Jump to content

గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆండ్రూ కార్నీజీ

వికీసోర్స్ నుండి

అమెరికాదేశ గ్రంథభాండాగారోద్యమమునకు

కల్పతరువు.

ఆండ్రూ కార్నీజీ.

కోటీశ్వరుడు.

ఆండ్రూ కార్నీజీ.

అమెరికా కోటీశ్వరుడు.

అనుపదేశ గ్రంథ భాండాగారోద్యమమునకు కల్పతరువు.

ఇదివరలో గొంతకాలము క్రిందట నాచే వ్రాయ బడిన అమెరికావతక చరిత్రపీఠికయందు మహనీయుడ గు కార్నీ జీయెడ నాకుగల గౌరవమును దెలిపియున్నా ను. ఇప్పుడు కార్నీ జీయొక్క జీవితచరిత్రను ముఖ్యము గ భాండాగారాభ్యుదయములతో సంబంధించినంతవరకు వ్రాయుటకు బూనితిని.

అమెరికాయందు సార్వజనిక గ్రంథాలయముల యభివృద్ధికి మూలపురుషుడనదిగిన ఆండ్రూ కార్నీ జీ యొ క్క నామము పవిత్రవంతమై గ్రంథభాండాగారముల యభివృద్ధితో నెల్లప్పుడును పరిగణింపబడుచున్నది. కా ర్నీ జీయొక్క పేరు తలంచినంతమాత్రమున ఆయనయెడ మనకుగల గౌరవభావము స్ఫురింపకమానదు. కార్నీ జీ యెటుల కోటీశ్వరుడయ్యెనో తన ధనము నెటుల పుస్త శభాండాగారముల కై వెచ్చింపుచుండెనో తెలియుటవల్ల మనకు ఎక్కువ సంతోషమును ఉద్రేకమును కలుగుట కవకాశము గలదు.

ఇప్పటికి ఎనుబది సంవత్సరముల క్రిందట స్కా ట్లాండు దేశములో డంఫర్ లైను నగరమునందు ఆండ్రూ కార్నీ జీ అను మన కథా నాయకుడు జననమందెను. ఆయ నతండ్రి విల్లియము కార్నీ జీ యను నాయన మగ్గములనేత వల జీవించుచుండెడివాడు. మన యాండ్రూకార్నీ జీ బాల్యమునందు తల్లివద్దను పినతండ్రివద్దను విద్యాభ్యాస ము జేసెను. తల్లి ఆయనకు అక్షరాభ్యాసమును జేసెను; అతని నడవడిని మంచిమార్గమున నుంచగలిగెను. అట్టి మాత అతనికి ఏబది సంవత్సరముల వయస్సు వచ్చువరకును జీవించియుండి మన కథానాయకుని మేధాశక్తిని సానప ట్టినదై వజ్రముకన్న విలువగలదిగా జేసెను. అతని పిన తండ్రి రాచకీయ తంత్రజ్ఞుడై యుండుట చేత చిన్న తనము లో నే యాండ్రూకార్నీ జీకి ప్రజాపరిపాలనా పద్ధతు అలవడి చరిత్రాభ్యాసప్రాప్తి సిద్ధిరా అందుచేత అతడు పదియవయేటనే ప్రజాపక్షమున రాచకీయపద్ధతులందు మెలంగుచుండెను.

కార్నీజీకి పదునొకండవ సంవత్సరము వచ్చెను. ఆకాలమున దేశమునందు నూతనముగా ఆవిరియంత్రము లు ప్రబలసాగెను; వానిముందర చేతిమగ్గముల పసతగ్గి పోవుటచే నాపోటీకి తాళజాలక విలియము కార్నీ జీ తన కుటుంబముతో జీవయాత్రకై అమెరికాలో పిట్సు బర్లు పట్టణమునకు బోవలసివచ్చెను. కార్నీ జీని 12 వ యేట దూది ఫ్యాక్టరీలో వారమునకు 2 రూపాయిల కూ లిని బుచ్చుకొని దూది నేరు పనిలో తండ్రి ప్రవేసింపజే నెను. తర్వాత అనేక కోట్ల రూపాయిలతని చేతిమీద వ్యయపడినను మొదట తాను తన తలితండ్రుల కై సంపా దించిన 2 రూపాయిల విలువను తా నెన్నటికి మరువజా లననియు, తర్వాత తానార్జించిన కోట్లకంటే నా రెండు రూపాయిల నె ఎన్ని రెట్లో ఎక్కువగ చూచుచుండెడి వాడననియు, అప్పుడు తాను పడిన కాయకష్టము బాని సవృత్తికంటె యధమముగ నుండినను తన తలిదండ్రుల కు సహాయపడుటకై గానిచో దుర్భరమై యుండెడిదని యు కార్నీ జీ వ్రాసియున్నాడు.

ఒక సంవత్సరము దూది ఫ్యాక్టరీలో పనిచేసిన తర్వాత ఆవిరియంత్రముతో పనిచేయు మరియొక ఫ్యాక్టరీలో బాయిలరులో నిప్పునుజూచు పనియందు కార్నీ జీ ప్రవేసించి, ప్రతిదినము ఎక్కువకష్టపడి పనిచేయుచుం డెడివాడు. అంతమాత్రము కష్టము చేత నాతడు అధైర్య ము చెందలేదు. ఎప్పటికైనను మంచిదినములు రాకబో వునా యను మనో ధైర్యము కలిగియుండెను. పేదరికము వలన భయమును జెందుటకు మారుగ సంపన్నుల గృ హములయందు జూడజాలని నిజమైన సౌఖ్యము పేదవా రి యింటనే గలదని యాతడు తృప్తి జెందుచుం డెను; తర్వాత స్వయంకృషిచే మిక్కిలి ధనవంతుడైనప్పుడు సహితము తన యభిప్రాయమును మార్చుకొనజాలనని కార్నీ జీ నుడివియున్నాడు. ఈప్రకారము బాయిలకు వద్ద ఒక సంవత్సర కాలము పనిచేసి ఓహియో టెలిగ్రా ఫు కచ్చేరీలో తంత్రీ వాత౯లను బట్వాడా చేయు కుర్ర వాడుగా ప్రవేశించెను. అచ్చటనున్న కాలములో టెలి గ్రాఫు పనులను దెలిసికొని శీఘ్రకాలములో నెలకు ము ప్పది రూపాయిల జీతము సంపాదింపగల టెలిగ్రాఫు ఉద్యోగమును రైలు స్టేష నునందు సంపాదింప గలిగెను. ఆజీతమునకు అతడు చాల సంతృప్తినిజెంది యానందము ను బొందుచుండెడివాడు, అప్పుడు తన తండ్రియొక్క గృహమును తాకట్టుబెట్టి ఆదామ్సు యక్స్ప్రెస్సు కం పెనీలో 10 భాగములను కొనెను. వ్యాపార ప్రారంభ మున కిదియే కార్నీ జీ యొక్క ప్రధమ ప్రయత్నము. అనుభవశాలియగుటచేత నావ్యాపారములో భాగములు కొనినచో లాభము రాగలదని ఊహింపగలిగెను. దూర దృష్టితో నాలోచించి తనవద్ద సొమ్ము లేనప్పటికి నప్పు చేసి వ్యాపారమున జొరబడెను. సాహసములేని దెట్టి స్వల్ప కార్యమైనను సాధింపజాలముగదా.

రైలు కంపెనీవారు కార్నీ జీయొక్క తెలివి తేట లను గని పెట్టి వెంటనే పిట్సుబర్లు డివిజనునకు సూపరిం టెండెంటుపని నిచ్చిరి. ఆకాలమున అమెరికాలో జరిగి న దేశీయ యుద్ధమునందు మిలిటరీ రైలురోడ్డును టెలి గ్రాఫులను కాపాడుటకు కార్నీజీ నియమింపబడెను. యుద్ధమును ప్రత్యక్షముగ సందర్శించుట కవకాశము క లిగి యందలి ఘోరము లాతని మనసునకు దృఢముగ నా టుటచేత నిప్పటికిని యుద్ధవాత యతనికి కణకఠో రముగ నుండును.

ఆయుద్ధకాలమున కార్నీ జీ వాషింగ్టనులో పనిచే సి తిరిగి పిట్సుబర్లునకు రాగా, నిద్రకనుగుణ్యమైన రైలు బండ్లనుక నుగొనిన ‘వుడురపు' అను వానితోకలసి భాగస్థు డుగ జేరి బ్యాంకిలో కొంతసొమ్మును బుణము తెచ్చి ఁ పె నిసీ ర్వేనియా ' రోడ్డుమీదకూడతమబండ్ల నేవాడుక లోనికి రప్పించగలిగెను. ఆడమ్సు కంపెనీకంటే ఈకం పెనీలో కార్నీజీ కెక్కువ లాభము గలిగెను.

1861 సంవత్సరములో పెన్సిల్వేనియాలో కనిపె ట్టబడిన కిరసనాయిలు వ్యాపారమునకై తానప్పటికి నిల వజేసిన 8000 నవరసులను వినియోగించి యానూనె దొర కుక్షేత్రము నొకదానిని కొనెను. కార్నీజీ యదృష్ట మంతయు అతని నప్పటినుండి యుచ్ఛస్థితికి దెచ్చినది. ఇనుప వ్యాపారములు జేయు అనేక కంపెనీలలో భాగ స్థుడై 1868 సంవత్సరములో ఆంగ్లేయదేశములో ప్రశ స్త మైన బెస్మరు ఉక్కు తయారు చేయుపద్ధతిని పరిశీలిం చుటకై పోయియుండి అమెరికాకు వచ్చినపిమ్మట, ఉ క్కురైళ్ళను తయారుచేయుటకు యంత్రశాలలను స్థా పించెను. రైళ్ళకు కావలసిన యినుపసామగ్రిని తా తయారుచేయించవలెనని దీక్ష వహించి కార్నీ జే ఉక్కు యంత్రశాలలను స్థాపించియుండెను. తన పట్టుదల ప్రకా రము తన పనులకు కావలసిన సామానులనన్నిటిని తన యంత్రశాలలోనే తయారుచేయగలిగి యితరుల పై యా ధారపడి యుండనందులకు కార్నీ జీపొందిన యానంద మును మనమూహింపజాలము. 1883 సంవత్సరములో మరియొక ఉక్కు యంత్రశాల కధికారియయ్యెను. కా ర్నీ జీ ఉక్కు యంత్రశాలల కంపెనీ పేరబరగు వ్యాపార ములందు 50 లక్షల నవరసులను మూలధనముగా కార్నీ యుంచగలిగెను. 1892 వ సంవత్సరములో బొగ్గు నుని కంపెనీ నొకదానిని సంపాదించెను. 1900 సంవ త్సరము నాటికి తన కంపెనీలలో మూలధనము కోటిన్న ర నవరసులుగు జేసెను. తనకు 62 సంవత్సరముల వయసు వచ్చుసరికే కార్నీ జీ వ్యాపారములనుండి చాలించుకొని 50 కోట్ల నవరసుల స్థితితో తులతూగుచుండెను.

కార్నీజీ యీవిధముగ లాభమును సంపాదించగ లుగుటకు ముఖ్యకారణము, వ్యాపారములో పనిచేయు వారికి తన లాభములో కొంతపాలు పంచియిచ్చుటయ ని బోధించుచున్నాడు. మరియొక రహస్యమేమనగా తెలివిగలవా డెచ్చటకన్పించినను వానిని తగువిధముగా ప్రోత్సాహపరచి లాభములో భాగమునిచ్చి తనవ్యాపా రములో చేర్చుకొనుచుండెడివాడు. ఎవరైన భాగస్తుడు కాలము చేసినయేడల నెల దినములలో వాని వారసులకు (. జెందవలసిన సొమ్మును పంచియిచ్చి వేసి యాభాగమును మిగిలిన భాగస్థులే పంచుకొనెడివారుగాని చనిపోయిన వాని కొమాళ్ళనుగాని యితర వారసులను గాని వ్యాపా రమునందు జొరనిచ్చుటలేదు. ఇందువల్ల ఆగస్త్యభ్రా తలు జేరి మంచి వ్యాపారములను మంటగలుపుట కవకా శము తగ్గునుగదా ! కార్నీ జీ వ్యాపారపు పనులనుండి విశ్రాంతినిబొందుట దేహదారుష్యము లేక కాదు. భాగ స్థుల వత్తిడివల్లను గాదు. తానార్జించిన విశేష ధనమును తన జీవితకాలములో నే సద్వినియోగము చేయవలెనను ముఖ్యోద్దేశ్యముతో ఆయన వ్యాపారమును మాని జీవ యాత్రను గడుపుచున్నాడు.

కార్నీ జీ అభిప్రాయప్రకారము ధనమాజికొంచుట కంటె దానిని వ్యయము జేయుట కష్టమని తేలుచున్న ది. ధనికుడుగా జనిపోవువాడు తనను తా నగౌరవపరుచు కొనువాడని కార్నీ జీ అభిప్రాయమై యున్నది. సాధా రణముగ మనముచేయు ధర్మముల పద్ధతులు సరియైనవి గావని కార్నీ జీయొక్క నమ్మకము. ధనము సద్వినియో గము జేయుట యనగా సరియైన వ్యయము చేయుటయె గాని యిష్టమువచ్చినటుల వెచ్చించుటకాదు. 1881 సంవత్సరములో అమెరికా దేశ పత్రికలకు వ్రాయుచు ధర్మముచేయు పద్ధతులలో విద్యాలయములు సర్వ కళాశాలలు స్థాపించుట, ధర్మపుస్తక భాండాగార ములు, వైద్యశాలలు, యంత్రశాలలు, విహారవనములు, పురమందిరములు, ఈత నేర్పు స్థలములు మొదలగువాని నేర్పరచుట అత్యుత్తమంబులని ఆయన జెప్పియున్నాడు.

కార్నీజీయొక్క ధర్మములయందు గ్రంథ భాం డాగారములే అగ్రస్థానమును వహించియున్నవి. ఈ గ్రంథభాండా గాగో ద్దేశ్యము మొదట కార్నిజీ కెట్లు క లిగెనో, యీ ధర్మమును గురించి యతని యభిప్రాయమే మిటో కొంచెము విచారించుట కతేకావ్యము. పిట్సుబర్లు లో పిల్లలు వారముసకొకసారి చదువుకొనుట కవకాశ ము కలిగిన 400 పుస్తకములు గల యొక చిన్న భాం డాగారమునందు, తనకు గల యభిమానమును తానుపొం దిన సంతోషమును 'కార్ని జీ యెన్నటికిని మరపుజెందిన వాడుగాడు. అప్పుడతని మనస్సులో, ఎప్పటికైన నా కు ధనము చేకూరె నేని ఇటువంటి ధర్మపు సకభాండా గారములను దేశమున వెదజలి బీదజనులకు నుపయోగ కారు లగునటుల చేయుదునుగదా యని నునిళ్ళూరు— చుండెడివాడు. ఆయన పేదపిల్లవాడుగా నున్నప్పుడు కలిగిన యూహ యట్టిది. ఇప్పుడు వృద్ధుడై కోటీశ్వరు డైన కార్నీ జీ, సంఘమునకు జేయగల ధర్మములయందె ల్ల ధర్మగ్రంథ భాండాగార స్థాపనయే ఉత్కృష్టమై పరిగణింపబడవ లెనని చాటుచున్నాడు.

కార్నీజీని కొందరు ధర్మగ్రంథ భాండాగారముల ను గూర్చి ఆయన యభిప్రాయమును దెలుపవల సినది గా కోరినప్పుడు ఈదిగువ సంగతులను శీలలిచ్చెను.

“గ్రంథాలయములు కష్టపడనిదే ఫలమునియ్యవు; స్వయంసహాయము జేసికొనువారికే అవి లాభమును గ లిగించును; కాబట్టి అవి మనుజులను దరిద్రుల నెన్నటికి. ని చేయజాలవు. ఈకారణములచేత ధర్మగ్రంధాలయ ములు జనసామాన్యము నభివృద్ధికి దెచ్చు పరమోత్కృష్ట సాధనములుగ నేను పరిగణించుచున్నాను. ఆసక్తిగల వారికెల్ల గ్రంథములలో నిమిడియున్న యమూల్య రత్న ములను గ్రంధభాండాగారములే యొసంగగలవు. గ్రంథ పఠన కభిరుచిగలవారిబుద్ధి ఇతర నీచ రుచులయందు ప్ర నేశించుట కిష్టపడదు. ఇది గాక జక్కని నవలల జదువు టచేత బీదలకు విశ్రాంతికుదిరి వారి దుర్భరజీవితములకు హాయి గలుగునని నమ్ముచున్నాను. ఇట్టివియేయగు ననేక కారణముల చేత, ఇతరధర్మము లనేకములకంటె ధర్మ పుస్తక భాండాగారములు ప్రజా సౌఖ్యమునకును అభివృద్ధికిని ముఖ్యసాధనము లగుటంజేసి, నేను వానిని స్థాపించుచున్నాను,

1891 సంవత్సరమునందు పీటరు హెడు' గ్రంధ భాండాగారణాలను తెరచు సమయమున కార్నీ జీ గ్రంథ భాండా గారములను గురించిన తన ప్రథమ ఊపన్యాస ము నిచ్చియుండెను. సంవత్సరమునకు 25 నవరసులు ధ ర్మము చేయ దలచినవారున్న యెడల చిన్న గ్రామమునకు దగిన గ్రంధభాండాగారము నేర్పరచుటకు వీలుగలదని యప్పట్టున కార్నీ జీ నుడివియున్నాడు. ఇంకొక 5 నవ రసులు వెచ్చించినయెడల విద్యార్థులకు దగిన పుస్తకము లను చేర్చుట కవకాశము గలదనెను. అందుల 44 గ్రంధములు భాండాగారమునకు జేర్చవచ్చుననెను. ఒక బడిపిల్లలు జదివిన గ్రంథములు మరియొక బడికి బంపుట తను, సంచార కార్యదర్శుల నేర్పరచి మంచి గ్రంథము లను జదువుటకు దగిన ఏర్పాట్లు చేయుటకును బూనవలె ను. 'లగ్గాను ' పట్టణములోనున్న భాండాగారములో ఆ న్నియు సద్గ్రంధములే గలవనియు, ఆజిల్లాలో నున్న మూడుపాఠశాలలలో నన్యోన్యసహాయమును బొందుచు పరస్పరము పుస్తకముల నెరువుదీసికొనుచున్నారనియు, స్వల్పవ్యయముతో నంత యెక్కువలాభమును పొందుచు న్న యితర మార్గములను తాను జూడ లేదనియు కార్నీ జీ నుడివెను.

“తనకుండుకున్న విశేష ధనములో స్వల్పభాగ మునుమాత్రము వెచ్చించిన లోకమున కెంతో ఉపకార ము చేయగలుగుదునను సంగతిని ధనికులైనవారు గుతేకా రిగి యుండవలసియున్నది. నేను ఐశ్వర్యను వాత ను గురించి వ్రాసిన వ్యాసములో విశేష ధనముండుట ధర్మకర్తృత్వము వహించుటకేయని వ్రాసి యుంటిని. ధనికు లాసంగతి గమనింపవలెను. 5 గాని 10 గాని 25 గాని నవరసులు మాత్రము గ్రంధభాండాగారములలో వినియోగించిన అందువలన నూరురెట్లో లేక వేయిరెట్లో ఫలప్రాప్తి గలుగునను సంగతి అనుభవమువల్ల తెలియన గును. గ్రంధభాండాగారములకు ధనమిచ్చు ధనికులకం ఔ యట్టి భాండాగారములవల్ల లాభమును పొందినవారు స్వయముగ దాని యభివృద్ధిని కనుగొనుట కెక్కువ అ వకాశము గలదు. ఁ ఏమహానుభావుడు తన ధన మునేగాక తన శక్తినికూడ ధార్మిక విషయము లందు వినియోగించునో అతడు మాత్రము నిజమయిన దేశభక్తుడు' ధనసహాయము జేసినం తమాత్రము చేత వానివిధి సంపూణFముగ నెర వేరజాల దు. ధనమిచ్చుటకంటె శ్రద్ధవహించి కొనసాగించుటలో విశేషము గలదు.”

ఈప్రకారము కాగ్నీ జీ ముత్యములవంటి మాటల తో హితోపదేశము చేసియున్నాడు. అందు ప్రతిమాట కును విలువగలదు. •మనకుగల లోకానుభవమువలన, చే ఆయుగం సులభమైన పనియనియు స్వయముగ చేయుట కష్టమైన పనియనియు దెలియుచున్నది. కా ర్నీ జి వట్టిమాటలవా డెన్నటికిని గాడు. క్రియాశూరు - డు, నిజమైన లోక బాంధవుడు. తాను నిర్ధారణజేసిన ప ద్ధతిప్రకారము తనయొక్క ధనము నెటుల ధర్మపుస్తక భాండాగారములకు వినియోగించెనో ఆమహానీయునియొ క్క దిగువ ధర్మములపట్టిక ను పరిశీలింపుడు.

(1) 1902 సంవత్సరమునఁ కార్నీ జి యిన్ స్టిట్యూ టు' అనుదానిని వాషింగ్టను పట్టణమునందు స్థాపించి దానికి 44 లక్షుల నవరనుల నిచ్చియుండెను. ఈధర్మ మువల్ల మానవకోటికి మిక్కిలి యుపయోగకరమయిన శాస్త్రచర్చజేయుటకు పరిశోధనకు నవకాశము గలిగినది.

(2) ఉపాధ్యాయుల బోధనాభివృద్ధికి కార్ని జీ స్థాపితము. —1905 సంవత్సరములో ఉపాధ్యాయులకు పించను వసతికిని వారి వితంతువుల మనోవతిజ్ఞకిని ఉత్త ర అమెరికాఖండములో 30 లక్షల నవరసుల నిచ్చి యుండెను.

(3) కార్నిజీ ధీరులనిధి. ప్రాణరక్షణ గావిం చినవారికి ఆప్రయత్నములో నాపదచెందిన వారికిని, నష్ట పడినవారి వారసులకును, అనివార్యమైన బాధ జెందువా సహాయముగ బహుమానములిచ్చుటకు ఈనిధి 1904 సంవత్సరములో 10 లక్షల నవరనులతో స్థాపింప బడినది. ఇది సంయుక్త రాష్ట్రములకు మాత్రము చేయ బడిన ధర్మము. రికిని

(4) ఈ ప్రకారము ఆంగ్లేయరాజ్యమునకు 1908 సంవత్సరములో 2 లక్షలన్నర నవరసులను, ఫ్రాంసుకు 1909 సంవత్సరములో 2 లక్షల నవరసులును, రాక్షస కృత్యములకాలవాలమగు జర్మనీకి 1910 సంవత్సరములో 24 లక్షల నవరసులును ధీరులనిధికై యిచ్చియుండెను.

(5) కార్ని జీ సంధినిధికి 1910 సంవత్సరములో 20 లక్షల నవరసుల నిచ్చెను.

(6) కార్నిజీ కార్పొ రేషనుకు 1911 సంవత్సర ములో 50 లక్షల నవరసులను ప్రకృతిశాస్త్ర విద్యకును భాండాగారాభివృద్ధికిని సంయుక్త రాష్ట్రముల వారికై యిచ్చి యుం డెను. ఈ విధముగ చేయబడిన కార్ని జీయొక్క పైధ ర్మముల మొత్తము మన రూపాయిలలో 30 కోట్ల 52 లక్షల 50 వేల రూపాయలు కాగలదు. ఈ మొ త్తము ను తలంచిన యే ఆంధ్రునిగుండె ఝల్లుమనకుండును ? కార్ని జీయొక్క ఐశ్వర్వమువాత మన దేశములో నెల్ల రు చదువవలెను. హిందువులలో “అపుత్రస్య గతిర్నా స్త్రీ" యని నమ్మకము గలదు. తాను ధనమెద్విధముగా సంపాదించినను కొడుకనేవాడున్నాడా దానికి కత యని చూచుచుండుట హిందువుని స్వభావము. అట్టివా ని కణములకు కార్నిజీ బోధ బాధకరముగా నుండ వచ్చును. కాని ఆయన దారపుత్రాదులకు తగినంతనూ త్రమిచ్చి శేషించినది ధర్మమునకు వినియోగించవలె నను చున్నాడు, ఆంగ్లేయ పత్రికాధిపతులలో సుప్రసిద్ధుడై నట్టి కీతిజు శేషుడయిన స్టెను కార్ని జీకినిచ్చిన సలహాల ను, కార్ని జీ స్వయము గా వ్రాసిన యనేకవిషయములను మన యాంధ్రయువకులు ముఖ్యముగా జదువవలెనని బ రోడా పత్రికాధిపతుల యభిప్రాయమై యున్నది.

అమెరికాలోని గ్రంథ భాండాగారములకు కార్ని జీ 1918 సంవత్సరమునందు చేసిన ధర్మములయొక్క మొత్తము 4 లక్షల అరువదివేల నవరసులు. ఇతరు లిం దునిమిత్త మిచ్చినది 4 లక్షల నవరసులు ఇది గాక లక్ష 68 వేల 655 గ్రంధములును, గ్రంథభాండాగారముల ని మిత్తము 12 స్థలములును, 101 భవనములును ఇంక చిల్ల ర ధర్మము ల నేకములును చేయబడినవి. 1913 సంవత్స రాంతమునకు ఆండ్రూ కార్ని జీయొక్క ధర్మముల వె త్తము 18 కోట్ల 24 లక్షల రూపాయిలై యుండెను.

పెద్దిభొట్ల వీరయ్య, బి.ఏ., బి.యల్.

పుస్తక భాండాగారములు

వాని నభివృద్ధి జేయవలసిన పద్దతులు.

మన విద్యయొక్క స్థితి.

మనదేశమునందు జనులలో ననేకులు విద్యాగం ధము లేనివారు, విద్యతో సంతగా నవసరము లేదని త లంపబడు స్త్రీలమాటయటుండనిచ్చి, పురుషులలో సహితము రాజకీయోద్యోగములం బ్రవేశింప నెంచువారును, తమ జీవనోపాధికి విద్య యత్యంతయవసరమని తలచెడి కొలదిమందియును, మాత్రమే తమబిడ్డలకు విద్య నేర్పించు చున్నారు. కావున దేశమునందు బహుసంఖ్యాకులు విద్యావిహీనులేగాక నిరక్షరకుక్షులు నైయున్నారు.

మన దేశముయొక్క స్థితి.

దేశమునందు జ్ఞానము వ్వాప్తమై జనులు మౌఢ్య మను బోనడుపవలయునన్న చిన్న పిల్లలనిమిత్తమై పాఠ శాలలును, కర్మకారులు వ్యవసాయదారులు మొదలగు వారినిమిత్తమై రాత్రిపాఠశాలలను పెట్టవలెను. ఇదివర కే కొంత చదువ నేర్చినవారికొఱకై యప్పుడప్పుడు యు పన్యాసములు నిప్పించుటకై ప్రయత్నములు గూడ జరుగ వలసి యున్నవి. తానే దేశమునందు జన్మించినదియు, తన దేశముయొక్క నైసర్గిక స్థితి, శీతోష్ణాదిమార్పులు, పాడి పంటలకును వ్యాపారమునకును గల సౌకర్యములు, జను లు, వారియాచారవ్యవహారములు మున్ను గాగలయంశము లను తెలిసికొని యానందించలేనంతటి దౌర్భాగ్యస్థితివం టిది మానవునకు మఱియొకటి యుండబోదు. ఏదేశమైన ను అట్టి బలపరాక్రమశీలురగు నాగరికా గ్రేసరులగు జాతులు గలిగినదైనను, తన పూర్వపు ఔన్నత్యమును మఱచి తన పూర్వపురుషుల సాధుచరితంబుల నుపఠింపక తన్మూలకముగ ధైర్యసాహసములకు గోల్పోవుటికిచ్చగిం పదు. మన ప్రస్తులేవిద్యా విహీనావస్థకు కారణము మన పూర్వచారిత్రమును మఱచి పోవుటయేయని వేఱుగ చెప్ప · నేల !