమునకు మూర్ధము, నకారమునకు దన్తము, మకారమున కోష్టములు స్థానములు గలవు. కానఁ పంగయనునప్పుడు, అనుస్వారము కేవలము నాసిక చేతనే యుచ్చరింపఁబడినను, తదవ్యవహితోత్తరవర్తి యగు గకారమునకున్న కంఠస్థాన మీయనుస్వార నాసికా స్థానముతోఁ గూడఁ జేరినట్లు దోచుటచే వారి కట్లు భ్రమకలిగెను. అనుస్వారమునకుఁ నాసికయు దానికిఁ బరమగు శకారమునకు గంఠము, రెండు సంహితగా నుచ్చరింపఁబడుచున్నవి యని యనుకొని సూక్ష్మదృష్టితోఁ జూడుఁడు. పంగ యనుచో 'ఙ'కారమే లేదు, యనుస్వారమే యున్నది యని మీకు బోధయగు, ఙ'కారమే యున్న యెడల నాసికా స్థానమైన తరువాత కంఠము ఙకారమున కొకసారియు గకారమున కొకసారియు వినియోగింపఁ బడనగు. అట్లు రెండుసార్లు కంఠ ముపయోగింపఁబడుచున్నదా? లేదు. సంస్కృతములోననో ఙ ఞ లు ప్రత్యేకమున్నవి. ఙఞలు హల్లులు ప్రాణులు. ప్రాణులు ప్రాణములతోఁగూడి వ్యవహరింపఁబడనగు, ఙకారము ప్రత్యజ్ఞాత్మా. ఇకారము ప్రజ్ఞాయాచా, యనుచో నచ్చులతోఁ గలసి ప్రత్యేక వణ౯ములై వ్యవహరింపఁబడచున్నవి. ఇట్లెచ్చోనయినఁ దెలుఁగున బ్రత్యేక మచ్చుతోఁగలసి ఙ ఞ లు కానవచ్చునా ? అట్లు లేనిచో నీని జీ౯ ప్రతిమలఁ జేర్చినచో లాభమేమో మృగ్యము. సంస్కృతముననో అఙ్కితః , అఞ్కితః ఇత్యాదులయందుండు ఙ ఞ లు లక్ష్యాంతరములయందు ప్రకృతిసిద్ధ ములై యిచ్చట ననుస్వారస్థానమం దాదేశముగావచ్చినవి గాని స్వతసిద్ధములు గావు. అకి, అఞ్చి ధాతువుల వలనఁబుట్టిన యీరూపములు మొదలు నకారము గలవి యని తజ్ఞులకు విశదము. గంజి, పంగ లలో నుండునవి నకారమనిగాని ఙ ఞ- లనిగాని సప్రమాణముగా వ్యుత్పత్తి ననుసరించి మీరు చూపింపలేదు గనుకను అనుస్వారమున కుండవలసిన నాసికామాత్రమే పైవణ౯ ములకుండిన కంఠాదిస్థానములతో సేకీభవించిన ననుభవసిద్ధమగు సుఖోచ్చారణము సిద్దించుచున్నది గనుకను ననుస్వారమనియే యొప్పుకొనక తప్పదు. స్థూలదృష్టితో విచారించినను మీ మతమందింకొకతప్పు గలదు. అనుస్వారము లేదనిన నథ౯మెక్కడిది ? అదియు లేదందురా, అతిసాహసము. ఉన్నదందురా దేనికధ౯ము? దీనికిఁ బూణ౯ మేది? నకార స్థానికము పూణ౯ము. దానికి లోపము ప్రాపించినపు డధ౯మని వైయాకరణులు వ్యవహరించిరి. కాన నాంధ్రమునం దధ౯ పూణా౯నుస్వారములున్నవనియు ఙ ఞ లు లేవనియుఁ జెప్పినది సర్వమనవద్యము. నిర్వికారదృష్టితో నీవ్యాసమును జూచిన సత్యము గోచరమగుననియెంచి శాస్త్రీయచర్చ నొకింతఁజూపి విరమించుచున్నాడను.
తత్ - సత్.